
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ‘డిజిటల్ ఇండియాా’ అవార్డు రానుంది. ఆన్‌లైన్‌లో అందిస్తున్న సేవలకుగాను కేంద్రం ఈ అవార్డు ఇవ్వనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ -ఆస్పత్రి విధానం అమలు అవుతోంది.
ఈ-ఆస్పత్రి సేవలు..
దేశ వ్యాప్తంగా 41 చోట్ల ఈ-ఆస్పత్రి విధానం అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మాత్రమే ఈ-ఆస్పత్రి విధానం అందుబాటులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరి 3న ఈ -ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు తమ పేర్లను ముందుగా ఈ-ఆస్పత్రి విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం రోగి సమ స్య ఏమిటి, సంబంధిత వైద్యుడు ఎవరు, రోగికి అందించవల్సిన సేవలు ఏమిటి, చికిత్స అనంతరం రోగి ఎలా ఉన్నాడు.. తదితర వివారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రోగికి ఒక నెంబర్ ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ద్వారా ఎక్కడినుం చి అయినా రోగి వివరాలను తెలుసుకోవచ్చును. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఈ విధానం కొనసాగుతోంది.
ఈ-ఆస్పత్రి విధానానికి ముందు జనరల్ ఆస్పత్రిలో ప్రతినెల 500 నుంచి 700 వరకు రోగులు నమోదు అయ్యే వారు. ఈ-ఆస్పత్రి విధానం ప్రారంభం అయిన తరువాత అవుట్, ఇన్‌పేషెంట్‌ట్లు 1200 నుంచి 1300 వరకు నమోదు అవుతున్నారు. పలుసార్లు 1500 సంఖ్య దాటింది. 15 మంది సిబ్బంది, 20 కంప్యూటర్లతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు.
అత్యధికంగా గైనిక్, చిన్నపిల్లలు, ఆర్థో, జనరల్ సర్జన్, కంటి విభాగానికి సంబంధించి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మునుముందు ప్రతి వార్డులోను ఈ-ఆస్పత్రి విభాగం ఏర్పాటుచేసి ఇన్‌పేషెంట్ రోగులకు సంబంధించి ప్రతి రోజు వైద్యసేవలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇందుకుగాను ఏర్పాట్లు చేస్తున్నారు.
అవార్డు..
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తున్న ఆస్పత్రులను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియా అవార్డులను అందిస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జనరల్ ఆస్పత్రి నుంచి ప్రతిపాదనలు కోరారు. ఢిల్లీలో ఆస్పత్రి అధికారులు అవార్డు అందుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందే జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మేళాలో ఈ ఆస్పత్రి విభాగం పనితీరుకు కేంద్ర మంత్రి అవార్డును అందించారు.
Comments
Please login to add a commentAdd a comment