జయశ్రీ (ఫైల్) భర్త సుబ్రమణితో జయశ్రీ (ఫైల్)
కర్ణాటక, బొమ్మనహళ్లి: భార్య అందంగా లేదని వేధించేవారు కొందరైతే, అందంగా ఉందని ఈర్ష్యతో పీడించే కుత్సిత భర్తలకూ ఈ సమాజంలో కొదవ లేదు. వివాహిత ఇంట్లో అనుమానాస్పద మృతి చెందిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్ళి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సర్జాపుర పోలీసులు తెలిపిన ప్రకారం. మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణి భార్య జయశ్రీ (26) మృతురాలు.
వివక్ష చూపుతూ వేధింపులు
మాదప్పనహళ్ళికి చెందిన సుబ్రమణి రెండు సంవత్సరాల కిందట హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ఆందంగా ఉండటం భర్తకు నచ్చేది కాదు. ఆమె ముందు తాను తక్కువస్థాయిలో ఉన్నట్లు ఆత్మన్యూనత చెందేవాడు. దీంతో సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నీవు చాలా అందంగా ఉన్నావు, నా వెంట బయటకి రావొద్దు, నేను సినిమా తీయాలనుకుంటున్నా. నీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకునిరా అని పీడించేవాడు. గుడికి వెళ్లినా తాను ఒక లైన్‌లోవెళ్ళి భార్యను మరో లైన్‌లోవెళ్ళాలని హెచ్చరించేవాడు. ఇంట్లో ముస్తాబు అయినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించేవాడు.
తల్లిదండ్రులకు జయశ్రీ మొర
దాంతో అనుమానం భర్త వేదింఫులను తట్టుకోలేక జయశ్రీ తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు వచ్చిపంచాయతీ పెట్టి నచ్చచెప్పారు. కానీ అతనిలో మాత్రం మార్పు రాలేదు. పుట్టింటి నుంచి వరకట్నం తీసుకుని రావాలని నిత్యం వేధించేవాడు. దాంతో శనివారం సాయంత్రం జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేనని, తీసుకునిపోవాలని మొరపెట్టుకుంది. మేం ఒకటి రెండురోజుల్లో వస్తాం అని నచ్చజెప్పారు. ఈ పరిణామాలతో తీవ్ర విరక్తి చెందిన ఆమె ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్లు స్థితిలో శవమై తేలింది. సర్జాపుర పోలీసులు పరిశీలించిజరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. జయశ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తెని భర్త సుబ్రమణి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment