ఆయన చీర మాత్రమే కట్టుకుంటాడు
బెంగళూరు: ఇంట్లో తన భర్త మహిళలా ప్రవర్తిస్తున్నాడని, ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని (29) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఏడాది క్రితం బెంగళూరులో వివాహం జరిగింది. బెంగళూరులోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో భర్త వైఖరిని భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
'మా ఆయన పగలు ఆఫీసుకు వెళతాడు. ఇంటికి వచ్చాక నాలా మేకప్ వేసుకుంటాడు. రాత్రి పూట ఆయన చీర మాత్రమే ధరిస్తాడు. మహిళలా ప్రవర్తిస్తాడు. మా వివాహమై ఏడాది అయినా మేమిద్దరం దగ్గర కాలేదు. ఆయన నపుంసకుడు. పెళ్లయిన మొదటి రోజు నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఆయన అసహజమైన శృంగారం కోరుకుంటాడు. ఆయన వైఖరిని భరించలేకపోతున్నాను. భర్త నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను' అని సంబంధిత వివాహిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె నుంచి విడిపోయేందుకు భర్త అంగీకరించాడు.