![BJP wins UPs Milkipur in prestige battle Against SP](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/BJPlogo1.jpg.webp?itok=pOsDjhty)
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మిల్కిపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ.. యూపీ మిల్కిపూర్‌లో సైతం తన హవా కొనసాగించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిల్కిపూర్ అసెంబ్లీలో బీజేపీ 60 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం ాసాధించింది. శనివారం ప్రకటించిన ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కి చెందిన అభ్యర్థి అజిత్ ప్రసాద్‌పై అఖండ విజయం అందుకున్నారు.
30 రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్నిాసాధించి విక్టరీ నమోదు చేసింది. ఈ అయోధ్య జిల్లాలో ఉన్న మిల్కిపూర్ నియోజకవర్గాన్ని బీజేపీ-ఎస్పీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ బీజేపీకి ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఫజియాబాద్ లోక్‌సభ సీటును ఎస్పీకి కోల్పోయిన కొన్నినెలల వ్యవధిలోనే మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఆ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇదిట్రైలర్ మాత్రమే
ఈ విజయంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ‘ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. 2027లో పూర్తి సినిమా చూపిస్తాం. సమాజ్‌వాదీ పార్టీ ఇక ఆశలు వదులుకోవాల్సిందే’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment