
పోలీసులను ఆశ్రయించిన దస్తగిరమ్మ
కర్నూలు, ఆళ్లగడ్డ టౌన్: చిత్రంలో అమాయకంగా కనిపిస్తున్న మహిళ పేరు దస్తగిరమ్మ. జి. జంబులదిన్నె గ్రామానికి చెందిన ఈమెకు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన పెద్దదస్తగిరితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఈమెకు ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లాడికోసం ఈమె భర్త రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. విడాకుల కోసం భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి గెంటివేయడంతో ఆమె పుట్టింటికి చేరింది. దీంతో తండ్రితో కలిసి శుక్రవారం స్థానిక టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయమై ఎస్‌ఐ ప్రియతంరెడ్డి మాట్లాడుతూ..దస్తగిరి వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడానికి దస్తగిరమ్మ వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చి విభేదాలు లేకుండా కాపురం చేసుకోవాలని పంపించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment