Devendra
-
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
Devendra Jhajaria: పార్లమెంట్ బరిలో పతకాల వీరుడు
Paralympian Devendra Jhajaria: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది. భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్‌ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి. -
స్వర్గలోకానికి స్వాగతం
‘‘విక్రమార్కా... మన ఇంద్ర తెలుసుకదా నీకు?’’ అడిగాడు భుజం మీది భేతాళుడు.‘‘నాకు తెలియకపోవడం ఏమిటి! దాయి దాయి దామ్మ నా ఫేవరెట్ సాంగ్’’ వీణ డ్యాన్స్ చేస్తూ చెప్పాడు విక్రమార్కుడు.‘‘నేను చెప్పేది ఇంద్ర సినిమా గురించి కాదు... ఇంద్రుడి గురించి, స్వర్గలోకాధిపతి దేవేంద్రుడి గురించి. ఆయన ఈమధ్య తరచుగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తున్నాడట. ఎందుకో చెప్పకపోతే... నీ తల హాంఫట్’’ అని హెచ్చరించాడు భేతాళుడు.విక్రమార్కుడు చెప్పడం మొదలుపెట్టాడు....∙∙ అనగనగా ముగ్గురు వ్యక్తులు. చీమకు కాదు దోమకు కూడా హాని తలపెట్టని మహానుభావులు. ఒకరోజు ఏదో పనిమీద ఈ ముగ్గురూ కారులో ప్రయాణిస్తున్నారు. వెళుతూ వెళుతూ ఒక వర్షం కురిసిన రాత్రి ఈ కారు వెళ్లి ఒక చెట్టును ఢీకొట్టింది. అంతే, ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. సరాసరి స్వర్గానికి వెళ్లిపోయారు. అక్కడ కొండవీటి చాంతాడంతా క్యూ ఉంది.‘‘పాపం పెరిగింది... పాపం పెరిగింది అంటాంగానీ అంతా ఉత్తదే. ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి. సినిమా టికెట్ కౌంటర్ల దగ్గర కూడా ఇంత క్యూ ఉండదు’’ అన్నాడు ముగ్గురిలో ఒకరు.‘‘నిజమే సుమా!’’ అన్నారు ఇద్దరు స్నేహితులు.స్వర్గద్వారాలు అప్పుడే తెరిచారు.ఇక అంతే...‘నేను ముందు అంటే కాదు నేను ముందు’ అంటూ జనాలు తోసుకోవడం స్టార్ట్ అయింది.ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఒకరినొకరు తోసుకుంటున్నారు. పెద్దగా అరుపులు కేకలు.ఈలోపు ఎవరిదో పర్స్ కొట్టేశారు. ఒకరి సెల్‌ఫోన్ దొంగిలించారు.‘‘అయ్యో నా పర్సు...’’‘‘అయ్యో నా సెల్‌ఫోన్’’‘‘షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి నా ఉంగరం కొట్టేశాడు’’ఈ శబ్దాలను మించిన శబ్దంతో...‘‘దయచేసి ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి. సైలెన్స్‌గా ఉండండి. నాపేరు పరోపకారి పాపన్న. ఇంద్రుడిగారి పర్సనల్ సెక్రెటరీని’’ అని అరిచాడు బంగారు కిరీటం పెట్టుకున్న పొడవాటి వ్యక్తి.‘‘ఇంద్రుడి సెక్రటరీ వచ్చాడు’’ అనేమాట చెవిన పడగానే అందరూ సైలెంటైపోయారు.పీయే మళ్లీ మాట్లాడం మొదలు పెట్టాడు...‘‘డీయర్ ఫ్రెండ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. సపోజ్ మీరు కాకినాడకు వెళ్లాలనుకొని సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లి తెలుగు టీవీ సీరియలంత క్యూలో నిల్చొని నానా ఆపసోపాలు పడి టికెట్టు కొంటారు. తీరా ట్రైన్ ఫ్లాట్‌ఫాం మీదికి వచ్చాక రెట్టింపు ప్రయాణికులు. కొందరు కిటికీలో నుంచి కూడా ట్రైన్లో దూరడానికి ప్రయాత్నిస్తుంటారు. ఓరి నాయనో ఈ ట్రైన్లో వెళితే కాకినాడకు వెళ్లం... సరాసరి నరాకానికి వెళతాం. బతికుంటే దీని తరువాతి ట్రైన్ బఠానీలు అమ్ముకోవచ్చు అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంటారు. సేమ్ టు సేమ్ అండీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీ అందరి దగ్గర స్వర్గానికి రావడానికి అవసరమైన టికెట్లు ఉన్నాయి. సీట్లేమో చా....లా తక్కువగా ఉన్నాయి.’’ అని నసిగాడు పీయే.‘‘ఇప్పుడేమంటావు? నరకానికి వెళ్లమంటావా ఏమిటి?’’ ఒకాయన వీరావేశంగా దూసుక్చొడు. ‘‘ఎందుకయ్యా అంత కోపం. ఇక్కడ సీట్లు లేవంటే నరకానికి వెళ్లమని కాదు కదా అర్థం’’ అన్నాడు పీయే.‘‘అంటే మళ్లీ వెనక్కి... అదే భూలోకానికి వెళ్లమంటావా ఏమిటి? అలా వెళితే ఇంకేమైనా ఉందా! దెయ్యం, దెయ్యం అంటూ అందరూ పారిపోతారు’’ అన్నాడు ఇంకో ఆయన ఆవేదనగా.ఇంతమందికి స్వర్గంలో ప్రవేశం ఎలా కల్పించాలని ఒకవైపు పరోపకారి పాపన్న తల మీద జుట్టు పీక్కొనుచుండగా మరోవైపు ఏం జరుగుతుందో చూడండి...