
ఆన్‌లైన్ పథకాల కోసం డిజిటల్ ఇండియా
ప్రభుత్వ పథకాలు పేద వారికి నేరుగా చేరడానికి డిజిటల్ ఇండియా ఎంతో సహాయ పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కేఎన్ అనురాధ తెలిపారు...
తుమకూరు: ప్రభుత్వ పథకాలు పేద వారికి నేరుగా చేరడానికి డిజిటల్ ఇండియా ఎంతో సహాయ పడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కేఎన్ అనురాధ తెలిపారు. తుమకూరు నగరంలో ఉన్న డాక్టర్ గుబ్బి వీరణ్ణ రంగమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన డిజిటిల్ ఇండియా వీక్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రభుత్వ కార్యాలయాల్లో పేపరు పని లేకుండా చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.
విద్యార్థులు ఈ డిజిటల్ ఇండియా గురించి పెద్దలకు తెలియజేయాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆందజేసే వారు ఇక పైన తమ మొబైల్ దరఖాస్తులను పంపించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, శాఖలకు చెందిన ప్రభుత్వ పథకాలపై ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆనంద్, తుమకూరు నగర పాలికే కమిషనర్ ఆషాద్ షరీఫ్ అలీ, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.