
ప్రతీకాత్మక చిత్రం
మంగళగిరి(గుంటూరు జిల్లా): భర్త అదృశ్యంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని భార్గవపేటకు చెందిన పడవల బాలసుబ్రహ్మణ్యం శనివారం భార్య బేబి అఖిలతో కలసి విజయవాడ సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం నేరుగా మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుని బ్యాగు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు.
చదవండి: మరో మహిళతో ఆర్‌ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో..
సినిమా హాలులో ఉన్న భార్య బేబి అఖిల ఎంత సేపటికీ భర్త హాలులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకుని చూడగా అప్పటికే భర్త బ్యాగు సర్దుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment