kasi
-
తాగుబో‘తోడు’ వద్దనుకుని.. ఇన్‌స్టా పరిచయంతో ప్రేమవివాహం!!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. తమ భర్తల వేధింపులు భరించకలేక ఇద్దరు వివాహితులు వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు మహిళలు.. కాశీలో వివాహం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఇద్దరు మహిళలు తమ కుటుంబాలను వదిలిపెట్టి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. గురువారం సాయంత్రం కాశీలో కవిత, గుంజా అలియాస్ బబ్లూ వివాహం చేసుకున్నారు. అయితే, తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా విసిగిపోయిన ఇద్దరు మహిళలు మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులు అయ్యారు. పెళ్లికి ముందు ఆరేళ్ల పాటు ఒకరికొకరు టచ్‌లో ఉన్నారు. ఇద్దరూ తమ భర్తల చేతిలో గృహ హింసకు గురయ్యారు. దీంతో, భర్తను విడిచివెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుటి తిలకం దిద్దారు. దండలు మార్చుకుని, ఏడు అడుగులు వేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. మా భర్తల మద్యపానం, అసభ్య ప్రవర్తనతో మేము వేధించబడ్డాం. ఇది శాంతి, ప్రేమతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా చేసింది. మేము జంటగా గోరఖ్‌పూర్‌లో నివసించాలని నిర్ణయించుకున్నాము. తమను ఎవ్వరూ విడదీయబోరని, కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం వారికి శాశ్వత ఇల్లు లేకపోయినా, అద్దెకు నివాసం ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో, మద్యానికి బానిసైన తన భర్త తనపై రోజూ దాడి చేసేవాడని ఓ మహిళ తెలిపింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 🚨 UP: Two Women Marry Each Other in Deoria to Escape Harassment by Their Husbands...Lo kudoos tumhra sapna sach ho gya 😂😂👇 pic.twitter.com/2OWcS09xBY— Naren Mukherjee (@NMukherjee6) January 25, 2025 -
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో 56 గణేషుడి దేవాలయాలు
-
ఆ యాత్ర ఓ చరిత్ర
ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్ సుప్రీం కోర్టులో ‘ఇంటర్ ప్రిటర్’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్ బిషప్ హెబార్డ్’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్ హెబార్డ్ జర్నల్’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి. వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్ 3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు) 1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. – కోరాడ శ్రీనివాసరావు సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా -
దివ్య కాశి భవ్య కాశి
-
నిదురించే తోటలోకి...
ఇష్టంలేని పనిచేయడం చాలా కష్టం. నా మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. చిన్నప్పటి నుంచి అంతే. అందుకే అమ్మ తరచు ‘అంత మొండితనం పనికిరాదు’ అని కోప్పడుతుండేది. ‘టికెట్ ఎక్కడికి సార్!’కండక్టర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను.‘వేములపల్లికి ఒకటివ్వండి’టికెట్ తీసుకుని కిటికీ పక్కకి జరిగాను. బస్సంతా కోలాహలంగా ఉంది. కూలీలు బస్సుపైకి మూటలు వేస్తున్నారు. బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. నా ఆలోచనలు స్థిమితంగా లేవు. ఆ ఊరెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ అమ్మ కోరికను కాదనలేకపోయాను. ఎందుకంటే అది ‘చివరిది’ కాబట్టి.అమ్మ జ్ఞాపకం వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు ఎంత అవమానం ఎదుర్కొన్నాం ఆ ఇంట్లో! చెయ్యని నేరం అమ్మపై మోపారు. ఊరు విడిచి వచ్చేసేలా చేశారు. నాన్న చనిపోయే నాటికి నాకు ఆరేళ్లుంటాయి. రాజారాం మావయ్య మమ్మల్ని చేరదీశాడు. ఆయన బాగా ఆస్తిపరుడు. వందల ఎకరాల ఆసామి. పాలేర్లు, పనివాళ్లు, వచ్చిపోయేవాళ్లతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉండేవి. పాడి గేదెలకు, ఆవులకు కొట్టం ఉండేది. పొట్టేళ్లను, పందెంకోళ్లను ప్రత్యేకంగా పెంచేవారు. వెన్నునొప్పి సమస్యతో అత్తయ్య మంచానికే పరిమితమై ఉండేది. వాళ్ల నలుగురు పిల్లల బాగోగులు అమ్మే చూసుకునేది.మావయ్య మా పట్ల ఎంత అభిమానం చూపినా, పిల్లలు మాత్రం అమ్మతో అప్పుడప్పుడు దురుసుగా మాట్లాడేవాళ్లు. మావయ్య పెద్దకొడుకు కాశీ అందరి మీద పెత్తనం చేసేవాడు. కాశీ తర్వాత వసుంధర, శరత్, సుమన... నేనూ, సుమన వీధిగుమ్మం పక్కనే ఉండే ఏనుగు బొమ్మపై కూర్చుని ఆడుకునేవాళ్లం. ‘‘బస్సు పది నిమిషాలు ఆగుద్ది. టీ తాగేవాళ్లు తాగొచ్చు’’ప్రయాణికుల మొహం చూడకుండా బాగా అలవాటైన ఒక ప్రకటన చేసి డ్రైవర్, కండక్టర్ కిందకు దిగారు. నాకెందుకో దిగాలనిపించలేదు. ఇష్టంలేని ప్రయాణంలో ప్రతిదీ అసౌకర్యంగా అసహనంగా అనిపిస్తాయేమో!