Ravisanker prasad
-
ఆ లేఖను బాబు రాసినట్టా, రాయనట్టా?
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు 2017లో రాసిన లేఖలను జస్టిస్ ఈశ్వరయ్య ఈమధ్యే బహిర్గతం చేశారు. ఇద్దరు బీసీ న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ కుమార్‌లను హైకోర్టు జడ్జీలుగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బాబు ఆ లేఖలు రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించింది. బీసీ న్యాయవాదులపై బాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలడంతో ఆ ఇద్దరినీ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్రం నియమించింది. ఈ అంశాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆ లేఖల ప్రతులతో సహా విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల ఎదుట బహిర్గతం చేశారు. తర్వాత సీఎం బాబు, యనమల రామకృష్ణుడుతోపాటు బీసీ మంత్రులు ఈశ్వరయ్యను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు. కానీ వీరెవ్వరూ ఆ లేఖలు బాబు రాయలేదని గానీ, రాసిన లేఖల్లో బీసీ న్యాయవాదులపై ఆరోపణలు చేయలేదని గానీ, వాటిని తిరస్కరించిన విషయాన్నిగానీ ఖండించలేదు. తమ హయాంలో బీసీ న్యాయవాదులు 9 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా అయ్యారంటూ చెబుతున్నారు తప్ప ఆ ఇద్దరు బీసీ న్యాయవాదులకు వ్యతిరేకంగా బాబు కేంద్రానికి లేఖలు రాశారా లేదా అనేదే కీలక ప్రశ్న. ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక్క బీసీ కూడా నియమితులు కాలేదు కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎలా నియమితులయ్యారు. ఇందులో బాబు దొడ్డిదారి ప్రయత్నం లేదా? ఏపీ హైకోర్టులో గత 7 దశాబ్దాల కాలంలో ఆయా ప్రభుత్వాల హయాంలో ఎంతమంది బీసీ న్యాయవాదులు జడ్జీలుగా నియమితులయ్యారు. అప్పుడు మొత్తం హైకోర్టు జడ్జీల సంఖ్య ఎంత? వారిలో బీసీ జడ్జీలు ఎందరు? అలాగే హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో కూడా ఎంతమందిని లా ఆఫీసర్లుగా ప్రభుత్వాలు నియమించాయి? వారిలో బీసీలు ఎంత మంది? వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్రప్రభుత్వం, మంత్రి యనమల తక్షణమే ప్రకటించాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయాన్ని ఏపార్టీ, ఏమేరకు చేసిందో తేలిపోతుంది. – వై. కోటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్, బీసీ మహాజన సమితి, 98498 56568 -
'డిజిటల్ ఇండియాతో అవినీతి నిర్మూలన'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో భాగంగా మోదీ డిజిటల్ ఇండియా పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియాలో పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని అన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని చెప్పారు. ఈ డిజిటల్ ఇండియా గొప్ప మార్పును తీసుకొస్తుంది. మేక్ ఇన్ ఇండియా లేకుంటే డిజిటల్ ఇండియా అసంపూర్తిగా మిగిలిపోతుందని రవిశంకర్ తెలిపారు. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. డిజిటైలేజేషన్ ప్రారంభం ఓ గొప్ప ముందుడగు అంటూ ఆయన అభివర్ణించారు. ఈ డిజిటల్ ఇండియాలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియాతో జీవనవిధానం మరింత సులభంగా ఉంటుందని చెప్పారు. డిజిటల్ ఇండియా ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు వస్తాయన్నారు. అంతేకాక సామాజిక మార్పునుకు డిజిటల్ ఇండియా ఎంతోగానూ దోహదపడుతుందని చెప్పారు. -
ఇక 'వైఫై' కేవలం రూ.70లకే!
వారణాసి: దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పొంతలు తొక్కుతోంది. దాంతో సాంకేతికపరంగా ఇంటర్ నెట్ వినియోగం కూడా రానురాను నిత్యఅవసరంగా మారింది. టెలికాం సంస్థలు కూడా అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మొబైల్స్ ను వైఫై సౌకర్యంతో మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో వైఫైకు మంచి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా వారణాసిలోని పురాతన ఘాట్లైన గంగా నది- శీతల, దాశ్వాష్ మెథ్లను కలుపుతూ వైఫై సౌలభ్యం అందుబాటులోకి రానుంది. వైఫై సేవలు చౌక ధరలకే వినియోగదారులకు అందేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారణాసిలో వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కేవలం రూ. 70లకే లభ్యం కానుంది. ఈ వైఫై ఇంటర్నెట్ కనెక్టవిటీని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. దాంతో వారణాసిలో రోజంతా రూ. 70లకే వైఫై సౌకర్యాన్ని వినియోగదారులు పొందవచ్చనని ఆయన పేర్కొన్నారు. కాగా వినియోగదారులు ఈ వైఫై సేవలను మార్కెట్లో ఇలా పొందవచ్చు... మొదటి అరగంట ఉచితంగానూ... ఆ తర్వాత ముఫ్పై నిమిషాలు వాడితే రూ. 20, ఒక గంటకు రూ. 30, రెండు గంటలు వాడితే రూ.50లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని టెలికాం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా ఇతర ఘాట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో రానున్నట్టు టెలికాం శాఖ పేర్కొంది.