
ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ
జంగారెడ్డిగూడెం: ఇంటర్ ఫలితాల్లో విద్యా వికాస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు కళాశాల యాజమాన్యం పి.సతీష్‌చంద్, వి.శ్రీనివాస్‌లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో పి.పూర్ణ, ఎ.శ్రావ్యసుష్మ, కె.మౌనిక 465 మార్కులు, భాస్కర్ జాన్ లెన్సన్, డి.జోత్న్సశ్రీ, సింధు ప్రసన్న, హర్షిత 464 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో షణ్ముఖ నాగ చైతన్య ఆంజనేయులు 435, ఎస్.శరణ్య, సురేష్ 434 మార్కులు సాధించారన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో పి.దేదీప్య 990, వై.అమృత 988, బైపీసీలో ఆర్.శ్రావణిలక్ష్మి 984 మార్కులు సాధించినట్లు చెప్పారు.
శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు..
తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరి నాగేశ్వరరావు, గర్రే శ్రీధర్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పరిటాల ఉష 466, బైపీసీలో పి.లాస్య 433 మార్కులు, సీఈసీలో టి.బిందు 483 మార్కులు సాధించినట్లు చెప్పారు. సీనియర్ ఇంటర్‌లో ఎంపీసీ విభాగంలో ఎస్.సంజన కావ్య, ఎ.హెన్నాగ్రేస్‌లు 988 మార్కులు, బైసీపీలో జి.దివ్య సత్యశ్రీ 989 మార్కులు సాధించినట్లు తెలిపారు.
రాణించిన శ్రీరామచంద్ర విద్యార్థులు
ఇంటర్ ఫలితాల్లో శ్రీరామచంద్ర విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారని శ్రీ రామచంద్ర విద్యాసంస్థల చైర్మన్ బీవీ కృష్ణారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో డి. శ్రీలక్ష్మి 984, వి.యామిని 983 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్‌డి అజిమున్సీసా 962, ఎం.నాగశ్రీ 960, సీఈసీలో ఎం.ఈశ్వరి 960, జి.సంతోషి 957 మార్కులు సాధించినట్లు చెప్పారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో పీబీఎన్‌వీ సంపత్ 455, జి.కార్తిక్ సాయి 447, బైపీసీలో డి.లీల వెంకట శివ సంజయ్ 411, సీఈసీలో ఎన్.సురేఖ 437 మార్కులు సాధించినట్లు తెలిపారు.
మాధవ్ అరెస్టుపై కురుమల ఆగ్రహం
కురుమ కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ
దెందులూరు: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసి రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైగా కురుమ కులస్తుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురైందని కురుమ కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎం.సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోమవరప్పాడులో కురుమ సంఘ కార్యాలయంలో, మండల నాయకులు సొసైటీ మాజీ చైర్మన్ మేక సాంబశివరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయన్నారు. బలహీన వర్గాల ప్రజలను, వారి ప్రతినిధులను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని అభాసుపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తే ఏ వ్యక్తి అయినా యోగా చేస్తూ కూర్చోలేరన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే ఉండదన్నారు. తీవ్ర దూషణలు చేసిన టీడీనీ కార్యకర్తను నామమాత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేస్తే ఈ సంఘటన ఇక్కడితో అయిపోయిందనుకుంటే కూటమి ప్రభుత్వం భ్రమేనన్నారు. గోరంట్ల మాధవ్‌పై పోలీస్ శాఖ తీరు కురుమ కులస్తులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు.

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