'డిజిటల్ ఇండియాతో అవినీతి నిర్మూలన' | Digital India can be made an eradication of corruption | Sakshi
Sakshi News home page

'డిజిటల్ ఇండియాతో అవినీతి నిర్మూలన'

Published Wed, Jul 1 2015 5:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Digital India can be made an eradication of corruption

న్యూఢిల్లీ:  ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ను బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మోదీ డిజిటల్ ఇండియా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని అన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. ఈ డిజిటల్ ఇండియా గొప్ప మార్పును తీసుకొస్తుంది. మేక్ ఇన్ ఇండియా లేకుంటే డిజిటల్ ఇండియా అసంపూర్తిగా మిగిలిపోతుందని రవిశంకర్ తెలిపారు.

ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. డిజిటైలేజేషన్ ప్రారంభం ఓ గొప్ప ముందుడగు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ డిజిటల్ ఇండియాలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాతో జీవనవిధానం మరింత సులభంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ ఇండియా ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు వస్తాయన్నారు. అంతేకాక సామాజిక మార్పునుకు డిజిటల్ ఇండియా ఎంతోగానూ దోహదపడుతుందని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement