చండీగఢ్: ‘ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే సమైక్యంగా ఉంటూ పోరాడాలి’అని రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లెవాల్(70) ఉద్బోధించారు. పంజాబ్–హరియా ణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. డల్లెవాల్ ఆరోగ్యం విషమంగా ఉన్న ట్లు ఆయన్ను పరీక్షించిన వైద్యులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖనౌరీలో ని దీక్షా శిబిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు.
‘నిరశన దీక్షకు మద్దతుగా నిలిచిన వారందరికీహృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నానని, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో మనం గెలవాలి. దేశం యావత్తూ కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నెగ్గగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనల్ని ఇక్కడి నుంచి తొలగించరాదని నేను కోరుతున్నా. ప్రభుత్వం మన పోరాటాన్ని కొనసాగనిస్తే మనం గెలుస్తాం లేదా ఇక్కడే చనిపోతాం. ఈ రెండింటిలో ఒకటి ఖాయం’అని ఆయన స్పష్టం చేశారు.
డల్లెవాల్ చాలా బలహీన స్వరంతో నెమ్మదిగా రెండు నిమిషాలసేపు మాత్రం మాట్లాడగలిగారని ఆయనకు సహాయకుడిగా ఉంటున్న రైతు నేత అభిమన్యు కొహార్ చెప్పారు. తాను బాగానే ఉన్నానంటూ డల్లెవాల్ చెప్పడం అంటే..శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు అర్థమని అనంతరం కొహార్ వివరించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కి చట్టబద్ధత కలి్పంచడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగానే డల్లెవాల్ నిరాహార దీక్ష చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment