veldurthi krupamani
-
'కృపామణి' కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
కృపామణి కేసులో కొత్త కోణాలు.
-
'కృపామణి' కేసులో మరో ఇద్దరి అరెస్ట్
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో మరో ఇద్దరు నిందితులు మంగ, రాజకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్ ను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు, శ్రీనివాస్... తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
కృపామణి కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్
-
కృపామణి కేసులో ఇద్దరి నిందితుల అరెస్ట్
ఏలూరు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి,సోదరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గుడాల సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం గాలింపు కొనసాగుతోంది. తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. -
ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది?
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు రోజుకొక కీలక సమాచారం లభ్యమవుతోంది. తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అదనపు డీజీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాయి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పెన్ డ్రైవ్ దొరికినట్టు తెలిసింది. ఆ పెన్ డ్రైవ్‌లో వందమందికి పైగా యువతులు, మహిళలతో రాసలీలల దృశ్యాలు ఉన్నట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మహిళల చిత్రాలను షూట్‌చేసి బ్లాక్మెయిల్ చేసేవాడని ఇప్పటికే సాయిశ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంపై ఇతనిపై పెరవలి, హైదరాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వాస్తవానికి ఈ కీచకుడి విశృంఖలత్వం వెనుక ఖాకీల పాత్ర కూడా ఉందని అంటున్నారు. తణుకుకు చెందిన కొంతమంది పోలీసులు సహకరించడం వల్లనే నిందితుడు నిర్భీతిగా దుశ్చర్యలకు పాల్పడ్డాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు ప్రత్యేక బృందాలు సాయిశ్రీనివాస్ వేటలో ఉన్నాయి. నిందితుడు పట్టుబడితే పోలీసు శాఖలోని ఇంటిదొంగల గుట్టు బయటపడే అవకాశముంది. కేసులో సెల్ఫీయే కీలకం తణుకు: కృపామణి ఆత్మహత్య కేసులో రెండున్నర నిమిషాల సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. ఆమె సెల్ఫీ తీసుకుందా, ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాత మోడల్ సెల్‌ఫోన్ వెనుక ఉన్న కెమెరాతో సెల్ఫీ తీసుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ బావ, సోదరి విచారణ! ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తణుకులోని అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో హైదరాబాదులో ఉంటున్న అతని సోదరి, బావలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో తణుకు సీఐ, రూరల్ ఎసై్సపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. -
కృపామణి కేసులో కొత్త కోణాలు
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృపామణి కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటన వెలుగులోకి వచ్చి ఐదు రోజులైనా నిందితులు దొరకలేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. కాగా, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు సాయిశ్రీనివాస్ కు అధికారులు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పలువురు యువతులు, మహిళలను లైంగికంగా వేధించినట్టు సమాచారం. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించగా, ఇప్పుడు రాష్ట్ర అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరులో కృపామణి భర్త నాగపవన్‌కుమార్ ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులనుంచి వివరాలు సేకరించారు. తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్ఫోన్లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. పోలీసుల విస్తృత గాలింపు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సాయిశ్రీనివాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతను పలువురు మహిళలు, యువతులను వలలో వేసుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. పెరవలి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ఇతను నిందితుడు. హైదరాబాదులో కూడా ఓ యువతిని గదిలో నిర్బంధించి అత్యాచారం చేసిన అభియోగంపైనా ఇతనిపై కేసు నమోదైనట్టు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడి కోసం కూడా గాలిస్తున్నారు.