సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) జరిగిన రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్లో యూపీ ఆంధ్రప్రదేశ్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు విప్రాజ్ నిగమ్ (ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిగమ్‌ను 50 లక్షలకు కొనుగోలు చేసింది) ఆల్‌రౌండ్ షోతో (4-0-20-2, 8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి యూపీని గెలిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేవీ శశికాంత్ (23 నాటౌట్), కెప్టెన్ రికీ భుయ్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
శ్రీకర్ భరత్ (4), అశ్విన్ హెబ్బర్ (11), షేక్ రషీద్ (18), పైలా అవినాశ్ (19), త్రిపురణ విజయ్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ దక్కించుకున్నారు.
157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్.. మరో ఓవర్ మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరణ్ శర్మ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, సిక్సర్), విప్రాజ్ నిగమ్ (27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి యూపీని గెలిపించారు.
కే సుదర్శన్ (4-1-23-3), త్రిపురణ విజయ్ (4-0-21-2), సత్యనారాయణ రాజు (4-0-30-1) మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ ఏపీని గెలిపించలేకపోయారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు డిసెంబర్ 11న జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment