
మా పొట్ట కొట్టొద్దు
జంగారెడ్డిగూడెం: దుకాణాలు తొలగించి తమ పొట్ట కొట్టొద్దంటూ చిరు వ్యాపారులు రాస్తారోకో చేశారు. మండలంలోని వేగవరం జాతీయ రహదారిపై గురువారం పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ నిరసన తెలిపారు. చిరు వ్యాపారులను ఖాళీ చేయించేందుకు రెవెన్యూ అధికారులు పొక్లెయిన్‌తో రాగా ఆందోళనకు దిగా రు. తాము 40 ఏళ్లుగా రోడ్డు పక్కనే చిరు వ్యా పారాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, కొంతకాలంగా కొందరు దళారులు వచ్చి దుకాణాలు తొలగించాలని బెదిరిస్తున్నారన్నారు. తమ వద్ద నుంచి రూ.10 వేల చొప్పున తీసుకున్నారని, మళ్లీ వారే వెళ్లి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని, చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్ద ని అధికారులకు సూచించారన్నారు. ఆందోళనతో రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.