తాను తయారు చేసిన కిట్‌తో పాజిల్
సాక్షి, చెన్నై : ప్రమాదాల కట్టడి లక్ష్యంగా మదురైకు చెందిన ఓ యువకుడి డిజిటల్ ఇండియా యాక్సిడెంట్ ప్రివెంటింగ్ కిట్‌ను రూపొందించాడు. కేవలం రూ.ఐదు వేల ఖర్చుతో ఈ కిట్‌ను సిద్ధం చేశాడు. అలాగే, వాయిస్ కిట్ కూడా తయారు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.రాష్ట్రంలో ఇటీవల కాలంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అతి వేగం, నిర్లక్ష్యం వెరసి ప్రతి ఏటా వేలాది మందిని బలి కొంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల మేరకు ప్రతి ఏటా పది హేను వేల ప్రమాదాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. ఇందులో పది వేల మంది మరణించగా, రెండు వేల మంది కోమాలోకి వెళ్తున్నారు. మరో మూడు వేల మంది క్షతగ్రాతులుగా మిగులుతున్నారు. గత వారం కూడా మదురై, తిరువళ్లూరులలో అతి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిత్యం రోడ్లు రక్తమోడుతున్నాయి. వాటని తగ్గించడానికి మదురైకు చెందిన పాజిల్ (23) యువకుడు వినూత్న ఆవిష్కరణ మీద దృష్టి పెట్టారు. తండ్రి చిన్న మరుదు పాండి, తల్లి షీబాలు అందించిన సహకారంతో సరికొత్త కిట్ తయారీ మీద దృష్టి పెట్టాడు. డిజిటల్ ఇండియా యాక్సిడెంట్ ప్రివెంటింగ్ కిట్‌ను సిద్ధం చేశారు. దీనిని వాహనాల్లో అమర్చితే చాలు, ఇందులోని సెన్సార్, అమరికల మేరకు ప్రమాదాల కట్టడి చేయవచ్చు.
పయనిస్తున్న వాహనానికి నాలుగు మీటర్ల దూరంలో ఏదేని వాహనం దూసుకొచ్చినా, ఎవరైనా అడ్డు పడ్డా, అమరికలు, సెన్సార్ ఆధారంగా ఆ వాహనం బ్రేక్ సడన్‌గా పడుతుంది. తద్వారా ప్రమాదాల్ని నియంత్రించేందుకు వీలుందని పాజిల్ పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తాను 30 నుంచి 35 కి.మీ వేగంతో ఈ కిట్‌ను ప్రయోగించి ఫలితాన్ని సాధించినట్టు వివరించారు. తనకు పూర్తి సహకారాన్ని అందించిన పక్షంలో వంద కీ.మీ వేగంతో సాగే దిశగా , సడన్ బ్రేక్ వేసి ప్రమాదాల్ని నియంత్రించే రీతిలో పరికరాన్ని రూపొందించేందుకు సిద్ధం గా ఉన్నట్టు పాజిల్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను, ప్రస్తుతం తయారు చేసిన కిట్‌కు రూ. ఐదు వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. ఈ కిట్‌తో పాటుగా షీబా పేరిట వాయిస్‌కంట్రోల్ కిట్‌ను కూడా సిద్ధం చేసి ఉన్నట్టు తెలిపా డు. ఆటోమేటిక్ డోర్లు కల్గిన వాహనాల్లో డోర్‌లాక్ అయిన పక్షంలో, ఏదేని సమస్య తలెత్తిన పక్షంలో వాయిస్ కంట్రోల్ కిట్ ద్వారా బయట పడే వీలుందని వివరించాడు. వాయిస్ కంట్రోల్ కిట్‌ను వైఫై, హాట్సాట్‌లకు అనుసం ధించే రీతిలో సిద్ధం చేశానని, త్వరలో ఏదేని కార్ల సంస్థను సంప్రదించి దీనిని ప్రయోగించనున్న ట్టు తెలిపాడు. కాగా, గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పరీక్షించకుండానే పసిగట్టే రీతిలో ఓ పరికరాన్ని ఈ యువకుడు రూపొందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment