గ్రామీణ ప్రాంతాల్లో వంద వైఫై హాట్‌స్పాట్‌లు
న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలసి గ్రామీణ భారతంలో వంద వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే ఒక్కో హాట్‌స్పాట్ సెంటర్‌కు రూ. 5 లక్షల చొప్పున ఏటా రూ. 5 కోట్లను ఫేస్‌బుక్ ఖర్చు చేయనుందని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను క్వాడ్‌జెన్ సంస్థ ఏర్పాటు చేసి, నిర్వహిస్తుందని, ఇప్పటికే 25 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.