తాగుబో‘తోడు’ వద్దనుకుని.. ఇన్‌స్టా పరిచయంతో ప్రేమవివాహం!! | Two Women Leave Home And Marry Each Other In Up Due To Husband Harassment, More Details Inside | Sakshi
Sakshi News home page

భర్తల వేధింపులు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహితలు

Published Sat, Jan 25 2025 8:45 AM | Last Updated on Sat, Jan 25 2025 11:13 AM

TWO Women Leave Home And Marry Each Other In UP

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. తమ భర్తల వేధింపులు భరించకలేక ఇద్దరు వివాహితులు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు మహిళలు.. కాశీలో వివాహం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇద్దరు మహిళలు తమ కుటుంబాలను వదిలిపెట్టి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. గురువారం సాయంత్రం కాశీలో కవిత, గుంజా అలియాస్ బబ్లూ వివాహం చేసుకున్నారు. అయితే, తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా  విసిగిపోయిన ఇద్దరు మహిళలు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులు అయ్యారు. పెళ్లికి ముందు ఆరేళ్ల పాటు ఒకరికొకరు టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ తమ భర్తల చేతిలో గృహ హింసకు గురయ్యారు. దీంతో, భర్తను విడిచివెళ్లాలని ఫిక్స్‌ అయ్యారు. ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుటి తిలకం దిద్దారు. దండలు మార్చుకుని, ఏడు అడుగులు వేశారు.

ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. మా భర్తల మద్యపానం, అసభ్య ప్రవర్తనతో మేము వేధించబడ్డాం. ఇది శాంతి, ప్రేమతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా చేసింది. మేము జంటగా గోరఖ్‌పూర్‌లో నివసించాలని నిర్ణయించుకున్నాము. తమను ఎవ్వరూ విడదీయబోరని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం వారికి శాశ్వత ఇల్లు లేకపోయినా, అద్దెకు నివాసం ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో, మద్యానికి బానిసైన తన భర్త తనపై రోజూ దాడి చేసేవాడని ఓ మహిళ తెలిపింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement