
భారత్‌లో మరిన్ని పెట్టుబడులపై యూఏఈ ఆసక్తి
న్యూఢిల్లీ: కేంద్రం తలపెట్టిన మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆసక్తి వ్యక్తం చేసింది. భారత్‌తో సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తెలిపారు. భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కాగా భారత్-యూఏఈ వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునేలా పరస్పరం సహకరించుకునేందుకు ఒక వాణిజ్య సమావేశం సందర్భంగా రెండు దేశాల పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, ఎఫ్‌సీసీఐ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.