రెండు రోజుల్లో  రూ. 1100 కోట్లు | Ola Electric Sells Scooters: Rs 1100 Crore In Just Two Days says Ola | Sakshi
Sakshi News home page

Ola Electric : రెండు రోజుల్లో  రూ. 1100 కోట్లు

Published Fri, Sep 17 2021 1:15 PM | Last Updated on Fri, Sep 17 2021 7:49 PM

Ola Electric Sells Scooters: Rs 1100 Crore In Just Two Days says Ola  - Sakshi

సాక్షి, ముంబై: క్యాబ్‌ సేవల సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల లాంచ్‌ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. అమ్మకాలు ప్రారంభించిన  రెండు రోజుల్లో  రికార్డు అమ్మకాలను నమోదు చేసింది.  రెండు రోజుల్లో   రూ 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ  ఓలా గ్రూప్ సీఈఓ భవీష్‌ అగర్వాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొలి రోజు సేల్స్‌ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ ట్వీట్‌ చేశారు

ఆటోమోటివ్ పరిశ్రమలో మాత్రమే కాదు, భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇది ఘనమైన రికార్డు అని ఒకే ఉత్పత్తికి ఒక రోజు (విలువ ప్రకారం) అత్యధిక అమ్మకాలలో ఇదొకటి అన్నారు. ఇదే కదా  డిజిటల్ ఇండియా అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ అమ్మకానికి మొదటి రోజు, కంపెనీ  రూ 600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన సంగతి తెలిసిందే.  48 గంటల సేల్‌ నిన్నటితో (సెప్టెంబరు 16) ముగిసింది.  అయితే కస్టమర్లు స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో  రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తదుపరి సేల్‌ దీపావళి సందర్బంగా నవంబర్ 1 నిర్వహించనుంది.  కేవలం రూ. 499 వద్ద ఆన్‌లైన్‌లో ప్లాట్‌ రిజర్వ్ చేసుకోవచ్చు.  

అయితే  ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్‌ చేసినా,  రిజర్వేషన్లు olaelectric.com  ఓపెన్‌లో ఉంటుందని ఓలీ సీఈఓ తెలిపారు.  ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రోలను కొనుగోలు చేయాలనుకుంటే ఇపుడే రిజర్వ్ చేసుకోవాలనికోరారు  అలాగే  ఇప్పటికే రిజర్వ్ చేసుకుని, కొనుగోలు చేయని వారు కూడా నవంబర్ 1న  తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చని చెప్పారు. 

 ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు
ఓలా ఎస్ 1 ధర 1 లక్ష రూపాయలు, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అంతేకాదు దేశవ్యాప్తంగా  ఎలక్ట్రిక్  వాహనాలపై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.  ఎస్‌ 1 గరిష్ట వేగం  గంటలకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ఉంటుంది.  ఎస్‌ 1 ప్రో గరిష్ట వేగం  181- 115 కి.మీ.ల మధ్య ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement