
డిజిటల్ ఇండియా మాకెందుకు
సాక్షి, లక్నో : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తోందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారని అన్నారు.
తనకు అడ్డొస్తారనుకున్న ప్రతి పక్షనేతలపై తప్పుడు కేసులను బీజేపీ ప్రభుత్వం బనాయిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ‘మాకు డిజిటల్ ఇండియా అవసరం లేదు.. యువత కోసం, రైతుల కోసం ఇండియా కావాల’ని చెప్పారు. దేశాన్ని మతం పేరుతో బీజేపీ చీల్చే కుట్ర చేస్తోందని అన్నారు.