
వక్ఫ్ బిల్లుపై నిరసన హోరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద కర్బలా మైదానం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. ముస్లిం యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎండీ ఇలియాజ్ మాట్లాడుతూ ముస్లిం పూర్వీకులు పుణ్యం కోసం దానం చేసిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా వక్ఫ్ సవరణ చట్టం రూపొందించారని విమర్శించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యవాదులంతా చట్టాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ర్యాలీకి వైఎస్సార్‌సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, నాయకులు మద్దతు తెలిపారు. అలా గే ర్యాలీకి ఎమ్మెల్యే బడేటి చంటి మద్దతు తెలపడం గమనార్హం. ర్యాలీలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రా జనాల రామ్మోహన్‌రావు, కమ్యూనిస్టు పార్టీ నా యకులు, ముస్లిం పురుషులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో శేషగిరికి వినతిపత్రం ఇచ్చారు. అంజుమన్ అధ్యక్షుడు ఎండీ జబివుల్లా, జమాత్ ఇస్లాం అధ్యక్షుడు ఇబ్రహీం, నయీముల్లా, రియాజ్, జావీద్, సూ రజ్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో భారీ ర్యాలీ

వక్ఫ్ బిల్లుపై నిరసన హోరు