Uttar Pradesh
-
ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు.. పెళ్లైన 15 రోజులకే..
లక్నో: ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో రకరకాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాలు ఎక్కువగా సంఖ్యలో బయటకు వస్తున్నాయి. భర్త, భార్యలను హత్య చేసిన ఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి.తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి జరిగిన రెండు వారాలకే సదరు వ్యక్తి.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ముగ్గురు పిల్లలు ఉండటం, ఆమె కానిస్టేబుల్ కావడం. ఈ నేపథ్యంలో మొదటి భార్య కేసు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. యూపీలోని రసూల్పూర్ గ్రామానికి చెందిన నేహాకు గజల్‌పుర్ వాసి నవీన్‌తో ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. పెళ్లయిన రెండు రోజులకే ముగ్గురు పిల్లలున్న హెడ్ కానిస్టేబుల్ నిర్మలతో నవీన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది. నిర్మలతో కలిసి ఉండాలని నవీన్ భార్యపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. దీంతో, చేసేదేమీ లేక.. అనంతరం మార్చి ఒకటో తేదీన నిర్మలతో నవీన్ రెండోపెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16న రాత్రి మొహల్లా సాకేత్ కాలనీలోని నవీన్-నిర్మల ఏకాంతంగా ఉన్న సమయంలో వీరిద్దరినీ పట్టుకుంది నేహా. ఈ క్రమంలో నేహా వద్ద నుంచి వారిద్దరూ పారిపోయారు. తర్వాత.. ఏప్రిల్ 17న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిర్మలను హఫీజ్‌పుర్ పోలీస్‌స్టేషనుకు అటాచ్ చేశారు. ప్రస్తుతం నవీన్, నిర్మల పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి ఫొటోలు వైరల్‌గా మారాయి. -
భార్య మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అక్కడ ఫొటో చూసి భర్త..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కాబోయే అల్లుడితో అత్త పరారీ, తన కూతురు మామతో మరో మహిళ జంప్ వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు వారి కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన భార్య కనిపించకపోవడంతో టెన్షన్ పడి భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్‌చేస్తే.. ఆమె మరో వ్యక్తితో తాజ్‌మహల్ వద్ద కనిపించడంతో సదరు భర్త ఖంగుతున్నాడు.వివరాల ప్రకారం.. యూపీలోకి అలీఘర్కు చెందిన షకీర్, అంజుమ్ భార్యాభర్తలు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా, షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, భార్య, పిల్లలు కనిపించలేదు. దీంతో, కంగారు పడిన షకీర్.. ఇంటి చుట్టుపక్కల వారిని అడిగి.. అంతా వెలికాడు. అయినప్పటికీ ఆమె కనిపించకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.అయితే, షకీర్ బంధువు ఒకరు తాజాగా తాజ్‌మహల్ పర్యటకనకు వెళ్లారు. ఈ క్రమంలో అంజుమ్ మరో వ్యక్తితో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీంతో, ఆమె ఫొటో, వీడియోను వాట్సాప్ ద్వారా షకీర్‌కు పంపించారు. దీంతో, షకీర్‌కు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తి తాను పనిచేసే చోటే వర్క్ చేస్తున్నట్టు గుర్తించాడు. దీంతో, వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అమ్మా, నాన్న క్షమించండి.. ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నా!
నేటి కాలంలో భార్యా భర్తల సంబంధాల్లో ఆస్తులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జీవితాంతం కలిసుండాలని ప్రమాణం చేసిన బంధాల్ని చిదిమేస్తున్నాయి. పెళ్లి సంబంధాలు వేట మొదలుపెట్టిన దగ్గర్నుంచీ అబ్బాయికి ఎంత ఉంది(ఆస్తి).. అమ్మాయి ఎంత స్త్రీ ధనం(కట్నం) తెచ్చుకుంటుందనే తతంగం మరీ ఎక్కువైపోయింది. అసలుకంటే కొసరు ముద్దు అనే చందంగా తయారైంది. అది చివరకు వైవాహిక బంధాలు నాశనం కావడానికి కూడా కారణమవుతోంది. తాజాగా జరిగిన ఘటనలో తన పేరున ఇల్లు రాసివ్వాలని భార్య పట్టుబట్టడంతో పాటు బంధువుల్ని తీసుకొచ్చి నానా రకాల హింస పెట్టడంతో ప్రాణాలు తీసుకున్నాడు భర్త. భార్య నుంచి వేధింపుల్ని తట్టుకోలేక చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎటావాలో 33 ఏళ్ల ఫీల్డ్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య నుంచి ఎలా వేధింపులకు గురయ్యాడో వీడియో రికార్డ్ చేసి మరీ తనువు చాలించాడు. మోహిత్ యాదయ్‌కు ప్రియా అనే అమ్మాయితో రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఏడేళ్ల పాటు రిలేషనలో ఉన్న వీరు 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్నుంచీ అమ్మాయి తల్లి.. వీరి కాపురాన్ని శాసిస్తూ వస్తోంది. చివరకు భార్య ప్రియ గర్బవతి అయినా కూడా అబార్షన్ చేయించిందట అత్త. ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తన అత్త తీసుకెళ్లిపోయిందని మోహిత్ రికార్డు చేసిన వీడియో ద్వారా తెలిసింది.చనిపోయి ముందే మోహిత్ చెప్పిన మాటలు..‘ఇల్లు తన పేరున రిజిస్టర్ చేయాలని నా భార్య తరచు వేధింపులకు గురిచేస్తోంది. ఇల్లు, ఆస్తి అంతా తన పేరునే రాయాలట. మా అమ్మా, నాన్నలపై కూడా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆమె తండ్రి చేత ఒక తప్పుడు కేసు పెట్టించింది. నా భార్య సోదరుడు నా బావమరిది నన్ను చంపుతానని పదే పదే బెదిరిస్తున్నాడు. రోజూ ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంది నా భార్య, ఆమె తల్లి దండ్రులకు దీనికి సపోర్ట్ చేస్తున్నారు’ అని పేర్కొన్నాడు.అమ్మా నాన్న క్షమించండి.. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్లి పోతున్నా. నాకు న్యాయం జరిగాలి. నా చావుతోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నాకు న్యాయం జరగకపోతే నా బూడిదను డ్రైన్ లో కలిపేయండి’ అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రాణాలు తీసుకున్నాడు.ఇదీ చదవండి: నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు -
‘దిశ’ తరహా ఘటన.. పెళ్లికి వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిశ తరహా ఘటన లక్నోలో వెలుగుచూసింది. కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు ముగ్గురు దుండగులు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడంతో.. కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.వివరాల ప్రకారం.. లక్నోలోని బెహాసా గ్రామానికి చెందిన ఛాయా(26) బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో లక్నోకు చెందిన సుధాన్షు అనే వ్యక్తి.. తన ఇంట్లో పెళ్లి వేడుక సందర్భంగా మేకప్ కోసం రావాలని ఛాయాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె తన ఇంటికి వచ్చేందుకు కారును కూడా పంపాడు. కారులో అజయ్, వికాస్, ఆదర్శ్ కలిసి వెళ్లారు. దీంతో, ఛాయ తన సోదరి పాలక్‌తో కలిసి.. సుధాన్షు ఇంటికి బయలుదేరింది. వివాహ వేడుకల్లో పాల్గొన్న కారణంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో తాను ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో కారులో ఆమె ఇంటికి వెళ్తున్న సమయంలో అజయ్, వికాస్, ఆదర్శ్.. ఛాయా ఆమె సోదరి పాలక్‌పై అత్యాచారయత్నం చేశారు. కదులుతున్నా కారులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ప్రతిఘటించడంతో ఛాయాపై కత్తితో దాడి చేశారు. ఈ సందర్భంగా వేగంతో వెళ్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో, కారు బోల్తా పడటంతో పాలక్.. తమకు సాయం చేయాలని గట్టిగా అరిచింది.అనంతరం, అక్కడి నుండి ముగ్గురు నిందితులు పారిపోతూ పాలక్‌ను బెదిరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తర్వాత వారు ముగ్గురు పారిపోయారు. అది గమనించిన స్థానికులు.. వెంటనే ఛాయ, పాలక్‌ను ఆసుపత్రికి తరలించగా.. ఛాయ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. వికాస్, ఆదర్శ్‌ను అరెస్ట్ చేయగా.. అజయ్ ఇంకా పరారీలో ఉన్నాడు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు ఏసీపీ వికాస్ పాండే తెలిపారు. ब्रेकिंग लखनऊ ब्यूटीशियन छाया की दुष्कर्म के प्रयास में हत्यातीन युवको ने ब्यूटीशियन के साथ की छेड़छाड़ छेड़छाड़ का विरोध करने पर हत्या एक आरोपी गिरफ्तार, दो फरार #BREAKING #Lucknow #Murder #RapeAttempt #indiavoice pic.twitter.com/W4ppJOskGW— India Voice (@indiavoicenews) April 19, 2025 -
క్షేత్రస్థాయిలో బలోపేతంపై బీఎస్పీ దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయ పావులు కదుపుతున్నారు. మరో రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో ఈసారైనా కనీసం డబుల్ డిజిట్‌తో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నది ఆమె లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఘర్‌వాపసీ పై దృష్టి పెట్టారు. ఆకాశ్ ఆనంద్, నగీనా మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీలోకి వచ్చిన తర్వాత, పశ్చిమ యూపీ ప్రాంతానికి చెందిన పార్టీ మాజీ నాయకులను దారి లోకి తెచ్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన, బయటకు వెళ్లిన కొందరు నేతలు తిరిగి పారీ్టలోకి వచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా తిరిగి పార్టీ ఛత్రం కిందికి వస్తే బీఎస్పీ క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందని ఆమె అంచనాగా ఉంది. ఒకప్పుడు ఘన చరిత్ర1984లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న బీఎస్పీ ఇప్పుడు పతనావస్థలో ఉంది. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారీ్టతో యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన మాయావతి...ఆ తర్వాత ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 20 సీట్లు సాధించిన ఆ పార్టీ, 2014లో కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, 2019 ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్డీతో కలిసి బరిలో దిగి 10 చోట్ల విజయం సాధించిన బీఎస్పీ 2024 ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలో కూడా జెండా ఎగురవేయలేకపోయింది. అంతేగాక 2012–2024 మధ్య జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తన ఉనికిని సైతం చాటుకోలేక చతికిలపడింది. పాత నేతలకు తిరిగి బాధ్యతలు 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఎస్పీకి క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు తగ్గిపోయిన నేపథ్యంలో, ఒక్కరొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. కాగా పశ్చిమ యూపీ లో ఒకప్పుడు పార్టీకి అండగా నిలిచిన 15 మందికి పైగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల్లో కొందరిని క్రమశిక్షణా రాహిత్యం కారణంతో మాయావతి పార్టీ నుంచి బహిష్కరించారు. మరికొందరు తమకు తాముగానే పార్టీని వీడారు. ఇప్పుడు వీరందరిపైనా బీఎస్పీ కన్నేసింది. అలాంటి కొందరు నేతలు పారీ్టతో టచ్‌లో కూడా ఉన్నారు. అయితే, ఇటీవల అధినేత్రి మాయావతికి క్షమాపణ చెప్పిన తర్వాత మేనల్లుడు ఆకాశ్ ఆనంద్, ఆ తర్వాత మాజీ ఎంపీ గిరీశ్ చంద్ర తిరిగి పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిలో గిరీశ్ చంద్రకు బిజ్నోర్, అమ్రోహా పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అధినేత్రి బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో నాలుగు నెలల క్రితం పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రమోద్ నిరంకారిని రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ నియమించారు. -
నా భార్య వేధింపులు భరించలేకపోతున్నా.. ఇక సెలవు
భార్యాభర్తల సంబంధం అనేది చాలా సున్నితమైనది. ఇది ప్రేమ అనే బంధంతో ముడిపడి ఉంటుంది. చిన్నపాటి దారంతో మెలివేసి ఉంటుంది. ఈ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి చిన్న పొరపాటు సరిపోతుంది. ప్రేమ దారంతో ముడిపడాల్సిన బంధం.. అనుమానం అనే ఆయుధంతో దాడి చేస్తే కాపురాలు నాశనం అవుతాయి. ఆ బంధాలు శాశ్వతంగా నిలబడువు. ఈ ఘటనలో అదే జరిగింది.వారిది పెద్దగా అన్యోన్యమైన దాంపత్యం కాదు. పెళ్లై ఐదేళ్లే అవుతుంది. అప్పట్నుంచీ ఇంట్లో రోజూ చికాకులు. భార్యాభర్తల మధ్య గొడవలు. ఒకరి కంఫర్ట్ జోన్ లోకి ఇంకొకరు రాలేకపోయారు. దాంతో భర్త ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తాను చేయని తప్పుకు భార్య నిందించడంతోపాటు కేసును కూడా పెట్టడంతో భర్త ప్రాణాలు వదిలేశాడు. సమాజం, కుటుంబం తానేమిటీ అన్న విషయాన్ని నమ్మాలంటే అది తన ఆత్మహత్య ద్వారానే సాధ్యమవుతుందని భావించి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.34 ఏళ్ల మోహిత్ త్యాగి అనే వ్యక్తికి పెళ్లైన దగ్గర్నుంచీ భార్య నుంచి ఏవో వేధింపులకు గురవుతూనే ఉన్నాడట. 2020, డిసెంబర్లో ప్రియాంక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోహిత్.. ఆపై నరకం చూసాడట.తనకు రెండో పెళ్లి కావడంతో భార్య తన ఆస్తి కోసం, తన సంపాదన కోసమే చేసుకుని ప్రతీరోజూ నరకం చూపించేదని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ భార్య ప్రియాంకను, ఆమె తరఫు బంధువులు పేర్లు పేర్కొంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను చనిపోవడానికి నిర్ణయించుకున్న కొన్ని సెకన్ల ముందే ఆ నోట్ తన ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. ఆ వెంటనే విషం తాగాడు. రెండు రోజుల మృత్యువుతో పోరాడి చనిపోయాడు.2024లో మోహిత్ తల్లి చనిపోయిన క్రమంలో భార్య ప్రియాంక బాగా గొడవపడిందట. ఆ సమయంలోనే భార్య కొంతమందిని ఇంటికి తీసుకొచ్చి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారాన్ని మొత్తం అపహరించిందట. ఈ విషయాన్ని మోహిత్ సోదరుడు తాజాగా వెల్లడించాడు.సూసైడ్ నోట్ లో ఏముందంటే..నాపై అనుమానంతో ఒక తప్పుడు కేసును భార్య పెట్టించింది. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను పెళ్లి చేసుకుంది. అనేక సార్లు గర్భం వస్తే దాన్ని తీయించుకుంది. నన్ను చాలా హింసించింది. నేను ఇక తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నాపై పోలీస్ కేసు పెట్టడంతో నా జీవితం ఇక అనవసరం. నేనూ ఏ తప్పూ చేయలేదు. నేను చనిపోతున్నందుకు నాకు బాధేమీ లేదు. కాకపోతే నాకు పుట్టిన కొడుకు పరిస్థితి ఏమౌంతుందో అని ఆలోచిస్తున్నా. నాకు అదొక్కటే విచారంగా ఉంది. వీరంతా నా కొడుకును చంపేసే అవకాశం కూడా ఉంది. మీరు నిజాన్ని నమ్మాలంటే నాకు చావు ఒక్కటే శరణ్యం’ అని పేర్కొన్నాడు. భార్య ప్రియాంక, ఆమె తరుఫు బంధువులే తన చావుకు కారణమని తెలిపాడు. తన చావు తర్వాత భార్య ప్రియాంక కచ్చితంగా చింతిస్తుందని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఏప్రిల్ 15వ తేదీన సూసైడ్ చేసుకోగా, రెండు రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం..
ఈరోజుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావివరుసలు మరిచి విపరీత పోకడలకు పోతున్నారు కొందరు. తనకు కాబోయే అల్లుడితో అత్త జంప్ అయిన ఘటన మరువక ముందే.. అలాంటి దరిద్రపు ఘటనే యూపీ బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ.. తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్ ట్రక్క్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. అయితే, తన కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్ ట్రక్క్ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్ లేని సమయంలో శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమత, శైలేంద్ర.. తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో, వీరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిపింది.భర్త ఆవేదన..ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు.. శైలేంద్రకు ఫోన్ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.బిడ్డల ముందే..మరోవైపు.. మమత కుమారుడు మాట్లాడుతూ.. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ.. మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ.. సునీల్ వేరే చోట్ల ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. నెలలో రెండు మూడుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త దూరంగా ఉండటంతో మమత.. శైలేంద్రను ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని చెప్పారు. అతనే మమతను తీసుకెళ్లాడని చెబుతున్నారు. -
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
లక్నో: గృహ హింస చట్టం కింద రక్షణ కోరే అవకాశం కుటుంబంలోని ప్రతీ స్త్రీకి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. కేవలం అది కోడలకు మాత్రమే నిర్దేశించిన చట్టం మాత్రమే కాదని, అత్తకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. తనకు కోడలు పెట్టే గృహ హింస నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అది కేవలం కోడళ్లకు మాత్రమే ఉద్దేశించిన చట్టం మాత్రమే కాదని, కుటుంబంలో ఎవరైనా స్త్రీ దీనికి అర్హులేనని పేర్కొంది. జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గృహ హింస ఫిర్యాదులో తన అత్త దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్లను కోడలు, ఆమె తరుఫు బంధువులు సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఇకడ కోడలు పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు.. మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ అలోక్ మాథుర్ నేతృత్వంలోని హైకోర్టు సమర్ధించింది. అది కేవలం కోడళ్ల చట్టమంటూ హైకోర్టుకు..ఆ చట్టం అనేది కేవలం కోడళ్లకి మాత్రమే ఉద్దేశించబడినదంటూ హైకోర్టుకు వెళ్లింది కోడలు. గృహ హింస చట్టం అనేది కోడళ్లకు మాత్రమే చేయబడిదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మేజిస్ట్రేట్ తీర్పును సవాల్ చేసింది. దీన్ని కొట్టివేసేన హైకోర్టు,..గృహ హింసకు గురయ్యే ప్రతీ మహిళకి ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది. ఇది కేవలం కోడళ్లకి మాత్రమే చేయబడిన చట్టం కాదని చురకలంటించింది. డీసీ(డొమస్టిక్ వయెలెన్స్) చట్టంలోని సెక్షన్ 12 కింద కుటుంబంలోని ఏ స్త్రీ అయినా రక్షణ కోరవచ్చని తెలిపింది.ఇంతకీ కేసు ఏంటంటే..!యూపీ రాష్ట్రానికి చెందిన గరిమా అనే మహిళ సుధా మిశ్రాను వేధింపులకు గురి చేయడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. రాయబేరీలోని సొంత ఇంటి నుంచి వెళ్లిపోదామని భర్తపై గరిమా పదే పదే ఒత్తిడి తెచ్చింది. దాన్ని తన కొడుకు తిరస్కరించడంతో తనపై కోడలు వేధింపులు అధికమైనట్లు అత్త సుధా మిశ్రా పేర్కొంది.. అదే సమయంలో తన ఇంటి నుంచి కోడలు గరిమా, ఆమె తరఫు బంధులతో కలిసి బలవంతంగా డబ్బును, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపింది. దీనిపై గృహ హింస చట్టం కింద కోర్టును ఆశ్రయించింది. -
పాము కాటు కాదు.. భార్య నిర్వాకమే!
ప్రియుడికి తనకు మధ్యలో అడ్డుగా ఉన్నాడని భర్తను ముక్కలు చేసి సిమెంట్ డ్రమ్ములో కుక్కింది ఓ భార్య. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. ఈ క్రమంలో తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు అదే ప్రాంతంలో మరో ఘోరం చోటు చేసుకుంది.రెండు రోజుల కిందట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని. రాత్రంతా ఆ పాము అలాగే పక్కలోనే ఉండిపోయింది. ఉదయం దానిని తొలగించి అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో ‘పాపం’ అనుకున్నారంతా. అయితే బుధవారం సాయంత్రం ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో షాకింగ్ విషయం ఒకటి వెలుగు చూసింది.మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని పాము కాటేయడంతో మరణించాడని ప్రచారం చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.రవితకు అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి అమిత్ తన భార్యను మందలించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రియుడు అమర్జీత్తో కలిసి భర్తను కడతేర్చాలని రవిత స్కెచ్ వేసింది. అమర్జీత్ సాయంతో అమిత్ నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిపి ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆపై రోజుకి రూ.వెయ్యి ఖర్చు అద్దెతో తెచ్చిన ఓ పామును మంచం మీద పడేసింది. పాము కాటు వల్లే చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. స్థానికుల సాయంతో పాములు పట్టేవాడిని తెచ్చి దానిని తొలగించింది. దీంతో జనం కూడా పాము కాటు వల్లే అతను చనిపోయాడని నమ్మి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రవితతో పాటు అమర్జీత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా వేరే ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
‘కేన్సర్.. మనీ వేస్ట్’ : రియల్టర్ ఎంత పనిచేశాడు!
కేన్సర్ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయ్.ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుల్దీప్ త్యాగి (46) తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే తనకు కేన్సర్ వ్యాధి సోకిందని, ఎంత డబ్బు ఖర్చు చేసినా అది నయం కాదని భయపడిపోయాడు. అందుకే ఇలాంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్దీప్ తన భార్యను లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో కాల్చి చంపి, ఆపై నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇంట్లో తనను తాను కాల్చుకున్నాడు. సంఘటన జరిగిన సమయంలో వారి కుమారులు ఇంట్లో ఉన్నారు. తుపాకీ కాల్పులు విన్న వెంటనే వారి తల్లిదండ్రుల గదికి చేరుకున్నారు. కుల్దీప్ మృతదేహం నేలపై, అన్షు మృతదేహం మంచంపై కనిపించింది. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను శవపరీక్షకు పంపారు.‘‘కేన్సర్ ఉందని నిర్ధారణ అయింది. నా కుటుంబానికి దాని గురించి తెలియదు. కోలుకుంటానన్న గ్యారంటీ లేదు. దీనికి చికిత్స కోసం డబ్బు వృధా .. అందుకే ఈ నిర్ణయం. ఇందులో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు, ముఖ్యంగా నా పిల్లలు నిందించాల్సిన అవసరం లేదు" అంటూ సూసైడ్ నోట్ రాశాడు. అలాగే కలిసి ఉంటామని ప్రమాణం చేశాను కాబట్టి తన భార్య అన్షు త్యాగిని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోతున్నా అంటూ ఆమెను కూడా కాల్చి చంపేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుల్దీప్ తండ్రి రిటైర్డ్ పోలీసు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి పూనమ్ మిశ్రా వెల్లడించారు. -
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
లక్నో: తన కూతురికి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకున్న పరారీ అయిన అత్త ఘటన వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని సప్న తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. మరోవైపు.. తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కునవేలేసుకున్నారు.అయితే, తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. ఈ తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే, తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది.మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.Aligarh's absconding 'mother-in-law and son-in-law' were caught, what did the mother-in-law say, watch the video#Aligarh #Nepalborder #Bihar #saas #damad #Breaking #Lateat pic.twitter.com/yTOu6qXwig— Indian Observer (@ag_Journalist) April 16, 2025 -
మీరట్ కేసు.. నిందితురాలికి జైల్లో స్పెషల్ సదుపాయాలు
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితురాలు, అతడి భార్య ముస్కాన్ రస్తోగిని జైల్లోని ప్రత్యేక ప్రసూతి బ్యారక్‌లోకి మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు గర్భంతో ఉన్న మరో మహిళా ఖైదీని కూడా తరలించనున్నారు.ప్రస్తుతం ఆరు వారాల గర్భవతిగా ఉన్న ముస్కాన్ రాస్తోగిని గర్భిణీ ఖైదీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారక్‌లోకి పంపనున్నట్లు జైలు అధికారి తెలిపారు. బిడ్డ జన్మించేంత వరకు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముస్కాన్ రస్తోగికి ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు.సౌరబ్ రాజ్‌పుత్ సోదరుడు బబ్లూ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు.కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
భర్త చనిపోయిన బాధలో అంజలి.. ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి..
లక్నో: భూమికి సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఆమెకు మద్యం తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి(28) జీవిస్తోంది. తన భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్దే ఉంటోంది. కాగా, అంజలి, రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర యాదవ్ మధ్య ఓ భూమికి సంబంధించి కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అంజలికి శివేంద్ర యాదవ్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా.. ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడు. దీంతో, తనకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని అంజలి డిమాండ్ చేయడంతో శివేంద్ర తప్పించుకునేందుకు ప్లాన్ చేశాడు. అంజలిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ నేపథ్యంలో మరో వ్యక్తి గౌరవ్‌తో కలిసి అంజలిని హత్య చేసేందుకు శివేంద్ర ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అంజలికి ఫోన్ చేసి.. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని తన ఇంటికి రావాలిని శివేంద్ర చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అంజలి.. అక్కడికి వెళ్లడంతో.. వారిద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం, గొంతు కోసి హత్యచేసి మృతదేహాన్ని యమునా నదిలో పడేశారు. ఈ క్రమంలో గత ఐదు రోజులుగా అంజలి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు.. ఫోన్ ట్రాకింగ్, స్కూటీ ఆధారంగా యుమునా నది వద్ద ఉన్నట్టు తేల్చారు. దర్యాప్తులో భాగంగా శివేంద్ర, గౌరవ్.. ఆమెను హత్య చేసినట్టు గుర్తించారు.దీంతో, వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన తీరులో విచారించగా.. అంజలిని తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. భూమి వివాదంలో అంజలి పదేపదే డబ్బులు అడుగుతున్న కారణంగానే హత్య చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీశారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, అంజలి బిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోవడంతో బోరున విలపిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.Etawah, Uttar Pradesh: Senior Superintendent of Police (Etawah), Sanjay Kumar Verma says, "A report was received yesterday at the Civil Lines police station regarding a woman named Anjali, aged around 28-30 years, who had gone missing. She was a widow with two children. Upon… pic.twitter.com/Dc2gfdNwKP— IANS (@ians_india) April 12, 2025 -
అయోధ్య గెస్ట్‌హౌస్‌లో దారుణం.. మహిళలు స్నానం చేస్తున్న వీడియో తీసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగుచూసింది. అయోధ్యలోని ఒక గెస్ట్ హౌస్‌లో బాత్రూమ్లో మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్న వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్లో వందల వరకు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. అయోధ్యలోని రామాలయం గేట్ నంబర్-3 దగ్గరలో రాజా గెస్ట్ హౌస్ ఉంది. రామాలయం దర్శనం కోసం అయోధ్యకు వచ్చిన వారు ఈ గెస్ట్‌హౌస్‌లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే, తాజాగా వారణాసికి చెందిన ఓ మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వచ్చారు. శుక్రవారం సదరు రాజా గెస్ట్‌హౌస్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో సదరు మహిళ.. బాత్రూమ్లో స్నానం చేస్తుండగా.. గెస్ట్‌హౌస్‌లో పనిచేసే సౌరభ్ తివారీ అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. అది గమనించిన ఆమె.. ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు, అక్కడ పనిచేస్తున్న వారు అతడిని పట్టుకున్నారు.అనంతరం, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. నిందితుడు సౌరభ్ తివారీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న ఫోన్ తీసుకుని పరిశీలించగా.. మహిళలు స్నానం చేస్తున్న పది వీడియోలను, అనేక అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.🚨 Ayodhya | A 30-year-old female devotee was secretly filmed while bathing at Raja Guest House near Gate No. 3 of the #Ayodhya Ram Temple.Another disturbing breach of women's privacy in UP.#Ayodhya #WomenSafety #PrivacyViolation #UPNews #indtoday pic.twitter.com/uWRtfpouvV— indtoday (@ind2day) April 11, 2025ఈ క్రమంలో బాధితురాలు మాట్లాడుతూ.. నేనుస్నానం చేసేందుకు బాత్రూమ్లోకి వెళ్లాను. బాత్రూమ్లో పైన ఒక టిన్ షెడ్ ఉంది. నేను స్నానం చేస్తుండగా, అకస్మాత్తుగా పైన ఒక నీడ కనిపించింది. అప్పుడు ఎవరో మొబైల్ ఫోన్‌తో రికార్డ్ చేయడం చూశాను. నేను భయపడి, అరిచి, నా బట్టలు వేసుకుని బయటకు పరిగెత్తాను. గెస్ట్ హౌస్‌లో బస చేసిన ఇతర అతిథులు కూడా బయటకు వెళ్లి ఆ వ్యక్తిని పట్టుకున్నారు అని తెలిపారు. -
అత్యాచార కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చింది?: ప్రధాని ఆరా
వారణాసి: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో శుక్రవారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో సంచలన సృష్టించిన అత్యాచార ఘటనపై ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం వారణాసిలో 19 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీశారు.ఆ దారుణ ఘటనకు సంబంధించిన నిందితుల్ని అందరన్నీ అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని పోలీస్ కమిషనర్ ని ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా ఆయనకు మర్యాద పూర్వకంగా కలవడానికి వెళ్లిన సిటీ పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లను ప్రధాని మోదీ ప్రశ్నించారు. అత్యాచార ఘటన కేసులో పురోగతి ఎంతవరకూ వచ్చిందని మోదీ అడిగి తెలుసుకున్నారు.ఈ క్రమంలోనే నిందితులకు ఏమైతే శిక్షలు ఉంటాయో అవి అమలయ్యేలా చూడాలన్న మోదీ.. భవిష్యత్ లో ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనిపై సమాధానమిచ్చిన పోలీస్ కమిషనర్.. కేసులో పురోగతి ఉందని స్పష్టం చేశారు. పలువుర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా, ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 22 గ్యాంగ్ రేప్‌నకు పాల్పడినట్లు యువతి ఫిర్యాదు చేసింది.. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నగరంలోని లాల్పూర్కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ను కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే కొన్నిరోజుల పాటు తిరిగి రాలేదు. దీనిపై ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే రోజు, పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు పోలీసులు. అనంతరం ఆమెసొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్‌లో తనపై మొత్తం 22 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది.కేసు నమోదు చేసిన పోలీసులు హుకూల్ గంజ్, లాల్పూర్ ఏరియాలకు చెందిన కొందరు నిందితులను అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. -
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
‘‘అమ్మా.. ఇక సెలవు.. శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటున్నా’’ అంటూ ఓ కొడుకు రాసిన సూసైడ్ లెటర్ ఆ తల్లిని తల్లడిల్లిపోయేలా చేసింది. ఉత్తర ప్రదేశ్ బరేలీలో బుధవారం ఘోరం జరిగింది. భర్తపై కక్ష గట్టి మరీ ఆ భార్య అతని కటకటాలపాలు చేసింది. అది భరించలేకపోయిన ఓ భర్త.. పైగా ఆ విషయం సోషల్ మీడియాకు కూడా చేరడంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.రాజ్ ఆర్య, సిమ్రాన్లకు ఏడాది కిందట వివాహం జరగ్గా.. ఈ జంటకు నెలల బాబు ఉన్నాడు. అయితే గతకొంతకాలంగా ఆ కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఓ వివాహ వేడుకకు భార్యతో పాటు హాజరు కావాల్సిన పరిస్థితి రావడంతో రాజ్, అతని తండ్రి షాహ్జన్పూర్లోని సిమ్రాన్ ఇంటికి వెళ్లాడు. అయితే సిమ్రాన్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుని సిమ్రాన్ సోదరులంతా రాజ్, అతని తండ్రిపై దాడి చేశారు. దీంతో చేసేది లేక ఆ ఇద్దర బరేలీకి తిరిగి వచ్చారు. ఈలోపు..ఇంటికొచ్చి మరీ తన కుటుంబ సభ్యులపై దాడి చేశారంటూ రాజ్, అతని తండ్రిపై సిమ్రాన్ కేసు పెట్టింది. దీంతో విచారణ పేరిట బుధవారం రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. గురువారం ఉదయం ఇంటికి వచ్చిన రాజ్.. తనకు నిద్రగా ఉందంటూ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. స్టేషన్లో తనకు తీవ్ర అవమానం జరిగిందని, అది భరించలేక పోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అయితే.. సిమ్రాన్ వివాహేతర సంబంధమే దీనంతటికి కారణమని రాజ్ సోదరి అంటోంది. పైగా రాజ్‌పై ఫిర్యాదు చేయడానికి ముందు.. చేశాక.. ‘ఇక ఊచలు లెక్కపెట్టు’ అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టులను ఆమె బయటపెట్టింది. అంతేకాదు పోలీస్ అధికారి అయిన సిమ్రాన్ సోదరుడు రాత్రంతా రాజ్‌ను పీఎస్‌లో ఉంచి చితకబాదాడని, ఆ అవమానాన్ని తన సోదరుడు భరించలేకపోయాడని ఆరోపించిందామె. ఇక ఈ ఘటనపై రాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. In the suicide case of #RajArya, a resident of #AkankshaEnclave under the #Izzatnagar police station area in #UttarPradesh's #Bareilly, an FIR has been registered against seven individuals, including his wife #Simran.The report was filed by the deceased's brother, Suresh,… https://t.co/Z4MGrKhyEt pic.twitter.com/otNGtaMmvs— Hate Detector 🔍 (@HateDetectors) April 10, 2025 ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. తీవ్ర నిర్ణయాలు తీసుకునే ముందు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
నేడు వారణాసికి ప్రధాని మోదీ
వారణాసి/భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సొంత నియోజకకవర్గం వారణాసిలో రూ3,880 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ వివరించారు. మెహెందీగంజ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారన్నారు. వారణాసిలో సుమారు రెండున్నర గంటలు ప్రధాని గడుపుతారు. -
కన్నీరు కార్చడమే దేశద్రోహమా?
ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగి సాఖిబ్ ఖాన్ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్ ఖాన్ సహారన్పూర్ జిల్లా కైలాష్పురిలో విద్యుత్ సంస్థకు చెందిన సబ్ స్టేషన్లో కాంట్రాక్టు మీద లైన్ మన్‌గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్ నమాజ్ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియా మీద పంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్ పరివార్ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అదే సమయంలో సహారన్పూర్లో అంబాలా రోడ్ ఈద్గాలో నమాజ్ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్ సూపరింటెండెంట్ వ్యోమ్ బిందాల్ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం. నిజానికి పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఇజ్రాయెల్ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు. దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్ అరాఫాత్తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్ ఇంగ్లిష్ వాళ్లకూ, ఫ్రాన్స్ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. ఇజ్రాయెల్ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 1988 నవంబర్ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్‌తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. పీఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫాత్ 1997 నవంబర్‌లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్ హైదరాబాద్‌కు కూడా వచ్చి ఇండో–అరబ్ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్‌కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. చదవండి: కఠిన వాస్తవాలను దాచేస్తారా?అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్మేట్ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెంచ్ బెయిల్ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా. -
ఆమెకు 30.. అతడికి 18.. ముగ్గురు పిల్లులున్నా భర్తను కాదని..
లక్నో: ఆమె వయసు 30ఏళ్లు.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం, మతం మార్చుకుని 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని మూడో పెళ్లి చేసుకుంది. అయితే, వీరి వివాహానికి యువకుడి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోకి చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని అమ్రోహా జిల్లాలోని సైదాన్వాలిలో నివసిస్తున్న షబ్నమ్‌కు తల్లిదండ్రులు లేరు. ఆమెకు మొదట మీరట్‌కు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అనంతరం, కొన్ని కుటుంబ కారణాల వల్ల మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. తర్వాత ఆ గ్రామానికి చెందిన తౌఫిక్‌తో ఆమెకు రెండో వివాహమైంది. అయితే 2011లో రోడ్డు ప్రమాదం వల్ల అతడు వికలాంగుడయ్యాడు. దీంతో, తాజాగా 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి శివతో ప్రేమలో పడింది. దీంతో, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న వికలాంగుడైన భర్త తౌఫిక్‌కు ఆమె విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత హిందూ మతంలోకి మారింది. షబ్నమ్ పేరును కాస్తా.. శివానీగా మార్చుకున్నది. ఈ క్రమంలో స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం విద్యార్థి శివను పెళ్లాడింది. మరోవైపు శివానీతో తన కుమారుడి పెళ్లిని శివ తండ్రి దాతారామ్ సింగ్ స్వాగతించాడు. తన కొడుకు నిర్ణయానికి తాను మద్దతు ఇస్తున్నానని తెలిపాడు. ఆ జంట సంతోషంగా ఉంటే తమ కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పాడు.ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిషేధిత చట్టం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Amroha : Shivani became Shabnam in love... Divorcing her first husband & Married with Shiva Shivani left Muslim religion and converted to Hinduism and got married The case of a village of Thana Said Nangli #UttarPradesh pic.twitter.com/QnJyKzl1PZ— Indian Observer (@ag_Journalist) April 9, 2025 -
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు. -
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
మీరట్: గత నెలలో యూపీలో సంచలన సృష్టించిన భర్త హత్య కేసులో నిందితురాలిగా మీరట్ జైల్లో ఉన్న ముస్కాన్ గర్బవతి అని మెడికల్ రిపోర్ట్ లో రావడంతో పుట్టబోయే బేబీ సంగతి ఏంటనే చర్చ మొదలైంది. భర్తను ప్రియుడితో సాహిల్ శుక్లాతో కలిసి హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్న ముస్కాన్ గురించి కనీసం ఆమె కుటుంబం కూడా పట్టించుకోవడం లేదు. ముస్కాన్ గర్భం దాల్చింది అన్న తర్వాత ఆమె కుటుంబం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. భర్తను హత్య చేసిన తర్వాతే ఆమెను పట్టించుకోవడం మానేసిన కుటుంబ సభ్యులు.. ఈ విషయం గురించి కూడా ఎటువంటి ఆసక్తి చూపలేదు.ఈ విషయంపై హత్య గావించబడ్డ సౌరభ్ సోదరుడు మాత్రం.. ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ సౌరభ్ రక్తం అయితే తాము తప్పకుండా పెంచుకుంటామన్నాడు. సౌరబ్ రాజ్ పుత్ సోదరుడు బబ్లూ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘ ముస్కాన్ కు పుట్టబోయే బిడ్డ మా అన్నకు సంబంధించిన బేబీ అయితే మేము కచ్చితంగా పెంచుకుంటాం. అన్నీ చూసుకుంటాం.’ అని స్పష్టం చేశాడు.ముస్కాన్ గర్భవతి అని తెలిసినా..ముస్కాన్ గర్భవతి అని తెలిసినప్పటికీ ఆమె కుటుంబ నుంచి ఎవరూ కూడా జైలుకు వచ్చి చూడలేదు. కాకపోతే ఆమె ప్రియుడు సాహిల్ కుటుంబ సభ్యులు మాత్రం సోమవారం జైలుకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్లారు. సాహిల్ నాన్నమ్మ జైలుకు వచ్చి మనవడితో మాట్లాడి వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముస్కాన్, సాహిల్‌లు ఇద్దరూ మీరట్ జిల్లా జైల్లో వేర్వేరు బారక్‌ల్లో ఉంటున్నారు. తాము కలిసి ఉంటామని ఒకే బారక్ ఇవ్వమని డిమాండ్ చేసినా జైలు రూల్స్ ఒప్పుకోవమని చెప్పి వారికి సెపరేట్ రూమ్‌లే కేటాయించారు అధికారులు. ముస్కాన్ గర్భం దాల్చిన విషయాన్ని సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు. ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. కాగా, సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
మీరట్ హత్య కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి మరో కీలక విషయం
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీలో చట్టాన్ని అతిక్రమించే చర్యలే ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి తాను తిరిగి తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. ఈ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో అసలు యూపీలో ఏం జరుగుతుందని సూటిగా ప్రశ్నించింది సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్శనాథన్‌లతో కూడిన ధర్మాసనం.‘ఇదొక సివిల్ కేసు.. దీన్ని క్రిమినల్ కేసు కింద ఎందుకు ఫైల్ చేశారు. యూపీ పోలీసుల తీరు ఎంతమాత్రం సహేతుకం కాదు. సివిల్ నేపథ్యం ఉన్న కేసుల్ని క్రిమినల్ కేసుగా ఎందుకు మార్చి రాశారు. చట్ట ప్రకారం ఇది సరైనది కాదు. ఒక మనిషి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేని పక్షంలో అది క్రిమినల్ కేసులోకి రాదు యూపీలో ప్రతీరోజూ చాలా వరకూ ఈ తరహా కేసులే కనిపిస్తున్నాయి. సివిల్ కేసుల్ని తీసుకొచ్చి క్రిమినల్ కేసుల కింద ఎలా ఫైల్ చేస్తారు. ఇది కంప్లీట్ గా చట్టాన్ని అతిక్రమించడమే’ అని ధర్మాసనం చురకలు అంటించింది. ఇదీ చదవండి: మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు -
బాల రాముడికి సూర్యతిలకం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాల రాముడికి ఆదివారం సూర్య భగవానుడు తిలకం అద్దడం చూసి భక్తులు పులకించిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తిలకం 4 నిమిషాలపాటు కొనసాగడం అమితంగా ఆకట్టుకుంది. కొందరు గర్భాలయంలో ఆనందంతో నృత్యాలు చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా సూర్యతిలకం అద్దే కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. అలాగే ప్రభు శ్రీరామ్‌లల్లాకు అర్చకులు ప్రత్యేకంగా మహా మస్తకాభిషేకం నిర్వహించినట్లు తెలియజేసింది. 56 పదార్థాలతో కూడిన భోగ్‌ను శ్రీరాముడికి నివేదించారు. ప్రత్యేక హారతి ఇచ్చారు. గర్భాలయంలో సూర్యతిలకం, మహా మస్తకాభిషేకాన్ని నేరుగా చూడలేని భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. 10 లక్షల మందికిపైగా తరలివచ్చినట్లు అంచనా. -
Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం
అయోధ్య: నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు జన్మించిన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారుకు ఈ రోజు ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలక్ రాముణ్ణి దర్శించుకునే వేళలను పొడిగించారు. ఈరోజు బాలరాముడు భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచివుంచనున్నారు. వీవీఐపీ దర్శనాలను(VVIP visits) కూడా నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దనున్నాడు. (ఆ సమయంలో సూర్య కిరణాలు శ్రీరాములవారి నుదుటను తాకనున్నాయి)ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా అందంగా తీర్చి దిద్దారు. రామనగరి అయోధ్యలో ఈరోజు సాయంత్రం సరయూ తీరంలో రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
పెళ్లి రోజే భార్య కళ్ల ముందు కుప్పకూలి..
ఆ జంట విజయవంతంగా పాతికేళ్లు వివాహ బంధం పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యుల సూచన మేరకు సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. బంధువులు, అతిథులంతా ఆ సంబురంలో భాగం అయ్యారు. కొందరు అమ్మాయిలు ఆ జంటతో వేదిక మీద డ్యాన్సులు వేయించారు. అయితే అంతలోనే అనుకోని విషాదం ఆ వేదికను ఆవిరించింది. అచేతనంగా పడి ఉన్న భర్తను చూసి ఆ భార్య గుండెలు అవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. లక్నో: వసీం సర్వత్(Wasim sarwat) ఉత్తర ప్రదేశ్ బరేలీ(Bareilly)లో షూ వ్యాపారి. 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. హ్యాపీగా స్టేజ్‌పై తన భార్య ఫరాతో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే, ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన గుండెపోటు(Heart Attack)తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వసీం స్టేజ్‌పై కుప్పకూలి పడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.🚨2 April 25 : Shoe merchant Wasim died of a #heartattack2025 while dancing with his wife on his 25th wedding anniversary in Bareilly district of Uttar Pradesh.#LuciferShotWorking #ChipShot pic.twitter.com/OrHYonE2NP— Anand Panna (@AnandPanna1) April 3, 2025హఠాన్మరణాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అప్పటిదాకా ఆరోగ్యంగా.. హుషారుగా కనిపించవాళ్లు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణం విడుస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలని నిపుణులు సూచిస్తుండగా.. ఇలాంటి అత్యవసర సందర్భాల్లో సీపీఆర్లాంటి వాటిపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నోట్: పై వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేయొచ్చు. కేవలం వార్తను అథెంటిక్‌గా అందించే ఉద్దేశంలో భాగంగానే వీడియోను అందిస్తున్నాం. -
ఇకనైనా అరాచకం ఆగేనా!
రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్డోజర్ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక బుల్డోజర్ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్డోజర్లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్డోజర్లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన బెంచ్ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్ అహ్మద్ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్ జిల్లా కలెక్టర్ షకీర్ అహ్మద్ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో షకీర్ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్డోజర్ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్ తన స్కూల్ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది. -
ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు ట్విస్ట్ ఇచ్చిన రెండో అత్త
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది. -
‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. 2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి. ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.రూ.10లక్షల నష్టపరిహారం ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్ చర్యలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.అది మా పొరపాటేఅంతకుముందు అడ్వకేట్, ప్రొఫెసర్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్ అతిక్ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదుకూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి. పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్ ఎస్.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయిఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది. అందరూ కలత చెందుతున్నారుఅదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్లో బుల్డోజర్ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు. -
Uttar Pradesh: భవనంలో అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నోయిడా: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్ని ప్రమాదాలు(Fire hazards) చోటుచేసుకుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గల సెక్టార్ 18లోని ఒక భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ని కీలల నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనంపై నుంచి దూకడాన్ని మనం వీడియోలో చూడవచ్చు नोएडा के सेक्टर 18 स्थित बिल्डिंग में आग लग गई। देखिए लोग कैसे कूदकर अपनी जान बचा रहे हैं: @NavbharatTimes pic.twitter.com/2I4LC0IVgF— NBT Uttar Pradesh (@UPNBT) April 1, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం అట్టా మార్కెట్(Atta Market)లోని ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల నుంచి తప్పించుకునేందుకు భవనంలోని వారు తొలుత భవనం పైభాగానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సెక్టార్ 18లోని కృష్ణ అపరా ప్లాజాలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నదీ ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. తొలుత భవనం బేస్మెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి అగ్ని జ్వాలలు మొదటి అంతస్తుకు, తరువాత రెండవ అంతస్తుకు చేరుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత -
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్ గోవిల్.టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్ గోవిల్.. మీరట్ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్ గోవిల్(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్ గోవిల్ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు. ఈ కేసులో భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్, కూరగాయాలు పండిస్తూ సాహిల్ గడపబోతున్నారు.అది ఏఐ జనరేటెడ్ వీడియో!రిమాండ్ ఖైదీగా ఉన్న ముస్కాన్ ఓ పోలీస్ అధికారితో ఏకాంతంగా గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్లోడ్ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్, సాహిల్ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం విశేషం. -
రూ. 800 ఫీజు కట్టలేదని అవమానించారు.. బాలిక ఆత్మహత్య!
ఆ బాలిక చదివేది తొమ్మిదో తరగతి.. ఎగ్జామ్ టైమ్ వచ్చింది. కానీ ఆ బాలిక స్కూల్ ఫీజు రూ. 800 కట్టాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించక ఆ కొద్ది మొత్తాన్ని పరీక్షల నాటికి కట్టలేకపోయింది. ఇంకేముందే పరీక్షలు రాయడానికి స్కూల్ యాజమాన్యం అంగీకరించకపోగా, అవమానించింది. ఇది కూడా బహిరంగంగా ఆ అమ్మాయిని స్కూల్ యాజమాన్యం అవమానించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్ గడ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది.స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ దగ్గర్నుంచీ స్కూల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఆఫీసర్ దీపక్ సరోజ్ లు ఆ బాలికను అవమానానికి గురి చేశారు. స్కూల్ పరీక్ష ఫీజు కట్టలేకపోయిందంటూ అవమానించారు. అంతేకాకుండా పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పారు. ఇక చేసేది లేక అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇంటికి వచ్చేసింది. లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె తల్లి పొలం పనికి వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి విగత జీవిలా కనిపించింది.స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను పరీక్షకు అనుమతించడమే కాకుండా అవమానించడం దారణమని న్యాయవాది, స్థానిక పంచాయతీ సభ్యుడైన మొహ్మద్ అరిఫ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యాలు అవమానించాయంటే అది నేరం కిందకు వస్తుందన్నారు.తన కూతురు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేస్తోంది. దీనిపై భారతీయ న్యాయ సన్నిహిత సెక్షన్ 107 కింద స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
పొట్టలో మర్చిపోయిన కత్తెరను 17 ఏళ్ల తర్వాత తీశారు!
లక్నో: సిజేరియన్ సమయంలో మహిళ పొట్టలోనే కత్తెరను మర్చిపోయి కుట్లేశాడో వైద్యుడు. 2008లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 17 ఏళ్ల పాటు కడుపు నొప్పితో ఎంతో బాధపడింది ఆ మహిళ. చివరికి ఎక్స్ రేతో పొట్టలో కత్తెర ఉన్న విషయం తెల్సి ఆపరేషన్‌తో వెలుపలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సంధ్యా పాండే అనే మహిళకు 2008 ఫిబ్రవరి 28వ తేదీన లక్నోలోని ‘షీ మెడికల్ కేర్’ఆస్పత్రిలో సిజేరియన్తో కాన్పు చేశారు. ఆ సర్జరీ జరిగినప్పటి నుంచి పొట్టలో విపరీతమైన బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఎందరో డాక్ట ర్ల వద్దకు వెళ్లారు. అయినా ఉపశమనం దొరకలేదు. ఇటీవల సంధ్యా పాండే వైద్య పరీక్షల కోసం లక్నోలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎక్స్ రే కూడా తీశారు. ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు ఎక్స్ రే రిపోర్టుతో తెలిసింది. దీంతో ఆమె కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు. మార్చి 26వ తేదీన ఆపరేషన్ చేసి వైద్యులు కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. ఎంతో సంక్లిష్టమైన ఆపరేషన్ ద్వారా కత్తెరను బయట కు తీశామని, కోలుకున్నాక సంధ్యా పాండేను డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సంధ్య భర్త అరవింద్ కుమార్ పాండే ఫిర్యాదు మేరకు సిజేరియన్ చేసిన డాక్టర్ పుష్పా జైశ్వాల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త.. ఆ తర్వాత ఏమైందంటే?
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరో వ్యక్తిని ప్రేమించి, అతడితోనే ఉంటానని చెప్పడంతో భర్త.. వారిద్దరికీ పెళ్లి జరిపించారు. అంతేకాకుండా.. తమ ఇద్దరు పిల్లలను తానే పోషిస్తానని సదరు భర్త చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోని సంత్ కబీర్‌నగర్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన రాధికను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బబ్లూ జీవనోపాధి మరోచోట పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రాధిక.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఈ సంబంధం క్రమంగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం భర్త బబ్లూకు కూడా తెలిసింది. దీంతో, భార్యను మందలించాడు. తీరు మార్చుకోవాలని సూచించాడు. అయితే, ఆమె మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో బబ్లూ.. నా భార్య నాతో జీవించాలా లేక తన ప్రేమికుడితో జీవించాలా అని నిర్ణయించుకుంటుందా? అని గ్రామస్తుల ముందు పంచాయితీ పెట్టాడు. ఆ మహిళ తన ప్రేమికుడితో కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు మొత్తం సమాజం నివ్వెరపోయింది.భార్య ప్రవర్తన కారణంగా చేసేదేమీ లేకపోవడంతో.. ముందుగా భర్త తన భార్యతో కలిసి నోటరీ పబ్లిక్ కోర్టుకు హాజరయ్యాడు. ఆపై తన భార్యను ఆమె ప్రియుడితో ఒక ఆలయంలో రెండో వివాహం చేశాడు. తానే దగ్గరుండి ఆమె ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరిపించాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇక మొదటి భర్త తన భార్యతో కలిగిన సంతానాన్ని తనతోనే పోషిస్తానని చెప్పాడు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Darr Ka Mahaul HaiKai shocking cases mein jab patiyon ko maar diya gaya, toh pati community mein darr fail gaya hai.Sant Kabir Nagar: Ek naye twist mein, 7 saal ki shadi ke baad, ek aadmi ne apni biwi ka past accept kar liya aur khud usko uske lover ke saath vida kiya, aur… pic.twitter.com/CLwzKzg1e1— F3News (@F3NewsOfficial) March 26, 2025 -
యూపీలో అన్ని మతాల ప్రజలు సురక్షితమేనా?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని.. అందుకే రాష్ట్రంలో అన్ని మతాల వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కేవలం హిందూ మతానికే బీజేపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శల ప్రస్తావనతో ఆయనకో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..‘‘ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. అయితే ఇదంతా 2017కి ముందు నాటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?.. లేదు కదా. అందుకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా తీసుకోండి. పాకిస్థాన్ మరో ఉదాహరణ. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో తెలుసు కదా!. అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది?’’ అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లే. నేనొక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని. నేనొక యోగిని. నా దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం కూడా అని అన్నారాయన. సనాతన ధర్మం ఈ భూమ్మీదే అతిపురాతన మతం అని, దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని అన్నారు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చరిత్రలో లేవన్నారు. కానీ, బదులుగా మనకు దక్కుతోంది ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీలాంటి ‘నమునా’ వల్లే బీజేపీ ఇవాళ దేశంలో బలంగా ఉండగలిగిందని యోగి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. విదేశాలకు వెళ్లి మాతృదేశాన్నే తిడతారు. అందుకే ఆయన ఉద్దేశాలేంటో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి ‘నమునా మనుషులే’ ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అప్పుడే దారులన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోగలం. అయోధ్య, కుంభమేళా సహా దేశ ప్రతిష్టకు పేరు తెచ్చే ఏ సందర్భానైనా వివాదం చేయడమే కాంగ్రెస్‌కు తెలుసు అని అన్నారాయన. చట్టాన్నిగౌరవిస్తున్నాం, లేకుంటేనా..ప్రార్థనా స్థలాల వివాదాలపైనా సీఎం యోగి ఏఎన్ఐ ఇంటర్వ్యలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని అన్నారాయన. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపుగా అభివర్ణించిన సీఎం యోగి.. అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని అన్నారు. దేవుడు ఇచ్చిన కళ్లు.. ఆ కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇది చూడాల్సిందే. శంభల్‌లో ఏం జరిగింది.. అదే సత్యం అని యోగి పేర్కొన్నారు. ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారాయన. -
మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు -
ఉదయం గర్ల్‌ఫ్రెండ్.. సాయంత్రం మరొకరు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒకే రోజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రియురాలి మెడలో ఉదయం తాళికట్టిన అతడు.. పెద్దలు కుదిర్చిన యువతితో సాయంత్రం ఏడడుగులు నడిచాడు. మోసపోయినట్లు తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్ జిల్లా హర్పూర్ బుధాట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు నాలుగేళ్లుగా ఓ యువతితో సంబంధం నెరుపుతున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఒకసారి గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జన్మించిన బిడ్డను నర్సుకు అప్పగించాడు. రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటే తన కుటుంబం కూడా ఒప్పుకుంటుందని నమ్మబలికాడు.ఈ క్రమంలో ఒక రోజు ఉదయం రిజిస్టర్ ఆఫీసుకు తీసుకెళ్లి, తాళి కట్టాడు. అదే రోజు రాత్రి పెద్దలు కుదిర్చిన విధంగా సంప్రదాయబద్ధంగా మరో యువతిని పెళ్లి చేసుకుంది. అనంతరం, విషయం తెలిసి అక్కడికి వెళ్లిన బాధితురాలిని అతడి కుటుంబీకులు దూషించి, వెళ్లగొట్టారు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి జితేంద్ర కుమార్ తెలిపారు. -
యూపీలో మరో దారుణం
మెయిన్‌పురి: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన రెండు వారాలకే ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భర్తను చంపించిందో భార్య. ఒకే గ్రామానికి చెందిన ప్రగతి యాదవ్, అనురాగ్ యాదవ్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే.. ప్రగతి కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా మార్చి ఐదో తేదీన దిలీప్ యాదవ్‌తో వివాహం జరిపించారు. అయిష్టంగానే పెళ్లి చేసుకున్న ప్రగతి ఎలాగైనా దిలీప్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనురాగ్‌తో కలిసి దిలీప్‌ను హతమార్చాలని పథకం వేసింది. ఈ హత్యకు ఏర్పాట్లు చేయడానికి అనురాగ్‌కు ప్రగతి రూ .1 లక్ష ఇచ్చింది.రాంజీ అనే కిరాయి హంతకుడిని ఈ పని కోసం రూ.2 లక్షలకు నియమించుకున్నారు. దిలీప్ మార్చి 19వ తేదీన పని మీద కన్నౌజ్ జిల్లాకు వెళ్లి తిరిగొస్తూ పట్నా కెనాల్ సమీపంలో ఓ హోటల్ వద్ద ఆగాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దిలీప్ వద్దకొచ్చి తమ బైక్ పాడైందని, సాయపడాలంటూ దిలీప్‌ను తమ ఇంకో బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో దిలీప్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పొలంలో పడేసి పరారయ్యారు.దిలీప్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు రోజుల తర్వాత అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనాస్థలి సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా గుర్తుతెలియని వ్యక్తుల దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి సాయంతో కిరాయి హంతకుడు రాంజీని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచా రంతో అనురాగ్, ప్రగతిని అదుపులోకి తీసుకున్నారు. -
నోటీసిచ్చి.. 24 గంటల్లో కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్స్టర్విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు. -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
మీరట్ సౌరభ్ కేసులో మరో ట్విస్ట్
మీరట్: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితుల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సౌరభ్ భార్య, నిందితురాలు ముస్కాన్ రస్తోగి తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ శుక్లాకు ఇచ్చినట్లు తెలిసింది. ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడించి వచ్చిన డబ్బుతో వీరిద్దరూ విహారయాత్రలకు వెళ్లినట్లు దర్యాప్తు తేలింది. అలాగే, సౌరభ్‌కు నిద్ర మాత్రలు ఇచ్చిన నిద్రలోకి వెళ్లిన తర్వాత హత్య చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. మెడికల్ స్టోర్‌లో కొనుగోలు చేసిన మాత్రల గురించి విచారణ చేపట్టినట్టు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని మీటర్లో ప్రేమించి పెళ్లాడిన సౌరభ్‌ను ప్రియుడి సాయంతో ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇక, తాజాగా ముస్కాన్ తన భర్త సంపాదించిన డబ్బులను ప్రియుడు సాహిల్ ఇచ్చినట్టు తెలిసింది. వాటితో బెట్టింగ్ ఆడినట్టు వెల్లడైంది. అలా వచ్చిన డబ్బులతో వారిద్దరూ విహారయాత్రకు వెళ్లారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. భార్యా భర్తలుగా చెప్పుకుని కసోల్‌లోని ఓ హోటల్లో మార్చి 10న దిగారు. అక్కడే ఆరు రోజులు ఉండి 16వ తేదీన వెళ్లిపోయారు. వారితోపాటు ఓ డ్రైవర్ కూడా ఉన్నట్లు హోటల్ యజమాని పోలీసులకు వెల్లడించాడు.నాలుగు రోజులు హోటల్ గదిలోనే.. అయితే, ఈ జంట మాత్రం రోజు మొత్తం హోటల్లోనే గడిపారని, కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లేవారని హోటల్ యజమాని పేర్కొన్నాడు. అలా చేయడం అసాధారణంగానే అనిపించిందని, కనీసం రూమ్ శుభ్రం చేసేందుకు సిబ్బందిని కూడా గది లోనికి రానివ్వలేదని చెప్పాడు. హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు.. తాము మనాలీ నుంచి వచ్చామని, యూపీకి వెళ్తున్నామని చెప్పినట్లు తెలిసింది.ఫుడ్ కాదు.. డ్రగ్స్ కావాలి.. ఇదిలా ఉండగా.. ఈ కేసులో అరెస్టైన ముస్కాన్, సాహిల్‌కు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా (Drug Addiction) మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వారు తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండడంతో వేరేగా ఉంచినట్లు తెలిపారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో వారిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.హత్య ఇలా.. సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్(25)తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. -
మేము ఇద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!
ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్ సింగ్ జైల్ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్ విరేష్ రాజ్ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్ లో ఉంచాలని కోరినట్లు విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్ బారక్ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్ కు బానిసలైన సంగతని విరేష్ రాజ్ శర్మ పేర్కొన్నారు. మెడికల్ రిపోర్ట్ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్ మెంట్ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి తెలియజేశారు.మాకు లాయర్ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్ లాయర్ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు. -
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..
ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్‌లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్‌గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్ ఆర్ట్స్‌తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్‌కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్ ఫైనల్ ఛాంపియనషిష్(మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్ ఫైనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్‌తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్‌సీ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్‌గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్ మ్యాచ్‌లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే) -
Viral video: 95 పైసల కోసం గొడవ.. అసలేం జరిగిందంటే..
నోయిడా: కేవలం 95 పైసల కోసం ఓ మహిళా జర్నలిస్టు, క్యాబ్ డ్రైవర్ వాదించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే, నెటిజన్లంతా క్యాబ్ డ్రైవర్‌కే మద్దతు ఇస్తున్నారు. ఈ వాగ్విదానికి సంబంధించిన వీడియోను దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే హక్కుల కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేసింది. డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించగా, ఆమె తనను బెదిరించి టాక్సీ ఛార్జీ చెల్లించడానికి నిరాకరించిందని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. కాగా, తాను జర్నలిస్టునని సదరు మహిళా జర్నలిస్టు క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.మిగతా 95 పైసలు కూడా చెల్లిస్తే పోయేదానికి ఈగోకు పోయి ఆ మహిళా గొడవకు దిగిందని ఓ నెటిజన్.. కేవలం 95 పైసల కోసం క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించడం అవసరమా..? అంటూ మరో నెటిజన్ ప్రశ్నలు గుప్పించారు. క్యాబ్ డ్రైవర్‌ది తప్పులేకపోయినా మహిళా కార్డు ఉపయోగించి అతడిని బెదిరించడం కరెక్టు కాదు. చేతిలో డబ్బులు లేకపోతే బస్సులో వెళ్లొచ్చుగా క్యాబ్‌లో వెళ్లి గొడవపడటం ఎందుకు..?’’ అంటూ యూజర్లు ఆ మహిళను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై మహిళా జర్నలిస్టు శివంగి శుక్లా వివరణ ఇస్తూ.. తాను క్యాబ్ డ్రైవర్‌ను బెదిరించలేదని, అతడే తనతో దురుసుగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. లోకేషన్‌కు దూరంగా క్యాబ్‌ను ఆపేశాడని, లోకేషన్‌కు తీసుకెళ్లమంటే కుదరదని దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో తాను క్యాబ్ దిగి రూ.129 పేమెంట్ చేశానని, తొందరలో పైన ఉన్న 95 పైసలు చూసుకోలేదు. ఇంతలోనే 95 పైసలు ఎందుకు కొట్టలేదంటూ క్యాబ్ డ్రైవర్‌కు గొడవ దిగాడని, దాంతో తాను జర్నలిస్టునని, దబాయించవద్దని వార్నింగ్ ఇచ్చానని ఆ మహిళా జర్నలిస్టు తెలిపారు.Who is this Journalist threatening @Uber_India driver of police action just because he asked her to pay the fare ? Plz identify her & ask her to travel in bus if she doesn't want to payAlso - in public interest, please ask every cab driver you meet to install cameras pic.twitter.com/PA9qqdBluJ— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) March 21, 2025 -
భర్తను వదిలేస్తే పోయేది కదా!
ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్ రాక్షసత్వంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ప్రియుడితో కలిసి మనాలికిభర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు. హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవహోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు. ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.ఆరు రోజులు రూమ్ లోనే..వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని, ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి 16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు. -
ఆ తీర్పు ముమ్మాటికీ తప్పే!: కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో ఆయన తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి. అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ.. దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..?2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్‌లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. -
‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’.. చిన్నారి వ్యాఖ్యలపై నాన్నమ్మ ఆవేదన
మీరట్: ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వెలుగుచూసింది. భర్త హత్య అనంతరం.. ప్రియుడితో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో మృతుడి కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ హత్యను ఆమె చూసి ఉండవచ్చని తెలుస్తోంది.మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని సమాచారం. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి తల్లి ఈ విషయాలను వెల్లడించారు. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని ఆ చిన్నారి పొరుగింటి వారికి పదే పదే చెప్పడం గమనించిన ముస్కాన్ బాలికను వేరే చోటుకు పంపించేసింది’ అని సౌరభ్ తల్లి రేణు దేవీ ఆవేదన వ్యక్తంచేశారు.సౌరభ్ తల్లి రేణు దేవీ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు సౌరభ్‌ను అతడి భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారు ఉంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న డ్రమ్మును వారు పైకి ఎత్తలేకపోయారు. దీంతో, లోపల ఏముందని అడిగితే చెత్తాచెదారం అని ముస్కాన్ చెప్పిందట. అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.#WATCH | Meerut, UP | Saurabh Rajput Murder case | Mother of deceased Saurabh Rajput says, "They (Muskan and her partner Sahil) murdered my son, and after that she went for a trip...She locked the body in the room...the owner of the house had asked them (Saurabh and Muskan) to… https://t.co/QyeUSKIwcu pic.twitter.com/hgs3tLfMsk— ANI (@ANI) March 19, 2025అయితే, పోలీసులు వచ్చేలోపే మా కోడలు అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మా ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుంది. చిన్న పాప పదే పదే.. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ పొరుగింటి వారికి చెప్పింది. అది గమనించిన ముస్కాన్.. పాపను వేరే చోటకు పంపించేసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.డ్రమ్ములో మృతదేహం..సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టిన రోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.మా కుమార్తెను ఉరితీయండి..!నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. -
పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్ రివర్స్..
లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్ ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో కప్పి పెట్టారు. ఈ క్రైమ్ సీన్ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలోని మీరట్‌కు చెందిన సౌరవ్ కుమార్ మర్చంట్ నేవీలో పనిచేస్తున్నాడు. సౌరవ్.. ముస్కాన్‌ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరవ్‌కు, తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్‌తో కలిసి ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ రెండో తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.చిగురించిన మరో ప్రేమ..అయితే, నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్.. విధులకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్‌కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో, వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దీని కోసం సౌరవ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్‌లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం, మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టారు.#Meerut: Wife Muskan Rastogi along with her boyfriend Sahil Shukla stabbed her husband Saurabh Rajput,The two then chopped up his body into 15 pieces, placed the remains in a drum, and sealed it with cement. After committing the crime, she allegedly went on a vacation with sahil. pic.twitter.com/qs6xnwWpa0— Dilip Kumar (@PDilip_kumar) March 19, 2025పక్కా ప్లాన్‌తో హత్య..మరోవైపు.. భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. దీంతో, వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్‌ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టిందని పోలీసులు తెలిపారు. This is very painful,Saurabh Kumar, who works in the Merchant Navy, had a love marriage with his wife. He had come to #UttarPradesh's #Meerut from #London 22 days ago.In Meerut, his wife along with her boyfriend killed Saurabh. Both of them cut the body into pieces and1/2 pic.twitter.com/gdiwwaZDHP— Siraj Noorani (@sirajnoorani) March 18, 2025 -
కుటుంబం తలరాత మార్చిన ‘కుంభమేళా’.. 30 కోట్లు సంపాదన
లక్నో: ఇటీవల ముగిసిన మహాకుంభమేళా నిర్వహణపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీటుగా బదులిచ్చారు. పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని సమాజ్‌వాదీ పార్టీ చేసిన విమర్శకు రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం యోగి సమాధానమిచ్చారు.ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ..‘45 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన సనాతన ఆధ్యాత్మిక వైభవం మహాకుంభ్‌మేళా. ప్రయాగ్‌రాజ్‌లో ఒక కుటుంబం విజయగాథ చెప్తా. ఆ కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. 45 రోజుల కుంభమేళా రోజుల్లో ఈ కుటుంబం ఏకంగా రూ.30 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంటే ఒక్కో బోటు రూ.23 లక్షల లాభాల తెచ్చింది. రోజుల లెక్కన చూస్తే ఒక్కో బోటు నుంచి రోజుకు రూ.50,000 నుంచి రూ.52,000 లాభం వచ్చింది’ అని అన్నారు.ఇదే సమయంలో కుంభమేళా వివరాలను యోగి వెల్లడించారు. ఒక్క తొక్కిసలాట ఘటన తప్పితే 45 రోజుల్లో ఏకంగా 66 కోట్ల మంది భక్తులు సంతోషంగా మేళాకు వచ్చి వెళ్లారు. ఒక్క నేరం జరగలేదు. మహిళలపై వేధింపులు, కిడ్నాప్, దోపిడీ, హత్య ఘటన ఒక్కటి కూడా జరగలేదు అని అన్నారు.One Boatman family who has 130 boats earn ₹ 30cr in just 45 days during the Kumbh Mela. pic.twitter.com/7UhvKZZosc— Farrago Abdullah Parody (@abdullah_0mar) March 4, 2025వేల కోట్లు పెడితే లక్షల కోట్ల వ్యాపారం..కుంభమేళాకు ఏర్పాట్లు, రక్షణ, భద్రత తదితరాల కోసం అయిన మొత్తం ఖర్చు రూ.7,500 కోట్లు. 200కుపైగా రోడ్లను వెడల్పు చేశాం. 14 ఫ్లైఓవర్లు కట్టాం. 9 అండర్‌పాస్‌లు నిర్మించాం. 12 కారిడార్లను సిద్ధంచేశాం. దీంతో పలు రంగాల్లో మొత్తంగా ఏకంగా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. హోటల్ రంగంలో రూ.40,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక ఆహారం, నిత్యావసరాల విభాగంలో రూ.33,000 కోట్లు, రవాణారంగంలో రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. రూ.660 కోట్ల విరాళాలు వచ్చాయి. జాతీయరహదారుల వెంట టోల్‌ట్యాక్స్ రూపంలో రూ.300 కోట్లు వచ్చాయి. ఇతర రెవిన్యూ మార్గాల్లో రూ.66,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఈఏడాది దేశ స్తూలజాతీయోత్పత్తికి కుంభమేళా సైతం తన వంతు వాటాను అందించింది అని యోగి చెప్పారు. -
అసెంబ్లీలో ఎమ్మెల్యేల గలీజు పని.. స్పీకర్ ఫైర్
అసెంబ్లీకి వెళ్లిదే ఎవరు.. ప్రజా ప్రతినిధులు. వారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి వ్యక్తిగత అలవాట్లను పక్కన పెడితే, అసెంబ్లీని మాత్రం శుభ్రంగా ల్సిన కనీస బాధ్యత వారిపై ఉంటుంది. అది కూడా ఎమ్మెల్యేలు చేయకపోతే, ఇక ప్రజలకు వారిచ్చే సందేశం ఏముంటుంది. మరి అటువంటి ఎమ్మెల్యేలు తమ బాధ్యతను మరిచి కనీసం అసెంబ్లీని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహిస్తే, ఇలానే ఉంటుంది. అసలు ఏమి జరిగిందనే విషయాన్ని ఒక్కసారి చూస్తే..ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికరమైన ఉదంతం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ హాల్‌ను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. అనంతరం విధాన సభలో ఆయన చేసిన ఓ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. సభా ప్రాంగణంను శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరిన ఆయన.. తాను శుభ్రం చేయడానికి గల కారణం చెప్పడంతో ఎమ్మెల్యేలంతా తలలు దించుకున్నారు.సెషన్ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సతీష్ మహానా సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఉదయం విధాన సభ హాల్లో జరిగిన ఓ ఘటన గురించి మీకు చెప్పాలి. సభ్యుల్లో ఒకాయన పాన్ మసాలా నమిలి ఉమ్మేశారు. విషయం తెలియగానే నేనే స్వయంగా వెళ్లి అక్కడ శుభ్రం చేశా. ఆ ఎమ్మెల్యే ఎవరనేది ఆ వీడియోలో నేను చూశా. కానీ, పేరు చెప్పి ఒక గౌరవ సభ్యుడి పరువు తీయాలని అనుకోవడం లేదు. తనంతట తానుగా ఆయన నా దగ్గరకు వచ్చి వివరణ ఇచ్చుకుంటే మంచిది. లేకుంటే నేనే పిలవాల్సి ఉంటుంది. ఈ సమయంలో దయచేసి మీ అందరికీ ఓ విజ్ఞప్తి. ఇక మీదట అలా ఎవరైనా చేస్తుండడం మీరు గమనిస్తే.. వాళ్లను అడ్డుకోండి. ఎందుకంటే.. అసెంబ్లీని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని అన్నారు. #WATCH | Uttar Pradesh Assembly Speaker Satish Mahana raised the issue of some MLA spitting in the House after consuming pan masala. He said that he got the stains cleaned, urged other MLA to stop others from indulging in such acts and also appealed to the MLA to step forward and… pic.twitter.com/VLp32qXlU8— ANI (@ANI) March 4, 2025 -
మరణించిన పిల్లితో రెండురోజులు గడిపి.. చివరికి షాకింగ్ నిర్ణయం
లక్నో: పెంపుడు పిల్లి మృతితో కుంగిపోయిన ఓ మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తీవ్ర మనస్తాపం చెందిన ఆమె.. మళ్లీ బతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు తన పెంపుడు పిల్లి మృతదేహంతోనే గడిపింది. చివరికి మూడో రోజు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఈ ఘటన జరిగింది. హసన్‌పూర్‌లో నివసించే 32 ఏళ్ల పూజకు ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీకి చెందిన వ్యక్తితో వివాహం కాగా.. రెండేళ్ల తర్వాత భార్యాభర్తలు విడిపోయారు. దీంతో నాటి నుంచి తల్లి గజ్రా దేవి వద్ద ఆమె నివసిస్తోంది.ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి పెంచుకుంటోంది. ఆ పిల్లి హఠాత్తుగా చనిపోవడంతో ఆమె తల్లి.. పిల్లిని పాతిపెట్టమని చెప్పింది. అందుకు పూజ నిరాకరించింది. అది తిరిగి బతికి వస్తుందంటూ.. రెండు రోజుల పాటు ఆ పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు చెప్పిన కానీ పూజ వినిపించుకోలేదు.పిల్లి మృతితో తీవ్ర కుంగుబాటుకు గురైన పూజ.. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడో అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్రా దేవి తన కూతురిని చూడటానికి తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
వధువు స్నేహితురాలి మెడలో వరమాల, చివరికి..
ఆ వరుడు అడిగిన అదనపు కట్నం ఆ అమ్మాయి తండ్రి ఇవ్వలేనన్నాడు. కోపంతో ఎలాగైనా అమ్మాయి కుటుంబం పరువు తీయాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. పెళ్లిరోజే పీటలపైకి తప్పతాగి వచ్చాడు. తాగి వచ్చినోడు ఆ మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. ఇక అంతే.. అతని చెంప చెల్లుమంది..రవీంద్ర కుమార్(26)కు రాధా దేవికి ఈ నెల 22వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుతో పెళ్లి కొడుకు కల్యాణ మండపానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఎలాగైనా పెళ్లిలో వధువు కుటుంబాన్ని అందరి ముందు అవమానించాలని రవీంద్ర భావించాడు. ఊరేగింపు కంటే ముందే స్నేహితులతో ఫుల్‌గా మద్యం సేవించాడు.తీరా పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా.. వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాల వేశాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చింది. తూగుతున్న అతన్ని లాగి అతని చెంప మీద కొట్టింది. తన చేతిలో దండ కింద పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది.बरेली: दूल्हे ने दुल्हन की बेस्ट फ्रेंड को पहना दी वरमाला, दुल्हन ने मारा दूल्हे को थप्पड़, लौट गई बारात.!#UttarPradesh #UPNews #Bareilly #UPPolice pic.twitter.com/WZssqNzG5T— Bansal News (@BansalNewsMPCG) February 25, 2025Video Credits: Bansal Newsఇరువర్గాలు కుర్చీలు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రాధాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు.. అదనపు కట్నం డిమాండ్, ఉద్దేశపూర్వకంగానే రాధాదేవిని అవమానించారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎపిసోడ్లో వరుడు, అతని స్నేహితులపై మరో కేసు నమోదయ్యింది. కల్తీ మద్యం కొనుగోలు చేశారని పోలీసులు అభియోగాలు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. -
రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హసన్‌పూర్‌లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్‌తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. -
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మహా కుంభమేళా
-
దేశీయ పర్యాటకుల ఆకర్షణలో ఏపీది 4వ స్థానం
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్ణాటక, ఐదో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. 2022తో పోలిస్తే 2023లో ఆంధ్రప్రదేశ్‌లో దేశీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీని ప్రకారం.. 2022లో 19.27 కోట్ల మంది రాష్ట్రంలో పర్యటించగా 2023లో 25.47 కోట్ల మంది పర్యటించారు. అంటే.. 2022 కన్నా 2023లో 6.2 కోట్ల మంది పెరిగారు. ఇక 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లోనే 86.11 శాతం మంది ఉండగా మిగతా రాష్ట్రాల్లో కేవలం 13.89 శాతమే ఉన్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే, 2022తో పోలిస్తే 2023లో దేశీయ పర్యాటకుల సంఖ్య 77.86 కోట్లు పెరిగారు. 2022లో ఈ సంఖ్య 173.10 కోట్లుండగా 2023లో 250.96కి పెరిగింది. అలాగే, 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ కూడా ఉన్నాయి. -
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్ ట్విస్ట్
ఝాన్సీ: ‘పాపా కిల్డ్ మమ్మీ, హ్యాంగ్డ్ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి."🚨 Jhansi: A 4-year-old girl's drawing exposed the murder of her mother, Sonali Budholia. She alleged her father, Sandeep Budholia, killed her after years of dowry harassment & abuse. 💔 Police are investigating. #JusticeForSonali #StopDowry #UttarPradesh" pic.twitter.com/ayZG51DKxO— HK Chronicle (@HK_Chronicle_) February 18, 2025నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
మహిళలు అనుభవించే గృహహింసకు, వేధింపులకు చాలావరకు చిన్నారులే మౌన సాక్షులుగా ఉంటారు. అమ్మను నాన్న నిరంతరం వేధిస్తూ, కొడుతుంటే.. బిక్కుబిక్కు మంటూ చూస్తారు. చూసీ, చూసీ కొంతమంది తిరగబడతారు. ‘ఖబడ్దార్.. అమ్మమీద చేయి వేస్తే..’ అంటూ అమ్మకు అండగా నిలబడతారు. అమ్మమీద దెబ్బ పడకుండా కాపాడు కుంటారు. అవసరమైతే నాలుగు దెబ్బలు కూడా తింటారు. ఈ విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మరింత వేగంగా స్పందిస్తారు. కానీ చివరికి ఆ అమ్మ ఇక తనకు లేదని తెలిస్తే.. ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటి ఆశలతో కాపురానికి వచ్చిన కోడల్ని, బిడ్డ పుట్టిన తరువాత కూడా వేధింపులకు పాల్పడి, దారుణంగా హత్య చేసిందో కుటుంబం. కానీ దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. కానీ ఐదేళ్ల చిన్నారి సాహసంతో వారి పథకం పారలేదు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివపరివార్ కాలనీలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాలు ..యూపీలోని ఝాన్సీలో ఒక వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించింది. సోమవారం తెల్లవారుజామున తీవ్ర విషమంగా ఉన్న స్థితిలో ఆమెను ఝాన్సీ మెడికల్ కాలేజీకి తీసుకుచ్చారు. చికిత్స పొందుతూ మరణించింది. తమ కోడలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అత్తింటివాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఐదేళ్ల కుమార్తె తన తండ్రి తన తల్లిని ఎలా చంపాడో వివరిస్తూ ఫోటో గీసి మరీ వివరించింది. ఒక బొమ్మను గీస్తూ తన తండ్రి తన తల్లిని బాగా కొట్టాడని వివరించింది. ఇంకో బొమ్మలొ నానమ్మ తన తల్లిని మెట్లపై నుండి తోసేసిందనీ, తండ్రి గొంతు నులిమినట్టు ఆమె తెలిపింది. ఇది చూసి పోలీసులు కూడా షాకయ్యారు. దీంతో ఈ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పలువురి గుండెల్ని పిండేస్తున్న ఈ మాటలు వైరలవుతున్నాయి. కంటతడిపెట్టించే చిన్నారి మాటలు ‘నాన్నే అమ్మను తీవ్రంగా కొట్టాడు..ఆ తర్వాత ఉరేశాడు. ఇదేంటి అని అడిగినందుకు కావాలంటే నువ్వు చచ్చిపో అన్నాడు’ అని మీడియాకు చిన్నారి దర్శిత చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అనేకసార్లు తన తల్లిని చంపేస్తానంటూ నాన్న బెదిరించాడని తెలిపింది. అంతేకాదు ఇంకోసారి మా అమ్మను ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని తాను ఒకసారి నాన్నను ఎదిరిస్తే.. మీ అమ్మ చచ్చాక నీకూ అదే గతి పడుతుంది అంటూ.. తనను కూడా కొట్టేవాడు అంటూ దీనంగా చిన్నారి చెప్పిన వైనం అందర్నీ కలచి వేసింది.భారీ కట్నం, అమ్మాయి పుట్టిందని మరింత వేధింపులుదీంతో తికామ్గఢ్ జిల్లాకు చెందిన మృతురాలి తండ్రి సంజీవ్ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్తమామలు తన కుమార్తెను బాగా వేధించేవారని ఆరోపించారు. తన కుమార్తె సోనాలిని మెడికల్ రిప్రజంటేటివ్‌గా పని చేస్తున్న సందీప్‌తో వివాహం చేశారు. 2019లో వివాహం చేసుకున్నప్పటి నుండి అత్తమామలు కట్నం కోసం నిరంతరం మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వాపోయారు. రూ. 20 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ, ఆమెను తీవ్రంగా వేధించేవారంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, అతగాడికి మగపిల్లవాడు కావాలట, అందుకే ప్రసవం తర్వాత తల్లీ బిడ్డల్ని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బిల్లు తానే కట్టి ఇంటికి తీసుకెళ్లానని, ఒక నెల తర్వాత అల్లుడు వచ్చాడని చెప్పారు. దీనిపై సోనాలి భర్త సందీప్ బుధోలియాపై గతంలో వరకట్న వేధింపుల కేసు నమోదైంది, కానీ ఆ తరువాత బాగా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో అప్పట్లో రాజీ కుదిరింది.సర్కిల్ ఆఫీసర్ (CO) సిటీ రాంబీర్ సింగ్ ప్రకారం, సందీప్, అతని తల్లి వినీత, అతని అన్నయ్య కృష్ణ కుమార్, అతని వదిన మనీషా మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భర్త సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అదనపు కట్నం కోసం అత్తమామల వికృత చేష్ట.. కోడలికి ఏకంగా..
లక్నో: అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో కోడలిపై కక్ష గట్టి దారుణానికి ఒడిగట్టారు అత్తామామలు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసి హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతికి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023 ఫిబ్రవరి 15న వివాహమైంది. వివాహం సందర్భంగా సచిన్‌కు రూ.15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. వీరి పెళ్లి తర్వాత కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇంతలో అత్తింటి వారు స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో రూ.25 లక్షలు తీసుకురావాలని కోడలిని వేధించారు. ఈ క్రమంలో తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో, ఆగ్రహానిలోనైన అత్తామామలు.. కోడలిని ఇంటి నుంచి బయటకు పంపించేశారు.అయితే, ఈ విషయం పంచాయతీ పెద్దల వరకు వెళ్లడంతో వారికి నచ్చజెప్పి యువతిని తిరిగి అత్తింటికి పంపారు. కానీ, తీరు మార్చుకోని అత్తమామలు అదనపు కట్నం కోసం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారు. తమ కుమారుడికి మరో వివాహం చేయాలనే ఆలోచనతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే హెచ్ఐవీ వైరస్‌తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. కొంత కాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు నిర్దరించారు. ఇదే సమయంలో భర్త అభిషేక్‌కు పరీక్షలు చేయగా.. అతడికి హెచ్ఐవీ నెగిటివ్‌గా తేలడంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, వారు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. Bahu is injected with an HIV-infected needle by Bimaru criminal in-laws.In Bimaru Pradesh, a fairly typical incident pic.twitter.com/KiTm2EIDtV— @PoliJester (@PoliJester420) February 15, 2025 -
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కుంభమేళ రైలు, టికెట్ల విక్రయమే కారణమా?
న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్లో (New Delhi Railway Station Stampede) జరిగిన తొక్కిసలాటలో 18మంది ప్రయాణికులు మరణించారు. కుంభమేళా భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ప్రకటన, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల కోసం టికెట్ల అమ్మకాలు పెరగడం ఈ విషాద సంఘటనకు దారితీసిన కారణాలని ఢిల్లీ పోలీసుల విచారణలో పలు నివేదికల ప్రకారం, రైల్వే అధికారులు ప్రయాగ్‌రాజ్ కోసం ప్రతి గంటకు సుమారు 1,500 జనరల్ టిక్కెట్లను జారీ చేస్తున్నారు.విచారణ ప్రకారం.. శనివారం రాత్రి, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైలు ఎక్కేందుకు వందల మంది ప్రయాణికులు 14 ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో న్యూఢిల్లీ నుండి దర్భంగాకు నడిచే స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు పక్కనే ఉన్న ప్లాట్‌ఫామ్ 13 వద్ద ప్రయాణికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే, స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్ బయల్దేరి సమయం కంటే ఆలస్యంగా అర్ధరాత్రి బయల్దేరుతున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్తో ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉండిపోయారు.ఓ వైపు కిక్కరిసిన ప్రయాణికులు ఉండగా.. రైల్వే అధికారులు టికెట్ల అమ్మకాన్ని కొనసాగించారు. దీంతో అదనపు టిక్కెట్ల అమ్మకాల ఫలితంగా 14 ప్లాట్‌ఫామ్ మీద ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరగడం ప్రారంభమైంది. ఫలితంగా రద్దీ పెరిగి ప్రజలు నిలబడటానికి ఖాళీ స్థలం లేకుండా పోయింది.అదే సమయంలో పెరుగుతున్న రద్దీ, టిక్కెట్ల అమ్మకాలను పరిగణనలోకి తీసుకున్న రైల్వే అధికారులు రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్లాట్‌ఫామ్ 16 నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ ప్రకటన విన్న వెంటనే, ప్లాట్‌ఫామ్ 14లో జనరల్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి దాటి ప్లాట్‌ఫామ్ 16 వైపు పరుగెత్తారు’. పరిగెత్తే సమయంలో ఓవర్ బ్రిడ్జిపై కూర్చున్న ప్రయాణీకులను తొక్కుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడే ఓ ప్రయాణికుడు అదుపుతప్పి జారిపడ్డాడు. ఇదే తొక్కిసలాటకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన జరిగిన సమయంలో పాట్నాకు వెళ్తున్న మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ 14పై ఉండగా, జమ్మూకు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ప్లాట్‌ఫారమ్ 15పై ఉంది. 14 నుండి 15 వరకు వస్తున్న ఒక ప్రయాణీకుడు జారిపడి మెట్లపై పడిపోయాడు. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంది’ అని అన్నారు. తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు రైల్వే పోలీసులు భారీ మొత్తంలో మొహరించారు. కానీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. ఆదివారం సైతం తొక్కిసలాటపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తామని తెలిపారు. ఈ తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారణాన్ని దర్యాప్తు చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రైల్వే అధికారులు చేసిన ప్రకటనల డేటాను సేకరిస్తాము’ అని పోలీసు వర్గాలు చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో 18 మంది బాధితులు మరణించారు. వారిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్ఎన్జెపి) ఆసుపత్రి, లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లక్షలాది జనం.. రవాణా ఘోరం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక యాత్ర విషాదభరితంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాకు తరలి వెళ్తున్నారు. కానీ డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేవు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ, అటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయలేదు. భక్తులు మధ్యతరగతి, సామాన్యప్రజలకు ఏ మాత్రం అందనంతగా విమానచార్జీలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి రావాలని కోరుకుంటున్న జనం తోచిన మార్గంలో వెళ్తున్నారు. సామర్థ్యం లేని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేసి ప్రమాదాల బారిన పడుతున్నారు. నాచారం (హైదరాబాద్) నుంచి యూపీ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాకు మినీబస్సులో వెళ్లిన ఏడుగురు భక్తులు తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని మరణించిన ఉదంతం ఆందోళన రేపుతోంది. ప్రయాణికుల రద్దీ కారణంగా ఒకవైపు రహదారులు వందలకొద్దీ కిలోమీటర్లతో కిక్కిరిసిపోతుండగా, మరోవైపు మినీబస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు వంటి చిన్న వాహనాల్లో ఎక్కువమంది ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అరకొర రైళ్లు...: ప్రయాణికుల రద్దీ మేరకు రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కానీ అరకొర రైళ్లు అందుబాటులో ఉన్నాయి. పైగా సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్, గోరఖ్‌పూర్, లక్నో, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో జనవరి నాటికే బుకింగ్ నిలిచిపోయింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు 200 దాటింది. మరిన్ని అదనపు రైళ్లు నడిపితే తప్ప తెలుగు రాష్ట్రాల నుంచి కుంభమేళాకు ప్రయాణం చేయడం సాధ్యం కాదు. సాధారణంగా సంక్రాంతి, దసరా వంటి పండుగలు, మేడారం వంటి జాతరలకు ఆర్టీసీ వేలకొద్దీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. కానీ ఈ కుంభమేళాకు లక్షలాది మంది తరలి వెళ్తున్నట్లు తెలిసి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడం శోచనీయం.ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీప్రతిసారీ పండుగ ప్రయాణాన్ని సొమ్ము చేసుకొనే ప్రైవేట్ ట్రావెల్స్, టూరిస్ట్ సంస్థలు మహాకుంభమేళా భక్తులను కూడా వదలకుండా నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఫిట్నెస్ ఉన్నా లేకున్నా పెద్దఎత్తున వాహనాలను నడుపుతున్నాయి. 30 నుంచి 40 మంది ప్రయాణం చేసే ప్రైవేట్ బస్సులతోపాటు, 14 నుంచి 20 మంది వరకు ప్రయాణం చేసే సామర్థ్యం ఉన్న మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు, ఇతరత్రా వాహనాలను ఎడాపెడా రోడ్డెక్కిస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో ఒక్కో ప్రయాణికుడి వద్ద రూ. 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసే వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒకసారి విధులు మార్చుకోవాలి. కానీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాలు చాలావరకు ఒక డ్రైవర్‌తోనే బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు సుమారు 1,136 కి.మీ. దూరం నిరాటంకంగా వాహనాలను నడపడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. -
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మిల్కిపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ.. యూపీ మిల్కిపూర్‌లో సైతం తన హవా కొనసాగించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిల్కిపూర్ అసెంబ్లీలో బీజేపీ 60 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం ాసాధించింది. శనివారం ప్రకటించిన ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కి చెందిన అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై అఖండ విజయం అందుకున్నారు.30 రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్నిాసాధించి విక్టరీ నమోదు చేసింది. ఈ అయోధ్య జిల్లాలో ఉన్న మిల్కిపూర్ నియోజకవర్గాన్ని బీజేపీ-ఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ బీజేపీకి ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫజియాబాద్ లోక్‌సభ సీటును ఎస్పీకి కోల్పోయిన కొన్నినెలల వ్యవధిలోనే మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఆ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.ఇదిట్రైలర్ మాత్రమేఈ విజయంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ‘ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. 2027లో పూర్తి సినిమా చూపిస్తాం. సమాజ్‌వాదీ పార్టీ ఇక ఆశలు వదులుకోవాల్సిందే’ అని అన్నారు. -
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం
లక్నో: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై ఎస్పీ సర్వేష్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కొద్ది రోజల క్రితం సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. #WATCH | Prayagraj | The Fire that broke out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra has been brought under controlThere has been no loss of lives. The reason behind the fire is under investigation..." says SP city Sarvesh Kumar Mishra pic.twitter.com/SBshdMCkrT— ANI (@ANI) February 7, 2025అంతకుముందు .. ఇదే కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలతో అప్రమత్తమైన సీఎం యోగీ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై యోగీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్‌పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్‌ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్‌గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025 (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
‘కుంభమేళా’ మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారు
న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. కుంభమేళాను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అక్కడ జరిగిన వైఫల్యాల సంగతి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదని మండిపడ్డారు.‘బడ్జెట్ సంఖ్యల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కుంభమేళా తొక్కిసలాట మృతుల లెక్కలు చెప్పండి’ అని అఖిలేశ్ యాదవ్ నిలదీశారు. ఒకవైపు మృతదేహాలు మార్చురీలో ఉంటే, మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారని, ఇదెక్కడి సనాతన సంప్రదాయమని ధ్వజమెత్తారు. జేసీబీలతో మృతదేహాలను నదిలోకి నెట్టేశారని ఆరోపించారు. కుంభమేళాలో ఎంతోమంది భక్తులు చనిపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని విమర్శించారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు చూసే బాధ్యతను సైన్యానికి అప్పగించాలని సూచించారు. -
నేడు మహాకుంభ మేళాకు మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు ప్రధాని మోదీ(Narendra Modi)5న హాజరవుతున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బుధవారం ఉద యం ఢిల్లీ నుంచి ప్రత్యేక వి మానంలో ఆయన ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటారు.ఉదయం 11 గంటల సమయంలో త్రివేణి సంగమంలో మోదీ స్నానమాచరించి, గంగాదేవికి పూజలు చేస్తారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనుంది. -
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. -
లోన్ తీసుకుని మరీ మరదలు హత్యకు సుపారీ
ముజఫర్‌నగర్: లోన్ తీసుకుని మరీ.. మరదలిపై సామూహి క అత్యాచారం, హత్య చేయించాడో ప్రభుద్ధుడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఆశిష్ అనే వ్యక్తి.. తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చంపేంత ధైర్యం ఒక్కడికే లేదు. అందుకోసం ఇద్దరు మనుషులను మాట్లాడుకున్నాడు. వారికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో రూ.40 వేలు అప్పుగా తీసుకుని మరీ శుభమ్, అతని స్నేహితుడు దీపక్‌కు చెల్లించాడు. జనవరి 21న బాధితురాలికి కాల్ చేసి రప్పించారు. స్కూటర్‌పై మీరట్‌లోని నాను కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కండువాతో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 21న ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఎంతకీ రాకపోవడం, ఫోన్ పనిచేయకపోవడంతో జనవరి 23న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్‌లతో కనిపించినట్లు తేలింది. ఆశిశ్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. మరదలు బ్లాక్మెయిల్ చేయడంవల్లే చంపాల్సి వచ్చిందని చెప్పాడు. ఘటనా స్థలం నుంచి బాధితురాలి అవశేషాలు, కాలిపోయిన దుస్తులు, ఉంగరం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీఅమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
‘ఇదిగో ఏవండి. మిమ్మల్ని. నా మాట వినండి. మనకున్నది ఒక్కతే కూతురు. కూతూర్ని బాగా చదవించాలి. దాని పెళ్లి చేయాలి. ఇవన్ని చేయాలంటే డబ్బులు బాగా అవసరం. అందుకే మీరో ఈ త్యాగం చేయండి. మీ కిడ్నీని రూ.10 లక్షలకు అమ్మేయ్యండి. డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బును బ్యాంక్‌లో వేద్దాం. ఆ డబ్బే భవిష్యత్తులో కూతురు చదువు, పెళ్లికి ఉపయోగపడతాయి’ అంటూ ఓ మహిళ భర్త కిడ్నీని అమ్మేందుకు ఒప్పించింది. చివరికి ఏం చేసిందంటే? పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ తన భర్త కిడ్నీని విక్రయించమని బలవంతం చేసింది. భార్య పోరు తట్టుకోలేక భర్త తన కిడ్నీని అమ్మాడు. ఆ డబ్బుతో తన ప్రేమికుడితో కలిసి భార్య పారిపోయింది. నివ్వెరపోయే ఉదంతం హౌరా జిల్లాలోని సంక్రైల్‌లో జరిగింది. సంక్రైల్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తె చదువు, పెళ్లి కోసం డబ్బును పొదుపు చేస్తాననే నెపంతో అతని కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్మాలని తన భర్తపై ఒత్తిడి తెచ్చింది.భార్య తెస్తున్న ఒత్తిడికి తట్టుకోలేక భర్త కిడ్నీని విక్రయించేందుకు అంగీకరించాడు. అదే సమయంలో తన అవయవ దానం చేయగా వచ్చిన డబ్బు భవిష్యత్తులో కుమార్తె చదువు, వివాహం చేయడం సులభం అవుతుందని ఆశించాడు. భార్య దురుద్దేశాన్ని పట్టించుకోలేదు. దీంతో నిందితురాలు, తన ప్రియుడితో కలిసి భర్త కిడ్నీని అమ్మేందుకు సిద్ధమైంది. భర్త కిడ్నీని అమ్మేందుకు సుమారు ఏడాది పాటు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం కిడ్నీ అవసమరయ్యే వ్యక్తి దొరికాడు. కిడ్నీని అమ్మగా రూ.10లక్షలు వచ్చాయి. ఫేస్బుక్ ప్రేమికుడితోబాధిత భర్త పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమైతే, భార్య ఫేస్బుక్లో యాక్టీవ్ ఉండే బరాక్‌పూర్‌కు చెందిన పెయింటర్ ప్రేమలో మునిగి తేలింది. భర్త కిడ్నీ అమ్మగా వచ్చిన రూ.10లక్షలు తీసుకుని ప్రియుడితో పరారైంది. ఓ వైపు అనారోగ్య సమస్యలు, కుమార్తె భవిష్యత్తు.. మరోవైపు రోజులు గడుస్తున్నా అడ్రస్ లేని భార్య జాడ. దీంతో ఏం చేయాలో పాలుపోక భర్త పోలిసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భార్య ఆచూకీ లభ్యమైంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తేలింది.అనంతరం, భర్త తన పదేళ్ల కుమార్తె తన కుటుంబ సభ్యుల్ని వెంటబెట్టుకుని భార్య నివాసం ఉండే ఇంటికి వెళ్లారు. పదేళ్ల కూతుర్ని చూసైనా ఆ తల్లి గుండె కరుగుతుందేమోనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రియుడి మోజులో పడ్డ బాధితురాలు భర్తను బెదిరించింది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నీకు విడాకులు ఇస్తా. నేను ఈ గడప దాటి బయటకు రాను అంటూ ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. భార్య చేసిన నిర్వాకంతో మనోవేధనకు గురయ్యాడు. కుమార్తెకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ధృడ సంకల్పంతూ వడివడిగా అడుగులేసుకుండూ ఇంటికి పయనమయ్యాడు బాధిత భర్త. -
కుంభమేళాలో మరో తొక్కిసలాట!
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాల కోసం వేచి ఉన్న భక్తులపై వెనకవైపు భక్తులు పడటంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్తలో కొంత నిగూఢార్థం ఉందని ఆలస్యంగా వెల్లడైంది. మరణాలన్నీ ఈ సంగం ఘాట్ వద్దే సంభవించలేదని కొన్ని సమీపంలోని ఝాసీ ఘాట్ వద్ద సంభవించాయన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగం ఘాట్‌లో భారీ తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటి తర్వాత ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్ విషాదం నుంచి భక్తులు తేరుకునేలోపే మరోచోట కూడా తొక్కిసలాట జరిగిందన్న వార్త తెలిస్తే భయంతో భక్తులు వెనుతిరగడమో, గందరగోళంతో పరుగెత్తడమో చేస్తే మళ్లీ సంగం ఘాట్‌లో మరో అపశృతి చోటుచేసుకుంటుందన్న అనుమానంతో అధికారులు ఈ విషయాన్ని వెంటనే బయటకు చెప్పలేదని తెలుస్తోంది. భక్తులను శాంతపరచడమే తమ ముఖ్య ఉద్దేశమని అక్కడి అధికారులు చెప్పారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంగం ఘాట్‌కు ఉత్తరాన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంగ ఒడ్డుకు ఆవలివైపు ఈ ఘాసీ ఘాట్ ఉంది. సంగం ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఝాసీ ఘాట్‌లో దాదాపు ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాట జరిగింది. మధ్యాహ్నం దాకా మృతదేహాలు అక్కడే! ‘‘ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిన భక్తుల మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయి. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. ఉదయం ఆరు గంటలకు తొక్కిసలాటలో చనిపోతే మధ్యాహ్నం 1.30 గంటలకు మృతదేహాలను ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. తొక్కిసలాట జరిగిన నాలుగు గంటల తర్వాత ఒక మహిళా కానిస్టేబుల్ వచ్చింది. అప్పటికే అక్కడి భీతావహ పరిసరాలను తమ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్న జనాలను పోలీసులు వారించారు’’అని ఝాసీ ఘాట్‌లో హల్దీరామ్ దుకాణం నడుపుతున్న నేహా ఓఝా స్థానిక మీడియాతో చెప్పారు. ‘‘ఊహించనంతగా భక్తులు వచ్చారు. అడ్డుగా ఉన్న కర్ర బ్యారీకేడ్లను విరగ్గొట్టి ముందుకు రావడంతో ఘోరం జరిగింది. ఇదే అదనుగా అక్కడ నిద్రిస్తున్న వాళ్లకు చెందిన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను కొందరు కొట్టేశారు’’అని ప్రత్యక్ష సాక్షి హర్షిత్ అన్నారు. ‘‘మా దుకాణం చుట్టూతా ఒక్కసారిగా జనం పోగయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. మా దుకాణంలోకీ జనం చొచ్చుకొచ్చారు. ఇదే అదనుగా ఎవరో మా హల్దీరామ్ దుకాణం క్యాష్ కౌంటర్ నుంచి రూ.1,80,000 కొట్టేశారు. ఇక్కడ గుట్టలుగా పడి ఉన్న భక్తుల బ్యాగులు, చెప్పుల కుప్పల నుంచే కొందరు వృద్ధుల మృతదేహాలను బయటకు తీశారు. నా ముందే ఈ టెంట్లో ఇద్దరు చనిపోయారు’’అని నేహా ఓఝా చెప్పారు. ‘‘వెంటనే ఝాసీ ఘాట్‌కు అంబులెన్సు వచ్చే సౌకర్యం కూడా లేదు. ఏ సాయం అందాలన్నా నది ప్రవాహం మీదుగా పడవల్లో వచ్చి సాయపడాల్సిందే’’అని మరో ప్రత్యక్ష సాక్షి మెయిన్ బహదూర్ సింగ్ చెప్పారు. ‘‘బస్సులో వచి్చన ఒక 20 మంది యువకులు బ్యారీకేడ్లను విరగొట్టి, అందర్నీ తోసేసి ముందుకెళ్లారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది’’అని మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సాధువు చెప్పారు. ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట కారణంగా ఏర్పడిన చెత్తను తొలగించేసరికి సాయంత్రం ఆరు అయిందని ఒక కార్మికుడు చెప్పారు. అగ్నిప్రమాదంలో 15 టెంట్లు దగ్ధం మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నప్రమాదం సంభవించింది. సెక్టార్ 22 సమీప ఛామన్గంజ్ చౌకీ వద్ద చెలరేగిన అగ్నికీలల్లో 15 టెంట్లు కాలిపోయాయని ప్రధాన అగ్నిమాపక దళ అధికారి(కుంభ్) ప్రమోద్ శర్మ చెప్పారు. విషయం తెలియగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటల్ని ఆర్పేశారు. సరైన రోడ్డు మార్గంలేకపోవడంతో త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం కష్టంగా మారింది. అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదని అధికారి స్పష్టంచేశారు. కలిపోయిన టెంట్లు కుంభమేళాలో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినవి కాదని, అక్రమంగా వెలిశాయని వెల్లడించారు. అగ్నికీలలు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలెట్టారు. -
Maha Kumbh Mela 2025 : గర్ల్ ఫ్రెండ్ సలహాతోనే పెట్టుబడిలేని వ్యాపారం
ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా అశేష భక్తకోటితో ఉత్సాహంగా సాగుతోంది. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే సుదూర తీరాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (MahaKumbhMela 2025)కు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా హృదయాలను హత్తుకునే సంఘటనలు, కథనాలు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు బడా వ్యాపరస్తులతోపాటు ఇక్కడ చిన్నా, చితకా వ్యాపారం చేసుకునేందుకు అనేకమంది ప్రయాగరాజ్‌కు వస్తున్నారు. వీరిలో రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముకునే మోనాలీసాలాగా పాపులర్ అవుతున్నారు. ఈ కోవలో ఒక ప్రేమికుడు నిలవడం విశేషం. స్నేహితురాలు ఇచ్చిన సలహాను తు.చ. తప్పకుండా పాటించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. పెట్టుబడి లేని వ్యాపారంగా వేప పుల్లల్ని విక్రయిస్తూ ఆకర్షణీయమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రియురాలిచ్చిన సలహా ఆధారంగా రంగంలోకి దిగిన అతగాడు రోజూ పొద్దున్నే అక్కడ వేపపుల్లల్ని విక్రయిస్తున్నాడు. తద్వారా గత ఐదు రోజుల్లో 40వేల రూపాయలు సంపాదించాడు. ఈ సందర్భంగా సంతోషం నిండిన కళ్లతో అతను చెబుతున్న మాటలు అనేకమంది హృదయాలను హత్తుకుంటున్నాయి.‘‘ఆమె(తన ప్రేయసి) కారణంగా నేను ఇక్కడ ఉన్నాను. తానే మహాకుంభ మేళాకు వెళ్లమని చెప్పింది. పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఆ క్షేత్రంలో వేపపుల్లలు అమ్మమని సలహా ఇచ్చింది. నేను ఆమె కారణంగా ఇంత సంపాదించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు సంతోషంగా.“నిజమైన బంధం” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ అయిన ఈ కథనంపై నెటిజన్లు వారి ప్రేమను అభినందించారు. నిజమైన ప్రేమ, ఎంత హృద్యంగా ఉంది లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. "ఇంత అద్భుతమైన స్నేహితురాలిని ఎప్పుడూ వదులుకోవద్దు లేదా మోసం చేయవద్దు" అని ఒక ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు రాశారు."చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నాడు. మీరు జీవిత మార్గంలో విజయంలో అగ్రస్థానానికి చేరుకుంటారు" అని మూడవ వ్యక్తి వ్యాఖ్యానించాడు.ఒక్క క్షణం కూడా తన స్నేహితురాలికి క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడలేదు సూపర్ అని మరొకరన్నారు. చూశారా.. ప్రియురాలు గురించి చెప్పేటపుడు అతని ముఖంలో వెలుగు, మాటల్లో గర్వం, ఆ స్వరంలో ప్రేమ ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయో..ఇదే రా ప్రేమంటే అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత! View this post on Instagram A post shared by Adarsh Tiwari (@adarshtiwari20244) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా భావించే మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్ర కార్యంలో సన్యాసులు, సాధువులు, సాధువులు, సాధ్విలు ప్రముఖంగా నిలుస్తుండగా, దేశ విదేశాలకు చెందిన పలువురు భక్తులతోపాటు, అన్ని వర్గాల ప్రజలు తరలివస్తున్నారు. గంగా, యమున ,సరస్వతిల పవిత్ర సంగమమైన సంగమంలో స్నానం చేసి తరలించాలని భక్తుల ఆకాంక్ష.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ‘డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendent Of Police-డీఎస్పీగా)’గా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దీప్తి కృతజ్ఞతలు తెలియజేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంది.కాగా భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team)లో దీప్తి శర్మ గత కొంతకాలంగా కీలక సభ్యురాలిగా ఉంది. రెండేళ్ల క్రితం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ రజత పతకం గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.గతేడాది అత్యుత్తమంగానిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.ఇక రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటుఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. క్రీడా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజాగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇందులో భాగంగా మొరదాబాద్‌లో సోమవారం అధికారికంగా ఉద్యోగంలో చేరిన దీప్తి శర్మ.. డీఎస్పీ యూనిఫామ్‌లో మెరిసింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్ శర్మ, ప్రశాంత్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగ్రా ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.ప్రతిజ్ఞ చేస్తున్నా‘‘ఈ మైలురాయిని చేరినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు మద్దతుగా నిలిచి.. ఈస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా.అలాగే.. ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా నా కొత్త పాత్రలో ఒదిగిపోవడంతో పాటుగా.. విధి నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అని దీప్తి శర్మ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మన క్రికెటర్లలో మరో డీఎస్పీఈ క్రమంలో దీప్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తొలుత సిరాజ్.. ఇప్పుడు మన క్రికెటర్లలో మరో డీఎస్పీ’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం హైలైట్‌గా నిలిచింది. కాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే అధికారికంగా అతడికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.చదవండి: 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట.. -
మహిళపై అత్యాచారం.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ భద్రత మధ్య రాకేష్ రాథోడ్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జనవరి 15న తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు సీతాపూర్‌లో అతడిపై కేసు నమోదైంది.వివరాల ప్రకారం.. యూపీలో కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 15న తనపై అత్యాచారం చేశారంటూ సీతాపూర్‌కు చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని, రాజకీయంగా తను భవిష్యత్ కల్పిస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్లుగా రాథోడ్ తనపై అనేక సార్లు అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్స్ కాల్స్ లిస్ట్, సంభాషణలకు పోలీసులకు అందజేసింది.ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్ రాథోడ్‌ను ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాకేష్‌ను అరెస్ట్ చేసే సమయంలో కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక, భారీ భద్రత మధ్య రాకేష్‌ను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.Sitapur, Uttar Pradesh: Congress MP Rakesh Rathore was taken into police custody during a press conference at his residence in connection with a Rape case pic.twitter.com/KlsQtjVhYi— IANS (@ians_india) January 30, 2025ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయమే ఎంపీ రాథోడ్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. రెండు వారాల్లోగా సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని సూచించినట్లు సమాచారం. అంతకముందు ఇదే కేసులో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నివాసం వద్దకు భారీ బందోబస్తుతో వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: యూపీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యత యూపీ ప్రభుత్వానిదేనంటూ ఓ అడ్వొకేట్ సుప్రీం కోర్టులో పిల్ వేశారు. త్రివేణి సంగమం వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. అయితే..మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహా కుంభమేళాలో అన్ని రాష్ట్రాల సమన్వయంతో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయించేలా అధికార యంత్రాగాన్ని ఆదేశించాలని కోరారాయన.మరోవైపు తీవ్ర విషాదం నేపథ్యంతో.. మహా కుంభమేళా నిర్వహణలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది. ఈ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించింది. అలాగే.. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంకోవైపు.. వీవీఐపీ, స్పెషల్ పాస్‌లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్‌రాజ్ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయనుంది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్ నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్‌వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలిరావడంతో సంగం ఘాట్‌వద్ద బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారుజామున 1, 2 గంటల మధ్య అఖాడాల కోసం ఏర్పాటు చేసిన సంగం స్నాన ఘాట్‌కు వెళ్లేందుకు అఖాడా మార్గ్వద్ద ఉన్న బారికేడ్లపైకి భక్తులు ఎక్కడంతో ఈ ఘటన జరిగిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
అధికారిక ప్రకటన.. కుంభామేళా తొక్కిసలాటలో మరణాలు ఎన్నంటే?
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు చనిపోయినట్టు మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణా అధికారికంగా వెల్లడించారు. ఇదే సమయంలో 60మంది త్రీవంగా గాయపడినట్టు వెల్లడించారు. కాగా, మరణించిన వారిలో 25 మందిని గుర్తించినట్టు తెలిపారు. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.తాజాగా డీఐజీ వైభవ్ కృష్ణా మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో తొక్కిసలాట జరిగింది. అఖారా మార్గ్‌లో భారీగా భక్తులు గుమ్మిగూడారు. ఈ రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో 25 మందిని గుర్తించాం.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై వివరాల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1920ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటన తర్వాత దాదాపు 90 మందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు భక్తులు అప్పటికే చనిపోయారు. 36 మంది స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. #WATCH | Prayagraj, UP: DIG Mahakumbh, Vaibhav Krishna says "Before Brahma Muhurta, between 1 am to 2 am, a huge crowd gathered on the Akhara Marg. Due to this crowd, the barricades on the other side broke and the crowd ran over the devotees waiting to take a holy dip of Brahma… pic.twitter.com/ZL6KlmMf9k— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీసినట్లు ప్రధాని వెల్లడించారు.आज के अमृत स्नान का विहंगम दृश्य...यह धरती है कल्पवास की, यह धरती है महाकुंभ की, यह धरती है तिर्थराज प्रयाग की...ॐ नमः पार्वती पतये हर हर महादेव#महाकुंभ2025 pic.twitter.com/oKsX0qJdOa— कर्वज्ञम् (@eternalroute) January 29, 2025ఇక, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు. महाकुंभ में में मौनी अमावस्या पर लगभग 10 करोड़ श्रद्धालु पहुंचे हैंभगदड़ की सूचना अप्रिय है लेकिन स्थिति नियंत्रित है. लश्कर मीडिया अफ़वाह उड़ा रहा है, उस पर भरोसा न करेंप्रशासन की सूचना पर ही भरोसा करें. ये आपका अपना MahaKumbh है, आपको ही संभालना है#MahakumbhStampede pic.twitter.com/ND25xkgPt7— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) January 29, 2025 ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025 -
వీడియో: వైద్యుడి రీల్స్ పిచ్చి.. ఆసుపత్రిలో మహిళ మృతి
లక్నో: ఓ వైద్యుడి రీల్స్ పిచ్చి మహిళ ప్రాణాలను తీసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను రక్షించాల్సిన వైద్యులు సోషల్ మీడియా చూస్తూ బిజీగా ఉండటంతో సదరు మహిళ చనిపోయింది. సరైన సమయంలో వైద్యుడు స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. యూపీలోకి మైన్‌పురి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి(60) అనే మహిళకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డాక్టర్ ఆదర్శ్ సెంగార్ డ్యూటీలో ఉన్నారు. దీంతో, బాధితులు ఆదర్శ్‌ను సంప్రదించారు. దీంతో, ఓ నర్సును బాధితురాలి వద్దకు పంపి.. డాక్టర్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫేస్బుక్లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో మహిళ కుటుంబసభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన బాధితురాలు సరైన వైద్య సహాయం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది.ప్రవేశ్ కుమారి మృతి చెందడంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఆస్పత్రికి సిబ్బందికి, వారికి మధ్య వివాదం నెలకొంది. వైద్యం చేయమని పదే పదే అడిగినా తమ తల్లి ప్రాణం పోయేదాకా డాక్టర్ రీల్స్ చూస్తూ కూర్చున్నాడని మృతురాలి కుమారుడు గురుశరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ తల్లికి ఎందుకు వైద్యం చేయలేదని ప్రశ్నించినందుకు వైద్యుడు తమపై దాడి చేశాడని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యుడిపై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.At the #Mainpuri district hospital in #UttarPradesh, a 60-year-old woman, #PraveshKumari, died of a heart attack while the doctor on duty, #DrAdarshSanger, allegedly watched reels on his mobile phone.The woman's family claims that crucial time was lost due to the doctor's… pic.twitter.com/ZGLcD5ZExg— Hate Detector 🔍 (@HateDetectors) January 29, 2025 -
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…— Narendra Modi (@narendramodi) January 29, 2025మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్‌రాజ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు -
తొక్కిసలాట ఘటన.. ప్రధాని నాలుగుసార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి
లక్నో: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారాయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారాయన. ‘‘నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య పుణ్య స్నానాలు మొదలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా నెలకొంది. అయినా అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖాడాలు తెలిపారు. ఈ ఉదయం 8గం. వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌కి ఇవాళ 8-10 కోట్ల మంది వస్తారని అంచనా. .. గత రాత్రి తొక్కిసలాట జరిగింది. అఖాడ మార్గం గుండా వెళ్లి స్నానాలు చేయాలని కొందరు భక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే నాలుగుసార్లు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు, కేంద్ర మంత్రి అమిత్ షా,గవర్నర్ కూడా ఘటన గురించి చర్చించారు ’’ అని యోగి ప్రకటించారు. అలాగే.. త్రివేణి సంగం వద్దకు కాకుండా ఎక్కడికక్కడే ఘాట్లకు వెళ్లి స్నానం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. #WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control...""Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలోమీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సెక్టార్ 2 వద్ద తొక్కిసలాటలో పలువురికి గాయాలు కాగా చికిత్స అందుతోంది. ఘాట్ వెంట కిక్కిరిసిన భక్తులతో కిలోమీటర్ మేర బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊపిరాడని పరిస్థితుల నడుమ భక్తులు నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పది నుంచి 15 మంది మరణించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. జరిగింది ఇదే! -
మాములు పెళ్లి వింత కాదు..! వరుడే పండితుడిగా మారి..
పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని రాంపూర్‌కు చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు. మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది. ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్‌కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్ తొందరలో ఆత్మ నిర్భర్‌గా మారుతుందని తరుచుగా అనేవారు. ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77— Genzdigest (@Genzofficia_l) January 25, 2025 (చదవండి: అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..) -
పెళ్లి పిలగాడే అయ్యగారు..
-
తాగుబో‘తోడు’ వద్దనుకుని.. ఇన్‌స్టా పరిచయంతో ప్రేమవివాహం!!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. తమ భర్తల వేధింపులు భరించకలేక ఇద్దరు వివాహితులు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు మహిళలు.. కాశీలో వివాహం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇద్దరు మహిళలు తమ కుటుంబాలను వదిలిపెట్టి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. గురువారం సాయంత్రం కాశీలో కవిత, గుంజా అలియాస్ బబ్లూ వివాహం చేసుకున్నారు. అయితే, తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా విసిగిపోయిన ఇద్దరు మహిళలు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులు అయ్యారు. పెళ్లికి ముందు ఆరేళ్ల పాటు ఒకరికొకరు టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ తమ భర్తల చేతిలో గృహ హింసకు గురయ్యారు. దీంతో, భర్తను విడిచివెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుటి తిలకం దిద్దారు. దండలు మార్చుకుని, ఏడు అడుగులు వేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. మా భర్తల మద్యపానం, అసభ్య ప్రవర్తనతో మేము వేధించబడ్డాం. ఇది శాంతి, ప్రేమతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా చేసింది. మేము జంటగా గోరఖ్‌పూర్‌లో నివసించాలని నిర్ణయించుకున్నాము. తమను ఎవ్వరూ విడదీయబోరని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం వారికి శాశ్వత ఇల్లు లేకపోయినా, అద్దెకు నివాసం ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో, మద్యానికి బానిసైన తన భర్త తనపై రోజూ దాడి చేసేవాడని ఓ మహిళ తెలిపింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 🚨 UP: Two Women Marry Each Other in Deoria to Escape Harassment by Their Husbands...Lo kudoos tumhra sapna sach ho gya 😂😂👇 pic.twitter.com/2OWcS09xBY— Naren Mukherjee (@NMukherjee6) January 25, 2025 -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులకు సీఎం యోగి సంతాపం
లక్నో : ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బాధితులు ప్రయాణిస్తున్న వ్యాన్‌పై టయోటా ఇన్నోవో దూసుకెళ్లింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 11మంది తీవ్రంగా గాయపడ్డారు.గురువారం అర్ధరాత్రి ఉత్తర ప్రదేశ్ లక్నోలోని దేవా రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. బాధితురాలు కిరణ్, ఆమె కుమారుడు కుందన్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు బంటీ యాదద్,శోబిత్ యాదవ్‌లు ఆస్పత్రి నుంచి ఇంటికి వ్యాన్‌లో బయలు దేరారు. దేవా రోడ్డులో ప్రయాణిస్తున్న వ్యాన్‌ను టయోటా మెరుపు వేగంతో ఢీకొట్టింది. ఎదురుగా ఉన్న భారీ ట్రక్‌ను వ్యాన్ డీకొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రాణాలొదిలారు.రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 11మందికి తీవ్రగాయాలయ్యాయని, నలుగురు మరణించినట్లు పోలీస్ అధికారి పంకజ్ సింగ్ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల్ని ఈస్ట్ డీసీపీ శశాంక్ సింగ్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అనంతరం ఓ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. ఆ వ్యాన్‌లో మొత్తం తొమ్మిదిమంది కుటుంబ సభ్యులు ప్రమాణిస్తున్నారు. అయితే ఆ వ్యాన్‌పైకి వెనుక నుంచి టయోటా ఇన్నోవా దూసుకొచ్చింది. ప్రమాదం తీవ్రతకు ఎదురుగా ఉన్న ట్రక్‌ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు’ అని తెలిపారు. సీఎం యోగి సంతాపంఘోర రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికార యంత్రాంగానికి సీఎం యోగి ఆదేశాలకు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
మేఘాలే తాకింది ఆ ‘మోనాలిసా’..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతున్న మహా కుంభమేళాలో ఇప్పుడో అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. రోజూ కనీసం కోటి మంది సందర్శకులు వచ్చే ఈ మహా కుంభమేళాలో రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రయాగరాజ్‌కు (Prayagraj) వచ్చిన 16 ఏళ్ల యువతి ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన అందంతో కేక పుట్టిస్తోంది. కుంభమేళాకు వస్తున్న పర్యాటకులు, భక్తులు, యాత్రికులు.. చూడగానే ఎవరినైనా ఇట్టే అకర్షించేలా ఉన్న ఈ తేనెకళ్ల సుందరి నుంచి రుద్రాక్షలు, పూసలు కొనుగోలు చేయడానికి కంటే ఆమెతో ఓ సెల్ఫీ తీసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఎగబడుతున్నారు. ఆ ఇంటర్వ్యూతో యమా క్రేజ్.. ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే ఆ యువతిని, మహా కుంభమేళా న్యూస్‌ను కవర్ చేసే అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి. ఆమె ఫొటో పెడితే చాలు, లక్షల్లోనే ఫాలోవర్స్.. వాస్తవానికి.. ఇండోర్ నుంచి రుద్రాక్ష మాలలు అమ్మకునేందుకు వచ్చిన ఆ యువతి పేరు మోనాలిసా భోంస్లే. చూసీచూడగానే ఎవరినైనా కట్టిపడేసేలా మనోహరంగా ఉన్న మోనాలిసా (Monalisa) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా (Social Media) కార్యకర్తల దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసే వారి సంఖ్య వేల సంఖ్యలోనే ఉండడం, వాటిని చూసి లైక్‌లు కొట్టేవారు లక్షల్లో ఉండడంతో సోషల్‌మీడియా వేదికగా ఆమె కీర్తి ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ యువతి మీడియా ప్రతినిధులతో తానేమి చదువుకోలేదని చెప్పినప్పటికీ.. యూట్యూబ్, ఇన్‌స్టా, ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆమె పేరుతో ఏర్పాటైన పేజీలతో పాటు ఆమె ఫొటోలు పోస్టుచేసిన దాదాపు అందరికీ కొత్త ఫాలోవర్స్ వరదలా పెరుగుతున్నారు. చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్లయిపోయి..అప్పటివరకు వందల్లో కూడా ఫాలోవర్స్ లేనివారికి మోనాలిసా కవరేజీతో వేల, లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ చేరిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మను లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ‘మోనాలిసా’తో పోలుస్తున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారల కన్నా ఆమె అందం పదుల రెట్లు ఎక్కువంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉపాధికి గండికొట్టిన పాపులారిటీ.. ఇదిలా ఉంటే.. అందం, కళ్లు ఆమెకు ఓ వైపు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టగా.. మరోవైపు అదే క్రేజ్ ఆమె ఉపాధికి గండికొడుతోంది. ఆమె అమ్ముతున్న రుద్రాక్షలు, పూసల దండలు కొనడంకంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అమ్మకాల్లేక, ఆదాయం రాక ఆందోళన చెందుతున్నారు. ఈ హడావుడితో వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మోనాలిసాను ఇండోర్‌కు తిరిగి పంపాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. (ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి) -
MahaKumbh 2025: 10 రోజులు..10 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ/మహాకుంభ్ నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 10 రోజుల్లోనే ఏకంగా 10 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమ స్థలికి భక్తులు బారులు తీరుతున్నారు. కుంభమేళాకు చేరుకోవడానికి రైళ్లు, విమానాలపై ఆధారపడుతున్నారు. వెయ్యికి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతి రైల్లోనూ చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉంటున్నాయి. జనరల్ బోగీల పరిస్థితైతే వర్ణనాతీతం! ఒక్కో రైలుకు నాలుగైదు చొప్పున జనరల్ బోగీలున్నా అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి! ఢిల్లీ, ముంబై, బెంగళూర్ వంటి నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. పైగా అప్పటికప్పుడు ప్రయాణ వేళలు మార్చడం, టికెట్ ధరలను విపరీతంగా పెంచడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇవి పాటించాలి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించే విషయంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు. కుంభమేళాలో స్నానం మనసులోని మాలిన్యాన్ని తొలగించుకోవడానికని గుర్తుంచుకోవాలి. స్నానం ఆచరించే ముందు సంగమ జలాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మేళాలో తొలి స్నానం క్షేమం కోసం, రెండోది తల్లిదండ్రుల పేరుతో, మూడోది గురువు పేరుతో ఆచరించాలి. త్రివేణి సంగమ పవిత్ర జలాన్ని ఇంటికి తెచ్చుకోవాలి.యోగి పుణ్యస్నానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం తన మంత్రివర్గ సహచరులతో కలిసి మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు. అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌లోనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ప్రయాగ్‌రాజ్‌లో రెండు నూతన వారధుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్శించబోతున్నట్లు తెలిపారు. యూపీ యువతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా త్రివేణి సంగమంలో యోగి పుణ్యస్నానం ఆచరించారు.అంతరిక్షం నుంచి కనువిందు కోట్లాది భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా కనిపిస్తున్న మహా కుంభమేళా దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం విడుదల చేసింది. వీటిని అంతరిక్షం నుంచి శాటిలైట్ ద్వారా చిత్రీకరించా రు. టెంట్ సిటీ ఏర్పాటవక ముందు, ఏర్పాటైన తర్వాతి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మేళా పరిసర ప్రాంతాలు సైతం ఆకర్షిస్తున్నాయి. 2023 సెపె్టంబర్లో, 2024 డిసెంబర్ 29న చిత్రీకరించిన ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దర్శనమిస్తున్నాయి. -
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025 -
అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్మెంట్’లో ట్విస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్మెంట్ మాత్రం కాలేదన్నారు.పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి ‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్ ఈ సందర్భంగా తెలిపారు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వెలుగులోకిమరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కుర్రాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్. భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్... నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.ఆ ఫొటోలతో బలపడిన ప్రచారంఅయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్ చేసింది. తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో రింకూ ఎంగేజ్మెంట్ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్ అయ్యాయి.యువ ఎంపీగా ప్రస్థానంఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా ప్రియా సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్‌లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కేరాకట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్మెంట్ గురించి స్పందించడంతో వదంతులకు చెక్ పడింది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 View this post on Instagram A post shared by Neha ❤️ (@_neha_singh_0700) -
నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Maha Kumbh 2025) జరుగుతోంది. దేశం నుంచే నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. ఈ కుంభమేళలో ఎందరో విచిత్రమైన బాబాలు, వారి నేపథ్యం విస్తుగొలిపే విధంగా ఉండటం చూశాం. యావత్తు భారతావనిలో ఆద్యాత్మికత శోభ ఎంతగా తనలోకి మేధావులు, మహా మహులను ఆకళింపు చేసుకుని కాంతిలీనుతోందనేది ఈ మహోత్సవం ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా అలాంటి మరో ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. తొలిసారిగా ఓ విదేశీయుడు నాగసాధువుగా మారి ఈ కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతడు ఏ దేశస్తుడంటే..భారతదేశపు ప్రాచీన జునా అఖారాకు(Juna Akhara) చెందిన నాగసాధుగా దీక్ష పొందిన తొలి విదేశీయుడు. ఆ వ్యక్తి పేరు బాబా రాంపురి(Baba Rampuri,). అమెరికాకు చెందిన వ్యక్తి. చికాగోలోని పిల్లల వైద్యుడు డాక్టర్ స్టీఫెన్ ఎల్. గాన్స్కు జన్మించిన విలియం ఎ. గాన్స్ ఈ బాబా రాంపురి. అతడు భారతీయ తత్వశాస్త్రం పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ప్రసిద్ధిగాంచిన అలాన్ వాట్స్ వంటి మహోన్నత వ్యక్తుల నుంచి ప్రేరణ పొంది 1969లో భారతదేశానికి వచ్చాడు.ఇక్కడ బాబా రాంపరి యోగా హరిపురి మహారాజ్ శిష్యుడయ్యాడు. అలా ఆయన భారత్‌లోని నిగూఢమైన నాగ సాధువులకు చెందిన జునా అఖారాలో నాగబాబాగా దీక్ష తీసుకున్నాడు. ఆ విధంగా ఆయన ఆది శంకరుల కాలంలోని యోగుల గురువు అయిన భవాన్ దత్తాత్రేయుడికి సంబంధించిన గౌరవనీయ వంశంలో దీక్ష పొందిన తొలి విదేశీయడుగా నిలిచాడు బాబా రాంపురి.అంతేగాదు ఆయన రాసిన "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ సాధు: యాన్ ఆంగ్రేజ్ అమాంగ్ నాగ బాబాస్" పుస్తకంలో 1971లో అలహాబాద్ మహా కుంభమేళా సమయంలో తాను నాగసాధువుగా మారిన క్రమం గురించి చెప్పుకొచ్చారు. తన ఆత్మకథలో భారతదేశాన్ని ఉనికిలోని తీసుకరావాలని కలలు కంటున్నానని, ఈ ప్రదేశం మనసుకు శాంతినిచ్చే యోగా వంటి ఆధ్యాత్మికతకు నిలయం అని రాశారు. ఈ భూమి మీద వినిపించే శబ్దాలు, కనిపించే ముఖాలు అన్ని తనకు పరిచయమున్నట్లుగా అనిపిస్తుందని, ఈ దేశంతో ఏదో తెలియని రక్తసంబంధం ఉంది అంటూ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇక బాబా రాంపురికి 2010 హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో, బాబాకు జూనా అఖారా కౌన్సిల్లో శాశ్వత స్థానంతో సత్కారం లభించింది. అలాగే ఆయనకు 'అంతరాష్ట్రీయ మండల్ కా శ్రీ మహంత్' అనే బిరుదుని కూడా పొందారు. (చదవండి: 'ఇంజనీర్ బాబా': ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఫోటోగ్రఫీ వదిలి మరీ..) -
ఉత్తరాదిలో పొగమంచు ఎఫెక్ట్.. వాహనదారుల ఇబ్బందులు
-
కుంభ మేళాకు బాబా @ 100 ఏళ్లు
మహాకుంభ్ నగర్: యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత, యోగ సాధకుడు స్వామి శివానంద బాబా. 1896లో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగే ప్రతి కుంభమేళాలోనూ హాజరవుతున్నారు. తాజాగా, మహాకుంభమేళాకు సైతం వచ్చారు. సంగంలోని 16వ నంబర్ సెక్టార్‌లోని టెంట్లో ఈయన బస చేస్తున్నారు. టెంట్ బయట బాబా ఆధార్ కార్డు, పుట్టిన రోజు సర్టిఫికెట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనకు ఉంచారు. బాబా శిష్యుడు, బెంగళూరుకు చెందిన ఫల్గుణ్ భట్టాచార్య వారిలో ఒకరు. ‘బాబా బిచ్చగాళ్ల కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచూ వెళ్లేవారు. ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయస్సులో బాబాను సాధువులకు అప్పగించేశారు. ఆరేళ్ల వయస్సులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది. మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు. వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు’అని భట్టాచార్య వివరించారు. ‘అప్పటి నుంచి జీవితమే మారిపోయింది. రాత్రి 9 గంటలకు పడుకుని, వేకువజామున 3 గంటలకే నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా, ధ్యానంలోనే గడపడం దినచర్యంగా మార్చుకున్నారు’అని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవన్నారు. కానుకలు స్వీకరించరని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు, నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్‌లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మీ శ్రీ అవార్డును స్వీకరించారు. బాబా వయస్సు 125 ఏళ్లని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొంది. కాగా, ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు, శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం. అందుకే, ఉదయాన్నే మేల్కొనడం, కాసేపు నడక, కనీస అరగంటపాటు యోగ సాధనతోపాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫల్గుణ్ భట్టాచార్య తెలిపారు. -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
పెట్రోల్ పోయవా? అయితే కరెంట్ కట్
లక్నో: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారుల మరణాలను నివారించే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఒక నిబంధన రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో అతను పెట్రోల్‌బంక్‌కు విద్యుత్ సరఫరాను నిలిపేసిన ఘటన హాపూర్ జిల్లా లోని పార్థాపూర్ రోడ్డులో జరిగింది. హెల్మెట్ ధరి స్తేనే ద్విచక్రవాహనదారులకు పె ట్రోల్‌ను విక్రయించాలనే నిబంధనను అమలుచేయాలని యూపీ సర్కార్ ఆదేశించింది. దీంతో పార్థాపూర్ రోడ్డులోని ఒక పెట్రోల్‌బంక్ సైతం ఇదే నియమాన్ని పాటిస్తోంది. మంగళవారం ఈ పెట్రోల్‌బంక్‌కు వచ్చిన కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ పెట్రోల్ అడగ్గా బంక్ సిబ్బంది నిరాకరించారు. హెల్మెట్ ధరించి వస్తేనే బైక్‌కు పెట్రోల్ కొడతామని కరాఖండీగా చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన లైన్మెన్ అక్కడి నుంచి కొంతదూరం వెళ్లి బంక్‌కు విద్యుత్‌సరఫరా అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఉన్న కరెంట్‌స్తంభం ఎక్కి వైర్‌ను కత్తిరించాడు. దీంతో బంక్‌లో విద్యుత్‌సరఫరా ఆగిపోయింది. దీంతో ఇంధన వినియోగదారుల చాంతడంత క్యూలైన్ ఏర్పడింది. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే లైన్మెన్ కరెంట్ లైన్‌ను కత్తిరించిన విషయం అక్కడి సీసీటీవీలో రికార్డ్‌కావడంతో అది లైన్మెన్ పని అని తర్వాత తెలిసింది. వెంటనే స్థానికులు ఫిర్యాదుచేయడంతో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. -
Maha Kumbh 2025: భక్తజన జాతర
సాక్షి, న్యూఢిల్లీ: మహా కుంభమేళాకు భక్తుల వరద అంచనాలకు మించుతోంది. మేళాలో పాల్గొని పవి త్ర స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నానాయుధ ధారులైన నాగా సాధువులు, సంతులు తొలి ‘షాహీ స్నాన్ (రాజస్నానం)లో పాల్గొన్నారు. తెల్లవారుజాము 3 గంటల వేళ శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచయతీ అటల్ అఖాడా సాధువులు త్రివేణి సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిపై హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది. ఈ సందర్భంగా డమరుక, శంఖనాదాలతో సంగమ స్థలమంతా ప్రతిధ్వనించింది. ఇక బుధవారం కూడా దాదాపు కోటి మంది దాకా భక్తులు వచ్చినట్టు చెబుతున్నారు. తొలి రోజు సోమవారం 1.65 కోట్లకు పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించినట్టు వెల్లడించడం తెలిసిందే. తొలి మూడు రోజుల్లో భక్తుల సంఖ్య 6 కోట్లు దాటినట్టు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు భక్తుల సంఖ్య ఏకంగా 10 కోట్లు దాటుతుందని అంచనా! అందుకు ఏర్పాట్లూ చేయాల్సిందిగా సీఎం యోగి ఆదేశించారు. ఆరోగ్యానికి పెద్దపీట భక్తులు అసంఖ్యాకంగా వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా యూపీ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంది. 100 పడకలతో ‘సెంట్రల్’ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఓపీతో పాటు ఇందులో ఆపరేషన్లు కూడా చేసే వీలుంది. ఇక్కడి మెడికల్ స్టోర్‌లో 276 రకాలకు చెందిన ఏకంగా 107 కోట్ల ట్యాబ్లెట్లున్నాయి! 380 పడకలతో 43 తాత్కాలిక ఆసుపత్రులు, అసంఖ్యాకంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 14 ఎయిర్ అంబులెన్సులూ అందుబాటులో ఉన్నాయి. 400 మంది వైద్యులు, వెయ్యికి పైగా సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు.లారెన్ పావెల్ కాళీ బీజదీక్ష యాపిల్ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ బుధవారం త్రివేణి సంగమ ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ‘‘అనంతరం శ్రీ నిరంజనీ పంచాయ్ అఖాడా అధిపతి స్వామీ కైలాసానందగిరి నుంచి ఆమె కాళీ బీజదీక్ష స్వీకరించారు. గురుదక్షిణ కూడా సమర్పించారు’’ అని అఖాడా ప్రతినిధి వెల్లడించారు. ఆమె సోమ, మంగళవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పవిత్ర స్నానం అనంతరం కోలుకున్నట్టు ప్రతినిధి తెలిపారు.నాగసాధువులతో ‘వాక్ బయటి ప్రపంచానికి ఎప్పుడూ మిస్టరీగానే ఉండే నాగ సాధువుల జీవితాలను గురించి తెలుసుకునేందుకు కుంభ మేళా సందర్భంగా యూపీ సర్కారు వీలు కల్పించింది. వారితో ‘వాక్ టూర్’ను అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీని బట్టి రూ.2వేల నుంచి రూ.3,500 దాకా చెల్లిస్తే చాలు, నాగ సాధువులతో వాక్ టూర్ చేయవచ్చు. అఘోరీలు, కల్పవాసీల గురించి కూడా టూర్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం 900 మందికి పైగా సుశిక్షిత టూర్ గైడ్లు అందుబాటులో ఉన్నారు. -
రూల్స్ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!
మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.India Not For Beginers అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్‌ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్‌తో ఓ బంక్‌లోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్‌కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్‌లో కరెంట్ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్‌కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్‌కు పవర్ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్‌కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్ ఓనర్ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్.యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్ వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్‌లోకి వచ్చే టైంలో పైలాన్ రైడర్లూ ఉన్నా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.#Hapurपिलखुवा क्षेत्र के परतापुर रोड स्थित श्री जी फ्यूल पर एक अजीबो गरीब मामला सामने आया हैबिना हेलमेट बिजली विभाग के कर्मचारियों को पेट्रोल ना देना पेट्रोल पंप संचालक को पड़ा भारी लाइनमैन ने काट दी पेट्रोल पंप की बिजलीघटना सीसीटीवी में हुई कैद @DmHapur pic.twitter.com/My77ptruK3— Asian News UP (@AsianNewsUP) January 15, 2025 -
కన్నుల పండుగగా కుంభమేళ
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు
-
అబ్బురపరుస్తున్న టెంట్ సిటీ
కుంభమేళాకు పోటెత్తే కోట్లాది భక్తులకు బస, ఏర్పాట్లు చేసే సామర్థ్యం ప్రయాగ్‌రాజ్‌లోని హోటళ్లకు లేదు. ఆ అవసరాలు తీర్చే ఏకైక చిరునామాగా ‘టెంట్ నగరి’ నిలిచింది. లక్షలాది టెంట్లు ఆతిథ్యానికి సిద్ధమయ్యాయి.సకల సౌకర్యాల శిబిరాలు ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదీ తీర ఇసుక తిన్నెలు ఇప్పుడు ఆధునాతన టెంట్లుగా రూపాంతంరం చెంది ఎండా, వాన నుంచి భక్తులకు రక్షణగా నిలిచాయి. పది అడుగుల ఎత్తయిన కర్రలను ఈ టెంట్ల నిర్మాణం కోసం వాడారు. మొత్తంగా 68 లక్షల చెక్క కర్రలు, 100 కిలోమీటర్ల పొడవైన వస్త్రం, 250 టన్నుల బరువైన సీజీఐ(ఇనుప) రేకులతో ఈ టెంట్లను నిర్మించారు. గత కొన్ని నెలలుగా నిరాటంకంగా ఏకంగా 3,000 మంది కారి్మకులు అవిశ్రాంతంగా కష్టపడి ఈ టెంట్ నగరానికి తుదిరూపునిచ్చారు. వర్షం, గాలులను తట్టుకునేలా టెంట్లను పటిష్టంగా నిపుణులు నిర్మించారు. ఒకేసారి 20 లక్షల మందికి బస సౌకర్యం కల్పించేలా ఎక్కువ టెంట్లను కట్టారు. విభిన్న సౌకర్యాల మహాకుంభ గ్రామం టెంట్ సిటీలో అన్ని ఒకే తరహా టెంట్లు ఉండవు. సాధారణ భక్తుడు మొదలు సంపన్న భక్తుడి దాకా ప్రతి ఒక్కరికి వారి వారి తాహతుకు తగ్గట్లు విభిన్న టెంట్లను నెలకొల్పారు. డిమాండ్, భక్తుల రద్దీని బట్టి మరిన్ని టెంట్లను నిర్మించేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లుచేస్తోంది. భారతీయ రైల్వే వారి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) వారు భక్తుల కోసం మహాకుంభ్ గ్రామ్ పేరిట ప్రత్యేక టెంట్లను నిర్మించింది. ఇవి త్రివేణి సంగమం నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వీటిల్లో సూపర్ లగ్జరీ టెంట్లు, విల్లాలు ఉన్నాయి. విడిగా స్నానాల గది, చల్లటి, వేడి నీళ్లు, ఎయిర్ బ్లోయర్, మంచాలున్నాయి. అల్పాహారం, భోజన సదుపాయాలూ కల్పిస్తున్నారు. టెలివిజన్ ఏర్పాట్లూ చేశారు. ఆర్ఐసీటీసీ ద్వారా ఈ టెంట్లను బుక్ చేసుకోవచ్చు. రోజుకు రూ.18,000 నుంచి రూ.20,000 వసూలుచేస్తారు. ప్రీమియం టెంట్లూ ఉన్నాయ్ ఖరీదైన పరుపులతో సిద్ధంచేసిన మంచాలు, రాత్రిళ్లు బోగిమంటల్లా చలికాచుకోవడానికి ఏర్పాట్లు, ఆధ్యాతి్మక బోధనలు వినేందుకు విడిగా ఏర్పాట్లూ ఈ ప్రీమియం టెంట్ల వద్ద ఉన్నాయి. ప్రాచీన మత విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, ఆధునికత మేళవింపు ఈ సంగమస్థలిలో కనిపిస్తుంది. వీటిలో శాకాహార భోజన ఏర్పాట్లు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, బెంగాళీ, అస్సామీ, మరాఠీ, హిందీ సహా ఇంగ్లిస్ వంటి పది భాషల్లో సమాచారాన్ని పొందొచ్చుఉచితంగానూ ఇస్తారుసర్వోదయ మండలి వంటి సంస్థలు పేద భక్తుల కోసం ఉచిత బస వసతులనూ ఈ టెంట్లలో కల్పిస్తున్నాయి. గరిష్టంగా 30 మంది ఈ భారీ టంట్లను తాత్కాలికంగా కొంతసమయం మాత్రం ఉండేందుకు అనుమతిస్తారు. పోటెత్తే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తర్వాతి పేద భక్తులకూ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తక్కువ సమయం మాత్రమే బస వసతి కల్పిస్తారు. ఎంతో సౌకర్యవంతం ‘‘40 ఏళ్లుగా ప్రతి పుష్కరాల్లోనూ టెంట్ సిటీకి వచ్చా. అప్పుట్లో కేవలం టెంట్ల కింద ఇసుకపైనే నిద్రించేవాళ్లం. ఇప్పుడు చాలా సౌకర్యాలు పెంచారు. టీవీ, వై–ఫై, డ్రోన్లు, నిఘా కెమెరాలు, అసలు మనం ఎక్కడ ఉన్నామని లొకేషన్ తెలిపే క్యూఆర్ కోడ్ స్కాన్ ఫ్లెక్సీ బ్యానర్లు, నిరంతరం పోలీసు గస్తీ.. ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. భద్రంగా, భక్తితో, చక్కటి భోజనాలతో కుంభమేళా యాత్ర పూర్తిచేయడంలో ఈ టెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి’’ అని రాజస్తాన్‌కు చెందిన వృద్దురాలు కల్పవాసీ అన్నారు. రూ. 3,000 నుంచి 1లక్ష దాకా! టెంట్ సౌకర్యంతోపాటు అక్కడి పలు ఘాట్ల వరకు తీసుకెళ్లడం, టూర్ గైడ్, పడవ ప్రయాణం, దగ్గరి పుణ్యక్షేత్రాల సందర్శన తదితరాలతో కలిసి పలు రకాల ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. రూ.3,000 నుంచి మొదలు ఏకంగా రూ.1లక్ష దాకా ‘టెంట్ కమ్ టూర్’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. లాలూజీ అండ్ సన్స్ సంస్థ ఇందులో 104 ఏళ్ల అనుభవం గడించింది. ‘‘పుష్కరాల కోసం మా ఏర్పాట్లు 18 నెలల నుంచే మొదలవుతాయి. టెంట్ అంతర్గత సౌకర్యాల కోసం కాటన్, టెరీ కాటన్ వాడతాం. బయటివైపు చిరిగినా వర్షపు నీరు లోపలికి రాకుండా పాలిథీన్‌తో కుట్టేస్తాం. మంచాలు, కురీ్చలు, టీవీ స్టాండ్ ఇతర సౌకర్యాలు సమకూరుస్తాం’’ అని సంస్థ నిర్వాహకుడు దీపాన్షు అగర్వాల్ చెప్పారు. ‘‘పూర్వం రోజుకు రూ.10 వేతనం దక్కేది. ఇప్పుడు రూ.500 పైనే చేతికొస్తున్నాయి. డబ్బుల కంటే భక్తుల కోసం పని చేస్తున్నామన్న తృప్తి మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది’’ అని టెంట్ల నిర్మాణంలో పనిచేసే రోజువారీ కారి్మకుడు 68 ఏళ్ల రఘునాథ్‌ను చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మేళాలో ప్రత్యేక ఆకర్షణ... నాగ సాధువులు
వాళ్లు బంధాలు, అనుబంధాలుండవు. సర్వం త్యజించిన సన్యాసులు. చలికాలమైనా, ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు. ఒళ్లంతా విభూది ధరిస్తారు. జనవాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామాన్యానికి కనిపిస్తారు. వాళ్లే నాగసాధువులు. కుంభమేళాకు శ్రీకారం చుట్టేది వాళ్లే. ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొహెంజోదారో కాలం నుంచీ నాగాల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను అన్య మతస్తుల దాడులు తదితరాల నుంచి వీరు కాపాడినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయుధాల వాడకంలోనూ వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లుగానూ అభివర్ణిస్తుంటారు. వీరి ప్రాముఖ్యత అనాది కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది. హిమాలయాల్లో ఉంటారంటారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. తద్వారా పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందన్నది విశ్వాసం. అందుకే మేళాలో తొలి రాజ (షాహీ) స్నానం వీరితోనే చేయించి గౌరవిస్తారు. కుంభమేళా కోసం.. → ప్రయాగ్‌రాజ్‌లో 92 రహదారులు నిర్మించారు → 17 ప్రధాన రోడ్లను సుందరీకరించారు → 30 బల్లకట్టు వంతెనలు కట్టారు → భిన్న భాషల్లో 800 దారిసూచికలు ఏర్పాటుచేశారు → తొలిసారిగా అండర్‌వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపారు. ఇవి 100 మీటర్ల లోతుకు సైతం వెళ్లి గాలిస్తాయి. అలాగే 120 మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాయనున్నాయి. → రోజూ వేలాది భక్తులకు కంటి పరీక్షలకు 10 ఎకరాల్లో 11 భారీ గుడారాల్లో నేత్ర కుంభ్‌ను నెలకొల్పారు. → భద్రతకు ఏడంచెల కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. → భక్తుల కోసం దేశ నలుమూలల నుంచి 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. → తప్పిపోయిన వారికోసం ‘ఖోయా–పాయా’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కుంభమేళా చరిత్ర ఇప్పటిది కాదు
కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్రకందని కాలం నుంచీ జరుగుతూ వస్తోందని చెబుతారు. క్రీస్తుశకం ఆరో శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభ మేళా అనే పేరు అమృతకలశం నుంచి వచ్చింది. సాగరమథనం వల్ల పుట్టుకొచ్చిన అమృత భాండం నుంచి నాలుగు చుక్కలు భూమిపై ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో పడ్డాయని ఐతిహ్యం. తల్లికి బానిసత్వం తప్పించేందుకు గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతభాండం తెస్తుండగా చుక్కలు జారిపడ్డాయని మరో కథనం. అమృతంతో అత్యంత పవిత్రతను సంతరించుకున్న ఆ నాలుగు చోట్లా కుంభమేళా జరగడం ఆనవాయితీగా వస్తోంది.నాలుగు రకాలు కుంభమేళా నాలుగు రకాలు. ఏటా మాఘ మాసంలో జరిగేది మాఘ మేళా. ఇది కేవలం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఆరేళ్లకు ఓసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయోగరాజ్ల్లో జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్‌రాజ్‌తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌ల్లో కూడా జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత, అంటే 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహా కుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయోగరాజ్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది మహా కుంభమేళా. ఏం చేస్తారు? కుంభమేళాలో పాల్గొనే భక్తులు ముఖ్యంగా ఆచరించేది త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం. తద్వారా పాపాలు తొలగి దేహత్యాగానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందన్నది విశ్వాసం. 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో ఆరు ముఖ్యమైన తిథులను మరింత పవిత్రమైనవిగా నమ్ముతారు. ఆ రోజుల్లో సంగమ స్థలికి ఇసుక వేసినా రాలనంతగా జనం పోటెత్తుతారు. పుణ్య స్నానం తర్వాత త్రివేణి తీరాన్నే ఉన్న అక్బర్ కోటలో అక్షయ వటవృక్షాన్ని. ఆ పక్కనే ఉన్న బడే హనుమాన్ ఆలయాన్ని, అక్కడికి సమీపంలో ఉండే మాధవేశ్వరీ శక్తి పీఠాన్ని దర్శిస్తారు. మామూలు రోజుల్లో కంటే మేళా సమయంలో సంగమ స్థలిలో చేసే పుణ్యకార్యాలు అత్యంత ఫలప్రదాలని నమ్ముతారు. కల్పవాసం కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు కల్పవాసం. భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో సంగమ ప్రాంతంలో నెల రోజుల పాటు దీన్ని నిష్టగా పాటిస్తారు. మేళా మొదలయ్యే పుష్య పౌరి్ణమ నాడు కల్పవాస సంకల్పం తీసుకుంటారు. అప్పటినుంచి మాఘ పూరి్ణమ దాకా కల్పవాసాన్ని పాటిస్తారు. ఆ నెల పాటు సంగమ స్థలం దాటి వెళ్లరు. రోజూ గంగలో మూడు మునకలు వేయడం, యోగ, ధ్యానం, పూజలు, ప్రవచనాల శ్రవణం వంటివాటితో పూర్తి భక్తి భావనల నడుమ కాలం గడుపుతారు. ఈసారి 15 నుంచి 20 లక్షలకు పైగా భక్తులు కల్పవాసం చేయనున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వివరించారు. వారి కోసం కుంభ్‌నగర్‌లో విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
MahaKumbh2025: ప్రారంభమైన ఆధ్యాత్మిక సంరంభం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో ఉదయం 5గం.15ని. పుష్య పూర్ణిమ పుణ్య స్నానాలతో మొదలైంది. 144 ఏళ్లకోసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా.. 45 రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పుణ్య స్నానాలతో ఈ ఆధ్యాత్మిక సంరంభం ముగియనుంది.తొలుత పీఠాధిపతులు, నాగా సాధువుల షాహీ (రాజ) స్నాన వేడుకతో మహా కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. అనంతరం భక్త జనాన్ని స్నానాలకు అనుమతిస్తున్నారు. దేశ నలుమూలల నుంచే గాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు, ఔత్సాహికులు కుంభమేళాను తిలకించేందుకు పోటెత్తనున్నారు. మహా కుంభమేలా ప్రారంభమైన కాసేపటికే ప్రముఖులు.. మరీ ముఖ్యంగా విదేశీ సందర్శకులు సందడి కనిపించింది. తొలిరోజే కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా. #WATCH | Prayagraj | A Brazilian devotee at #MahaKumbh2025, Fransisco says, "I practice Yoga and I am searching for Moksha. It's amazing here, India is the spiritual heart of the world... Water is cold but the heart is filled with warmth." pic.twitter.com/as1oBQXmGl— ANI (@ANI) January 12, 2025 #WATCH | Prayagraj | A Russian devotee at #MahaKumbh2025, says, "...'Mera Bharat Mahaan'... India is a great country. We are here at Kumbh Mela for the first time. Here we can see the real India - the true power lies in the people of India. I am shaking because of the vibe of the… pic.twitter.com/vyXj4m4BRs— ANI (@ANI) January 13, 2025 #WATCH | Prayagraj | Devotees take holy dip in Triveni Sangam - a scared confluence of rivers Ganga, Yamuna and 'mystical' Saraswati as today, January 13 - Paush Purnima marks the beginning of the 45-day-long #MahaKumbh2025 pic.twitter.com/Efe6zetUc4— ANI (@ANI) January 13, 2025ప్రయాగ్‌రాజ్‌కు ‘కుంభ కళ’ కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ ఉత్సవ కళ సంతరించుకుంది. ప్రపంచ నలుమూల నుంచీ కోట్లలో వచ్చే భక్తులు, సందర్శకులతో కళకళలాడనుంది. రాత్రి వేళల్లో రేడియం వెలుగుల్లో మెరిసిపోతోంది. కార్యాలయాలు, గోడలు, ఫ్లై ఓవర్ల పొడవునా సనాతర ధర్మం, దేవీదేవతలకు సంబంధించిన పెయింటింగులతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్య కూడళ్లు కలశం, శంఖచక్రాలు, ఓంకారం యోగాసనాల థీమ్‌లతో కూడిన ఏర్పాట్లతో అలరిస్తున్నాయి. ఎంట్రీ పాయింట్ల వద్ద భారీ స్వాగత స్తంభాలు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమైన రోజులు జనవరి 13 పుష్య పౌర్ణమి జనవరి 14 మకర సంక్రాంతి జనవరి 29 మౌనీ అమావాస్య ఫిబ్రవరి 2 వసంత పంచమి ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 26 మహాశివరాత్రివిశేషాలెన్నో... త్రివేణిసంగమం, పరిసరాల్లో 10 వేల ఎకరాల పై చిలుకు స్థలంలో ప్రత్యేకంగా ‘కుంభ్‌నగర్’ పేరుతో ఏకంగా ఓ ప్రత్యేక పట్టణమే పుట్టుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక ఆవాస ప్రాంతంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. మేళాకు తరలివచ్చే భక్తులకు ఆశ్రయం తదితర అవసరాలను ఇది తీర్చనుంది. ఇందులో కనీసం కోటి మందికి సరిపడా ఏర్పాట్లున్నాయి. → గంగా నదిపై 30 బల్లకట్టు వంతెనలు → 2,700 ఏఐ కెమెరాలు, వెయ్యికి పైగా సీసీ కెమెరాలు, వందల డ్రోన్లు → ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో వాటర్ అంబులెన్సులు → విదేశీ పర్యాటకులకు ‘ఇన్క్రెడిబుల్ ఇండియా పెవిలియన్’ → 1800111363, 1363 నంబర్లలో టోల్‌ఫ్రీ సేవలుప్రథమ చికిత్స కేంద్రాలు → కోట్ల మంది వస్తున్నందున వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. → అత్యవసర చికిత్స కోసం విస్తృతంగా ప్రథమ చికిత్సా కేంద్రాలు పెట్టారు. → అన్ని సౌకర్యాలతో కూడిన 10 పడకల మినీ ఐసీయూలు పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.భక్తుల నుంచి పీఠాధీశుల దాకా....సాధారణ భక్తులతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ ఆధ్యాత్మిక పీఠాల అధిపతులూ కుంభమేళాలో పాల్గొంటారు. వారంతా ఇప్పటికే త్రివేణిసంగమం చేరుకున్నారు. గత నెల రోజులుగా ఒక్కొక్కరుగా అట్టహాసంగా నగరప్రవేశం చేసి ఆకట్టుకున్నారు. 13 ప్రఖ్యాత అఖాడాలతో పాటు పలు సంప్రదాయాలకు చెందిన చిన్నా పెద్దా పీఠాలు సంగమ స్థలిలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ఆశ్రమాలు, టెంట్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిలోనే ప్రత్యేకంగా పూజా మందిరాలు కూడా వెలిశాయి. నెలన్నర పాటు రాత్రిళ్లు నెగళ్లు వేసి, అక్కడే ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసాద వితరణ వంటివి జరపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి సూచకగా ఆదివారం సంగమ స్థలిలో నమామి గంగే బృందం ఆధ్వర్యంలో ఘనంగా యజ్ఞ క్రతువు నిర్వహించారు. నది పవిత్రతను, స్వచ్ఛతను కాపాడతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ రహితంగా ఉత్సవం జరుపుకుందామని పిలుపునిచ్చారు. భక్తులకు జ్యూట్ బ్యాగులు పంచారు. దక్షిణాది నుంచి 60 లక్షల మంది మహా కుంభమేళాకు తెలుగు వారు లక్షలాదిగా తరలనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది నుంచి కనీసం 60 లక్షల మందికి పైగా ఉత్సవంలో పాల్గొంటారని అంచనా. స్వచ్ఛత కోసం పది వనాలు మహా కుంభమేళాకు కోట్ల మంది వస్తున్నందున పరిశుభ్రమైన, స్వచ్చమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం రెండేళ్ల నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. జపాన్ విధానంలో 10 ప్రాంతాల్లో ప్రత్యేకంగా చిన్న చిన్న వనాలను పెంచింది.संस्कृति का गर्व, महाकुम्भ पर्व आज पौष पूर्णिमा स्नान से आरंभ हो गया। #MahaKumbhOnDD #MahaKumbh2025 #MahakumbhCalling #MahaKumb_2025 #DDNational #महाकुम्भ #महाकुंभ2025 #एकता_का_महाकुम्भ @UPGovt @MIB_India @MahaKumbh_2025 pic.twitter.com/9T6BsKVq4x— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 13, 2025రైలు ప్రయాణికులకు ఎన్క్లోజర్లు కుంభమేళా భక్తుల్లో అత్యధికులు రైలు ద్వారానే వస్తారని యోగీ ప్రభుత్వం అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్ వద్ద వారికోసం ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వారికోసం నాలుగు వైపులా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో నాలుగింటిని సిద్ధం చేశారు. రైలు దిగి రాగానే అవి కనిపిస్తాయి. ప్రతి ఎన్‌క్లోజర్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, మొబైల్ ఛార్జింగ్ తదితర సౌకర్యాలున్నాయి. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 1800 4199 139 టోల్‌ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది.‘‘అనాదికాలం నుంచి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న భారత ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆధునిక ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటిచెప్పేందుకు మహా కుంభమేళా చక్కని వేదికగా నిలవనుంది’’ – యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వాటర్ అంబులెన్సులు ముఖ్యమైన పర్వదినాల్లో పవిత్ర స్నానాల కోసం కోట్ల మంది భక్తులు రానున్నందున అదుపు తప్పి నీట మునిగేవారిని కాపాడేందుకు వందల సంఖ్యలో డీఆర్ఎప్ బృందాలు మోహరించాయి. రక్షించేందుకు, ప్రథమ చికిత్స అందించేందుకు వాటర్ అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. వాటిలో వైద్యుడు, పారా మెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ ఎంకే శర్మ తెలిపారు.విదేశీ పెవిలియన్ విదేశీ పర్యాటకులు, పండితులు, పరిశోధకులు, జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు, ప్రవాస సంఘం, భారతీయ డయాస్పోరా కోసం 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర పర్యాటక శాఖ ‘ఇన్క్రెడిబుల్ ఇండియా పెవిలియన్’ ఏర్పాటు చేసింది. కుంభమేళా ప్రాముఖ్యతను తెలిపే విశేషాలను ఇక్కడ పొందుపరిచారు. విమాన ప్రయాణికులకు అవసరమైన సమాచారాన్ని అందించేలా విమానయాన సంస్థలు కస్టమర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి.మహా కుంభమేళా యాప్ కుంభమేళాను వీక్షించేందుకు గూగుల్ ప్రత్యేక మ్యాప్‌ను సిద్దం చేసింది. బ్రిడ్జి, ఆశ్రమం, ఎరీనా రోడ్డు మొదలుకుని జాతరనంతా ఈ యాప్‌లో చూడొచ్చు. ఇది గూగుల్ పేస్టోర్, యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. దేవాలయాల లోకేషన్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రదేశాలకు సంబంధించిన సమాచారమంతా ఇందులో పొందుపరిచారు.మొత్తమ్మీద 40 కోట్ల దాకా భక్తులు రావచ్చని తొలుత భావించారు. కానీ శని, ఆదివారాల్లో ఏకంగా 25 లక్షల మంది చొప్పున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం విశేషం! దాంతో 45 రోజుల్లో మేళాకు వచ్చే భక్తులు 50 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని యూపీ సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా జనవరి 29న ఒక్క మౌనీ అమావాస్య నాడే ఏకంగా 5 కోట్ల మందికి పైగా పోటెత్తే అవకాశం ఉంది! ఇంతటి మహా క్రతువును సజావుగా నిర్వహించేందుకు కేంద్రం సహకారంతో సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. దాదాపు రూ.7,000 కోట్లు వెచ్చించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. :::ప్రయాగరాజ్ త్రివేణి సంగమం నుంచి సాక్షి ప్రతినిధి -
ఆపరేషన్ మిల్కీపూర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్‌లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్‌సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. 2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది. కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్‌లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్‌లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్‌లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్‌లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్‌లో 5,500 మంది యువతకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు. మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్‌వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
మేళాకు వేళాయె
సాక్షి, న్యూఢిల్లీ: అశేష జనవాహినితో భగవన్నామ స్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పుణ్యస్నానాలనగరి, త్రివేణి సంగమస్థలిలో మహాకుంభమేళాకు భక్తకోటి బారులుతీరింది. భక్తిపారవశ్యంతో పోటెత్తే కోట్లాది మందికి ‘మహా కుంభమేళా’ప్రాంతంలో విడిదిసహా రాకపోకలు, ఇతర సౌకర్యాల కోసం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 40కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో సకల సౌకర్యాలపై రాష్ట్ర సర్కార్ దృష్టిసారించింది. మహా కుంభమేళాకు వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. అధునాతన ప్రపంచ ఆధ్యాత్మిక ఘట్టంగా మహా కుంభమేళా నిలిచిపోయేలా యోగీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశం నలుమూలల నుంచి మహాకుంభ మేళాకు వచ్చే భక్తులు www. irctctourism.com తోపాటు www. upstdc. co. in వెబ్సైట్లో విడిది, ఇతర టూర్ ప్యాకేజీల కోసం బుక్ చేసుకునే ఏర్పాట్లు చేశారు. తెలుగు ప్రాంతాల నుంచి రైళ్లు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కుంభమేళా సమీప రైల్వేస్టేషన్లకు 50 రోజుల్లో మొత్తంగా 10,000 సాధారణ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ, సికింద్రాబాద్‌ల నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళా జరిగే ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి రైల్వేశాఖ రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లు ప్రయాగ్‌రాజ్ చెయోకీ రైల్వేస్టేషన్ వరకు వెళతాయి. మరికొన్ని ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్ వరకు వెళుతున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా ఒకే ఒక్క విమాన సౌకర్యం ఉంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచి విమానంలో వెళ్లే వారు హైదరాబాద్‌లో ఇదే విమానం ఎక్కాల్సి ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగే ప్రాంతానికి వేల కొద్దీ ఆటోలు, క్యాబ్‌లు, ద్విచక్రవాహనాలు, రిక్షా సౌకర్యాలు ఉన్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. వెలసిన టెంట్ సిటీ: మహాకుంభ మేళా జరిగే ప్రాంతంలో ఉండేందుకు రైల్వేశాఖకు చెందిన ఐఆర్సిటీసీ పలు ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉండాలనుకునే వారు ఠీఠీఠీ. జీటఛ్టిఛ్టిౌuటజీటఝ.ఛిౌఝ వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చు. చెక్ ఇన్ టైం మధ్యాహ్నం 12గంటలకు, చెక్ అవుట్ టైం మరుసటి రోజు ఉదయం 10గంటలుగా నిర్ణయించారు. టెంట్ అయితే రూ.18,000, విల్లా అయితే రూ.20,000 ధర నిర్ణయించారు. ‘ఐఆర్సిటీసీ మహాకుంభ్ గ్రామ టెంట్ సిటీ’పేరుతో బస సౌకర్యం అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. స్నానాల గది, వేడి, చల్లటి నీరు, కుంభమేళాను వీక్షించేందుకు ఎల్ఈడీ టీవీ, ఏసీ సౌకర్యాలూ అందిస్తున్నారు. ఒక టెంట్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉండేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకసారి బుకింగ్ పూర్తయ్యాక రద్దు చేసుకుంటే బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వరు. రూ.1500తో కూడా ఉండొచ్చు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సైతం బస ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసింది. ఒక్క రాత్రి విడిదికి రూ.1,500 నుంచి రూ.35,000 ధరలో వేర్వేరు రకాల భిన్న బస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విల్లా అయితే ఇద్దరు ఉండేందుకు రోజుకు రూ.35,000 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు వ్యక్తికి మరో రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. మహారాజా విభాగంలో ఇద్దరికి రూ.24,000, అదనంగా మరో వ్యక్తి బసచేయాలంటే మరో రూ.6,000 చెల్లించాలి. స్విస్ కాటేజ్ కేటగిరీలో ఇద్దరు భక్తులకు కలిపి రూ.12,000, అదనంగా మరో వ్యక్తి బసచేస్తే రూ.4,000 చెల్లించాలి. ఈ సౌకర్యాల కోసం www.upstdc.co.in వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చులో యాత్ర ముగించాలనుకునే వారికీ ఆయా ప్రాంతాల్లో రూ.1500కే బస ఏర్పాట్లు ఉన్నాయి. హోటల్స్, లాడ్జిలు బస నిమిత్తం రోజుకు రూ.1500 నుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. స్థానికుల ఇళ్లల్లో బసకూ ప్రభుత్వం అనుమతించింది. హోం స్టేకి కూడా రూ.500 నుంచి రూ.10వేల వరకు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. క్యారవాన్‌లో సైతం బస ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఒక్కో క్యారవాన్ 8మందికి అనుమతి ఇస్తోంది. ఒక్క రోజుకు రూ.18,000 వసూలు చేస్తున్నారు. రోజుకు 350 కిలోమీటర్లు ఈ క్యారవాన్‌లో ప్రయాణించొచ్చు. అంతకు మించితే ఒక్కో కిలోమీటర్‌కు రూ.70 వసూలు చేయనున్నారు. ఎక్కడైనా ఓ గంటపాటు నిలిపి ఉంచితే మాత్రం ఒక్కో గంటకు రూ.700 చెల్లించాలి. వీటితో పాటు గంగా నదిలో పడవ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ బోటు అయితే ఒక్కో వ్యక్తికి రూ.5,000, మినీ క్రూయిజ్ బోట్ అయితే ఒక్కో భక్తుడి నుంచి రూ.900 వసూలుచేయనున్నారు. యోగాసనాలకూ అవకాశం ప్రయాగ్‌రాజ్‌లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్య యోగా టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. దీనికి ఒక్కో వ్యక్తి రూ.500 చార్జ్ చేస్తున్నారు. యోగా టూర్ ప్యాకేజీలో భాగంగా ఉదయం 6గంటలకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ నుంచి టూర్‌ను ప్రారంభించి ‘రహీ త్రివేణి’కి తీసుకెళ్తారు. 6.30గంటలకు నైనీలోని అరైల్ వద్ద యమునా నది ఒడ్డున ఉన్న త్రివేణి పుష్ప్, పర్మార్త్ నికేతన్ అనే ఆకర్షణీయమైన ప్రాంతాలను చూపిస్తారు. 9.30గంటల నుంచి 10.30గంటల వరకు యోగా, ధ్యానం చేసుకోవచ్చు. విరామం, విశ్రాంతిలో భాగంగా మధ్యాహ్నం ఒంటి నుంచి 2 గంటలకు భోజన సౌకర్యాలు కల్పిస్తారు. 3 గంటల నుంచి 4.30 గంటల మధ్య యోగా, ధ్యానం, సాయంత్రం 5.30గంటలకు సంగం హారతి సదుపాయం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఫ్లోటింగ్ రెస్టారెంట్ వద్దకు తీసుకురావడంతో టూర్ ముగుస్తుంది. రూ.5,000 ప్యాకేజీలో బోట్ సౌకర్యం, పానీయాలు, అల్పాహారం, భోజనం, పర్యావరణహిత చేతి సంచులు, నీళ్ల సీసాలు, కుంభమేళా మ్యాప్‌లు ఉచితంగా ఇస్తారు.వీవీఐపీల డిజిటల్ భద్రత బాధ్యత కాన్పూర్ ఐఐటీకి భక్తుల సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశాయి. సాంకేతిక పరిజ్ఞానంతో మహాకుంభలో భద్రతను పటిష్టం చేశారు. పుణ్య స్నానమాచరించడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశాలకు చెందిన వీవీఐపీలు ప్రయాగ్‌రాజ్ రానున్నారు. దీంతో వీవీఐపీల డిజిటల్ భద్రతను సమీక్షించే బాధ్యతను ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాన్పూర్ ఐఐటీకి అప్పగించింది. మేళాలో వీవీఐపీల భద్రతలో ఐఐటీ కాన్పూర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ పర్యవేక్షణలో పది మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తల బృందం డిజిటల్ భద్రతను పరిశీలిస్తోంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీతో సహా అత్యాధునిక సాంకేతికతను వీవీఐపీల భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. మహాకుంభ్ జరిగే ప్రాంతాల్లో వివిధ చోట్ల సెన్సర్లను, స్కానర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది. డిజిటల్ భద్రతకు సంబంధించిన పనులను కాన్పూర్ ఐఐటీ బృందం రెండు నెలల క్రితమే మొదలెట్టింది. -
Kannauj: రైల్వే స్టేషన్లో కూలిన నిర్మాణం.. శిథిలాల కింద పలువురు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. ఇప్పటివరకు 12 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్(DM) శుభ్రాంత్ కుమార్ శుక్ల్ తెలిపారు. కన్నౌజ్ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 35 మంది కూలీలు అక్కడ ఉన్నట్లు సమాచారం.ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. -
మీరట్‌లో దారుణం
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. దంపతులు, వారి 8 ఏళ్లలోపు ముగ్గురు కుమార్తెలు దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది. పాత గొడవలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇటీవలే మొయిన్ అలియాన్ మోయినుద్దీన్(52), అస్మా(45)దంపతులు అద్దెకు దిగారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అఫ్సా(8), అజిజా(4), అడీబా(1)ఉన్నారు. మొయిన్ దంపతులు బుధవారం నుంచి కనిపించకపోవడంతో అస్మా సోదరుడు షమీమ్, మొయిన్ సోదరుడు సలీ వారుండే ఇంటికి వచ్చి చూడగా బయట తాళం వేసి ఉంది. శుక్రవారం అతికష్టమ్మీద ఇంటి పైకప్పును తొలగించి, లోపలికి వెళ్లి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి. పడుకునే మంచానికి ఉన్న అరలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కుక్కి ఉండగా దంపతులను బెడ్‌షీట్‌లో చుట్టి పడేశారు. వీరి కాళ్లు కట్టేసి ఉన్నాయి. షమీమ్, సలీమ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అస్మా చిన్న మరదలు, ఆమె ఇద్దరు సోదరులతోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో అనుమానితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనే కావొచ్చని పోలీసులు తెలిపారు. -
మహా కుంభమేళాలో తెలుగు కీర్తి
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు సర్వం సన్నద్దమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో ఈనెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు అంటే 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగరాజ్ వేదికగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దమయ్యాయి. ఇందులో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపూరి, సిత్రియా తదితర నాట్యాలతో పాటు సంగీత కచేరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకాళాకారులను ఎంపిక చేశారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. పద్మశ్రీ, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి, పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత దీపికా రెడ్డి, ఎస్ఎన్ఏ అవార్డు గ్రహీత కళాకృష్ణ మహా కుంభమేళాలో నృత్య ప్రదర్శన చేయనున్నారు. ‘శివోహం’తో ఆనంద ‘శివోహం’ ఇతివృత్తంతో లక్షలాది మంది భక్తులను అలరించనున్నారు పద్మశ్రీ గ్రహీత ఆనంద శంకర్ జయంత్. దశబ్థాలుగా భరతనాట్యంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న ఆనంద శంకర్ జయంత్ 144 ఏళ్ల మహా కుంభమేళాలో తెలుగు వారిలో తొలి ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘గణేశ తాళనం, స్కంధ మయుర, దేవీ ఉపాసకం, శివోహం’లపై 45 నిమిషాల పాటు 17మంది నృత్య కళాకారులతో కలిసి ఆమె నాట్యమాడనున్నారు. ఇటువంటి మహోత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడం అనేది జన్మధన్యంగా భావిస్తున్నారు భారతనాట్య నృత్య కళాకారిణి ఆనంద శంకర్ జయంత్. ‘శివసతాయం’తో దీపికా రెడ్డి ‘కూచిపూడి కళ కోసం జీవితాన్ని అంకితం చేశా’అనే మాట ముమ్మాటికీ నిజం అంటారు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్’దీపికా రెడ్డి. నాట్యమే ఊపిరిగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ఆమె తన ప్రదర్శనను ఇవ్వనున్నారు. ‘శివ సతాయం’అనే థీంతో దాదాపు 50 నిమిషాల పాటు 12మంది నృత్య కళాకారులతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. ఈ నృత్యం ద్వారా గంగ అవతరణ, గంగ ద్వారా అందరికీ మంచి జరగాలనే కాన్సెప్ట్‌తో ఈనెల 26వ తేదీన దీపికా రెడ్డి మహా కుంభమేళాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘శివపల్లవి’తో కళాకృష్ణ తెలుగు సాంప్రదాయ నృత్యాలైన ఆంధ్ర నాట్యం, పేరిణి వంటి వాటిలో ప్రపంచస్థాయిలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కళాకారుడు కళాకృష్ణ. ఎస్ఎన్ఏ అవార్డుతో పాటు, రాష్ట్రప్రభుత్వం పలు అవార్డులతో ఆయనను సత్కరించింది. 24.02.2025 న మహా కుంభమేళాలో ‘శివపల్లవి’థీంతో ఐదుగురుతో కలిసి ప్రదర్శన చేయనున్నారు. గంగ, పంచముఖస్త్రోత్రాలు, నీలకంఠ మహాదేవ కీర్తన ఈ మూడు అంశాలను 30 నిమిషాల్లో కళ్లకు కట్టినట్లుగా తన అపారమైన అనుభవంతో కుంభమేళాలో భక్తులను అలరించనున్నారు. ‘నమామి గంగే’తో పద్మజా రెడ్డి కూచిపూడి నృత్యంతో కళాప్రపంచంలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజా రెడ్డి ఈ మహాకుంభా మేళాలో నృత్యప్రదర్శన చేయనున్నారు. దాదాపు 3వేలకు పైగా ప్రదర్శనలు ఇచి్చన పద్మజా రెడ్డి ‘ప్రణవ్’ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మందికి నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు. 10.02.2025న 30 నృత్యకళాకారులతో కుంభమేళాలో ‘నమామి గంగే’అనే థీంతో ప్రదర్శన చేయనున్నారు. ఇటీవల కాలంలో గంగానది కలుíÙతానికి గురైంది, గంగను ఎలా పరిరక్షించుకోవాలి, భావితరాలకు గంగ ప్రాముఖ్యతను వివరించాలనే అంశాలపై సుమారు గంట పాటు ‘నమామి గంగే’అనే ఇతివృత్తంతో అక్కడ ప్రదర్శన ఇవ్వనున్నారు. -
ఐఏఎస్ కల నుంచి సాధ్వీ గౌరీ గిరి దాకా...
ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం అది. నిక్కీ అని ముద్దుగా పిలుచుకునే చెల్లెలు ప్రాచీతో కలిసి ఆడుకోవడమంటే 13 ఏళ్ల అక్క రాఖీ సింగ్‌కు మహా ఇష్టం. పాఠశాలలోనూ చక్కని చదువరి. పెద్దయ్యాక ప్రజాసేవ చేయాలనేది ఆమె కల. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆమె ఆశయం. స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్కాలేజీలో 9వ తరగతి చదువుతూ స్కూళ్లో పాఠ్యాంశాలతోపాటు రామయణ, భాగవతాది ఇతిహాసాలపైనా అనర్గళంగా మాట్లాడేది. హిందూ మతంపై అచంచల విశ్వాసం ఉన్న రాఖీసింగ్ దుర్గాదేవిని బాగా పూజించేది. దేవీ శరన్నవరాత్రుల కాలంలో చెప్పుల్లేకుండానే నడిచిందని స్కూల్ యాజమాన్యంలోని అధికారి పీసీ శర్మ చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని దౌలీ పట్టణం ఈమె స్వస్థలం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి చూపే రాఖీ హఠాత్తుగా తాను సన్యాసినిగా మారతానని చెప్పినా తల్లిదండ్రుల్లో ఎలాంటి కలవరపాటు లేదు. ఆధ్యాత్మిక భావాలున్న తమ పెద్దకూతురు నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దీంతో జనవరి 19వ తేదీన జునా అఖాడాలో చేరి సాధ్వీగా మారేందుకు రాఖీ సిద్ధమైంది. ఆమెను పిండదాన్ క్రతువు తర్వాత గౌరీ గిరిగా పేరు మార్చి అఖాడాలో చేర్చుకుంటామని అఖాడా పెద్ద మహంత్ కౌషాల్ గిరి చెప్పారు. మలుపు తిప్పిన మహాకుంభమేళా తండ్రి సందీప్ సింగ్ ధాకరా, తల్లి రీమా సింగ్‌లతో కలిసి గత ఏడాది డిసెంబర్లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రాంతానికి వెళ్లింది. అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. ప్రాపంచిక సుఖాలకు దూరంగా నిరాడంబరంగా గడుపుతున్న సాధువుల జీవనశైలిని చూసి ఆకర్షితురాలైంది. ఐఏఎస్ అధికారిగా ప్రజల కష్టాలను తీర్చే బదులు ఆధ్యాత్మిక బోధనల ద్వారా ప్రజల మానసిక సమస్యలు తీర్చడం ముఖ్యమని భావించింది. బాహ్య ప్రపంచ కష్టాల కడలిని ఈదలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను తన ఆధ్యాత్మిక బోధనలతో సాంత్వన చేకూరుస్తానని, సాధ్విగా తన వంతు సాయం చేస్తానని రాఖీసింగ్ చెప్పింది. డిసెంబర్ 26వ తేదీన తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వాళ్లు అందుకు అంగీకరించి సెక్టార్20 ప్రాంతంలోని మహంత్ కౌషాల్ గిరి ఆశ్రమంలో చేరి్పంచారు. కన్యాదానం నుంచి సాధ్వి దాకా 13 ఏళ్ల రాఖీ నడవడికను స్వయంగా గమనించిన అఖాడా పెద్దలు ఆమెను సన్యాసినిగా స్వీకరించేందుకు అంగీకరించారు. గురుగ్రామ్ నుంచి మహంత్ రాగా ఆయన సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ జనవరి ఆరో తేదీన తల్లిదండ్రులు ఆశ్రమానికి రాఖీని కన్యాదానం చేశారు. ఆరోజున అఖాడాలు ఆమెకు గౌరి అని నామకరణం చేశారు. కూతురు సన్యాసినిగా మారుతుండటంపై తల్లి రీమా స్పందించారు. ‘‘మా కుటుంబం గత నాలుగేళ్లుగా ఆధ్యాత్మిక మార్గంలోనే పయనిస్తోంది. మహంత్ మేముండే ప్రాంతంలో భాగవతం విశేషాలను అందరికీ విడమరిచి చెప్పేవారు. ప్రయాగ్‌రాజ్ వెళ్లినప్పుడు రాఖీ తన మనసులోని మాట చెప్పింది. అది ఆమె నిర్ణయం కాకపోవచ్చు. భగవత్ సంకల్పం అనుకుంటా. ఆశ్రమంలో ఎందుకు చేర్పించారని బంధువుల నుంచి ఎన్నో ప్రశ్నలు. అయినా తల్లిగా నా బిడ్డ అక్కడ ఎలా ఉండగలదు? ఏం తింటుంది? అనే భయం నాకూ ఉంది. కానీ ఆమె నిర్ణయం దైవేచ్ఛ కాబట్టి మేం కూడా అడ్డుచెప్పలేదు’’అని తల్లి రీమా అన్నారు. సుదీర్ఘంగా క్రతువు సనాతన ధర్మ ప్రకారం సాధ్విగా మారితే ఆ అమ్మాయి కేశసంరక్షణపై ధ్యాస పెట్టకూడదు. జుట్టంతా ఉండలు కట్టినా పట్టించుకోవద్దు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించాలి. సాధ్వి గా మారే రోజున ఐదుగురు సాధువులు ఇచ్చిన ఐదు పవిత్ర పత్తిదారాలను స్వీకరించాలి. సన్యాసుల అన్నపానాలు, దీక్షా నియమాలను పాటించాలి. ప్రేమ, రాగద్వేషాలు, కామామోహాలను త్యజించాలి. మహాకుంభమేళాలో నాలుగో పవిత్ర పుణ్యస్నానాల రోజున అంటే జనవరి 19వ తేదీన పిండదాన్ క్రతువులో భాగంగా గౌరీని వేదమంత్రోచ్ఛారణల మధ్య గంగానదిలో 108 సార్లు ఓం నమఃశివాయ అని చదివిస్తూ ముంచుతారు. తర్వాత గంగాదేవికి హారతి ఇచ్చాక గౌరీ గిరిగా కొత్త పేరుతో పిలుస్తారు. ఇటీవల మరికొందరూ.. ఇటీవలికాలంలో భారత్‌లో ఎంతోమంది సాధారణ జీవితానికి స్వస్తిపలికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఆరంభించారు. ఇందులో టీనేజర్లూ ఉన్నారు. సూరత్‌లో వందల కోట్ల ఆస్తులున్న వజ్రాల వ్యాపారి గారాలపట్టి, 8 ఏళ్ల దేవాన్షీ సంఘ్వీ సైతం సన్యాసినిగా మారింది. జైన్ సాధ్విగా కొత్త జీవితాన్ని ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి ఘటన ఇంకోటి గుజరాత్‌లోనే జరిగింది. హిమ్మత్‌నగర్‌లో నిర్మాణరంగంలో వ్యాపారం చేస్తూ రూ.200 కోట్ల ఆస్తులు కూడబెట్టిన భవేశ్ భాయ్ భండారీ దంపతులు సన్యాసులుగా మారారు. అంతకుముందే అంటే 2022లోనే వీళ్ల టీనేజీ కుమారుడు, కుమార్తె సన్యాసులుగా మారడంతో వీళ్ల బాటలనే తల్లిదండ్రులు పయనించడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తప్పు స్పెల్లింగ్‌తో నకిలీ కిడ్నాప్ గుట్టు రట్టు
లక్నో: ఓ ఫేక్ కిడ్నాప్ కేసును ఉత్తరప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఒక ఇంగ్లీష్ పదానికి రాంగ్ స్పెల్లింగ్ రాసిన క్లూతో కేసు అసలు గుట్టును రట్టు చేశారు. ఈ నకిలీ కిడ్నాప్ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో జరిగింది. జిల్లాకు చెందిన సందీప్ (27) తాను కిడ్నాప్ అయినట్లు నాటకమాడి,రూ.50వేలు ఇవ్వాలని తన సోదరుడిని డిమాండ్ చేస్తూ వేరే ఫోన్ నుంచి మెసేజ్ పెట్టాడు.సోదరుడికి పంపిన బెదిరింపు మెసేజ్‌లో డబ్బులు ఇవ్వకుంటే సందీప్‌ను చంపేస్తామని రాసిన చోట డెత్ అనే పదాన్ని తప్పుగా(deathబదులుdeth)అని రాశాడు. ఈ మెసేజ్ నిశితంగా పరిశీలించిన పోలీసులు దానిని పంపిన వ్యక్తి అంతగా చదువుకోని వ్యక్తి అని నిర్ణయానికి వచ్చారు. పైగా సందీప్‌కు శత్రువులు ఎవరూ లేకపోవడంతో అనుమానం బలపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా సందీప్ ఆచూకీ గుర్తించారు.కిడ్నాప్ విషయమై సందీప్‌ను విచారించారు. విచారణ సందర్భంగా ఆ బెదిరింపు మెసేజ్‌ను రాయమని సందీప్‌ను కోరారు. దీంతో సందీప్ మరోసారి ‘డెత్’ అనే పదాన్ని తప్పుగా రాయడంతో కిడ్నాప్ నాటకమాడింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డబ్బుల కోసం తానే ఈ నాటకం ఆడానని, ఓ పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి ఈ పని చేశానని పోలీసులకు చెప్పాడు. ఇదీ చదవండి: పెళ్లికి సాయం చేస్తానని పిలిచి -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాలు, రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో కోల్డ్ వేవ్ కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు తెలిపారు. పొగమంచు కారణంగా 37 విమానాలు, పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.ఢిల్లీలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. ఢిల్లీని నగరం అంతటా పొగమంచు కమ్ముకుంది. చల్లటి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా దృశ్యమానత తగ్గింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. చాలా దట్టమైన పొగమంచుతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. బుదవారం ఉదయం ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు తెలిపింది. మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రత 10.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇదిలా ఉండగా, ఢిల్లీలో బుధవారం ఉదయం ఆరు గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 326గా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ‘చాలా పేలవమైనది’గా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏక్యూఐ గత కొన్ని రోజులుగా పడిపోయిన విషయం తెలిసిందే. ఇక, పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 37 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, మంగళవారం కూడా పొగమంచు కారణంగా దాదాపు 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచినట్టు అధికారులు వెల్లడించారు.#WATCH | Uttar Pradesh: Taj Mahal disappears in a blanket of thick fog in Agra as winter season intensifies across North India. pic.twitter.com/vq3bXPWNK3— ANI (@ANI) January 8, 2025 #WATCH | Delhi: Flight operations are normal at the Indira Gandhi International Airport amid the fog situation in the city pic.twitter.com/t11Nie6D21— ANI (@ANI) January 8, 2025#WATCH | Uttar Pradesh: Winter season further intensifies in North India. People sit by a bonfire in Moradabad to keep themselves warm. A thin layer of fog seen in the city this morning. pic.twitter.com/lO7kqUZoA6— ANI (@ANI) January 8, 2025మరోవైపు.. ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు వణికిపోతున్నారు. #WATCH | Delhi | A layer of fog engulfs the national capital as winter's chill intensifies in Northern IndiaVisuals from India Gate and surrounding areas pic.twitter.com/BzRbPF361T— ANI (@ANI) January 8, 2025#WATCH | Chandigarh city covered in a thin layer of fog this morning with the minimum temperature being 11 temperature, as per IMD. pic.twitter.com/TQHgHmtlq9— ANI (@ANI) January 8, 2025 -
మహా కుంభమేళా@ 144
మహా కుంభమేళా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు.. 45 రోజులపాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 40 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారని అంచనా. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళా రికార్డుకెక్కింది. సాధారణంగా కుంభమేళాను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ ఏడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరుగబోతున్న మహా కుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళా ఎలా మొదలైంది? కుంభమేళా మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసిన విషయం తెలిసిందే. సముద్రం నుంచి ఒక కుంభం(కుండ)లో అమృతం పైకి తేలింది. అమృతం రాక్షసుల చేతికి దక్కకూడదన్న ఉద్దేశంతో మహా విష్ణువు ఈ కుంభాన్ని తన ఆ«దీనంలో ఉంచుకున్నారు. అసురులు ఆయనను వెంబడించారు. మహా విష్ణువు అమృతభాండంతో ముందుకు పరుగులు తీస్తుండగా, కొన్ని అమృతం చుక్కలు నాలుగు చోట్ల పడిపోయాయి. అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ నాలుగు రకాల కుంభమేళాలు ⇒ కుంభమేళా(నాలుగేళ్లకోసారి) ⇒ అర్ధ కుంభమేళా(ఆరేళ్లకోసారి) ⇒ పూర్ణ కుంభమేళా(12 ఏళ్లకోసారి) ⇒ మహా కుంభమేళా(144 ఏళ్లకోసారి)ఏడాదికోసారి మాఘమేళా ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి సంవత్సరం మాఘ మేళా జరుగుతుంది. దీనిని ‘చోటా కుంభ్’ అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకా రం జనవరి–ఫిబ్రవరిలో ఈ మాఘమేళా నిర్వహిస్తారు. మహా కుంభమేళాలో షాహీ స్నానాల తేదీలు ⇒ జనవరి 13: పుష్య పూరి్ణమ స్నానం ⇒ జనవరి 15: మకర సంక్రాంతి స్నానం ⇒ జనవరి 29: మౌని అమావాస్య స్నానం ⇒ ఫిబ్రవరి 3: వసంత పంచమి స్నానం ⇒ ఫిబ్రవరి 12: మాఘ పూర్ణిమ స్నానం ⇒ ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం ఏ మేళా ఎప్పుడంటే..కుంభమేళా: ఈ వేడుక దేశంలో నాలుగుచోట్ల (హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్) నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదులు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తద్వారా పాప విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షిప్రా నది, మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉన్నాయి. అర్ధ కుంభమేళా: ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లో ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది. పూర్ణ కుంభమేళా: ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గ్రహగతుల ఆధారంగా పూర్ణ కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివస్తారు. మహా కుంభమేళా: 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. అంటే 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. మహా కుంభమేళాలను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా అఖాడాలు, నాగా సాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమలు జరుగుతాయి. మరో మహాకుంభమేళా కోసం 144 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. కొందరు తమ జీవిత కాలంలో మహా కుంభమేళాను చూడలేకపోవచ్చు కూడా. -
కుంభమేళాలో ముస్లింల మతమార్పిడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘‘ హిందూ కార్యక్రమంలో ముస్లింల మతమార్పిడి తంతు జరగబోతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఒక లేఖ రాశా. ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దే’’ అని బరేల్వీ అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామగ్రిని కొనుగోలుచేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిలభారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చి తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ముస్లిం, ఇతర మతాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ మరోలా స్పందించారు. ‘‘ముస్లింలు కుంభమేళా పరిసరాలకు వెళ్లినా ముస్లింలకు వచ్చే నష్టమేమీలేదు. ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీన స్థాయిలో ఇస్లాం లేదు’’ అని అన్నారు. -
‘కాస్గంజ్’ కేసులో 28 మందికి యావజ్జీవం
లక్నో: సంచలనం సృష్టించిన కాస్గంజ్ హింసాకాండ కేసులో 28 మంది దోషులకు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.80 వేల చొప్పున జరిమానా చెల్లించాలని దోషులను ఆదేశించింది. న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2018 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో నిర్వహించిన తిరంగా యాత్రలో హింస చోటుచేసుకుంది. మత కలహాలు చెలరేగాయి. తిరంగా యాత్రను కొందరు అడ్డుకున్నారు. యాత్రలో పాల్గొన్న చందన్ గుప్తా అనే వ్యక్తిని కాల్చి చంపారు. దీంతో హింస మరింత ప్రజ్వరిల్లింది. కాస్గంజ్ మూడు రోజులపాటు అట్టుడికిపోయింది. ఈ ఉదంతం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. చందన్ గుప్తాను హత్య చేయడంతోపాటు హింసకు కారణమైన దుండుగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడడం, జాతీయ జెండాను అవమానించడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ప్రభుత్వం అప్పగించింది. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు గురువారం 28 మందిని దోషులుగా తేల్చింది. శుక్రవారం శిక్ష ఖరారు చేసింది. నసీరుద్దీన్, అసీమ్ ఖురేషీ అనే నిందితులపై తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా గుర్తించింది. -
గ్రీన్ ఆర్మీ
ఉత్తరప్రదేశ్‌లో గతంలో ‘గులాబ్ గ్యాంగ్’ ఘనత విన్నాం. ఇప్పుడు ‘గ్రీన్ ఆర్మీ’. స్త్రీల మీద జరిగే దురాగతాలను స్త్రీలే ఉమ్మడిగా ఎదిరిస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. వారణాసిలో క్రియాత్మకంగా ఉన్న ‘గ్రీన్ ఆర్మీ’ మహిళా బృందాన్ని ప్రధాని మోదీ ఇటీవలి మన్‌కీ బాత్‌లో ప్రశంసించారు.వాళ్లంతా ఒక 50 మంది ఉంటారు. ఆకుపచ్చ చీరలో, చేతి కర్రతో వరుసగా నడుస్తూ ఊళ్లోకి వస్తారు. ఇక ఊళ్లోని మగాళ్లకు గుండె దడే. భార్యలను కొట్టేవాళ్లు, తాగుబోతులు, పేకాట రాయుళ్లు, మత్తు పీల్చేవాళ్ళు, కట్నం కోసం వేధించేవాళ్లు... ఎక్కడికక్కడ సెట్‌రైట్ కావాల్సిందే. ఎందుకంటే వారు ‘గ్రీన్ ఆర్మీ’. అందరి స్క్రూలు టైట్ చేసే ఆర్మీ. అందుకే మొన్నటి ‘మన్ కీ బాత్’లో వీరి గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘వీరి ఆత్మనిర్భరతకు, కృషికి అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలిపారు. దాంతో గ్రీన్ ఆర్మీలో కొత్త జోష్ వచ్చింది.వారణాసి చుట్టుపక్కలగ్రీన్ ఆర్మీ 2014లో పుట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్న రవి మిశ్రా వారణాసి చుట్టుపక్కల పల్లెల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఉత్తర జిల్లాలలో గృహ హింస ఎక్కువగా ఉందని గమనించాడు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే వారు ఆత్మరక్షణ చేసుకోగలరని అనుకున్నాడు. కొందరు విద్యార్థులతో కలిసి నిర్మలాదేవి అనే గృహిణిని గృహ హింసను ప్రతిఘటించమని కోరాడు. రైతు కూలీగా ఆమె సంపాదించేదంతా ఆమె భర్త లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు. నిర్మాలా దేవి విద్యార్థుల స్ఫూర్తితో ఆత్మరక్షణ నేర్చుకుంది. అంతేకాదు గ్రామంలోని మరికొంతమందిని జమ చేసింది. అందరూ కలిసి ఇక గృహ హింసను ఏ మాత్రం సహించమని ఎలుగెత్తారు. అంతేకాదు.. కర్ర చేతబట్టి మాట వినని భర్తలకు బడితె పూజ చేశారు. నిర్మలాదేవి భర్త దారికొచ్చాడు. దాంతో గ్రీన్ ఆర్మీ పేరు వినపడసాగింది.270 పల్లెల్లో...వారణాసిలో, చుట్టుపక్కల జిల్లాల్లో ఇప్పుడు 270 గ్రామాల్లో గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు ఉన్నారు. 2000 మంది స్త్రీలు ఇందులో భాగస్వాములు. ప్రతి ఊరిలో ఇరవై నుంచి యాభై మంది స్త్రీలు ఆకుపచ్చ చీరల్లో దళంగా మారి క్రమం తప్పక ఇంటింటికీ వెళ్లి సమస్యల ఆచూకీ తీస్తారు. వాటికి పరిష్కారాలు వెదుకుతారు. స్త్రీల మీద చెయ్యెత్తడం అనేది వీరు పూర్తిగా ఊళ్లల్లో నిర్మూలించారు. ఇక తాగుడు పరిష్కారం కోసం తాగుబోతులకు కౌన్సెలింగ్ ఇవ్వడంప్రారంభించారు. పేకాట, డ్రగ్స్కైతే స్థానమే లేదు. గ్రీన్ ఆర్మీతో స్థానిక పోలీస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఎవరైనా గ్రీన్ ఆర్మీకి ఎదురు తిరిగితే పోలీసులు వచ్చి చేయవలసింది చేస్తారు. వరకట్న సమస్య ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ‘మీకు కట్నం ఎందుకు ఇవ్వాలి... సరంజామా ఎందుకివ్వాలి’ అని గ్రీన్ ఆర్మీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దాంతో గొంతెమ్మ కోరికలు పూర్తిగా తగ్గాయి. ఇచ్చింది పుచ్చుకుంటున్నారు.ఆడపిల్లే అదృష్టంకొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఆడపిల్ల పుడితే శోకం వ్యక్తం చేస్తారు. ఏడుస్తూ గుండెలు బాదుకుంటారు. కాని గ్రీన్ ఆర్మీ బయలుదేరి ఈ శోకానికి ముగింపు చెప్పింది.‘ఆడపిల్ల అంటే లక్ష్మీ అని ఇంటికి భాగ్యమనీ బాగా చదివిస్తే సరస్వతి అని, శక్తిలో దుర్గ అని... ఆడపిల్లను మగపిల్లాడితో సమానంగా చూడాల’ని ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు రక్షణగా నిలబడ్డారు. ఇవన్నీ సాంఘికంగా చాలా మార్పు తెచ్చాయి. అందుకే ఒక్కరు కాకుండా సమష్టిగా ప్రయత్నిస్తే విజయాలు వస్తాయి. గ్రామీణ జీవితంలో స్త్రీలకు ఇంకా ఎన్నో ఆటంకాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కర్రచేత బట్టి ఆర్మీగా మారకపోయినా స్త్రీలు సంఘాలు ఏర్పరుచుకుంటే సమస్యలు దూరం కాకపోవడం ఉండదు. గ్రీన్ ఆర్మీ ఇస్తున్న సందేశం అదే. -
అంకుల్.. మొత్తం కుటుంబాన్ని చంపేశా..!
లక్నో: తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్కు చెందిన అర్షద్.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్ చేసి చెప్పాడు.అర్షద్ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్మీన్(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.ఆ నీచుడికి మరణశిక్ష వేయాల్సిందే..ఇంత దారుణానికి ఒడిగట్టిన అర్షద్‌కు మరణశిక్ష వేయాల్సిందేనని అస్మా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అస్మా సోదరుడు మహ్మద్ జీషాన్ మాట్లాడుతూ.. ఆ కిరాతకుడ్ని వదలొద్దని పోలీసులకు విన్నవించాడు. తన సోదరిని, మేనకోడల్ని చంపిన నీచుడ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దన్నాడు. ‘ అదే రోజు వారిని చంపేసిన తర్వాత నాకు ఫోన్ చేశాడు.అంకుల్ మొత్తం ఫ్యామిలీని చంపేశా’ అంటూ తనకు ఫోన్ చేసినట్లు జీషన్ చెప్పుకొచ్చాడు. నా సోదరితో మాట్లాడి నాలుగు నెలలు అయ్యింది. కూతుళ్లతో కలిసి ఆమె చాలా సింపుల్ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. అటువంటి కుటుంబాన్ని హతమార్చిన అర్షద్‌ను వదలకండి. అతనికి వేసే శిక్ష చాలా తీవ్రంగా ఉండాలి’ అని జీషన్ కన్నీటి పర్యంతంతో పోలీసుల్ని వేడుకున్నాడు.కుటుంబ పెద్ద సహకారం కూడా ఉందా?ఇంతటి దారణమైన హత్యల కేసులో కుటుంబ పెద్దగా ఉన్న అర్షద్ తండ్రి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబాన్ని చంపేసిన ఘటనలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు అర్షద్ స్పష్టం చేసినట్లు ప్రాథమిక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. -
అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్
‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నా సోదరీమణులు చనిపోతున్నారు. కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతాను. మాకు జరిగిట్టుగా భారతదేశంలోని ఏ కుటుంబం కూడా వేధింపుల బారిన పడకుండా చూడాలి. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాతైనా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. రాజకీయ నాయకులు, పోలీసులతో వారికి సంబంధాలున్నాయి. మా స్థలంలో సగం లాక్కున్నారు. మరో సగం కూడా గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు’- యూపీ రాజధాని లక్నోలో ఐదుగురు కుటుంబ సభ్యులను కిరాతంగా హత్య చేసిన అర్షద్(24) మాటలివి. తన తండ్రి సహాయంతో తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను అర్షద్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను హత్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించాడు.చెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేకనే..ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ పట్టణం అర్షద్ స్వస్థలం. తమ పొరుగున్న వారు, ల్యాండ్ మాఫియాతో కలిసి వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్షద్ వెల్లడించాడు. తనను, తన తండ్రిని కుట్రపూరితంగా దొంగ కేసుల్లో ఇరికించి.. తమ చెల్లెళ్లను అమ్మేయాలని చూశారని అతడు ఆరోపించాడు. దీంతో తన చెల్లెళ్లను చంపుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. వేధింపులు భరించలేక ఒక దశలో తామంతా మతం మారాలనుకున్నామని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అభ్యర్థించాడు. మాకెవరూ అండగా నిలబడలేదు‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మా అమ్మ, నా చెల్లెళ్లను నేనే చంపాను. నేను మాట్లాడిన ఈ వీడియో పోలీసులుకు దొరికినప్పుడు స్థానికులే బాధ్యులని వారికి తెలుస్తుంది. మా ఇంటిని కబ్జా చేసేందుకు నానారకాలుగా వేధించినా మేము గట్టిగా ప్రతిఘటించాం. కానీ మాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఇల్లు వదిలిపెట్టి 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయాం. పిల్లలు చలిలో తిరగడం మాకు ఇష్టం లేదు. కబ్జాకోరులు మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పత్రాలు మా దగ్గరే ఉన్నాయ’ని అర్షద్ తన వీడియోలో తెలిపాడు.ఈ హత్యలకు బాధ్యులు వారే..తమ కుటుంబ నాశనానికి రాణు, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ అనే వ్యక్తులు కారణమని అర్షద్ ఆరోపించాడు. బంగ్లాదీశీయులమని తమపై అసత్య ప్రచారం చేశారని వాపోయాడు. ‘వాళ్లు ల్యాండ్ మాఫియా. ఆడపిల్లలను అమ్మేస్తారు. నన్ను, మా నాన్నను తప్పుడు కేసులో ఇరికించి.. మా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మేయాలని ప్లాన్ చేశారు. వాళ్ల బారిని నుంచి తప్పించడానికి మాకు మార్గం మరో లేకుండా పోయింది. అందుకే మా నాన్న సహకారంతో నా సోదరీమణులను గొంతు, మణికట్టు కోసి బలవంతంగా చంపాల్సి వచ్చింది. వారి గౌరవాన్ని కాపాడటానికి మాకు ఇంత కంటే మార్గం తోచలేదు. నేను ఉదయం వరకు జీవించి ఉండకపోవచ్చు. మా స్థలాన్ని ప్రార్థనాలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాల’ని అర్షద్ తెలిపాడు. తన వీడియోలో తల్లి, చెల్లెళ్ల మృతదేహాలను చూపించాడు.చదవండి: ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్షకొనసాగుతున్న విచారణహోటల్ శరణ్‌జిత్‌లో ఐదుగురు మహిళల హత్యలు జరిగాయని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీసు కమిషనర్ రవీనా త్యాగి తెలిపారు. ఘటనా స్థలంలోనే నిందితుడు అర్షద్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని చెప్పారు. -
పాకిస్తాన్ ప్రేమికురాలి కోసంసరిహద్దులు దాటిన యూపీ వాసి
లక్నో: సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆపైన ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రియుడు యూపీ వాసి కాగా ప్రియురాలు పాకిస్తానీ. ఆమెను పెళ్లి చేసుకునేందుకు దొంగచాటుగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లాడు. ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అక్కడి పోలీసులకు దొరికిపోయి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. యూపీలోని అలీగఢ్ జిల్లా నగ్లా ఖట్కారి గ్రామానికి చెందిన ప్రియుడు బాదల్ బాబు(30) కథ ఇది. పాక్ ప్రియురాలి కోసం ఇప్పటికే ఇతడు 2024 జులైలో ఒక పర్యాయం సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించాడు. బీఎస్ఎఫ్ జవాన్లు ఖఖర్ పోస్ట్ వద్ద ఇతడిని పట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులకు అప్పగించారు. దీంతో తిరిగి సొంతింటికే చేరాడు. తాజాగా రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. సరిహద్దులు దాటి పంజాబ్‌లోని మండి బహాఉద్దీన్ నగరంలో ప్రేమికురాలిని కలుసుకున్నాడు. అయితే, ఎలాంటి ప్రయాణ పత్రాలు, వీసా వంటివి లేకపోవడంతో డిసెంబర్ 27వతేదీన అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడిపై పారినర్స్ చట్టం కింద కేసు పెట్టారు. కోర్టు ఇతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. జనవరి 10వ తేదీన కేసు విచారణకు రానుందని పాక్ అధికారులు వెల్లడించారు. -
లక్నోలో దారుణం.. తల్లి సహా నలుగురు చెల్లెళ్ల హత్య
లక్నో: కొత్త ఏడాది వేడుకల వేళ ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్షద్ అనే వ్యక్తి తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హోటల్ గదిలో దారుణంగా హత్య చేశాడు. వీరి హత్యకు కుటుంబ వివాదాలే కారణంగా నిందితుడు అర్షద్ అంగీకరించినట్టు లక్నో పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని నాకా ప్రాంతంలో ఉన్న హోటల్ శరంజిత్కు అర్షద్(24) సహా కుటుంబ సభ్యులు వెళ్లారు. ఈ క్రమంలో అర్షద్ తన తల్లి, నలుగురు చెల్లెళ్లను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఈ ఘటనపై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు అర్షద్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అర్షద్‌ను విచారించగా.. కుటుంబ వివాదాల కారణంగానే తన తల్లి, నలుగురు చెల్లెళ్లను హతమార్చినట్లు ప్రాథమికంగా అంగీకరించాడు. మరణించిన వారిని తల్లి అస్మా, అలియా (9), అల్షియా (19), అక్సా (16), రహ్మీన్ (18)గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించినున్నట్టు డీసీపీ తెలిపారు.Lucknow, Uttar Pradesh: A murder was reported at Hotel Sharanjeet in Thana Naka.JCP Crime Bablu Kumar says, "We received information about five dead bodies in a hotel room at Naka police station. Immediately, the local police reached the spot, took possession of the bodies, and… pic.twitter.com/N6GmX8HCcU— IANS (@ians_india) January 1, 2025 -
ఐక్యతా మహా కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి నెలన్నర పాటు జరగనున్న మహా కుంభమేళాను ఐక్యత మహాకుంభ్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ‘‘అందరూ కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించాలి. సమాజంలో విద్వేషం, విభజనవాదాల నిర్మూలనకు సంకల్పం తీసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం 117వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మాట్లాడారు. ‘‘దేశమంతా ఏకం కావాలన్న గొప్ప సందేశాన్ని కుంభమేళా ఇస్తోంది. భారీతనంలో కాకుండా భిన్నత్వంలోనే దాని ప్రత్యేకత దాగుంది. అంతటి వైవిధ్యాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడబోం. అవిశ్రాంత గంగా ప్రవాహంలా సమాజమంతా ఒక్కటిగా ఉండాలి’’ అన్నారు. కుంభమేళాలో 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్‌బాట్ సేవలను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ‘ఆయుష్మాన్’తో క్యాన్సర్‌కు చెక్ ‘‘మన దేశంలో 2015–2023 మధ్య మలేరియా కేసులు, మరణాలు 80 శాతం తగ్గినట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. ఇదో గొప్ప విజయం. మన దగ్గర క్యాన్సర్ చికిత్సను సకాలంలో ప్రారంభిస్తుండడం గణనీయంగా పెరిగిందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 90 శాతం మంది క్యాన్సర్ బాధితులు సకాలంలో చికిత్స పొందగలుగుతున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల విదేశీయులు ఆకర్షితులవుతున్నారు. ఫిజిలో తమిళ టీచింగ్ ప్రోగ్రాంకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో విశిష్టమైన ఒలింపిక్స్ జరిగాయి. పేదరికం, కరువు, వలసలకు మారుపేరైన ఒడిశాలోని కలహండిలో కూరగాయల విప్లవం సాగుతోంది’’ అని మోదీ అన్నారు. వచ్చే జనవరి 26న రాజ్యాంగ 75వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. ‘‘ఇది మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం వల్లే ఈ రోజు నేనీ స్థాయికి చేరుకున్నా. మన రాజ్యాంగం ప్రతి సందర్భంలోనూ కాల పరీక్షకు నిలిచింది. దారిదీపంగా, మార్గదర్శిగా ముందుకు నపుడుతోంది’’ అన్నారు.అక్కినేనితో కొత్త శిఖరాలకు తెలుగు సినిమా సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు చేర్చారంటూ మోదీ ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాలు, విలువలను ఆయన సినిమాలు ప్రతిబింబించాయని కొనియాడారు. ‘‘ఈ ఏడాది ఆయనతో పాటు రాజ్ కపూర్, తపన్ సిన్హా, మహ్మద్ రఫీ వంటి సినీ ఉద్ధండుల శత జయంతి వేడుకలు జరగడం హర్షణీయం. సృజనాత్మక రంగంలో మన ప్రతిభా పాటవాలను ప్రపంచానికి తెలిపేలా వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ దాకా ఢిల్లీలో తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ (వేవ్స్) జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి అగ్రశ్రేణి కంటెంట్ క్రియేటర్లు అందులో పాల్గొంటారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్‌లో ఇండియాను కేంద్రస్థానంగా మార్చే దిశగా ఈ సదస్సు మనకు చాలా కీలకం’’ అని తెలిపారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంలో కంటెంట్ క్రియేటర్లు చురుకైన పాత్ర పోషించాలన్నారు. దేశ ప్రజలందరికీ మోదీ నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంగా, సంతోషంగా ‘ఫిట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
భోజనాలపై అసంతృప్తి..పెళ్లికొడుకు షాకింగ్ నిర్ణయం
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో అనూహ్య సంఘటన జరిగింది. చందౌలీ జిల్లాలోని హమీద్పూర్ గ్రామంలో జరిగిన ఈ విచిత్ర పరిణామం అందరినీ షాక్‌కు గురి చేసింది. అసలేం జరిగిందంటే..పెళ్లి కోసం మెహతాబ్ అనే పెళ్లికొడుకు తన బంధు మిత్రులతో కలిసి పెళ్లి కూతురు ఇంటికి వచ్చాడు.పెళ్లి కూతురు తరపు వాళ్లు పెళ్లికొడుకు బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ తమకు ఇక్కడ సరిపడా భోజనాలు లేవని పెళ్లికొడుకు బంధువులు అతడికి ఫిర్యాదు చేశారు. ఇంకేముంది ఆగ్రహానికి గురైన పెళ్లికొడుకు ఏకంగా పెళ్లి పీఠల మీద నుంచి లేచి వెళ్లిపోయాడు.ఇంతటితో ఆగకుండా అదే రోజు రాత్రి తన బంధువైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికొడుకు నిర్ణయంతో అందరూ ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.పెళ్లికూతురు కుటుంబ సభ్యులు మెహతాబ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ప్లాంట్ల విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల తయారీలో ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ప్లాంట్లలో త్రీ–వీలర్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ఆంపియర్, ఈలీ, గ్రీవ్స్, ఈల్ట్రా బ్రాండ్స్‌లో ఎలక్ట్రిక్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తెలంగాణలోని తూప్రాన్, ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా, తమిళనాడులోని రాణిపేట్ వద్ద తయారీ కేంద్రాలు ఉన్నాయి. గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో త్రిచక్ర వాహనాల తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 21,514 యూనిట్ల నుంచి 45,896 యూనిట్లకు, తూప్రాన్ ప్లాంట్‌లో 13,538 నుంచి 34,800 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ‘విస్తరిస్తున్న మార్కెట్‌కు అనుగుణంగా అదనంగా ఉత్పత్తి చేయడానికి, అలాగే కొత్త మోడళ్ల తయారీని కూడా ఈ విస్తరణ అనుమతిస్తుంది’ అని కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది.ఐపీవో ద్వారా వచ్చే నిధులతో..గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గ్రేటర్ నోయిడాలో ఫెసిలిటీ విస్తరణ కోసం రూ.20 కోట్లు, తూప్రాన్ ప్లాంటుకు రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ప్రతిపాదిత ఐపీవో ద్వారా వచ్చే నికర ఆదాయం నుండి ఈ పెట్టుబడులకు నిధులు సమకూర్చనున్నారు. రాణిపేట్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను, గ్రేటర్ నోయిడా కేంద్రంలో ఎలక్ట్రిక్ త్రీ–వీలర్లను, తూప్రాన్ ఫెసిలిటీలో ఎలక్ట్రిక్తోపాటు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ త్రీ–వీలర్లను సంస్థ తయారు చేస్తోంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అనుబంధ సంస్థలు బెస్ట్‌వే ఏజెన్సీస్ గ్రేటర్ నోయిడా కేంద్రాన్ని, ఎంఎల్ఆర్ ఆటో తూప్రాన్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వార్షికంగా 4.80 లక్షల ద్విచక్ర వాహనాల సామర్థ్యం కలిగిన రాణిపేట ప్లాంట్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో కంపెనీకి ప్రస్తుతానికి లేదు.త్రీ–వీలర్ల వాటా 28 శాతం..2023–24లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొత్తం ఆదాయంలో త్రీ–వీలర్ల వాటా 28 శాతం కైవసం చేసుకుంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 13,470 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విక్రయించింది. 2022–23లో ఈ సంఖ్య 6,870 యూనిట్లు. ఆంపియర్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ టూ–వీలర్ వ్యాపారం దాదాపు 68 శాతం వాటాతో ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఆంపియర్ ద్విచక్ర వాహనాల అమ్మకాల పరిమాణం 2022–23లో 1.09 లక్షల యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 47,820 యూనిట్లకు పడిపోయాయి. బెంగళూరుకు చెందిన గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ అనుబంధ కంపెనీయే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్..రాణి పేటలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది 4,00,000 యూనిట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతిపాదిత నూతన కేంద్రాన్ని 2026 మే నెలలో ప్రారంభించనునన్నారు. 2026 జూలైలో వాణిజ్యపరంగా ఉత్పత్తి కార్యకలాపాలను మొదలు పెట్టాలని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ భావిస్తోంది. ఈల్ట్రా బ్రాండ్ పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం రూ.3.80 లక్షల నుండి ప్రారంభం. ప్యాసింజర్స్ లేదా వస్తువులను రవాణా చేయగల రెండు మీడియం స్పీడ్ త్రీ–వీలర్ మోడళ్లను విక్రయిస్తోంది. డీజిల్, సీఎన్జీ త్రీ–వీలర్లు గ్రీవ్స్ బ్రాండ్ ద్వారా రూ.2.90 లక్షల ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఈ బ్రాండ్ కింద నాలుగు మోడళ్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రిక్షా బ్రాండ్ ఈలీ కింద మూడు మోడళ్లు కొలువుదీరాయి. ధరల శ్రేణి రూ.1.30 లక్షల నుండి ప్రారంభం. -
వన్డేలో 407 చే‘దంచేశారు’
వడోదర: భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు లక్ష్యఛేదన నమోదైంది. పురుషుల అండర్–23 వన్డే టోర్నమెంట్లో సూపర్ ‘డబుల్’ ఫామ్‌లో ఉత్తరప్రదేశ్ (యూపీ) బ్యాటర్ సమీర్ రిజ్వీ (105 బంతుల్లో 202 నాటౌట్; 10 ఫోర్లు, 18 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస మ్యాచ్‌ల్లో రెండో అ‘ద్వితీయ’ సెంచరీ సాధించడంతో యూపీ 407 పరుగుల లక్ష్యాన్ని 41.2 ఓవర్లలోనే ఛేదించి దేశవాళీ క్రికెట్ పుటలకెక్కింది.జీఎస్ఎఫ్సీ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సొంతగడ్డపై విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల భారీస్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్ దనిశ్ మాలేవర్ (123 బంతుల్లో 142; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్లో కెపె్టన్ ఫయాజ్ (62 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 197 పరుగులు జోడించారు. తర్వాత జగ్జోత్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా అర్ధసెంచరీ సాధించడంతో విదర్భ 400 పైచిలుకు భారీ స్కోరు చేసింది. అయితే ఈ సంతోషం ప్రత్యర్థి లక్ష్యఛేదనకు దిగడంతోనే ఆవిరైంది. ఓపెనర్లు శౌర్య సింగ్ (42 బంతుల్లో 62; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్వస్తిక్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) 10.4 ఓవర్లలోనే 106 పరుగులు చకచకా జతచేశారు. ఈ మెరుపు శుభారంభం రికార్డు ఛేజింగ్‌కు బాటవేసింది. వన్‌డౌన్ బ్యాటర్ షోయబ్ సిద్దిఖీ (73 బంతుల్లో 96 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రిజ్వీ అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 173 బంతుల్లోనే 296 పరుగులు ధనాధన్‌గా జతచేయడంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 41.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో సమీర్ గత మ్యాచ్‌లో త్రిపురపై కూడా (93 బంతుల్లో 201 నాటౌట్) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను అవుట్ కాకుండా అజేయంగా నిలవడం విశేషం. -
శతక్కొట్టిన షారుఖ్ ఖాన్.. రింకూ సింగ్‌కు షాక్!
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు. విశాఖ వేదికగాకాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.114 పరుగుల భారీ తేడాతో ఘన విజయంఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్లో ఇదే తొలి శతకం కావడం విశేషం.చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు -
నిత్య పెళ్లి కూతురు.. ఏడో పెళ్లికి దొరికి పోయిందిలా!
లక్నో : ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరగుతాయంటారు. అది నాటి మాట. కానీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు డబ్బు కోసం జరుగుతున్నాయనేది నేటి మాట’ అని అర్ధం వచ్చే ఘటన ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి అంటూ యువకుల్ని నమ్మించడం. వారిని పెళ్లి చేసుకున్న అనంతరం డబ్బులు, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న ఓ యువతిని, ఆమె ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల మేరకు.. వధువుగా పూనమ్, ఆమె తల్లిగా సంజనా గుప్తా, విమలేష్ వర్మ ,ధర్మేంద్ర ప్రజాపతి పెళ్లిళ్ల పేరయ్యగా ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లు ముందుగా ఒంటరిగా ఉంటూ వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువకుల్ని గుర్తిస్తారు. అప్పుడే విమలేష్ వర్మ, ధర్మేంద్ర ప్రజాపతిలు రంగంలోకి దిగుతారు. మేం పెళ్లిళ్ల పేరయ్యలం. మీకు సంబంధాలు చూస్తాం. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువవుతుంది. మీకు ఓకే అయితే చెప్పండి. మేం మీకు మంచి అమ్మాయిని వెతికి పెడతాం. అంటూ పక్కా ప్లాన్ ప్రకారం బాధితులకు పెళ్లి కుమార్తెగా పూనమ్, సంజనా గుప్తా తల్లిగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అసలు కథ నడిపిస్తారు. ముందుగా మాట్లాడుకున్నట్లుగా రిజిస్టర్ ఆఫీస్‌లో పూనమ్‌ను ఇచ్చి సదరు యువకుడితో పెళ్లి జరిపిస్తారు. అనంతరం వరుడి ఇంటికి పంపిస్తారు. అదును చూసి వరుడి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువుల్ని అందిన కాడికి దోచుకుంటుంది పూనం. అక్కడి నుంచి.. మారు పేరుతో ప్రాంతాలు మార్చి తిరుగుతుంటారు. అలా ఈ గ్యాంగ్ మాస్టర్ మైండ్ పూనమ్ ఆరుగురిని వివాహం చేసుకుంది. అందరిని అలాగే మోసం చేసింది. ఏడో పెళ్లి చేసుకుందామని చూసింది. కానీ కథ అడ్డం తిరిగి జైలు పాలైంది. శంకర్ ఉపాధ్యాయ్ అనే ఒంటరి యువకుడిని పూనమ్ ముఠా సభ్యుడు విమలేష్ సంప్రదించాడు. అతనికి పెళ్లి చేస్తానని చెప్పాడు. అమ్మాయి బాగా చదుకుంది. మీకు నచ్చితే ఉద్యోగం చేస్తుంది. కాకపోతే ఆ అమ్మాయికి తల్లి తప్ప ఇంకెవరూ లేరు. మీరు ఆ అమ్మాయికి ఎంత కట్నం ఇవ్వాలనుకుంటున్నారో అది మీ ఇష్టం . మాకు మాత్రం పెళ్లి చేసినందుకు రూ.1.5లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని మాట్లాడుకున్నారు. అసలే వయస్సు మీద పడడంతో పెళ్లి చేసుకుందామనే తొందరలో ముఠా డిమాండ్ ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు.గత శనివారం విమలేష్.. శంకర్‌ను ఓ ప్రాంతానికి పిలిచాడు. అక్కడే పూనమ్‌ను పరిచయం చేశాడు. అనంతరం రూ.1.5లక్షలు అడిగారు. దీంతో సదరు గ్యాంగ్‌పై శంకర్‌కు అనుమానం వచ్చింది. ఆమె తల్లిగా నటించిన పూనమ్, సంజనల ఆధార్ కార్డ్‌లు చూపించాలని అడిగారు. దీంతో నిందితులు బండారం బయటపడింది. తనని మోసం చేస్తున్నారని యువకుడు గుర్తించాడు. తాను ఈ పెళ్లి చేసుకోనంటూ ఖరాఖండీగా చెప్పాడు. దీంతో పూనమ్ గ్యాంగ్ బెదిరింపులకు దిగింది. చంపేస్తామని, తప్పుడు కేసుల్లో ఇరికించామని హెచ్చరించారు. భయాందోళనకు గురైన బాధిత యువకుడు తనకు ఆలోచించుకోవడానికి సమయం కావాలంటూ మెల్లగా జారుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదుతో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్టు చేసినట్లు బాందా అదనపు పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్‌కు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సేల్స్, మార్కెటింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళా–2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను దక్కించుకుంది. కుంభ మేళా జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగనుంది. ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా వెండింగ్, అమ్యూజ్మెంట్ జోన్స్, ఫుడ్ కోర్ట్ సహా పలు కార్యకలాపాల హక్కులు సైతం పొందింది. రూ.6,300 కోట్లతో యూపీ ప్రభుత్వం నిర్వహించనున్న ఈ మేళాకు దేశ, విదేశాల నుంచి 50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో జరిగే ఈ మెగా ఈవెంట్ భారత చరిత్రలో అత్యంత గొప్ప కుంభ మేళా అవుతుందని శ్రేయాస్ మీడియా ఫౌండర్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రకటనలు, బ్రాండింగ్‌కు కంపెనీలు సుమారు రూ.3,000 కోట్లు వెచి్చంచే అవకాశం ఉందన్నారు. మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి సంస్థ తనకున్న అపార అనుభవం, అసమాన నైపుణ్యాన్ని ఉపయోగిస్తుందని చెప్పారు. -
ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు.. హెచ్చరికలు జారీ
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం, పొగమంచు కమ్మేసింది. తాజా పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. విజిబులిటి 500 మీటర్లకు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది.ఢిల్లీలో కాలుష్యం, పొగ మంచు కారణంగా విజిబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. దీంతో, వాయు కాలుష్యం సీవియర్ ప్లస్ కేటగిరిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్లో గ్రాఫ్-4 చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌పై ఢిల్లీలో సగటున 448 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొగమంచు, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. వృద్దులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లవద్దని సూచనలు చేసింది.#WATCH | A layer of fog covered parts of Delhi this morning as the minimum temperature dropped to 7°C, as per IMD. Drone visuals from the Akshardham area shot around 7.30 am pic.twitter.com/shhFO3xpRm— ANI (@ANI) December 19, 2024 #WATCH | Uttar Pradesh | A dense layer of fog engulfs Ghaziabad city as the temperature dips to 8°C, as per IMD. pic.twitter.com/wsVLqdVq5o— ANI (@ANI) December 19, 2024మరోవైపు.. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం అక్షర్ధామ్ ఏరియాలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకుంది. దీంతో, దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో, ప్రజలు వణికిపోతున్నారు.#WATCH | Madhya Pradesh | Dense fog and cold wave engulfs Gwalior city as the temperature dips to 7°C, as per IMD. pic.twitter.com/d5tCRWpjdJ— ANI (@ANI) December 19, 2024 -
కెప్టెన్‌గా రింకూ సింగ్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌కు సువర్ణావకాశం వచ్చింది. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2024లో అతడు ఉత్తరప్రదేశ్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రింకూకు ఈ అవకాశం దక్కింది.టీ20 టోర్నీలో అదరగొట్టిన రింకూకాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్ జట్టుకు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. అతడి కెప్టెన్సీలో యూపీ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది. ఇక ఈ టోర్నీలో రింకూ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 152కు పైగా స్ట్రైక్‌రేటుతో 277 పరుగులు చేశాడు.ఇక లిస్ట్-ఏ(వన్డే ఫార్మాట్) క్రికెట్లోనూ రింకూ సింగ్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 57 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఖాతాలో 1899 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ శతకాలు ఉన్నాయి.ఈసారి రింకూ కెప్టెన్సీలో భువీఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ-2024కు ప్రకటించిన జట్టుకు రింకూ సింగ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించిన 19 మంది సభ్యులతో కూడిన జట్టులో సారథిగా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, భువీ ఈసారి కేవలం బౌలర్‌గానే బరిలోకి దిగనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్సీ చేసిన భువనేశ్వర్.. ఆటగాడిగానూ రాణించాడు.ఈ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉండటం విశేషం. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం రింకూ కెప్టెన్సీలో భువీ ఆడనున్నాడు. ఇక యూపీ జట్టులో రింకూ, భువీతో పాటు నితీశ్ రాణా, మొహ్సిన్ ఖాన్, శివం మావి వంటి ఐపీఎల్ స్టార్లు కూడా ఉన్నారు. ఇక ఈ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి ఆరంభం కానుంది.విజయ్ హజారే ట్రోఫీ-2024కు ఉత్తరప్రదేశ్ జట్టురింకూ సింగ్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మాధవ్ కౌశిక్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీశ్ రాణా, అభిషేక్ గోస్వామి, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయాల్, ఆరాధ్య యాదవ్, సౌరభ్ కుమార్, కృతజ్ కుమార్ సింగ్, విప్రాజ్ నిగమ్, మొహ్సిన్ ఖాన్, శివం మావి, అక్విబ్ ఖాన్, అటల్ బిహారీ రాయ్, కార్తికేయ జైస్వాల్, వినీత్ పన్వర్.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’ఇప్పటికైనా చోటిస్తారా?.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ -
ఆలయం బావిలో విగ్రహాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది. అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు. ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్‌లో దారుణం
సాక్షి,హైదరాబాద్: బేగంబజార్ పోలీస్టేషన్ పరిధిలోని తొఫ్ఖానాలో దారుణం జరిగింది. సిరాజ్ అనే వ్యక్తి తన భార్య, చిన్న కుమారుడిని హతమార్చాడు. ఆపై తాను ప్రాణాలు తీసుకున్నాడు.అయితే, తండ్రి తన తమ్ముడి ప్రాణాలు తీస్తుంటే భయాందోళనకు గురైన పెద్ద కొడుకు ఇంటి నుంచి పారిపోయాడు. తండ్రి చేస్తున్న ఘోరాన్ని చూసి తట్టుకోలేక కాపాడండి అంటూ బిగ్గరుగా కేకలు వేశాడు. ఈ దుర్ఘటనపై సమాచారం బేగం బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, మృతుడు మహమ్మద్ సిరాజ్ అలీ,భార్య హేలియ,కుమారుడు హైజాన్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు సిరాజ్ రాసిన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా బాధితులు బతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు నిర్ధారించారు. దేశంలో ప్రతిరోజూ 78 హత్యలు దేశంలో ప్రతిరోజూ 78 హత్యలు జరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. క్రైమ్ ఇన్ ఇండియా-2022 పేరిట విడుదల చేసిన నివేదికలో హత్య కేసుల సంఖ్య 2021లో 29,272 కాగా, 2020లో 29,193కి తగ్గిందని హైలెట్ చేసింది. 2022లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 3,491 హత్యల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్ (2,930), మహారాష్ట్ర (2,295), మధ్యప్రదేశ్ (1,978), రాజస్థాన్ (1,834), పశ్చిమ బెంగాల్ (1,696)లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్సీఆర్బీఐ ప్రకారం.. సిక్కిం (9), నాగాలాండ్ (21), మిజోరాం (31), గోవా (44),మణిపూర్ (47) 2022లో హత్య కేసులు తక్కువగా నమోదయ్యాయి.2022లో అత్యధిక హత్య కేసుల్లో 9,962 కేసులతో వివాదాలే కారణమని డేటా వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,130, తమిళనాడు (1,045), బీహార్ (980), మధ్యప్రదేశ్ (726), ఉత్తరప్రదేశ్ (710) ఈ తరహా కేసులు నమోదయ్యాయి. వివాదాల తర్వాత, 'వ్యక్తిగత పగ లేదా శత్రుత్వం' 2022లో నమోదైన 3,761 కేసులతో జాబితాలో ఉంది. బీహార్ (804), మధ్యప్రదేశ్ (364), కర్ణాటక (353) ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.పైన పేర్కొన్న దారుణల్లో వరకట్నం, మంత్రవిద్య, మానవ అక్రమ రవాణ,మత, కులతత్వం, రాజకీయ కారణాలు, వర్గ ఘర్షణలు, పరువు హత్యలు, ప్రేమ వ్యవహారాలే ప్రధాన కారణమని నిర్ధారించింది. -
డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!
ఐఏఎస్ సాధించటం చాలామంది యువత కల. అయితే కొందరు మాత్రమే ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఎదరయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించగలుగుతారు. అలాంటి కోవకు చెందిందే అలంకృత. డిప్రెషన్ అనేది ఎంత భయానక మానసిక వ్యాధి అనేది తెలిసిందే. దీన్ని అధిగమించడం అంత సులభం కాదు. అలాంటి సమస్యతో పోరాడుతూనే క్లిష్టతరమైన సివిల్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారి అయ్యింది. ఈ క్రమంలో ఆమె చేసిన అలుపెరగని పోరాటం అసామాన్యమైనది. వ్యక్తిగతంగా క్షోభను అనుభవిస్తూనే..తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించి అందర్నీ విస్తుపోయేలా చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన అలంకృత పాండే ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ నుంచి ఇంజనీరింగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేసింది కూడా. ఇంకా ఏదో సాధించాల్సింది మిగిలిపోయిందన్న ఫీల్‌తో 2014లో ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షకు సన్నద్ధం కావాలనుకుంది. అయితే ఆ ఏడాదే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌తో మనో వ్యధను అనుభవించింది. తన స్నేహితులు, కుటుంబసభ్యుల మద్దతతుతో అధిగమించే యత్నం చేసింది. అయితే తీవ్రమైన డిప్రెషన్ ప్రభావంతో..ఆ ఏడాది ఫ్రిలిమ్స్కు హాజరు కావడం కూడా మానుకోక తప్పలేదు. అయినప్పటికీ అలంకృత అంతు చూసేంత వరకు తగ్గేదే లే..అంటూ వెనుకడుగు వేయలేదు. ప్రతిరోజూ ఎనిమిది గంటల పాటు ప్రిపరేషన్ సాగించేలా ప్రణాళిక వేసుకుని మరీ కష్టపడి చదివేది. సరిగ్గా 2015లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆ ఏడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. తొలి పోస్టింగ్ పశ్చిమబెంగాల్ కేడర్ కేటాయించడంతో అక్కడ నుంచి ఐఎఏస్గా బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత తన తోటి ఐఏఎస్ అధికారి అన్షుల్ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె బీహార్‌లో ఐఏఎస్‌గా విధుల నిర్వర్తిస్తోంది. ఇక్కడ అలంకృత డిప్రెషన్‌పై సడలని అలుపెరగని పోరాడటమే ఐఏఎస్ సాధించేలా చేసింది. సడలని స్థిరమైన స్థైర్యంతో కష్టతరమైన సవాళ్లను అధిగమించి అద్భుతాలను సృష్టించొచ్చని చూపించి..ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. సాధించాలన్న దృఢ సంకల్పం ముందు ఎంతటి అనారోగ్య సమస్య అయినా కతం కావాల్సిందే కదూ..!.(చదవండి: బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?) -
అనుజ్ రావత్ ఊచకోత.. సెమీస్‌లో ఢిల్లీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఢిల్లీ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో ఢిల్లీ.. ఉత్తర్ప్రదేశ్పై 19 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (44), యశ్ ధుల్ (42) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. అనంతరం ఆయుశ్ బదోని (25) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడగా.. ఆతర్వాత వచ్చిన అనుజ్ రావత్ చెలరేగిపోయాడు. అనుజ్ కేవలం 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనుజ్ విధ్వంసం ధాటికి యూపీ బౌలర్లు విలవిలలాడిపోయారు. యూపీ బౌలర్లలో మొహిసిన్ ఖాన్, వినీత్ పన్వర్, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు.194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ.. ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేయడంతో 174 పరుగలకే ఆలౌటైంది. ప్రిన్స్ యాదవ్ 3, ఆయుశ్ బదోని, సుయాశ్ శర్మ చెరో 2, ఇషాంత్ శర్మ, సిమ్రన్‌జీత్ సింగ్, హర్ష్ త్యాగి తలో వికెట్ పడగొట్టారు. యూపీ ఇన్నింగ్స్‌లో ప్రియం గార్గ్ (54) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సమీర్ రిజ్వి 26, భువనేశ్వర్ కుమార్ 20 పరుగులు చేశారు. టీమిండియా ఆటగాడు రింకూ సింగ్ (10), నితీశ్ రాణా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.సెమీస్‌లో బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ఇవాళ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. బరోడా, ముంబై, ఢిల్లీ, మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరాయి. డిసెంబర్ 13న జరిగే తొలి సెమీఫైనల్లో బరోడా, ముంబై.. అదే రోజు జరిగే రెండో సెమీఫైనల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. -
భార్య కేసు పెట్టిందని.. 40పేజీల డెత్‌నోట్ రాసి
బనశంకరి: భార్య తనపై కేసు పెట్టిందనే ఆవేదనతో భర్త 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ (35) మారతహళ్లి మంజునాథ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తాడని సమాచారం. ఇతని భార్య గొడవపడి యూపీలో పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.కుమార్తెకు కానుక కొనుగోలుఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్‌నోట్ రాసి, పలు రకాల డాక్యుమెంట్లను జత చేసి ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. తన ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఏయే పనులు జరిగాయి, పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందులో రాశాడు. చివరి క్షణంలో తన నాలుగేళ్ల కుమార్తె జ్ఞాపకం రావడంతో ఒక కానుకను కొనుగోలు చేసి ఉంచాడు. దానిని ఆమెకు ఇవ్వాలని రాశాడు. ఈ డెత్‌నోట్‌ను సుప్రీంకోర్టుకు పంపాలని కోరాడు.3 రోజుల నుంచి సన్నాహాలుగత మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. డే1, డే 2, డే3 ఏమేం చేయాలి అనేది ఇంట్లో బోర్డు మీద కాగితాల్లో రాసి అతికించాడు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలి అని గుర్తు చేసుకున్నాడు. ఇక న్యాయం జరగడమే మిగిలి ఉంది అని ఆంగ్లంలో రాశాడు. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యూపీలోని భార్య, కుటుంబానికి సమాచారం అందించారు. అతడు సున్నిత మన స్కుడని, కుటుంబ గొడవల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడని, అందువల్లే ఇలా చేశాడని పలువురు నెటిజన్లు సానుభూతి తెలిపారు. -
ఆంధ్ర అవుట్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్ రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), విప్రాజ్ నిగమ్ (8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. ఆంధ్ర మీడియం పేసర్ కేవీ శశికాంత్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రింకూ, విప్రాజ్ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్రాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్డీఎన్వీ ప్రసాద్ (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు), కేవీ శశికాంత్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. శ్రీకర్ భరత్ (11 బంతుల్లో 4), అశ్విన్ హెబ్బర్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్), షేక్ రషీద్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), రికీ భుయ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), త్రిపురాన విజయ్ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్ ఖాన్, శివమ్ మావిలకు ఒక్కో వికెట్ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడతాయి. -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) జరిగిన రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్లో యూపీ ఆంధ్రప్రదేశ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు విప్రాజ్ నిగమ్ (ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిగమ్‌ను 50 లక్షలకు కొనుగోలు చేసింది) ఆల్‌రౌండ్ షోతో (4-0-20-2, 8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి యూపీని గెలిపించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్డీఎన్వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు. కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు డిసెంబర్ 11న జరుగనున్నాయి. -
వీడు మాములోడు కాదు.... ఖతర్నాక్!’ ఇదొక ఎమోషనల్ క్రైం స్టోరీ
ఓ ప్రొఫెషనల్ కిల్లర్ చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్పైడర్‌మ్యాన్ మాదిరి జంప్ చేసి రైలెక్కుతాడు. ఆ రైల్లో ‘బేసిక్‌గానే బ్యాడ్ జాతకం’ ఉన్న ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంటి నుంచి చిన్నప్పుడే పారిపోయిన ఆ వ్యక్తి.. తిరిగి కుటుంబాన్ని కలుసుకునే ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. ఇంతలో బుల్లెట్ ప్రాణం ఆ వ్యక్తి తీసేస్తుంది. దీంతో అసలు పార్థు బదులు ‘అతడు’ బాసర్లపూడికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో సినిమా కథ.. కానీ, ఇక్కడ నిజజీవితంలో కొడుకు కాని కొడుకు ఒకడు ఓ కుటుంబాన్ని మోసం చేయాలనుకున్న తీరు గురించి తెలిస్తే.. మీరు కూడా ‘వీడు మాములోడు కాదు.. ఖతర్నాక్’ అనుకోవడం ఖాయం!.ఊరు: యూపీ ఘజియాబాద్ స్థలం: ఖోడా పోలీస్ స్టేషన్.. తేదీ నవంబర్ 21, టైం.. సరిగ్గా తెలియదు.మూడు పదుల వయసులో ఉన్న ఓ వ్యక్తి పీఎస్‌కు వచ్చాడు. తనను చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని.. కన్నవాళ్లకు దూరమై ఇన్నాళ్లు నరకయాతన అనుభవించానని.. వాళ్ల కోసం ఎక్కడెక్కడో తిరిగానని.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసులను బతిమిలాడాడు. ఆ కన్నీళ్లకు పోలీసులు జాలిపడ్డారు. బట్టలు, చెప్పులు కొనిచ్చి.. తిండి పెట్టి స్టేషన్లోనే ఉండనిచ్చారు. ఈలోపు అతనిచ్చిన సమాచారంతో మీడియాలో, సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రయత్నం ఫలించి చివరకు ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది.అది 1993 సంవత్సరం.. తేదీ సెప్టెంబర్ 08సమయం: పిల్లలు బడుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంస్కూల్ నుంచి షాహిబాబాద్(ఢిల్లీ)లోని ఇంటికి తన సోదరితో బయల్దేరిన ఏడేళ్ల రాజును.. ఎవరో బలవంతంగా తమ వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి పరుగున వచ్చి అన్నను ఎవరో ఎత్తుకెళ్లారని ఇంట్లో విషయం చెప్పింది. ఆందోళనతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టారు. లాభం లేకపోయింది. అయితే అటు కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేకపోవడం.. పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలం కావడంతో ఇన్నేళ్లుగా ఆ కేసు ఓ మిస్టరీగానే ఉండిపోయింది.చివరకు.. ఇన్నేళ్ల తర్వాత తానే ఆ రాజునంటూ ఓ వ్యక్తి వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. తనను రాజస్థాన్‌కు తీసుకెళ్లి హింసించారని, ఓ ఇంట్లో బంధించి పనులు చేయించుకున్నారని, ఆ ఇంట్లో ఓ పాప తనకు ధైర్యం చెబుతూ వచ్చిందని, ఎలాగోలా తప్పించుకుని ఊరు దాటానని, ఇన్నేళ్లు ఏవేవో పనులు చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగానని.. కన్నీళ్లతో చెప్పాడు రాజు. హనుమాన్ దయవల్లే తాను బతికి బట్టకట్టానని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పాడు. ఆ మాటలతో చలించిపోయిన వాళ్ల అమ్మ.. అతన్ని అక్కున చేర్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంలో అంతా మునిగిపోయారు. అక్కడి మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఈ ఎమోషనల్ రీయూనియన్ మీద వరుసబెట్టి కథనాలు ఇచ్చింది. ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందనుకునేరు!.ఇంటికి చేరుకున్నవాడు తిన్నగా ఉంటే ఫర్వాలేదు. కానీ, ఆస్తుల గురించి, ఇంట్లో దాచిన బంగారం.. డబ్బు గురించి పదే పదే ఆరా తీయడం మొదలుపెట్టాడట. దీంతో వారం తిరగకముందే ఆ కుటుంబం మళ్లీ ఘజియాబాద్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. అనుమానాల నడుమ.. డీఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే అతను వాళ్ల కొడుకే కాదని తేలింది. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. తమ స్టైల్ ఇంటరాగేషన్ చేసి నిజాలు కక్కించారు.రాజస్థాన్‌కు చెందిన రాజు అలియాస్ భీమ్ అలియాస్ ఇంద్రరాజ్ అలియాస్.. చిన్నప్పటి నుంచే దొంగతనం అలవర్చుకున్నాడు. బంధువుల ఇళ్లను సైతం వదల్లేదు. దీంతో వాళ్ల శాపనార్థాలు భరించలేక ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఊరూరా తిరుగుతూ చోరీలు చేస్తూ పోయాడు. ఈ క్రమంలో.. అతనికో ఆలోచన వచ్చింది.తన ఐడెంటిటీని మార్చుకుంటూ ఊర్లు తిరగసాగాడు. తన తల్లి చనిపోయిందని, తాను అనాథనంటూ పని కావాలంటూ.. ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు అతన్ని చేరదీసేవారు. అయితే చెప్పాపెట్టకుండా ఏదో ఒక రాత్రి.. ఆ ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా.. ఇప్పటిదాకా 9 కుటుంబాలను అతను మోసం చేసినట్లు ఘజియాబాద్ పోలీసులు నిర్ధారించారు.ఈ క్రమంలో.. ఘజియాబాద్‌లో ఓ ధనికుల కుటుంబంలో పిల్లాడు.. చిన్నవయసులోనే ఇంట్లోంచి పారిపోయాడని తెలుసుకున్నాడు. పోలీసులనే ఏమార్చి ఆ ఇంటికి కన్నం వేయాలనుకున్నాడు. కానీ, చివరకు అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నాడు ఈ కొడుకు కాని కొడుకు.गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है#Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU— JAN TV (@JANTV2012) December 7, 2024 Video Credits: JAN TV -
గాల్లో బాలిక ప్రాణాలు
లఖింపూర్‌ఖేరీ (యూపీ): ఆ 14 ఏళ్ల బాలిక జాతరకు వెళ్లింది. సరదాగా జెయింట్ వీల్ ఎక్కింది. అది కాస్తా పూర్తిగా పైకి వెళ్లాక 150 అడుగుల ఎత్తులో ఉండగా బాలిక ఉన్నట్టుండి అదుపు కోల్పోయింది. తన కేబిన్ నుంచి విసురుగా బయటికొచ్చింది. అయినా వీల్ ఆడకుండా తిరుగుతూనే ఉంది. దాంతో కిందనుంచి చూస్తున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు. అంతటి విపత్కర పరిస్థితిలోనూ పాప చురుగ్గా స్పందించింది. క్యాబిన్ కిందివైపున్న మెటల్బార్ను గట్టిగా పట్టుకుంది. దాన్ని కరుచుకుని కదలకుండా ఉండిపోయింది. ఆపరేటర్లు హుటాహుటిన జెయింట్ వీల్‌ను ఆపేశారు. అది నెమ్మదిగా తిరుగుతుండగా బాలికను కిందకు వచ్చింది. వెంటనే తనను అందుకుని దించి కాపాడారు. 30 సెకన్లకు పైగా బాలిక మెటల్బార్ను పట్టుకుని గాల్లోనే వేలాడింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ సమీపంలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భద్రతా ప్రమాణాలు పాటించలేదంటూ అధికారులు జెయింట్ వీల్‌ను సీల్ చేశారు. -
పదవికి ఎసరు పెట్టిన కొడుకు పెళ్లి.. బీఎస్పీ సీనియర్ నేత సస్పెండ్
లక్నో: అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్న కొడుకు పెళ్లి.. తన పొలిటికల్ కేరీర్‌ను దెబ్బకొట్టింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కారణమైంది. ఇందుకు కారణం.. తనకు కాబోయే కోడలు మరో పార్టీ నాయకుడి కూతురు కావడమే. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే త్రిభువన్ దత్ కుమార్తెతో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సీనియర్ నాయకుడు సురేంద్ర సాగర్ తన కుమారుడితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ పార్టీకి చెందిన నేతతో వియ్యం అందుకోవడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి సీరియస్ అయ్యారు. తక్షణమే సురేంద్ర సాగర్‌పై చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. క్రమశిక్షణ చర్యల కింద ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి ఓ లేఖను ఇచ్చారు.ఈ సందర్భంగా సురేంద్ర సాగర్ స్పందిస్తూ.. పార్టీ వ్యతిరేక చర్యలకు నేను పాల్పడలేదు. ఎమ్మెల్యే త్రిభువన్ కూతురితో నా కుమారుడికి వివాహం జరిపించడం నేరమా?. నేను ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సురేంద్ర కుమార్.. బరేలీ డివిజన్లో బీఎస్పీకి కీలక నేతగా ఉన్నారు. రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా ఐదుసార్లు పనిచేశారు. క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2022 ఎన్నికల్లో మిలాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి సాగర్ పోటీ చేసి ఓడిపోయారు.ఇక, ఆయన వియ్యంకుడు మాజీ ఎంపీ త్రిభువన్ దత్ ప్రస్తుతం అంబేద్కర్ నగర్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. బీఎస్పీ మాయావతి ఇలాంటి నిర్ణయం మొదటిసారేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే పార్టీలో వచ్చినప్పుడు మాజీ డివిజనల్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ గౌతమ్‌ను సస్పెండ్ చేశారు. -
ఉన్నావ్ కేసు.. నిందితుడికి రెండు వారాల మద్యంతర బెయిల్
లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీ హైకోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు రెండు వారాల మెడికల్ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
సంభాల్ అల్లర్ల వెనుక పాక్ ప్రమేయం?!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల అంశం యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే.. ఈ దాడులకు సంబంధించి షాకింగ్‌కు గురి చేసే విషయం ఒకటి ఫోరెన్సిక్ దర్యాప్తులో వెలుగు చూసింది. హింసకు ఉపయోగించిన ఆయుధాలపై మేడ్ ఇన్ పాక్ గుర్తులు బయటపడడంతో.. వీటి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ హింసాకాండలో పాకిస్తాన్‌కు చెందిన క్యాట్రిడ్జ్‌లు గుర్తించింది దర్యాప్తు బృందం(సిట్). నవంబర్ 24వ తేదీన కోట్ గర్వీ అల్లర్లు జరిగిన చోట.. ఐదు ఖాళీ షెల్స్, రెండు క్యాట్రిడ్జ్‌లను(మిస్ ఫైర్ అయినవే) ఫోరెన్సిక్స్ టీం సేకరించింది. అవి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి తయారైనవేనని నిర్ధారణ అయ్యిందని ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. మరోవైపు.. పాక్‌కు చెందిన ఆయుధాల జాడ కనిపించడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోందని సంభల్ ఎస్పీ కృష్ణ కుమార్ బిష్ణోయ్ అంటున్నారు. అదే టైంలో.. ఈ హింసాకాండలో భాగమైన వాళ్ల కోసం గాలింపు ఉధృతం చేశామని వెల్లడించారాయన.ఘటనా స్థలంలో.. సుమారు 90 నిమిషాల పాటు ఫోరెన్సిక్ తనిఖీలు కొనసాగాయి. పాక్‌తో పాటు అమెరికాకు చెందిన క్యాట్రిడ్జ్‌లు లభ్యమయ్యాయి. అలాగే అల్లర్లకు ఉపయోగించిన మందు సామగ్రి పాకిస్తాన్లో తయారైనట్లు తేలింది. దీంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు 12 బోర్ షెల్స్, రెండు 32 బోర్ షెల్స్ ఉన్నాయి. మరింత పరిశీలనకు.. మున్సిపల్ శాఖకు ఆ ప్రాంతంలో శుభ్రం చేయొద్దని సిట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు ముమ్మరం ద్వారానే పాక్ ప్రమేయంపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. పొలిటికల్ హీట్ఘర్షణల దృష్ట్యా యూపీ సర్కార్ డిసెంబర్ 10వ తేదీ వరకు సంభాల్‌లో నిషేదాజ్ఞలు అమలు చేస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీలు సంభాల్ పర్యటనకు వెళ్తుండగా.. ఘాజీపూర్ దగ్గర కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని ఇద్దరూ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో.. వారు ఢిల్లీ వెళ్లకుండానే తిరిగి ప్రయాణమయ్యారు.ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రాంతంలో నవంబర్ చివరివారంలో హింసాకాండ చోటుచేసుకుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న ప్రాంతంలోనే ఆలయం ఉందని గతంలో హిందూ పిటిషనర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై కోర్టు విచారించి సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్వే చేస్తున్న సమయంలో కొంతమంది అడ్డుకోవడంతో పాటు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి.. 400 మందిని గుర్తించామని, ఇందులో 33 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. -
సంభల్ ఉద్రిక్తతలు.. తిరిగి ఢిల్లీ ప్రయాణమైన రాహుల్, ప్రియాంక
పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం ‘మేం సంభల్ వెళ్లేందుకు పోలీసులు మమ్మల్ని అనుమతించట్లేదు. అడ్డుకుంటున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లే హక్కు నాకు ఉంది. ఇతర నేతలతో కాకుండా ఒంటరిగా వెళ్లేందుకూ నేను సిద్ధమే. పోలీసులతో కలిసి వెళ్లేందుకైనా సిద్ధమే. కానీ, వారు అందుకు అంగీకరించడం లేదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు.అటు వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘బాధితులను కలిసే హక్కు రాహుల్‌కు ఉంది. ఆయనను అనుమతించాలి’’ అని డిమాండ్ చేశారు. అయినా, పోలీసులు వారిని అనుమతించలేదు. దీంతో చేసేదేం లేక.. కాంగ్రెస్ నేతలు అక్కడినుంచి వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన రాహుల్ ప్రియాంకదాదాపు 2 గంటల తర్వాత ఢిల్లీకి పయనమైన నేతలుసంభల్ సందర్శనకు అనుమతి లేదని అడ్డకున్న పోలీసులు ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న ప్రియాంక, రాహుల్ఘాజీపూర్లో వీరి కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు.ఢిల్లీ టు సంభల్ మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులుఘాజీపూర్ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు #WATCH | Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police at the Ghazipur border on the way to violence-hit Sambhal. pic.twitter.com/EcPEOFahIV— ANI (@ANI) December 4, 2024న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ అల్లర్ల ప్రాంతాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా బయలుదేరారు. సంభాల్‌లోని మసీదులో సర్వే కారణంగా చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించనున్నారు. రాహుల్, ప్రియాంక వెంట ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు ప్రతినిధి బృందం కూడా ఉన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని 10 జనపథ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.#WATCH | Visuals from Ghazipur border where Lok Sabha LoP & Congress MPs Rahul Gandhi, Priyanka Gandhi Vadra and other Congress leaders have been stopped by Police on the way to violence-hit Sambhal. pic.twitter.com/eqad86lxr0— ANI (@ANI) December 4, 2024 ఢిల్లీ నలుమూలలా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీ–సంభల్ మార్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘాజీపూర్ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే సంభల్‌లో శాంతిభద్రతల దెబ్బతిన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆ ప్రాంతానికి చేరుకోకుండా ఆడ్డుకునే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా బయటి వ్యక్తులను ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనుమతించబోమని పోలీసులు, జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల సమాజ్ వాదీ పార్టీ ఎంపీల ప్రతినిధి బృందం జిల్లాలోకి ప్రవేశించకుండా నిలిపివేశారు. ఇక నిషేధాజ్ఞలను డిసెంబర్ 31 వరకు పొడిగించారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా గౌతమ్ బుద్ధ్ నగర్, ఘజియాబాద్ పోలీసు కమీషనర్లకు.. అమ్రోహా, బులంద్‌షహర్ పోలీసు సూపరింటెండెంట్లకు లేఖ రాశారు. రాహుల్ సోనియా గాంధీలను ఆపాలని లేఖలో కోరారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మాట్లాడుతూ.. కనీసం నలుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సంభాల్‌కు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.కాగా సంభల్‌లోని షాహీ జామా మసీదు ఉన్న స్థలంలో దేవాలయం కొందని కొందరు హిందూ పిటిషనర్లు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. స్థానికులు, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, అధికారుల వాహనాలకు నిప్పంటించారు. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దీంతో సంభల్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు స్థానిక సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్, మరో 700 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.. -
Kumbh Mela: కుంభమేళాలో పాల్గొన్న ప్రధానులు వీరే
ప్రయాగ్‌రాజ్: వచ్చే ఏడాది(2025) జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలిరానున్నారు.స్వాతంత్య్రానంతరం కుంభమేళాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా పాల్గొంటున్నారు. నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సమయాల్లో జరిగిన కుంభమేళాలలో పాల్గొంటూవస్తున్నారు. ताकि सनद रहे : पहले प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू भी कुंभ में स्नान कर चुके हैं और जनेऊ भी धारण किए हुए हैं।#KumbhMela2019 pic.twitter.com/06DUeCHBwr— Vinod Kapri (@vinodkapri) January 18, 2019పండిట్ జవహర్లాల్ నెహ్రూ (1951)భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కుంభమేళాను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. నెహ్రూ 1951లో జరిగిన కుంభమేళాకు హాజరయ్యారు.ఇందిరా గాంధీభారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా కుంభమేళా నిర్వహణకు సహకారం అందించడమే కాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కుంభమేళాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.అటల్ బిహారీ వాజ్‌పేయి (2001)అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఆయన పాల్గొన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు. కుంభమేళా ఘనంగా నిర్వహించేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయి విశేష కృషి చేశారు.నరేంద్ర మోదీ (2019)2019లో జరిగిన కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ గంగాస్నానం చేసి, ఈ కార్యక్రమం భారతీయ సంస్కృతికి విశిష్ట చిహ్నంగా అభివర్ణించారు. కుంభమేళాలో పరిశుభ్రత, మెరుగైన వసతుల కల్పనపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు.త్రివేణీ సంగమం కేంద్రంగా..ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరిగే మహాకుంభమేళాలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం చేయనున్నారు. ఈ సారి కుంభమేళాను మరింత ఘనంగా నిర్వహించేందుకు యూపీ సర్కారు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.అలరించనున్న సాంస్కృతి కార్యక్రమాలుగాయకుడు, స్వరకర్త శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, సోనూ నిగమ్, విశాల్ భరద్వాజ్, రిచా శర్మ, శ్రేయా ఘోషల్ తదితరులు తమ గానమాధుర్యంతో భక్తులను అలరించనున్నారు. కుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.శంకర్ మహదేవన్ సంగీత కార్యక్రమంజనవరి 10న ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన పాటలతో అలరించనున్నారు. జానపద గాయని మాలినీ అవస్థి జనవరి 11న తన సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. జనవరి 18న గాయకుడు కైలాష్ ఖేర్ ప్రదర్శన ఉండవచ్చని సమాచారం. జనవరి 19న సాయంత్రం సోనూ నిగమ్ తన గానంతో మ్యాజిక్ చేయనున్నారు. జనవరి 20న ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, జనవరి 31న కవితా పౌడ్వాల్, ఫిబ్రవరి 1న విశాల్ భరద్వాజ్, ఫిబ్రవరి 2న రిచా శర్మ, ఫిబ్రవరి 8న జుబిన్ నౌటియల్, ఫిబ్రవరి 10న రసిక శేఖర్, ఫిబ్రవరి 10న హన్స్‌రాజ్ రఘువంశీ, ఫిబ్రవరి 14న శ్రేయా ఘోషల్ తదితరులు తమ మధురమైన స్వరంతో భక్తులను అలరించనున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
దృష్టిలోపం ఉన్న వారికోసం అధునాతన ఏఐ కళ్లద్దాలు
లఖీంపూర్‌ఖేరీ(ఉత్తరప్రదేశ్): అజ్ఞానాంధకా రంలో మగ్గిపోతున్న వారికి అక్షరజ్ఞానం పంచితే వారి జీవితం వెలుగులమయం అవుతుందని పెద్దలంటారు. అంధత్వం లేకపోయినా తీవ్రస్థాయిలో దృష్టిలోపంతో బాధపడే వాళ్ల ప్రపంచం ఒక రకంగా చీకటిమయం. వారి ప్రపంచాన్ని వెలుగుమయం చేసేందుకు ఓ యువకుడు బయల్దేరాడు. వినూత్న ఆవిష్క రణలు చేస్తూ తీవ్ర దృష్టిలోప బాధితులకు అండగా నిలబడ్డారు. అధునాతన కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించారు. స్మార్ట్ నీళ్లసీసా, నేలసారాన్ని కొలిచే స్మార్ట్ పరికరం తయారుచేసి ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన 28 ఏళ్ల మునీర్ ఖాన్ తాజాగా ‘ఏఐ విజన్ ప్రో’ పేరిట కొత్తరకం కళ్లజోడును సృష్టించాడు.ఈనెల 17న ఐఐటీ ముంబైలో జరిగిన టెక్‌ఫెస్ట్‌లో దీనిని ఆవిష్కరించారు. ‘‘ తీవ్ర దృష్టిలోపం ఉన్న వాళ్లు కృత్రిమ మేధతో పనిచేసే ఈ కళ్లద్దాలు ధరిస్తే తమ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసు కోవచ్చు. సెన్సార్లు, కెమెరాలు, ఎన్విడి యా జెట్సాన్ ప్రాసెసర్లు, లీడార్ సాంకేతికత, ఏఐ మోడల్ కంప్యూటేషన్లతో ఇది పనిచేస్తుంది. కళ్లద్దాల ముందున్న అంశాలను రియల్‌టైమ్‌లో సంగ్రహించి, ధరించిన వారికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది ధరిస్తే ఎదుటి వారి ముఖాలను గుర్తు పట్టొచ్చు. అనారోగ్యం వేళ వేసుకోవాల్సిన మందులు, ఆహారం మధ్య తేడాలను చెప్తుంది. నడిచేటప్పుడు దారిలో అడ్డుగా ఏవైనా ఉంటే హెచ్చరిస్తుంది. చుట్టుపక్కల సమీపంలో ఏమేం ఉన్నాయో చెబుతుంది. ముద్రించిన వాటిని చదివేందుకు సాయపడుతుంది’’ అని మునీర్ చెప్పారు. మట్టిలో మాణిక్యంఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్‌ఖేరీలో గౌరి యా గ్రామం మునీర్ సొంతూరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మునీర్‌ను పేద రికం వెక్కిరించింది. తను ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయారు. చదువు ల్లో మేటి అయిన మునీర్‌ను ఎలాగైనా చదివించాలని ఆయన తల్లి, నలుగురు అన్నయ్యలు ఎంతో కష్టపడ్డారు. సొంతూరిలో పదో తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదివిన మునీర్ తర్వాత ఇంటర్ మాత్రం ప్రైవేట్‌లో పూర్తిచేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లోని భీమ్టాల్లో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌లో అడ్మిషన్ సాధించాడు.రెండో ఏడాదిలోనే ఫ్రాన్స్, రష్యాల నుంచి పరిశోధనా ఇంటర్న్‌షిప్‌లను సాధించి ఔరా అనిపించాడు. కృత్రిమ మేధ, సెన్సార్ టె క్నాలజీలపై ఆసక్తితో వాటిలో పరిశోధనలు చేశాడు. కొలంబియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశాక అమెరికా, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించేలా క్యాడర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించాడు. కొలంబియాలో చదువుకునే రోజుల్లోనే హైడ్రోహోమీ పేరిట స్మార్ట్ వాటర్ బాటిల్‌ను తయారుచేశాడు.భారత్‌లో రైతన్నలకు సాయపడేలా మరో అద్భుత ఆవిష్కరణ చేశాడు. నేలసారం ఏ స్థాయిలో ఉందో తెల్సుకునేందుకు పరిశోధనశాలకు మట్టి నమూనాలను పంపాల్సిన పనిలేకుండా చిన్న పరికరంపై మట్టిని ఉంచితే కొద్దిసేపట్లోనే ఆ నేలలోని ధాతువులు, మూలకాల పరిమాణాన్ని, నేలతీరును ఇట్టే చెప్పేస్తుంది. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ డివైజ్’గా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరంతో మునీర్ ఈ ఏడాది యువ శాస్త్రవేత్త అవార్డ్‌ను సైతం జూలైలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అందుకున్నారు. -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024