‘‘బాబూ! నువ్వు సీతమ్మ కొడుకువా?’’ వెనుక సీటు నుంచి తొంగిచూస్తూ అడిగాడు ఒక పెద్దాయన. అరవై ఏళ్లుంటాయి అటూ ఇటుగా...నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వేములపల్లిని వదిలి ఇరవయ్యేళ్లయింది. ఆ ఊరితో అనుబంధం దాదాపుగా తెగిపోయింది. ఆయన నన్నెలా గుర్తుపట్టాడో అర్థం కాలేదు.‘అవునండీ... మీరు..?’‘‘నీ పేరు ఆనందు కదూ! నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ ఇంటి పక్కనే ఉండే టైలర్ వెంకటేశ్వర్రావుని. నువ్వచ్చం మీ నాన్నలానే ఉన్నావు. వాడూ నేనూ కలిసి చదువుకున్నాంగా... ఎప్పుడూ నా కళ్లలోనే మెదుల్తాడు’’ అన్నాడాయన.‘‘సారీ అండీ... గుర్తుపట్టలేకపోయాను. రండి టీ తాగొద్దాం’’ అని సీటులోంచి లేచాను. ఆయన సంతోషంగా నన్ను అనుసరించాడు.టీ తాగేటప్పుడు అమ్మ ప్రస్తావన తెచ్చాడు. అమ్మ చనిపోయిందని చెబితే ఎంతో బాధపడ్డాడు. ఆయన కూడా రెండేళ్ల కిందట వేములపల్లి నుంచి వచ్చేసి నందిగామలో కూతురు దగ్గర ఉంటున్నానని చెప్పాడు.బస్సెక్కాం. నా పక్క సీటులోని వ్యక్తిని రిక్వెస్ట్ చేసి వెనక్కి పంపి, పెద్దాయన్ని నా పక్కన కూర్చోబెట్టుకున్నాను.‘‘మీ అమ్మ అట్టాంటి పని చేసిందంటే మేమెవరం నమ్మలేదయ్యా! నలుగురికి పెట్టే గుణమే తప్ప ఎవరి దగ్గరా ఏమీ ఆశించే మనిషి కాదు. నగలు దొంగతనం చేసే ఖర్మ సీతమ్మకి పట్టలేదని ఊరందరికీ తెలుసు.’’నేను మౌనంగా వింటున్నాను.‘మీరు ఊరొదిలి వెళ్లిపోయాక రాజారాంగారికీ కాశీకి పెద్ద గొడవ అయ్యిందటయ్యా! తండ్రీ కొడుకుల మధ్య ఈనాటికీ మాటలు లేవు. అంతకు మించి విషయాలేవీ బయటకు రాలేదు. ఏదైనా గుట్టుగల కుటుంబం’’ఆయన నిట్టూర్పు నాకు అర్థం అయ్యింది. మా అమ్మ పట్ల సానుభూతి, అభిమానం ఉండి కూడా మాకోసం ఏమీ చేయలేకపోయామనే అశక్తత ఉంది. ‘‘వచ్చే స్టేజీయే నందిగామ. రిటన్లో దిగిరాయ్యా! శ్రీనివాసరావుగారి బట్టల కొట్టంటే ఎవరైనా చెబ్తారు’’ అంటూ లేచారాయన.‘‘సరే బాబాయ్! జాగ్రత్తగా వెళ్లండి.ఆరోగ్యం జాగ్రత్త!’’ అన్నాను.వరుస కలిపి పిలిచినందుకు ఆయన మొహం సంతోషంతో వెలగడం నాకు కనిపించింది.ఆయన దిగాక మళ్లీ ఒంటరినయ్యాననిపించింది. ‘వేములపల్లి దిగండీ..’కండక్టర్ అదిలింపులాంటి ఆజ్ఞతో లేచాను. అప్పటికే సాయంత్రం అయింది.శివాలయం వీధిలో మూడో ఇల్లే మావయ్యది. నడుస్తున్నాను. ఊరు పెద్దగా మారలేదు. పెంకుటిళ్ల స్థానంలో డాబాలు వెలిశాయి. మట్టిరోడ్ల స్థానంలో సిమెంటు రోడ్లు వచ్చి చేరాయి. భద్రయ్యతాత కిళ్లీకొట్టు లేదు. అక్కడ సెల్‌ఫోన్ రీచార్జి చేసే షాపు ఉంది. నాకెందుకో ఉద్వేగంగా ఉంది. ఇల్లొచ్చింది. నాకో పెద్ద అనుమానం వచ్చింది. ఆ ఇల్లేనా అని. కళాకాంతులు లేని, పెచ్చులూడిన ప్రహరీగోడను చూడగానే మనసు చివుక్కుమంది. గేటు తీసుకుని లోపలికి వెళ్లాను.ఒక పదహారేళ్లుంటాయి కుర్రాడికి. కాశీబావ కొడుకై ఉంటాడు. నన్ను తేరిపార చూసి లోపలికి రండి అన్నాడు. కాళ్లు కడుక్కోమని పంపువైపు చూపించాడు. లోపలికి వెళ్లి ఒకావిడ్ని వెంటబెట్టుకొచ్చాడు.ఆవిడ చేతులు చెంగుకి తుడుచుకుంటూ హడావుడిగా నవ్వుతూ ఎదురొచ్చింది. ‘మావయ్యగారు బయటికెళ్లారు బాబూ! వచ్చేస్తారు’ అంటూ వరండాలోకి తీసుకెళ్లింది. ఒకప్పుడు నిత్యం పదిమంది మనుషులతో కళకళలాడిన ఆ లోగిలి బోసిపోయి ఉంది. గోడల రంగులు వెలిసిపోయాయి. బయట పశువుల పాకలో ఒక పాడిగేదె కట్టేసి ఉంది. ‘ఎప్పుడు బయలుదేరారు బాబూ! స్నానం చేసి రండి. మావయ్య వచ్చేస్తారు... నానీ! మావయ్యని రూమ్‌లోకి తీసుకెళ్లు’ అంటూ కొడుకుని పురమాయించి వంటగదిలోకి వెళ్లిందామె.వాళ్లిద్దరూ కనీసం మీరెవరు? అని అడగకపోవడానికి గల కారణం నాకు అర్థమైంది. ఎదురుగా గోడకు అత్తయ్య ఫొటో పక్కన అమ్మానాన్నల ఫొటో. అమ్మ తనవెంట తెచ్చుకోవడం మరిచిపోయిన ఫొటో. చిన్నప్పటి నుంచి నేను చూడలేకపోయిన నాన్న రూపం అచ్చు నాలానే ఉంది.రాత్రి ఎనిమిది గంటలకు మావయ్య వచ్చాడు. మనిషి వంగిపోయాడు. వస్తూనే నన్ను చూసి ‘బాగున్నావా..! మీ అమ్మ..’ అంటూ ఆగిపోయాడు.పక్కనున్న కుర్చీలో కూర్చుండిపోయాడు.నేను లేచి నిలబడి ‘బాగానే ఉన్నాను మావయ్యా! అమ్మ మిమ్మల్ని చూసి రమ్మని చివరికోరికగా చెప్పింది. అందుకే వచ్చాను. బయలుదేరతా’ అన్నాను నెమ్మదిగా.ఆయన నావైపు సూటిగా చూసి ‘‘రేపు పంపిస్తాను ఆనంద్ నిన్ను’’ అని కోడలివైపు తిరిగి ‘‘భోజనం ఏర్పాట్లు చూడమ్మా!’’ అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు. భోజనం చేస్తున్నాను మౌనంగా. ‘‘మా పెళ్లయిన మరుసటి ఏడాదే అత్తయ్యగారు పోయారు. ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పదిహేడేళ్ల నుంచి ఎప్పుడూ తండ్రీ కొడుకులు ఎదురెదురు కూర్చుని మాట్లాడుకోవడం చూడలేదు నేను. తప్పనిసరైతే ఒకటి రెండు మాటలు. అంతే. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వ్యవసాయం తరిగిపోయింది. మా మరిది శరత్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వసుంధర వాళ్లు హైదరాబాద్‌లో ఉంటున్నారు.’’ చెప్పుకుపోతోంది ఆ ఇంటి కోడలు.‘‘సుమన ఎక్కడుంటుందక్కా!’’ అని అడిగాను మధ్యలో.‘‘ఈ ఊరే ఇచ్చాం. రైత్వారీ సంబంధం. పాపం! దాని దాకా వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. రాజీపడక తప్పలేదు.కానీ! దాని కాపురమే బాగుందనిపిస్తుందయ్యా నాకు..’’ అందామె నిట్టూరుస్తూ.‘‘మీకేం తక్కువ?’’ అడిగాను కొంచెం చనువు తీసుకుని.కొద్దిపాటి నిశ్శబ్దం తర్వాత... ‘‘అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదు.ఇంటిల్లిపాదీ కూర్చుని తిని ఎరుగం... ఏదైనా నీ చేతుల్లోనే ఉంది తమ్ముడూ’’ అందామె చివరి మాటను ఎంతో ఆశగా... ప్రేమగా...నేను తలెత్తి చూశాను. ఆమె కళ్లలో సన్నటి కన్నీటిపొర. నాకు మాట రాలేదు.రాత్రి పదయింది. నేను వరండాలో కూర్చుని టీవీ చూస్తున్నా. కాశీ వచ్చాడు. నేను గుర్తుపట్టలేకపోయాను.‘‘ఆనందా..!? ఏరా బాగున్నావా? ఎప్పుడొచ్చావ్?’’ అన్నాడు దగ్గరకొచ్చి. నన్ను చూసి చాలా ఆనందపడ్డాడు. కాశీబావ నన్ను అంత బాగా పలకరిస్తాడనుకోలేదు. ‘‘బాగున్నాను బావా! సాయంత్రం వచ్చా’’ అన్నాను.‘‘సరే! రెస్టు తీసుకో. మాట్లాడదాం’’ అంటూ గదిలోకి వెళ్లగా అతని భార్య అనుసరించింది. పడుకున్నా... నిద్రపట్టలేదు. ఇరవయ్యేళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి.అర్ధరాత్రి కొంతమంది అమ్మను నిలదీస్తున్నారు. అమ్మ, మావయ్య తప్ప అందరూ ఏవేవో మాట్లాడుతున్నారు. వసుంధర, అత్తయ్య దగ్గర కూర్చుని ఏడుస్తోంది. కాశీబావ నోట పోలీసులు అనే మాట వినబడి నాకు భయం వేసింది.తెల్లవారు జామున అమ్మ నన్ను వెంటబెట్టుకుని బయలుదేరింది. బస్సెక్కాక ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? మళ్లీ ఎప్పుడొస్తాం?’’ అని నేను అడగడం గుర్తొచ్చాయి.తర్వాత రాజమండ్రి మహిళా సేవాసదన్‌లో అమ్మ ఆయాగా పనిచేసింది. వాళ్ల స్కూల్లోనే నన్ను చదివించింది.అందరూ ఏ కష్టమొచ్చినా అమ్మతోనే చెప్పుకొనేవాళ్లు. ఓపికగా వినేది. సాయం చేసేది. మావయ్య వాళ్ల గురించి ప్రస్తావన తెస్తే చిరునవ్వు నవ్వి ఊరుకొనేది. తర్వాత నేను అడగడం మానేశాను.‘ఆనందూ!’ఉలిక్కిపడి లేచాను. అర్ధరాత్రి గుమ్మం దగ్గర మావయ్య.‘రండి మావయ్యా!’ అంటూ లేచాను.మావయ్య మంచం ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. బెడ్‌లైట్ వెలుగుతోంది. లైట్ వెయ్యబోతే మావయ్య వద్దని వారించాడు.‘‘నీతో చాలా విషయాలు మాట్లాడాలిరా!... మా మీద నీకు చాలా కోపం ఉందని నాకు తెలుసు’’నేను మౌనంగా వింటున్నాను. ‘‘చెయ్యని తప్పు మీదేసుకుని నా చెల్లెలు గొప్ప త్యాగం చేసింది. ఇప్పుడు శాశ్వతంగా దూరమై నాకు జీవితకాలానికి సరిపడా శిక్ష వేసింది.’’ మావయ్య గొంతు జీరబోయింది.‘‘అసలు విషయమేమిటో నాతో కూడా ఎప్పుడూ చెప్పలేదు మావయ్యా! గుచ్చి గుచ్చి అడిగి అమ్మను బాధపెట్టడం ఇష్టంలేక నేనూ ప్రస్తావన తెచ్చేవాణ్ణి కాదు’’‘‘మరి అమ్మ ఏ తప్పూ చేయలేదంటున్నారు. ఆ రోజు అంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?’’ మర్యాదగానే సూటిగా అడిగాను. ‘‘దొంగతనం చేసింది మీ అమ్మ కాదురా! నా పెద్ద కూతురు.’’ మావయ్య గొంతులో ఉద్విగ్నత. ‘‘ఎవరినో ప్రేమించి అర్ధరాత్రి పారిపోతూ మీ అమ్మ కంటబడింది. సర్దుకున్న నగల బ్యాగ్ అక్కడే పడేసి భయంతో ఇంట్లోకి వచ్చేసింది. ఆ అలికిడికి ముందు నేనే లేచాను. నా కూతురు నాకు ఎదురుపడి భయంతో వణికింది. మీ అమ్మ ‘ఆడపిల్ల, దానిని ఏమీ అనొద్దు అన్నయ్యా! పెళ్లి కావాల్సిన పిల్ల. దాని జీవితం నాశనమైపోతుంది. ఏం జరిగినా ఏమీ మాట్లాడొద్దు’ అని నా చేత ఒట్టు వేయించుకుంది. ఈలోగా అందరూ పోగయ్యారు. తలో మాటా అన్నారు. నా చెల్లెలు... నా సీతమ్మ... నన్ను విడిచి ఊరు వదిలి వెళ్లిపోయింది.తర్వాత తప్పు చేసింది నా చెల్లెలు కాదు, తన చెల్లెలని కాశీకి తెలిసింది. మీ అమ్మను అన్ని మాటలన్నందుకు వాడు ఎంతో కుమిలిపోయాడు. నిజం దాచినందుకు ఆరోజు నుంచి నాతో మాట్లాడ్డం మానేశాడు.’’మావయ్య తలెత్తకుండా చెప్పుకుపోతున్నాడు.నాకు నోట మాట రాలేదు.ఇరవయ్యేళ్ల పాటు చెయ్యని తప్పుకు నింద మోసి దూరంగా బతికిన మా అమ్మ, కూతురు చేసిన తప్పుని చెల్లెలు మీదేసుకుని దూరమైపోతే నిస్సహాయంగా, నిస్సారంగా బతికేస్తున్న మావయ్య... తల్లిలా సాకిన మేనత్తను అకారణంగా నిందించి గెంటేశాననే అపరాధభావంతో కాశీ...మావయ్య లేచాడు. నేనూ లేచి నిలబడ్డాను.. ‘‘మీ అమ్మ నాకు ఉత్తరాలు రాసేది. మీ బాగోగుల గురించి తెలియజేసేది. సాయం చేస్తానంటే వద్దంది. అసలు రావద్దంది. తనను వచ్చేయమన్నాను. తను వస్తే దొంగలా బతకాలి, లేదంటే నా కూతురు చేసిన పనిని పదిమందికీ చెప్పాలి. అందుకే రానంది. తన అనారోగ్యం గురించి తెలుసుకుని విలవిలలాడాను. చివరి చూపు కూడా..’’నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘ఏదో ఒకరోజు నిన్ను పంపుతానని చివరిసారిగా రాసిన ఉత్తరంలో మాటిచ్చిందిరా!... మళ్లీ ఉత్తరం రాలేదు. నువ్వొచ్చావు. అన్నింటికీ నేనే బాధ్యుణ్ణిరా ఆనంద్’’మావయ్య గొంతు వణికింది. నేను మౌనంగా వింటున్నాను. ‘‘సరే! పడుకో. మనసులో బరువు దించుకోవడానికి ఈ ముసలోడికి ఒక అవకాశం ఇచ్చావు. సంతోషం. అడగడం మర్చిపోయాను. నీ భార్య, పిల్లలు...’’‘‘ఒక అబ్బాయి మావయ్యా! అందరూ బాగున్నారు.’’ అన్నాను.మావయ్య బయటికి నడిచాడు. వెనుక నాలుగు అడుగులు వేశాను. మెట్లెక్కుతున్న మావయ్యను చూస్తూ నిలుచున్నాను. వరండాలో ఒక మూల కాశీబావ.గుండె ఝల్లుమంది నాకు.ఈ తండ్రీ కొడుకులు మనసులో ఇంత భారం పెట్టుకొని ఇన్నేళ్లు ఎలా గడిపారో నాకు అర్థం కాలేదు. లక్ష్మక్క అన్నట్లు అంతా నా చేతుల్లోనే ఉందా? నెమ్మదిగా కాశీ దగ్గరకు వెళ్లాను.‘‘ఏంటి బావా! పడుకోలేదా?’’ అని అడిగాను.‘‘మాకు అన్నీ ఉన్నాయిరా... మనశ్శాంతి తప్ప. ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాం’’ అన్నాడు గంభీరంగా.నేనేం మాట్లాడలేకపోయాను.‘క్షమించమని అడగడానికి అత్తయ్య లేదు’ అని నా చేతులు పట్టుకున్నాడు. ‘‘బావా! ఒక్క మాట చెప్పవా..?’’ అని అడిగాను.ఏంటన్నట్టు చూశాడు.‘‘మావయ్య చేసిన తప్పేముంది? చెల్లెలు దూరమై, భార్య చనిపోయి... కొడుకు మాట్లాడక ఆయన చిత్రవధ అనుభవిస్తున్నాడు. నువ్వు మారాలి బావా!’’ అన్నాను.‘‘నాలుగు రోజులుంటావా?’’ అడిగాడు ప్రేమగా.‘‘ఆఫీసులో పని ఉంది బావా! రేపు ఉదయం వెళ్లాలి’’ అన్నాను.ఉదయాన్నే బయలుదేరాను.మావయ్య, కాశీ నాకు చెరోవైపు నడుస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులు కలిసి వీధిలోకి రావడాన్ని అంతా ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.ఎదురైన వారందరికీ ‘‘మా సీతమ్మ కొడుకు... నా మేనల్లుడు’’ అంటూ పరిచయం చేస్తున్నాడు మావయ్య.బస్సెక్కాను. ఆ ఊరికి రావడానికి తీవ్రంగా ప్రతిఘటించిన నా మనసు ఇప్పుడు తిరిగి వెళ్లడానికి బాధపడుతోంది. అమ్మ ఆఖరి కోరిక తీర్చాను. చాలా తృప్తిగా ఉంది. అమ్మ ఆత్మ కూడా తృప్తిపడి ఉంటుంది. గజ్జెల దుర్గారావు -
బిచ్చగాడుని మించుతుంది
‘‘తెలుగు నిర్మాతలందరూ నన్ను వారి హీరోగా భావించి ప్రోత్సహిస్తున్నారు. మంచి సినిమాలనే ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను. త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకుంటున్నా’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘కాశి’. కృతిక ఉదయనిధి దర్శకురాలు. ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ సినిమాని ఈ నెల 18న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ– ‘‘నా గత చిత్రాలతో పోల్చితే ‘కాశి’ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నా ‘బిచ్చగాడు’ని మించి హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా పాటలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఏ సినిమా పాటలైనా ‘విజయ్ ఆంటోని.కామ్’ నుంచి ఎప్పుడైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘విజయ్‌గారు ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేశారు. ‘కాశి’తో మరో హిట్ సాధిస్తారని భావిస్తున్నా’’ అన్నారు నిర్మాత కిరణ్. ‘‘సినిమా చూశా. చక్కగా ఉంది. ఈ సినిమా తర్వాత విజయ్ తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తారు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘కాశి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను. విజయ్‌గారు కథ వినగానే నన్ను నమ్మి డైరెక్షన్ అవకాశం ఇచ్చారు’’ అన్నారు కృతిక ఉదయనిధి. నిర్మాతలు ప్రద్యుమ్న, గణేశ్, సునైన, నటుడు మధు, రచయిత భాషా శ్రీ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, అమృత తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర బంధానికి బలి
తూప్రాన్: వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. గురువారం తెల్లవారు జామున రైలు కింద పడి బలవంతంగా తనువు చాలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉంది. కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లి జరి గింది. కుటుంబ తగాదాల కారణంగా భార్య తో విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న దేవేంద్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకు న్నాయి. కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయం దుబాయ్‌లో ఉన్న రఘుకు తెలియంతో భార్య తనకు వద్దని కులపెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్లో రాత్రి రైలు దిగిన వారు తమ వెంట ఉన్న దేవేంద్ర కూతురును స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
కాశీలో వదిలేస్తా!
సమ్సారం సంసారంలో సినిమా ‘‘ఒరేయ్! వెధవా! మా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశావా. ఏంటో కాశీలో గంగా స్నానం చేయక పోతే జీవితానికి పరిపూర్ణత వచ్చినట్లే ఉండదు’’ స్కూలు బ్యాగ్ ఖుషీ వీపుకి తగిలిస్తూ అడిగింది లక్ష్మీదేవి.‘‘నీకూ, నాన్నకీ రానుపోనూ టిక్కెట్లు, ఉండడానికి బస కూడా రెడీ. టిక్కెట్లు నిన్ననే నాన్నకిచ్చాను’’ భార్య ముందు ఒరేయ్తో సరిపెట్టకుండా వెధవా మకుటం కూడా చేర్చినందుకు లోలోపలే కస్సుబుస్సుమంటున్నాడు భాస్కర్.‘‘బై అమ్మా, నాన్నా, నానమ్మా స్కూలుకి వెళ్లొస్తా’’ అని బెడ్రూమ్లోకి చూస్తూ ‘‘తాతయ్యా! బై. సాయంత్రం నేనొచ్చే లోపు కాశీకెళ్లిపోతారా’’ అడిగింది ఖుషీ. ‘‘అవును తల్లీ, మధ్యాహ్నమే రైలు. నువ్వొచ్చేసరికి బయలుదేరుతాం’’ అంటూ తనూ హాల్లోకి వచ్చి మనుమరాల్ని దగ్గరకు తీసుకున్నాడు తాతయ్య. ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు నానమ్మా’’లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి ఆమెను చుట్టుకుంటూ గారాలు పోయింది ఖుషీ. ‘‘ఫిఫ్టీన్ డేసే... రెండు సన్డేల తర్వాత వచ్చేస్తాం బంగారూ’’ ఎంతో దూరంలో లేదన్నట్లు ఆ చిట్టిబుర్రకు నచ్చేలా చెప్పాడు తాతయ్య. ‘‘పాపకు సాక్స్ వేసే ముందు పాదాలు, వేళ్ల సందుల్లో పౌడర్ వేయండి’’ అన్నది సౌందర్య కిచెన్‌లో పాప లంచ్‌బాక్స్ సర్దుతూ.‘‘నీకెన్ని సేవలు చేయాలే తల్లీ. కాళ్లకూ పౌడరేయాలా’’ అంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న పౌడర్ డబ్బా తీసుకుని ముందుగదిలోకొచ్చాడు భాస్కర్. ‘‘పౌడర్ వేయకపోతే సాయంత్రానికి పాదాలు చెమట పట్టి నానిపోతాయి నాన్నా’’ అన్నది ఖుషీ. కళ్లు, నోరు, చేతులూ తిప్పుతూ తనకంతా తెలుసన్నట్లు ఆరిందలా చెప్పింది కానీ, ఆ గొంతులో నాన్నా నీకిది కూడా తెలియదా అనే టోన్ వినిపిస్తోంది భాస్కర్‌కి. ఖుషీకి షూస్ వేసి బకిల్ పెడుతున్నాడు భాస్కర్. ‘‘ఇంకా వేయలేదా’’ అంటూ లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ సర్దిన బాస్కెట్ తెచ్చింది సౌందర్య. ‘‘షూస్ కరెక్ట్ సైజ్ తెచ్చావు. రెణ్నెల్లకే టైట్ అవుతాయి. మళ్లీ కొత్తవి కొనాలి. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’’ సౌందర్య కనిపించగానే భాస్కర్ అసహనం మాటల్లో ప్రవహించింది. భాస్కర్ వైపు ఓ సారి చూసి లోపలికి వెళ్లింది సౌందర్య స్కూల్ బ్యాగ్ తేవడానికి.‘‘నాన్నా! అమ్మ షూస్‌లోపల కాటన్ పెట్టింది. ఇప్పుడు నాకు సరిపోతున్నాయి. టైట్ అయినప్పుడు ఆ కాటన్ తీసేస్తుందట’’ ఖుషీ మెల్లగా చెవిలో చెప్పినట్లే చెప్పింది. కానీ భాస్కర్‌కి మాత్రం ‘నాన్నా! నీకిది కూడా తెలియదు’ అని ఎగతాళి చేస్తున్నట్లే ఉంది.‘‘నానమ్మ, తాతయ్య ఇంకా ఎన్నిరోజులకొస్తారు నాన్నా’’ అడిగింది ఖుషీ సడెన్‌గా. ‘‘దానికి రెండ్రోజులుగా వాళ్ల నానమ్మ గుర్తుకొస్తోంది. బెంగపెట్టుకున్నట్లుంది. ఫోన్ చేసినప్పుడు మాట్లాడించకపోయారా’’ స్కూలు బ్యాగ్ తెస్తూ అంది సౌందర్య. ‘‘నానమ్మా, తాతయ్యా’’ అరుస్తూ ఎదురెళ్లింది ఖుషీ.‘‘మీ నాన్న నీకు ఏమంటూ ఖుషీ అని పేరు పెట్టాడో కానీ, ఎప్పుడూ సంతోషంగా ఉంటావ్ బంగారు తల్లీ’’ మురిసిపోతూ మనుమరాలిని దగ్గరకు తీసుకుంది లక్ష్మీదేవి.‘‘మీ నాన్న నీకు లక్ష్మీదేవి అని పెట్టారు. ఏం లక్షలు కారిపోతున్నాయిక్కడ’’ బ్యాగ్ కింద పెట్టి సోఫాలో కూర్చుంటూ సాగదీశాడు ఖుషీ తాతయ్య. ‘‘నన్ను చేసుకోకముందు కోట్లు లెక్కపెట్టడానికి చేతులు నొప్పెట్టి పదిమంది జీతగాళ్లను పెట్టుకున్న వాళ్లాయే పాపం’’ మూతి విరిచింది లక్ష్మీదేవి. ‘‘స్నానాలు చేయండి, తర్వాత మాట్లాడుకుందాం’’ అంది సౌందర్య కాఫీ ఇస్తూ. ఖుషీ కోసం తెచ్చిన బొమ్మలు, కొడుకు, కోడలికి తెచ్చిన డ్రస్‌లు తీసి బయట పెడుతోంది లక్ష్మీదేవి. ‘‘నీకేం తెచ్చుకున్నావ్ నానమ్మా’’ అంటూ బ్యాగ్‌లో ఉన్న గులాబీ రంగు చీరను బయటకు తీసింది ఖుషీ. ‘‘ఈ కలర్ శారీస్ మీకు చాలానే ఉన్నాయి కదత్తయ్యా’’ అంటూ ఆ చీరను చేతిలోకి తీసుకుంది సౌందర్య.