ఒక దగ్గర:‘జస్ట్ రెండు కోట్లు... రెండే కోట్లు’ అని అందరి చెవిలో రహస్యంగా చెబుతూ పోతున్నాడు ఒకడు. అతని చేతిలో నలుపు రంగులో టికెట్లు ఉన్నాయి.‘‘ఏమిటిది?’’ అని ఆరాతీశాడు ఒక పెద్దాయన.‘‘కనిపించడం లేదా? బ్లాక్టికెట్స్’’ అన్నాడు ఆ వ్యక్తి మెల్లగా.‘‘బ్లాక్టికెట్లా? ఇక్కడ సినిమా హాలు ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ బోసినోరు పెద్దాయన.‘‘స్వర్గం ఉంది. ఆ స్వర్గంలోకి వెళ్లామంటే ఒక్కటనేమిటీ వందలాది సినిమా హాళ్లు కనిపిస్తాయి. రంభ, ఊర్వశీ, మేనకల లైవ్డ్యాన్స్ పోగ్రాం చూడొచ్చు. ఇంకా....’’ అంటూ చెప్పుకుపోతున్నాడు ఆ గళ్ల చొక్కా వ్యక్తి.ఈలోపు హెవెన్ పోలీస్ స్క్వాడ్ వాళ్లు అక్కడికొచ్చి గళ్ల చొక్కా వ్యక్తిని నాలుగు బాది సెల్లో వేశారు.‘‘ష్...ష్....’’ అంటూ సుబ్బారావు అప్పారావును రహస్యంగా గిచ్చాడు.‘‘ఏమిటి?’’ అన్నాడు గిచ్చబడిన అప్పారావు.సుబ్బారావు: కోచింగ్ సెంటర్‌కు నాతో పాటు వస్తావా!అప్పారావు: కోచింగ్ సెంటరేమిటి?! మనమేమన్నా ఎమ్సెట్ ఎగ్జామ్స్ రాస్తున్నామా! సుబ్బారావు: ఎమ్సెట్ కాదు హెవెన్సెట్ అప్పారావు: హెవెన్సెటా? అదేమిటి? సుబ్బారావు: స్వర్గంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ హెవెన్సెట్ ప్లాన్ చేశారు. ఇందులో మంచి ర్యాంకులు తెచ్చుకున్నవాళ్లకే స్వర్గంలో ప్రవేశం ఉంటుందట. మనకు సీటు దొరకాలంటే స్టార్ కోచింగ్ సెంటర్లో చేరడం మంచిది. ఈ కోచింగ్ సెంటర్లో చేరిన వారికి గతంలో మంచి మంచి మార్కులు వచ్చాయట’’మరో దగ్గర:‘‘ఒరేయ్ గుర్నాథం... నీకో బ్రేకింగ్ న్యూస్!’’‘‘బ్రేకింగ్ న్యూస్‌ల గొడవ ఇక్కడ కూడా తప్పడం లేదా! ఏమిటో చెప్పు’’‘‘హెవెన్సెట్ పేపర్ లీకైందట!’’‘‘పేపర్ లీకైందా? ఇప్పుడెలా?’’‘‘గ్యాస్ లీకైనట్లు ముఖం పెడతావేమిటి? ఆ లీక్ చేసిన వాడు మా ఫ్రెండ్ బామ్మర్దికి స్వయాన బావ. నువ్వు ఓకే అంటే నేను బేరం మాట్లాడతాను’’‘‘డబ్బులదేముంది. పాపిష్ఠి డబ్బు. మనకు స్వర్గం ముఖ్యం’’∙∙ నిద్రలోకం నుంచి ఉలిక్కిపడి లేచాడు ఇంద్రుడు.‘‘ఏమిటి అలా లేచారు?’’ అడిగింది ఆయన భార్య కంగారుగా.‘‘ఏమిలేదు దేవీ. రాత్రి ఒక పీడడ్రీమ్ వచ్చినది. ఆ డ్రీమ్‌లో స్వర్గంలోకి ప్రవేశించడానికి కొందరు మానవులు రకరకాల వక్రమార్గాలు అనుసరిస్తున్నరట. నాకేందుకో భయముగా యున్నది’’ అన్నాడు ఇంద్రుడు.‘‘ఈ మానవులు ఎంతకైనను తెగించువారు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని ఇంద్రుడికి జాగ్రత్తలు చెప్పింది శచీదేవి. – యాకుబ్ పాషా -
వివాహేతర బంధానికి బలి
తూప్రాన్: వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. గురువారం తెల్లవారు జామున రైలు కింద పడి బలవంతంగా తనువు చాలించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కామారెడ్డి రైల్వే ఎస్సై తావునాయక్ తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డిలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం(35) వరుసకు మరదలైన దేవేంద్ర(30)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దేవేంద్ర భర్త రఘు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. వీరికి 5 ఏళ్ల బాబు, ఏడాది పాప ఉంది. కాశీరాంకు కూడా గతంలోనే పెళ్లి జరి గింది. కుటుంబ తగాదాల కారణంగా భార్య తో విడాకులు తీసుకున్నాడు. ఈ సమయంలో ఒంటరిగా ఉంటున్న దేవేంద్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకు న్నాయి. కులపెద్దలు పంచాయితీ నిర్వహించి కాశీరాంకు రూ.3 లక్షల వరకు జరిమానా విధించారు. ఈ విషయం దుబాయ్‌లో ఉన్న రఘుకు తెలియంతో భార్య తనకు వద్దని కులపెద్దలతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కాశీరాం, దేవేంద్ర బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్లో రాత్రి రైలు దిగిన వారు తమ వెంట ఉన్న దేవేంద్ర కూతురును స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై వదిలిపెట్టి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
మహారాష్ట్ర కొత్త సి.ఎమ్.దేవేంద్ర ఫడ్నవీస్
-
విదర్భ బీజేపీలో ‘సీఎం’ రగడ!
* ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్న దేవేంద్ర, గడ్కరీ * దేవేంద్ర వైపే అధిష్టానం మొగ్గు * గడ్కరీ కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న ‘విదర్భ’ నాయకులు సాక్షి, ముంబై: సీఎం పదవి విదర్భ బీజేపీలో చిచ్చురేపుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు సీఎం రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం విదర్భకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్‌వైపే మొగ్గుచూపినట్లు సమాచారం. కాగా, విదర్భలో బీజేపీకి ఎక్కువ స్థానాలు లభించేలా కీలకపాత్ర పోషించిన నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటం విశేషం. అయితే బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే విధంగా విదర్భకు చెందిన గడ్కరీ అనుకూలురైన సుధీర్ మునిగంటివార్, వినోద్ తావ్డే, కృష్ణ కోపడే వంటి నాయకులు గడ్కరీ పేరును సీఎం పదవికి పరిశీలించాలని బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండటం విశేషం. అలాగే విదర్భ నుంచి ఎన్నికైన 44 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సైతం నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడం విశేషం. వీరంతా తమ శాయశక్తులా అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు యత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు బెడిసికొట్టాయనే చెప్పవచ్చు. ఎందుకంటే అధిష్టానం ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గడ్కరీ కోసం రాజీనామా చేస్తా : కృష్ణ కోపడే నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని తనతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరూ కోరుకుంటున్నారని కృష్ణ కోపడే పేర్కొన్నారు. ఆయన పోటీచేసేందుకు వీలుగా తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కృష్ణ కోపడే తూర్పు నాగపూర్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భలో గ్రూప్‌లుగా చీలిన బీజేపీ..? విదర్భలో బీజేపీ రెండు గ్రూప్‌లుగా చీలిపోయిందని తెలుస్తోంది. ఒకవైపు విదర్భకే చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కానున్నారన్న ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ అదే ప్రాంతానికి చెందిన నితిన్ గడ్కరీ ఇంకా రేసులో ఉండటం గమనార్హం. నితిన్ గడ్కరీని సీఎం చేయాలని కోరుతున్నవారందరూ విదర్భకి చెందిన వారే కావడం విశేషం. దీంతో విదర్భలో బీజేపీ దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరీ గ్రూపులుగా చీలిపోయిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. శివసేనకే ఎక్కువ నష్టం.. పాతికేళ్ల పాటు కొనసాగిన మహా కూటమి బీటలు వారిన మీదట బీజేపీకన్నా ఎక్కువ నష్టం వాటిల్లింది శివసేనకేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో అన్ని పార్టీలు ఒంటరిపోరుకు దిగిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని సుమారు 50 నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అయితే గత ఎన్నికల్లో శివసేన గెలుచుకున్న 13 స్థానాలను ఈ ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.కాగా, గత ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో ఉన్న ఒకే ఒక స్థానాన్ని శివసేన కైవసం చేసుకుంది. దీంతో ఎక్కువ నష్టపోయింది శివసేనేనని స్పష్టమవుతోంది. 2009 ఎన్నికల్లో బీజేపీ 46, శివసేన 44 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సారీ పొత్తు బెడసి కొట్టడంతో వేర్వేరుగా పోటీచేసినప్పటికీ ఇందులో శివసేన గెలిచిన 44 సీట్లలో నుంచి 13 సీట్లు బీజేపీ తమవైపు లాక్కుంది. అదేవిధంగా బీజేపీ గెలిచిన 46 సీట్లలో కేవలం భివండీ గ్రామీణ నియోజకవర్గాన్ని శివసేన చేజిక్కించుకోగలిగింది.