
ఆదర్శనీయులు జ్యోతిరావు పూలే
కై కలూరు: సమాజ దురాచారాలను ఎదుర్కొనే ఆయుధంగా చదువును మలిచిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శనీయులని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. శుక్రవారం పూలే జయంతి సందర్భంగా పట్టణంలోని కో రుకొల్లు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఎన్నార్ మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ ముదురాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధనరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోట్రూ అర్జునరావు మాట్లాడా రు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, రా ష్ట్ర రైతు విభాగ సెక్రటరీ సయ్యపురాజు గుర్రాజు, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ జయమంగళ కాసులు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు కూర్మా నేహీమియా, బోయిన చంద్రభోగేశ్వరరావు, మహమ్మద్ గాలిబ్‌బాబు, గండికోట ఏసుబాబు, పాము రవికుమార్, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సెక్రటరీగా తుమూరి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ సెక్రటరీలుగా గరికిముక్కు జాన్‌విక్టర్, బూరుగుపల్లి ప్రేమ్ కుమార్‌ను నియమించారు.
సూత్రధారులను వదిలి పాత్రధారుల అరెస్టా?
కొయ్యలగూడెం: సూత్రధారులను వదిలి పా త్రధారులను అరెస్టు చేసి కూటమి ప్రభుత్వం చట్టాన్ని పక్కదోవ పట్టిస్తోందని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. శుక్రవా రం వైఎస్సార్‌సీపీ యూత్ నేత నూకల రాము ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పార్టీ పోలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై కిరణ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితుడు కిరణ్ వెనకున్న అసలు దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. కిరణ్‌ని అరెస్టు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని వక్రీకరిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నా రు. జగన్‌ని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చే సుకుని అసత్యపు ఆరోపణలు చేస్తోందన్నారు. నిలకడ లేని రాజకీయాలకు పవన్ కల్యాణ్, నైతిక విలువలు లేని రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారని అన్నారు. వైఎస్సార్‌సీపీ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలకు రుచి చూపిస్తామని బాలరాజు హెచ్చరించారు. మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, జెడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, టౌన్ కన్వీనర్ సంకు కొండ, ఎంపీటీసీ ఘంటసాల సీనమ్మ, నాయకులు పాల్గొన్నారు.
నేడు రిజిస్ట్రేషన్‌కార్యాలయాలు పనిచేస్తాయి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలు శనివారం పనిచేస్తాయని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కె.శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సా యంత్రం 5.30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయన్నారు. ఇదిలా ఉండగా రెండో శని వారం, సెలవు రోజుల్లో కార్యాలయాలు తెరవడంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్ కోర్సుల ప్రాక్టికల్ పరీ క్షలు శుక్రవారం ముగిశాయి. భౌతికశాస్త్రం, ర సాయనశాస్త్రం పరీక్షలకు 67 మంది హాజర య్యారని డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు.