
వేల్పూర్ : అనుమానపు భర్త ఆడగాలు తాళలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వేల్పూర్ ఎస్సై శ్రీధర్‌గౌడ్ కథనం మేరకు.. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామానికి చెందిన బోనాల స్వరూప (34), గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు రాంప్రసాద్ (4), కృతిక్ (1) ఉన్నారు. అయితే, భర్త తరచూ స్వరూపను అనుమానిస్తుండే వాడు. దీంతో తీవ్ర మనసాప్తం చెందిన ఆమె ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment