రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
ఏలూరు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దెందులూరు మండలం చిల్లచింతలపూడిలో కృపామణి తల్లి లక్ష్మి,సోదరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న గుడాల సాయి శ్రీనివాస్, కృపామణి తండ్రి రామలింగేశ్వరరావు కోసం గాలింపు కొనసాగుతోంది.
తణుకుకు చెందిన గుడాల సాయి శ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.