
వీడియో దృశ్యాలు
సాక్షి, నల్గొండ : తనను పట్టించుకోకుండా పరాయి మహిళతో సహ జీవనం చేస్తున్న భర్తకు గట్టిగానే బుద్ధిచెప్పిందో భార్య. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బంధువుల సహాయంతో దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. కనగల్ మండలం ధర్వేశిపురానికి చెందిన మాధవి అనే మహిళతో చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాతో 2011లో వివాహం జరిగింది. ( బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. )
కారు డ్రైవర్‌గా పనిచేసే సాయి.. భర్త చనిపోయిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య భార్యను పట్టించుకోవటం మానేశాడు. సాయి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న భార్య, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మాధవి, ఆమె తరపు బంధువులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment