Missing Husband
-
ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు.. సినిమా మధ్యలో భర్త బయటకువచ్చి..
మంగళగిరి(గుంటూరు జిల్లా): భర్త అదృశ్యంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని భార్గవపేటకు చెందిన పడవల బాలసుబ్రహ్మణ్యం శనివారం భార్య బేబి అఖిలతో కలసి విజయవాడ సినిమాకు వెళ్లాడు. సినిమా మధ్యలో బయటకు వచ్చిన సుబ్రహ్మణ్యం నేరుగా మంగళగిరిలోని తన ఇంటికి చేరుకుని బ్యాగు సర్దుకుని ఎటో వెళ్లిపోయాడు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. సినిమా హాలులో ఉన్న భార్య బేబి అఖిల ఎంత సేపటికీ భర్త హాలులోకి రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి చేరుకుని చూడగా అప్పటికే భర్త బ్యాగు సర్దుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను పట్టించిన ‘టిక్‌టాక్’
చెన్నై : ‘టిక్‌టాక్’ యాప్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మారుమూల పల్లెల్లో కూడా టిక్‌టాక్ ప్రభావం కనిపిస్తుంది. తాజాగా ఇంటి నుంచి పారిపోయిన వ్యక్తిని టిక్‌టాక్ తిరిగొచ్చేలా చేసింది. ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టింది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. అదేలా అంటే.. కృష్ణగిరికి చెందిన సురేశ్‌కు జయప్రదతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2016లో సురేశ్ తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి రాలేదు. భర్త కనిపించకుండా పోవడంతో జయప్రద తీవ్ర మనోవేదనకు గురయ్యారు. భర్త ఆచూకీ కోసం అతని స్నేహితులను, బంధువులను అడిగిచూసింది. అయినా లాభం లేకపోయింది. దీంతో జయప్రద పోలీసులను ఆశ్రయించారు. జయప్రద ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినప్పటికీ పురోగతి కనిపించలేదు. అయితే ఇటీవల జయప్రద బంధువు ఒకరు సురేశ్ పోలికలతో ఉన్న వ్యక్తిని ఒక టిక్‌టాక్ వీడియోలో చూశారు. ఈ విషయాన్ని జయప్రదకు చెప్పగా.. ఆ వ్యక్తి సురేశ్ అని ఆమె నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు హోసూర్‌లో సురేశ్‌ను గుర్తించారు. ‘సురేశ్ కుటుంబ సమస్యల కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం హోసూర్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు, అక్కడ ఒక ట్రాన్స్ఉమెన్తో కలిసి సురేశ్ జీవనం సాగిస్తున్నారు. సదురు ట్రాన్స్ ఉమెన్‌తో కలిసి చేసిన టిక్‌టాక్ వీడియోలోనే సురేశ్ బంధువులు అతన్ని గుర్తించారు. సురేశ్‌కు, జయప్రదకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ఇళ్లకు పింపిచామ’ని పోలీసులు తెలిపారు. -
తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదు
తమిళసినిమా : నా భార్య తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదంట్టున్నారు ఆమె భర్త త్యాగు. ప్రముఖ కవయిత్రి సీనీ గీత రచయిత తామరై తన భర్త త్యాగు ఇల్లు వదిలి పారి పోయాడని, తను తిరిగొచ్చి క్షమాపణ చెప్పాలంటూ శుక్రవారం ఉదయం స్థానిక చూళైమేడులోని భర్త ఇంటి వద్ద నిరాహారదీక్షకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆమె శనివారం కూడా నిరాహారదీక్షను కొనసాగించారు. తామరై వ్యవహారాన్ని చానెళ్లలో చూసిన ఆమె భర్త త్యాగు స్పందిస్తూ తామరైతో కలిసి జీవించడం తనకిఇష్టం లేదన్నారు. అయితే తను చెబుతున్నట్లు తానెక్కడికీ పారిపోలేదనీ, స్థానిక వేళచ్చేరిలో తన కుమార్తె వద్ద వుంటున్నానని తెలిపారు. తాయరై ఆరోపణలకు బదులిస్తున్నట్లూ తెలిపారు. గత ఏడాది నవంబరు 23 నుంచి తాను తామరైతో కలిసి ఉండడం లేదన్నది వాస్తవమేనన్నారు. ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్లుగా మా జీవితం సమస్యలమయంగా మారిందన్నారు. అప్పట్నించే మనస్పర్థలు తలెత్తాయన్నారు. దాంతో ఇద్దరం విడిపోవాలని తాను భావిస్తున్నానన్నారు. ఈవిషయాన్ని లేఖ ద్వారా పలు మార్లు తనకి తెలిపానన్నారు. అందుకామె నుంచి బదులు లేదన్నారు. చట్టబద్ధంగా విడిపోదామన్నా ఒప్పుకోవడం లేదని అన్నారు. తామరై గొప్ప కవయిత్రి, మంచి ఆలోచనాపరురాలన్నారు. అయితే కుటుంబ జీవనం వేరు సామాజిక అంశం వేరన్నారు. తను అలా చూడటంలేదని ఆరోపించారు. అందువల్ల ఆమెతో కలిసి జీవించడం తనకిష్టంలేదన్నారు. అయితే కొడుకును వదిలి ఉండడమే బాధగా ఉందన్నారు. తామరై తాను ఇకపై కలిసి జీవించే ప్రసక్తే లేదని త్యాగు అన్నారు.