కేసు వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతా ... | Wife files case on husband due to harassment | Sakshi
Sakshi News home page

కేసు వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతా ...

Published Tue, May 13 2014 9:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

సందీప్ రాజ్

సందీప్ రాజ్

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి గెంటేశాడో ప్రబుద్ధుడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా... వాపస్ తీసుకోకుంటే యాసిడ్ పోసి చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని జీవిస్తోంది. ఒడిశాకు చెందిన మహేష్ ప్రసాద్ కుమార్తె ఎస్. నేహరాజ్ (27)ను ఖైరతాబాద్‌కు చెందిన సందీప్‌రాజ్ 2010 ఏప్రిల్ 21న ప్రేమవివాహం చేసుకున్నాడు. సందీప్ ప్రస్తుతం విజయవాడలోని ఎయిర్‌కోస్ట్ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నాడు.
 
 కాగా, పెళ్లైనప్పటి నుంచీ అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు సుగుణ, బాల్‌సుందర్, మరదలు రీనారాజ్, భర్త స్నేహితుడు ఇలియాస్ వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల రోజు క్రితం ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె సీసీఎస్ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఉపసంహరించుకుని ఒడిశాకు వెళ్లిపోవాలని, లేకపోతే యాసిడ్ పోసి చంపుతానని భర్త బెదిరిస్తున్నాడు.  
 
 దీంతో బాధితురాలు సోమవారం మరోసారి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త సందీప్ ప్రస్తుతం విజయవాడలో మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. భర్తనుంచి తనకు ప్రాణహాని ఉందని,  వెంటనే అతడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement