
ప్రభుత్వాల విధానాల వల్లే రైతుకు కష్టం
దేశంలోని పలు రాష్ట్రా ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే వ్యవసాయం సంక్షోభంలో పడిందని..
సబ్సిడీల ఎత్తివేతతో రైతుల ఆత్మహత్యలు: మేధాపాట్కర్
హైదరాబాద్: దేశంలోని పలు రాష్ట్రా ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే వ్యవసాయం సంక్షోభంలో పడిందని.. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ప్రముఖ పర్యావరణ వేత్త మేధాపాట్కర్ అన్నారు. జాతీయ ప్రజా ఉద్యమాల సమాఖ్య ఆధ్వర్యంలో రామంతాపూర్‌లోని మౌంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘దేశంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతోపాటు సమకాలిక రాజ కీయ, ఆర్థిక విధానాలు, వ్యవసాయ సంక్షో భం’ అనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
దేశంలోని 15 రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన మేధావులు, సామాజిక కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో ఆమె ప్రధాన వక్తగా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికిచ్చే సబ్సిడీని పూర్తిగా ఉపసంహరించి ప్రభుత్వాలు ఆ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని, ఫలితంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మోదీ ప్రభుత్వం మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా పేరిట చేతి వృత్తులను నీరు గారుస్తుందన్నారు. సంస్కృతి ముసుగులో కులాల, మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆమె దుయ్యబట్టారు. కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ రాజు, జస్టిస్ చంద్రకుమార్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీరం రాముకు బోరపాటి అవార్డు
అస్పృశ్యత నివారణ, రైతు సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం పాటుపడిన బోరపాటి నరేంద్రనాథ్ స్మారక ఫెలోషిప్ అవార్డును వరంగల్ జిల్లాకు చెందిన బీరం రాముకు మేధాపాట్కర్ అందజేశారు.