
అంబేడ్కర్ జయంతి వేడుకలకు సుబ్బయ్యకు ఆహ్వానం
భీమవరం: భారత పార్లమెంట్‌లో ఈ నెల 14న నిర్వహించనున్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని పట్టణానికి చెందిన ఫౌండేషన్ కేంద్ర బోర్డు సభ్యుడు గరికిముక్కు సుబ్బయ్యకు ఆహ్వానం అందిందని శుక్రవారం ఆయన విలేకరులకు తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, అంబేడ్కర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నుంచి తనకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సుబ్బయ్య తెలిపారు.
శ్యాంప్రసాద్‌కు అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు
మండవల్లి: మండలంలోని కానుకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు కురేళ్ల శ్యాంప్రసాద్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు, విద్యార్థుల ఉన్నతికి చేస్తున్న కృషికి బీఆర్ అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రైవేట్ లెక్చరర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య శుక్రవారం తెలిపారు. ఈ నెల 13న గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ పురస్కారాన్ని అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సర్పంచ్ థామస్, గ్రామ పెద్దలు శ్యాంప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.
నాటుసారా బట్టీపై మెరుపు దాడులు
చాట్రాయి: మండలంలోని పోలవరంలో ముందస్తు సమాచారంతో నూజివీడు ఎకై ్సజ్ ఎస్సైలు వై.ఈశ్వరరావు, ఎం.ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రజువారం సారాబట్టీపై మెరుపు దాడి చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎ.మస్తానయ్య తెలిపారు. ఈ దాడిలో ఓ తోటలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న బిలుగుది చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే సారా తయారీ కోసం ఊరబెట్టిన 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.

అంబేడ్కర్ జయంతి వేడుకలకు సుబ్బయ్యకు ఆహ్వానం