వక్‌్ఫ సవరణ బిల్లుకు వ్యతిరేకం
ఏలూరు టౌన్: ముస్లింలు వక్ఫ్ సవరణ బిల్లును తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని, ప్రతిఒక్కరూ బి ల్లును వ్యతిరేకించాలని జిల్లా వక్ఫ్‌బోర్డ్ మాజీ చైర్మన్ డాక్టర్ కామిలు జమ అన్నారు. వక్ఫ్‌బోర్డ్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్‌తో కలిసి గురు వారం ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లుతో ముస్లిం, మైనార్టీలకు జరిగే నష్టాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికే ముస్లిం, మైనార్టీలకు చెందిన ఆస్తులు, భూముల్లో 50 శాతం ముస్లిమేతరులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చే శారు. ఢిల్లీలోనే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 30 శాతం వక్ఫ్ భూములను ఆక్రమించుకుందన్నారు. వక్ఫ్‌బోర్డు ఎవరి ఆస్తులను లాక్కోలేదని స్పష్టం చేశారు.
నేడు భారీ ర్యాలీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఏలూ రు వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకులు తెలిపారు. స్థానిక కర్బలా మైదానం నుంచి మధ్యా హ్నం 2.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.


