
కాశీరాం, దేవేంద్ర
తూప్రాన్: వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. గురువారం తెల్లవారు జామున రైలు కింద పడి బలవంతంగా తనువు చాలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉంది. కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లి జరి గింది. కుటుంబ తగాదాల కారణంగా భార్య తో విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న దేవేంద్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకు న్నాయి. కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయం దుబాయ్‌లో ఉన్న రఘుకు తెలియంతో భార్య తనకు వద్దని కులపెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో రాత్రి రైలు దిగిన వారు తమ వెంట ఉన్న దేవేంద్ర కూతురును స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment