తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదు | Famous Lyricist Protests For Missing Husband, Thamarai | Sakshi
Sakshi News home page

తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదు

Published Sun, Mar 1 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదు

తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదు

 తమిళసినిమా : నా భార్య తామరైతో కలిసి జీవించడం ఇష్టం లేదంట్టున్నారు ఆమె భర్త త్యాగు. ప్రముఖ కవయిత్రి సీనీ గీత రచయిత తామరై తన భర్త త్యాగు ఇల్లు వదిలి పారి పోయాడని, తను తిరిగొచ్చి క్షమాపణ చెప్పాలంటూ శుక్రవారం ఉదయం స్థానిక చూళైమేడులోని భర్త ఇంటి వద్ద నిరాహారదీక్షకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఆమె శనివారం కూడా నిరాహారదీక్షను కొనసాగించారు. తామరై వ్యవహారాన్ని చానెళ్లలో చూసిన ఆమె భర్త త్యాగు స్పందిస్తూ తామరైతో కలిసి జీవించడం తనకిఇష్టం లేదన్నారు. అయితే తను చెబుతున్నట్లు తానెక్కడికీ పారిపోలేదనీ, స్థానిక వేళచ్చేరిలో తన కుమార్తె వద్ద వుంటున్నానని తెలిపారు.
 
 తాయరై ఆరోపణలకు బదులిస్తున్నట్లూ తెలిపారు.  గత ఏడాది నవంబరు 23 నుంచి తాను తామరైతో కలిసి ఉండడం లేదన్నది వాస్తవమేనన్నారు. ఇంకా చెప్పాలంటే గత ఐదేళ్లుగా మా జీవితం సమస్యలమయంగా మారిందన్నారు. అప్పట్నించే మనస్పర్థలు తలెత్తాయన్నారు. దాంతో ఇద్దరం విడిపోవాలని తాను భావిస్తున్నానన్నారు. ఈవిషయాన్ని లేఖ ద్వారా పలు మార్లు తనకి తెలిపానన్నారు. అందుకామె నుంచి బదులు లేదన్నారు. చట్టబద్ధంగా విడిపోదామన్నా ఒప్పుకోవడం లేదని అన్నారు. తామరై గొప్ప కవయిత్రి, మంచి ఆలోచనాపరురాలన్నారు. అయితే కుటుంబ జీవనం వేరు సామాజిక అంశం వేరన్నారు. తను అలా చూడటంలేదని ఆరోపించారు. అందువల్ల ఆమెతో కలిసి జీవించడం తనకిష్టంలేదన్నారు. అయితే కొడుకును వదిలి ఉండడమే బాధగా ఉందన్నారు. తామరై తాను ఇకపై కలిసి జీవించే ప్రసక్తే లేదని త్యాగు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement