Velpur
-
వేల్పూర్‌కు సీఎం కేసీఆర్.. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి పరామర్శ
సాక్షి, వేల్పూర్/హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వేముల మంజులమ్మ(77) హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంత్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో మంజులమ్మ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. మంత్రి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే షకిల్ పరామర్శించారు. వేముల మాతృమూర్తి మృతిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు -
బస్సు, ఆటో ఢీ : అత్త, అల్లుడి దుర్మరణం
సాక్షి, నిజామాబాద్(వేల్పూర్): ఆటో, బస్సు ఢీకొన్న ఘటనలో అత్త, అల్లుడు దుర్మరణం చెందారు. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వేల్పూర్ మండలం లక్కోర గ్రామం వద్ద 63వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. వేల్పూర్ ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి కథనం మేరకు.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన అత్త పోసాని (60), అల్లుడు తిరుపతయ్య(40) చాలా ఏళ్లుగా పండ్లు, కూరగాయల అమ్మకం వ్యాపారం చేస్తుంటారు. శనివారం నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు వచ్చి పచ్చి వేరుశనగ కాయలు కొనుగోలు చేశారు. వీటిని మెట్‌పల్లికి తీసుకెళ్లేందుకు కమ్మర్పల్లి మండలం నాగాపూర్‌కు చెందిన నాందేవ్ ఆటోను కిరాయికి మాట్లాడుకున్నారు. వేరుశనగ సంచులు ఆటోలో వేసుకుని బయల్దేరారు. వారు లక్కోర వద్దకు రాగానే, వరంగల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ (అద్దె) బస్సు ఢీ కొట్టింది. తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందగా, పోసాని, ఆటో డ్రైవర్ నాందేవ్ తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: (చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్.. ఎంత దూరమైనా సరే..) లక్కోర గ్రామపంచాయతీ ఎదుట ప్రమాదం జరగగా, అక్కడే ఉన్న సర్పంచ్ వంశీ.. క్షతగాత్రులను తన కారులో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోసాని మార్గమధ్యలో చనిపోగా, నాందేవ్‌ను మెరుగైన చికిత్సకోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుపతయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త అనుమానం..భార్య బలవన్మరణం
వేల్పూర్ : అనుమానపు భర్త ఆడగాలు తాళలేక ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వేల్పూర్ ఎస్సై శ్రీధర్‌గౌడ్ కథనం మేరకు.. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామానికి చెందిన బోనాల స్వరూప (34), గంగాధర్ దంపతులకు ఇద్దరు పిల్లలు రాంప్రసాద్ (4), కృతిక్ (1) ఉన్నారు. అయితే, భర్త తరచూ స్వరూపను అనుమానిస్తుండే వాడు. దీంతో తీవ్ర మనసాప్తం చెందిన ఆమె ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. తీవ్ర గాయాల పాలైన ఆమెను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది. భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
'కృపామణి' కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
కృపామణి కేసులో కొత్త కోణాలు.
-
'కృపామణి' కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ, రాజకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు, శ్రీనివాస్... తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
కృపామణి కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్
-
కృపామణి కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్
ఏలూరు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి,సోదరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గుడాల సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం గాలింపు కొనసాగుతోంది. తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. -
ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు రోజుకొక కీలక సమాచారం లభ్యమవుతోంది. తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అదనపు డీజీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాయి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పెన్ డ్రైవ్ దొరికినట్టు తెలిసింది. ఆ పెన్ డ్రైవ్‌లో వందమందికి పైగా యువతులు, మహిళలతో రాసలీలల దృశ్యాలు ఉన్నట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మహిళల చిత్రాలను షూట్‌చేసి బ్లాక్మెయిల్ చేసేవాడని ఇప్పటికే సాయిశ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంపై ఇతనిపై పెరవలి, హైదరాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వాస్తవానికి ఈ కీచకుడి విశృంఖలత్వం వెనుక ఖాకీల పాత్ర కూడా ఉందని అంటున్నారు. తణుకుకు చెందిన కొంతమంది పోలీసులు సహకరించడం వల్లనే నిందితుడు నిర్భీతిగా దుశ్చర్యలకు పాల్పడ్డాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు ప్రత్యేక బృందాలు సాయిశ్రీనివాస్ వేటలో ఉన్నాయి. నిందితుడు పట్టుబడితే పోలీసు శాఖలోని ఇంటిదొంగల గుట్టు బయటపడే అవకాశముంది. కేసులో సెల్ఫీయే కీలకం తణుకు: కృపామణి ఆత్మహత్య కేసులో రెండున్నర నిమిషాల సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. ఆమె సెల్ఫీ తీసుకుందా, ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాత మోడల్ సెల్‌ఫోన్ వెనుక ఉన్న కెమెరాతో సెల్ఫీ తీసుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ బావ, సోదరి విచారణ! ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తణుకులోని అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో హైదరాబాదులో ఉంటున్న అతని సోదరి, బావలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో తణుకు సీఐ, రూరల్ ఎసై్సపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
కృపామణి కేసులో కొత్త కోణాలు
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృపామణి కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటన వెలుగులోకి వచ్చి ఐదు రోజులైనా నిందితులు దొరకలేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. కాగా, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు సాయిశ్రీనివాస్ కు అధికారులు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పలువురు యువతులు, మహిళలను లైంగికంగా వేధించినట్టు సమాచారం. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించగా, ఇప్పుడు రాష్ట్ర అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరులో కృపామణి భర్త నాగపవన్‌కుమార్ ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులనుంచి వివరాలు సేకరించారు. తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. పోలీసుల విస్తృత గాలింపు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సాయిశ్రీనివాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతను పలువురు మహిళలు, యువతులను వలలో వేసుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. పెరవలి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ఇతను నిందితుడు. హైదరాబాదులో కూడా ఓ యువతిని గదిలో నిర్బంధించి అత్యాచారం చేసిన అభియోగంపైనా ఇతనిపై కేసు నమోదైనట్టు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడి కోసం కూడా గాలిస్తున్నారు. -
ఇసుక టిప్పర్లు పట్టివేత
వేల్పూర్ : వేల్పూర్ మండలం అక్లూర్ వాగు వద్దకు ఇసుక అక్రమ రవాణాకు వచ్చిన ఐదు టిప్పర్లను తహశీల్దార్ శేఖర్, ఎస్సై కృష్ణ గురువారం వేకువ జామున పట్టుకున్నారు. అక్లూర్ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామానికి చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ వాగు వద్ద రెవెన్యూ సిబ్బందిని రాత్రిపూట కాపలాగా ఉంచారు. ఎప్పటిలాగే అర్ధరాత్రి ఇసుక టిప్పర్లు రావడంతో రెవెన్యూ సిబ్బంది తహశీల్దార్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఎస్సైని తీసుకొని వాగువద్దకు చేరుకున్నారు. టిప్పర్లు వాగు వద్దకు చేరగానే పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఆలయానికి నిధుల కోసం గ్రామస్తులు ఇసుక అక్రమ రవాణాకు రాత్రిపూట అనుమతించినట్లు సమాచారం. సుమారు రూ. 3.50 లక్షలకు ఐదు టిప్పర్లకు అనుమతించినట్లు తెలిసింది. అక్లూర్ నుంచి పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి దగ్గరగా దారి ఉండడంతో వ్యాపారులు అర్ధరాత్రి పూట తమ పనిని సునాయసంగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన టిప్పర్లకు ఒక్కోదానికి తహశీల్దార్ రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. అనుమతి పేరిట అక్రమ రవాణా! మండలంలోని కుకునూర్ వాగు నుంచి అభివృద్ధి పనులకు ఇసుక సరఫరాకు ఇస్తున్న అనుమతితో అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్మూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న రూ. 125 కోట్ల తాగునీటి సరఫరా పథకానికి, నిర్మల్ ప్రాంతంలో జరుగుతున్న ప్రాణహిత చేవెళ్ల పథకం పనులకు అధికారులు అనుమతులిచ్చారు. వారంలో ఐదు రోజుల పాటు రెండు పథకాలకు కుకునూర్ నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. వేబిల్లుతో ఇక్కడి నుంచి వెళ్లిన ఇసుక నిజంగా పనులు జరుగుతున్న చోటుకు చేరుతుందా? లేదా ! అనేది అనుమానాస్పదంగా మారింది. ఇసుక తీసుకెళ్లిన లారీ తిరిగి వేబిల్లులు మాత్రం సక్రమంగా తెచ్చి అధికారులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. కానీ చివరి వరకు చేరినట్లు నమ్మడమే తప్ప ఎవరూ చూసిన దాఖలాలు కన్పించడ ంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రోజుల క్రితం కుకునూర్ నుంచి ఆర్మూర్‌కు సరఫరా చేసేందుకు ఇచ్చిన అనుమతితో బయల్దేరిన టిప్పరు మండలంలోని పడగల్ మీదుగా వెళుతుండగా, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు హన్మంత్‌రావు అడ్డుకొని వీఆర్వోలకు పట్టించారు. దీంతో అనుమతితో వెళ్లిన ఇసుక సక్రమంగా చేరడం లేదని స్పష్టమవుతోంది. అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతుండగా, వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాన్ని సక్రమంగా వెలగబెట్టుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.