
లత(ఫైల్)
బన్సీలాల్‌పేట్: భర్త వేధింపులు తాళలేక ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కవాడీగూడలో ఉంటున్న లత(23) పీఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.
ఆమె భర్త లక్ష్మీ నరసింహ సింగరేణి కాలరీస్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఉదయం తన గదిలోకి వెళ్లి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల . సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకునకన గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.