
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
భీమవరం అర్బన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయా లని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. మండలంలోని గొల్లవానితిప్పలో శనివారం పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో, వెంపలో పి.గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ అంబేద్కర్ అన్నివర్గాలకు అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేడ్కర్ మన దేశంలో పుట్టడం దేశ ప్రజల అదృష్టమన్నారు. పీఏసీ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే అందరికీ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, నాయకులు మెంటే పార్థసారథి, వబిలిశెట్టి రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ పెనుమాల నరసింహస్వామి, మాజీ సర్పంచ్ బోకూరి విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు