కృపామణి(ఫైల్)
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ, రాజకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులను ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
తల్లిదండ్రులు, సోదరుడు, శ్రీనివాస్... తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.