ఇక 'వైఫై' కేవలం రూ.70లకే!
వారణాసి: దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకీ కొత్త పొంతలు తొక్కుతోంది. దాంతో సాంకేతికపరంగా ఇంటర్ నెట్ వినియోగం కూడా రానురాను నిత్యఅవసరంగా మారింది. టెలికాం సంస్థలు కూడా అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మొబైల్స్ ను వైఫై సౌకర్యంతో మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో వైఫైకు మంచి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా వారణాసిలోని పురాతన ఘాట్లైన గంగా నది- శీతల, దాశ్వాష్ మెథ్లను కలుపుతూ వైఫై సౌలభ్యం అందుబాటులోకి రానుంది. వైఫై సేవలు చౌక ధరలకే వినియోగదారులకు అందేలా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వారణాసిలో వైఫై ఇంటర్నెట్ సౌకర్యం కేవలం రూ. 70లకే లభ్యం కానుంది. ఈ వైఫై ఇంటర్నెట్ కనెక్టవిటీని టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. దాంతో వారణాసిలో రోజంతా రూ. 70లకే వైఫై సౌకర్యాన్ని వినియోగదారులు పొందవచ్చనని ఆయన పేర్కొన్నారు.
కాగా వినియోగదారులు ఈ వైఫై సేవలను మార్కెట్లో ఇలా పొందవచ్చు... మొదటి అరగంట ఉచితంగానూ... ఆ తర్వాత ముఫ్పై నిమిషాలు వాడితే రూ. 20, ఒక గంటకు రూ. 30, రెండు గంటలు వాడితే రూ.50లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని టెలికాం శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా ఇతర ఘాట్లకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో రానున్నట్టు టెలికాం శాఖ పేర్కొంది.