‘‘మీ మామయ్యతో వెళ్తే ఇక మరే రంగూ తీసుకోనివ్వడు కదా మరి’’ ఆ మాటలో విసుగు, కొంచెం మురిపెం కూడ.‘‘పెళ్లి చూపుల్లో ఈ రంగు చీరతోనే నన్ను మోసం చేశారు మీ వాళ్లు. కనీసం ఆ భ్రమలోనైనా బతుకుదామని’’ కౌంటర్ పడేసి తన బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్లాడు ఖుషీ తాతయ్య.బ్యాగ్ ఓపెన్ చేసి లక్ష్మీదేవి తన కోసం కొన్న ముఖమల్ షాల్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని చేత్తో తడుముతూంటే పెదవుల మీద మెత్తటి చిరునవ్వు. ఎప్పుడో మాటల సందర్భంలో ముఖమల్ షాల్ తనకిష్టమని చెప్పాడు. ఎన్నేళ్లయిందో అలా చెప్పి. ఆ మాట గుర్తుపెట్టుకుని మరీ ఎక్కడికెళ్లినా అలాంటి షాల్ కోసమే వెతికేదట. అది దొరికే వరకు ఆ మాట కూడా చెప్పనేలేదు. రైల్లో వస్తూ చెప్పింది ఇన్నేళ్ల అన్వేషణ గురించి. తన ఇష్టాలను నేను గుర్తు పెట్టుకుని తీర్చినవి ఏమైనా ఉన్నాయా... అంతర్మధనం మొదలైంది ఆయనలో. ‘‘కాశీలో ఏం వదిలారత్తయ్యా’’ ఇడ్లీల హాట్‌బాక్స్ టేబుల్ మీద పెడుతూ అడిగింది సౌందర్య. లక్ష్మీదేవి పూజలో ఉంది.. విన్నట్లు లేదు. ‘‘కాశీలో ఏం వదులుతారమ్మా’’ ఖుషీ అందుకుంది. ‘‘కాశీకెళ్లిన వాళ్లు గయలో తమకు ఇష్టమైన వాటిని వదిలి వస్తారు. అమ్మమ్మ తనకు బాగా ఇష్టమైన గుత్తివంకాయ కూరను వదిలేసింది, తాతయ్యేమో...’’ సౌందర్య చెప్తుండగానే ‘‘మా నాన్నకు కొబ్బరి పచ్చడి ఇష్టం కదా, ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయకూడదా సౌందర్యా’’ భాస్కర్ ప్లేటులో ఇడ్లీ పెట్టుకుంటూ అన్నాడు. మాటల్లోనే లక్ష్మీదేవి కూడా వచ్చి ప్లేటు తీసుకుంది ‘‘నానమ్మా! కాశీలో ఏం వదిలొచ్చావు’’ అడిగింది ఖుషీ. b‘‘మీ తాతయ్యను వదిలేద్దామనుకున్నా, వదిలేసినా రైలెక్కి ఇంటికే కదా వస్తాడు... అందుకే ఎక్కడికెళ్లినా తప్పని తద్దినాన్ని వదిలిపెట్టడం ఎందుకని తీసుకొచ్చా’’ అంది గదిలోకి వినిపించేటట్లు. ‘‘అందుకే చెబుతారు కాశీకి వెళ్లినా రాసినమొగుడేనని’’ గదిలో నుంచే రిటార్ట్. ‘‘నాన్నా! నువ్వు, అమ్మ కూడా కాశీకి వెళ్తారా’’ భాస్కర్ తలలో తెల్ల వెంట్రుకను లాగుతూ అడిగింది ఖుషీ.‘‘ఆ వెళ్తాం, నేనైతే మీ నాన్నను అక్కడే వదిలేసి వస్తా. మీ నానమ్మలా తిరిగి తీసుకురాను’’ అంది సౌందర్య దుప్పటి ముసుగుపెట్టుకుంటూ.‘‘నాన్నా! మరి... నసుగుతోంది’’ ఖుషీ.‘‘ఏంటి తల్లీ! చెప్పు’’ అన్నాడు భాస్కర్ కూతురిని బుగ్గలు పుణుకుతూ.‘‘మరి నాకు రోజూ స్కూల్‌కెళ్లేటప్పుడు షూస్ ఎవరేస్తారు, స్కూలు దగ్గర ఎవరు దింపుతారు?’’‘‘!?!’’ భాస్కర్‌కి నో డైలాగ్. స్టోరీ ఎండ్. సినిమాలో సంసారం తత్త్వం... బోధపడింది! శంకర్ నారాయణ (చిరంజీవి) వారణాశిలో(కాశీ) ట్యాక్సీ డ్రైవర్. కాశీ కొచ్చిన బాలుని(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) అన్ని ఘాట్ వద్దకు తీసుకెళ్లి చూపించడానికి, కాశీ విశిష్టతను వివరించడానికి రూ.300 బేరం కుదుర్చుకుంటాడు శంకర్ నారాయణ. ఇద్దరూ గంగా నదిలో పడవలో వెళుతుంటారు. ‘కళలు 64 ఎలా ఉన్నాయో అలాగే ఈ ఘాట్స్ కూడా 64 ఉన్నాయండీ. పురాణాల్లో హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన ఘాట్ అదేనండీ. ప్రపంచమంతా బ్రతకడం కోసం చస్తుంటారండీ. కానీ, కాశీలో మాత్రం చావడం కోసమే బ్రతుకుతుంటారండీ’ అంటాడు శంకర్. నువ్వు మాట్లాడుతుంటే ట్యాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నట్లు లేదు. ఆ అర్జునుడి రథం తోలిన కృష్ణ పరమాత్ముడు మాట్లాడుతున్నట్లుంది అంటాడు బాలు. ‘పొగడ్త పన్నీరు లాంటిదండీ.. అది ఒంటిమీద చల్లుకోవాలే తప్ప బాగుంది కదాని తాగేయకూడదు’ బదులిస్తాడు శంకర్ నారాయణ ‘ఇంద్ర’ సినిమాలో. జీవితంలో అనురాగం, సంతోషం, త్యాగం, వైరాగ్యం... అన్నీ ఉండాలనే తత్త్వం బోధపడుతుంది. – మంజీర -
ఎరక్కపోయి వచ్చాము.. ఇరుక్కుపోయాము..
తణుకు అర్బన్ : పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు. బుధవారం ఉదయం వారణాసిలో భగవంతుడిని దర్శించుకుని వచ్చే సందర్భంలో హోటల్లో రూ.500 నోటు చెల్లదని చెప్పడంతో విస్తుబోయినట్టు ఫోన్ ద్వారా మురళి, ఫణి ఇక్కడ బంధువులకు ఫోన్లో తెలిపారు. చిల్లర సమస్యతో కాశీలో చిక్కుకున్న వారి ఆవేదన వారి మాటల్లోనే.. ’రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తెలుగు వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు, వారంతా ఆటో కిరాయిలు, హోటల్లో భోజనం కొనుగోలుకు చిల్లర లేక అవస్థపడుతున్నారు. రూ.500 నోటుకు రూ.200 తీసుకుని రూ.300 ఇవ్వమన్నా కుదరదంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్నా చిల్లర మారక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న చిల్లర నోట్లు ఖర్చయి పోగా మా వద్ద ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే మిగిలాయి. గురువారం మధ్యాహ్నానికి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ అప్పటివరకు వాటర్ బాటిల్‌కు కూడా తికానా లేని పరిస్థితి. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో ప్రస్తుతం రూం తీసుకుని ఉన్నాం. పస్తులుండి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నా అక్కడ నుంచి రావడం కూడా కష్టం. ఏదో కరువు వచ్చినట్టుగా ఇక్కడంతా అల్లకల్లోలంగా ఉంది.’ -
ఎరక్కపోయి వచ్చాము.. ఇరుక్కుపోయాము..
తణుకు అర్బన్ : పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు. బుధవారం ఉదయం వారణాసిలో భగవంతుడిని దర్శించుకుని వచ్చే సందర్భంలో హోటల్లో రూ.500 నోటు చెల్లదని చెప్పడంతో విస్తుబోయినట్టు ఫోన్ ద్వారా మురళి, ఫణి ఇక్కడ బంధువులకు ఫోన్లో తెలిపారు. చిల్లర సమస్యతో కాశీలో చిక్కుకున్న వారి ఆవేదన వారి మాటల్లోనే.. ’రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తెలుగు వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు, వారంతా ఆటో కిరాయిలు, హోటల్లో భోజనం కొనుగోలుకు చిల్లర లేక అవస్థపడుతున్నారు. రూ.500 నోటుకు రూ.200 తీసుకుని రూ.300 ఇవ్వమన్నా కుదరదంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్నా చిల్లర మారక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న చిల్లర నోట్లు ఖర్చయి పోగా మా వద్ద ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే మిగిలాయి. గురువారం మధ్యాహ్నానికి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ అప్పటివరకు వాటర్ బాటిల్‌కు కూడా తికానా లేని పరిస్థితి. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో ప్రస్తుతం రూం తీసుకుని ఉన్నాం. పస్తులుండి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నా అక్కడ నుంచి రావడం కూడా కష్టం. ఏదో కరువు వచ్చినట్టుగా ఇక్కడంతా అల్లకల్లోలంగా ఉంది.’ -
కాశీ యాత్రకు వెళ్లొస్తుండగా విషాదం..
మారేడుపల్లి: కాశీ యాత్రకు వెళ్లొస్తున్న ఓ భక్త బృందం ప్రమాదం బారిన పడింది. వారు ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం ఇజ్జలూరి జంక్షన్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చింతగింజల విజయ (50) అనే మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు, 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల, శ్రీరామ్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 47 మంది గత నెల 29వ తేదీన కాశీయాత్రకు బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం అన్నవరం చేరుకుని సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున భద్రాచలం బయల్దేరారు. ఇజ్జలూరు జంక్షన్ సమీపంలో మలుపులో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
కాశీలో చప్పన్ భోగ్ పండుగ
-
శిష్యుడిపై గురువుదే విజయం
⇒ కాశీ మఠం మఠాధిపతి సుధీంద్ర తీర్థ స్వామే ⇒ ఆ స్థానాన్ని ఆయన పరిత్యజించలేదు ⇒ తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు ⇒ రాఘవేంద్ర తీర్థ స్వామి అప్పీళ్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన మఠాల్లో ఒకటైన కాశీ మఠం, బెనారస్ మఠాధిపతి విషయంలో జరిపిన సుదీర్ఘ న్యాయపోరాటంలో శిష్యుడిపై గురువు విజయం సాధించారు. కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా శ్రీమధ్ సుధీంద్ర తీర్థ స్వామే కొనసాగుతారని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. మఠాధిపతి స్థానాన్ని ఆయన పరిత్యజించలేదని తెలిపింది. తాను కాశీమఠం, బెనారస్ మఠాధిపతిగా నియమితులయ్యానంటూ సుధీంద్ర స్వామి శిష్యుడు శ్రీమధ్ రాఘవేంద్ర తీర్థ స్వామి చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని రుజువు చేసేందుకు రాఘవేంద్ర తీర్థ స్వామి ఎటువంటి ఆధారాలు చూపలేదని తేల్చిచెప్పింది. ఇదేసమయంలో మఠాధిపతి స్థానాన్ని తాను పరిత్యజించలేదని సుధీంద్ర స్వామి రుజువు చేయగలిగారని తెలిపింది. ఇందుకు సంబంధించి కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాఘవేంద్ర తీర్థ స్వామి దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాధిపతి స్థానాన్ని సుధీంద్ర తీర్థ స్వామి పరిత్యజించారని, దీంతో ఆయన శిష్యుడిగా తాను మఠాధిపతినయ్యానంటూ రాఘవేంద్ర స్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మఠం వ్యవహారాల్లో సుధీంద్ర స్వామితోసహా ఇతరులెవ్వరినీ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ తిరుపతి కోర్టులో 2000 సంవత్సరంలో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు రాఘవేంద్రస్వామి పిటిషన్‌ను 2009లో కొట్టేసింది. దీనిపై ఆయన అదేఏడాది హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. మఠాచారాల ప్రకారం మఠాధిపతి మహాసమాధి అయ్యాకనే ఆయన వారసుడిని మఠాధిపతిగా నియమిస్తారని జస్టిస్ నాగార్జునరెడ్డి తన 34 పేజీల తీర్పులో పేర్కొన్నారు. సుధీంద్ర స్వామి కేవలం పాలన వ్యవహారాలు, ఇతర దైవిక వ్యవహారాల బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని గుర్తుచేశారు. మఠాధిపతిగా కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించడానికీ, మఠాధిపతి స్థానాన్ని పరిత్యజించడానికీ తేడా ఉందన్నారు. కొన్ని బాధ్యతలను శిష్యుడికి అప్పగించాక కూడా మఠపెద్దగా మఠాధిపతి స్థానంలో కొనసాగేందుకు సుధీంద్ర స్వామికి అధికారముందని తేల్చారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఓ మఠానికి చెందిన మఠాధిపతి శిష్యుడు గద్దెకోసం తన గురువునే వివాదంలోకి లాగారు. కింది కోర్టులో చుక్కెదురైనా తను అనుకున్నది పొందేందుకు హైకోర్టును ఆశ్రయించారు. తన గురువుపైనే ఈ సన్యాసి చేస్తున్న న్యాయపోరాటాన్ని చూస్తుంటే, ఇటువంటి వ్యక్తులు కూడా సాధారణ వ్యక్తులవలే ఉన్నత స్థానాలకోసం వెంపర్లాడుతారా? అని ఆశ్చర్యం కలుగుతోంది. - జస్టిస్ సి.వి. నాగార్జునరెడ్డి -
కాశీకి బయల్దేరిన 40 మందికి అస్వస్థత
కోల్ కతా: తీర్థయాత్రలో భాగంగా కాశీయాత్రకు బయల్దేరిని తెలుగువారు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. కోల్ కతా వద్ద కలుషితం ఆహారం తిని ఆదివారం 40 మంది తెలుగువాసులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వీరిని హౌరాలోని మార్వాడి స్టీట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల నుంచి కాశీ యాత్ర బయల్దేరి అస్వస్థతకు గురైయ్యారు. ప్రస్తుతం తమ తిరుగుప్రయాణానికి డబ్బుల్లేవని ఏకరవు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గంగమ్మ తల్లిని దర్శించుకున్న మోడీ
-
మోడీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్
-
ఏడువేల కిలోమీటర్ల ప్రేమ..!
హృదయం ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అంటారు. ప్రేమకు చూపు ఉండదట! మరి ఏముంటుంది? హృదయం. మరి హృదయానికైనా చూపు ఉండాలి కదా. ఉంటుంది కానీ పైపై చూపు ఉండదు. అంతర్నేత్రంతో లోలోపల చూస్తుంది. చూసినా అది రూపురేఖలు చూడదు. రూపాయలను చూడదు. కులమేంటో చూడదు. మతమేంటో కూడా చూడదు. ఉత్తరమా దక్షిణమా, తూర్పా పడమరా, ఈ దేశమా ఆ దేశమా అని కూడా చూడదు. మరేం చూస్తుంది? ప్రేమను చూస్తుంది. ప్రేమను మాత్రమే చూస్తుంది. ఇందుకు మరొక తాజా నిదర్శనం సునీల్ పరిహార్, నెటాలీ. వీళ్ల కథ రైలు పట్టాల మీద దొరకలేదు. రక్తపు ఉత్తరాల్లో దొరకలేదు. నదిలో దొరకలేదు. సముద్రంలో దొరకలేదు. కథలన్నీ చేరే కంచిలోనూ దొరకలేదు. మరెక్కడ దొరికింది? కాశీలో! ఉత్తర ప్రదేశ్‌లోని కాశీలో. సునీల్‌ది కాశీ. నెటాలీది స్విట్జర్లాండ్! ఇద్దరి మధ్య దూరం 7000 కి.మీటర్లు. విమాన మార్గంలో అయితే 4500 మైళ్ల దూరం. స్విట్టర్లాండ్ నుండి ఇండియా రావాలంటే ఒక దారిలో ఇటలీ, గ్రీసు, టర్కీ, సిరియా, ఇరాక్ దాటి రావాలి. ఇంకో దారిలో ఆస్ట్రియా, రొమేనియా, టర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దాటుకుని రావాలి. ఏం? మగపిల్లాడు కదా, అబ్బాయే ఇండియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్లకూడదా... అంత ప్రేమ ఉంటే?! ప్రేమ ఉంది కానీ, వెళ్లే స్థోమత లేదు. టెన్త్ క్లాస్‌లో బడి మానేసి, బతుకు తెరువుకోసం బొమ్మలేసుకుంటున్న వాడు అంతదూరం ఎలా వెళ్లగలడు? అందుకే అమ్మాయే ఇండియా వచ్చేసింది. స్విట్జర్లాండ్‌లో చేస్తున్న టీచర్ ఉద్యోగం మానేసి మరీ సునీల్ కోసం ఇండియా వచ్చేసింది. సునీల్ కోసం కాదు. సునీల్ ప్రేమ కోసం. అంతగా అతడు ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ మెయిల్స్ పంపుకున్నారు. ఫోన్లో మాట్లాడుకున్నారు. చివరికి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనుకున్నారు. ఇద్దరికీ రెండు దేశాల్లో ఎవరి కుటుంబాలు వారికి ఉన్నాయి. ఎవరి పెద్దలు వారికి ఉన్నారు. ఏడాది వ యసున్న వీళ్ల ప్రేమ గురించి రెండు దేశాల్లో, రెండు కుటుంబాలకీ తెలుసు. ఇండియా వెళ్తున్నానని నెటాలీ ఇంట్లో చెప్పి వచ్చింది. నెటాలీని ప్రేమించానని తన ఇంటికి తీసుకెళ్లి మరీ చెప్పాడు సునీల్. అలాగే పెళ్లి విషయం కూడా. కొడుకు మాట కాదనలేదు సునీల్ తల్లిదండ్రులు. అయితే పెళ్లి మాత్రం తమ కళ్లముందే జరగాలని ఆశపడ్డారు. రెండు దేశాల మధ్య పెళ్లంటే ఇంట్లో పెళ్లి పందిట్లో జరిగితే సరిపోదు. అందుకే సునీల్, నెటాలీ కలిసి కాశీకి దగ్గర్లోని టికంఘర్లోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు. లాంఛనాలన్నీ (పెళ్లి లాంఛనాలు కాదు, అధికార లాంఛనాలు) పూర్తవడానికి రెండు నెలల సమయం పడుతుందనీ, అంతవరకు ఆగాలనీ అక్కడి అధికారులు చెప్పారు. అంతదూరం నుండి వచ్చిన దానిని ఎంతకాలమైనా ఆగుతాను అని నెటాలీ చిరునవ్వులు చిందిస్తుంటే , ఆమె భుజానికున్న బ్యాగును సరిచేస్తూ ఆమెను ప్రేమగా అనుసరిస్తున్నాడు సునీల్. ఏడాది క్రితం సునీల్‌ను నెటాలీ కలుసుకున్నది తొలిసారిగా అతడి గ్యాలరీలోనే. ఆ తర్వాతే వారిలో ప్రేమ చిగురించింది. ఆన్లైన్లో అతడి బొమ్మల్ని ప్రేమించిన నెటాలీ, ‘లైఫ్’లైన్లో అతడిని ప్రేమించడం మొదలుపెట్టింది. సునీల్ చక్కగా ఇంగ్లిషు మాట్లాడతాడు! నెలాలీ చక్కగా హిందీ అర్థం చేసుకోగలుగుతుంది. ఇక ప్రేమకు అడ్డేముంటుంది. ప్రేమకు దూరమేముందీ?