jaya sree
-
చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్
ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై.. అంటూ శాశ్వత వీడ్కోలు పలికి, మరికాసేపటికే తాను బాగున్నానంటూ వివరణ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ, కన్నడ నటి జయశ్రీ రామయ్య అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా తాను అలా ఎందుకు మాట్లాడారో చెప్పుకొచ్చారు. ఒత్తిడిని జయించలేకే చావును కోరుకున్నానని పేర్కొన్నారు. అయితే అలాంటి క్లిష్ట సమయంలో తన బాగోగులు చూసుకుంటూ, తనను చావు నుంచి కాపాడిన నటుడు కిచ్చా సుదీప్, అతని టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై: నటి) అలాగే అభిమానులను భయాందోళనలకు గురి చేసినందుకు క్షమాపణలు తెలిపారు. ఒత్తిడికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. కాగా ఈ నెల 22న జయశ్రీ "నేను వెళ్లిపోతున్నా.. ప్రపంచానికి, ఒత్తిడికి గుడ్‌బై" అంటూ పోస్ట్ పెట్టారు. అనంతరం కాసేపటికే దాన్ని తొలగించారు. అయితే అప్పటికే అభిమానులు ఆమెకు ధైర్యం నూరిపోస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ఆమె బాగానే ఉన్నానని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆస్తి కోసం మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గతేడాది ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే (మేనమామ వేధిస్తున్నాడు) -
గుడ్ బై.. వెళ్లిపోతున్నా: నటి
బెంగళూరు: ‘‘నేను వెళ్లిపోతున్నా. ఈ ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్ బై’’ అంటూ కన్నడ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆమె అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అయితే కాసేపటి తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు వెల్లడించడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కష్టాలకు ఎదురీది నిలబడటంలోనే అసలైన మజా ఉంటుందని, డిప్రెషన్‌ను వీడి ముందుకు సాగాలంటూ కామెంట్ల రూపంలో ఆమెకు ధైర్యం నూరిపోస్తున్నారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన జయశ్రీ.. ‘‘ఉప్పు హులి ఖరా’’అనే సినిమాతో వెండితెరకు పరిచయమ్యారు. ఆ తర్వాత కన్నడ బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ( చదవండి: మిస్ యూ అమ్మా: సోనూసూద్ భావోద్వేగం) ఇక లాక్డౌన్ నేపథ్యంలో అవకాశాలు లేకపోవడంతో ఆమె ఇటీవలే తన స్వస్థలానికి వెళ్లిన జయశ్రీ.. తాను డిప్రెషన్లో కూరుకుపోయానని, ఇకపై ప్రపంచాన్ని విడిచి వెళ్తున్నట్లు ఫేస్బుక్లో బుధవారం ఉదయం పోస్టు పెట్టారు. దీంతో ఆమె ఏ అఘాయిత్యానికి పాల్పడుతోందనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కఠిన నిర్ణయం తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత తన పోస్టును డిలీట్ చేసిన జయశ్రీ...‘‘నేను బాగున్నాను. సురక్షితంగా ఉన్నాను!! లవ్ యూ ఆల్’’ అంటూ పేర్కొన్నారు.(‘నా కొడుకును హత్తుకోలేకపోతున్నాను’) కాగా జయశ్రీ గత కొన్నాళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఆమె స్నేహితురాలు, నటి అద్వైతీ శెట్టి తెలిపారు. కుటుంబ సమస్యలు, కెరీర్ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులతో సతమవుతోందని చెప్పుకొచ్చారు. ఇంటికి వెళ్లినప్పటి నుంచి తమతో కాంటాక్ట్‌లో లేదని, ఫోన్ నెంబర్ తరచుగా మార్చడంతో మాట్లాడే వీల్లేకుండా పోయిందని పేర్కొన్నారు. బుధవారం నాటి పోస్టుతో తాను కంగారు పడ్డానని, ఈ విషయం గురించి తనతో తప్పకుండా చర్చించి, స్నేహితురాలి బాధను పంచుకుంటానని చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తాము సైతం అనేక సందర్భాల్లో కుంగుబాటుకు లోనయ్యామని తమ అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. -
భార్య అందంగా ఉందని ఈర్ష్యతో..
కర్ణాటక, బొమ్మనహళ్లి: భార్య అందంగా లేదని వేధించేవారు కొందరైతే, అందంగా ఉందని ఈర్ష్యతో పీడించే కుత్సిత భర్తలకూ ఈ సమాజంలో కొదవ లేదు. వివాహిత ఇంట్లో అనుమానాస్పద మృతి చెందిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్ళి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సర్జాపుర పోలీసులు తెలిపిన ప్రకారం. మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణి భార్య జయశ్రీ (26) మృతురాలు. వివక్ష చూపుతూ వేధింపులు మాదప్పనహళ్ళికి చెందిన సుబ్రమణి రెండు సంవత్సరాల కిందట హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె ఆందంగా ఉండటం భర్తకు నచ్చేది కాదు. ఆమె ముందు తాను తక్కువస్థాయిలో ఉన్నట్లు ఆత్మన్యూనత చెందేవాడు. దీంతో సూటిపోటి మాటలతో వేధించసాగాడు. నీవు చాలా అందంగా ఉన్నావు, నా వెంట బయటకి రావొద్దు, నేను సినిమా తీయాలనుకుంటున్నా. నీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకునిరా అని పీడించేవాడు. గుడికి వెళ్లినా తాను ఒక లైన్‌లోవెళ్ళి భార్యను మరో లైన్‌లోవెళ్ళాలని హెచ్చరించేవాడు. ఇంట్లో ముస్తాబు అయినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించేవాడు. తల్లిదండ్రులకు జయశ్రీ మొర దాంతో అనుమానం భర్త వేదింఫులను తట్టుకోలేక జయశ్రీ తల్లిదండ్రులకు తెలిపింది. దాంతో వారు వచ్చిపంచాయతీ పెట్టి నచ్చచెప్పారు. కానీ అతనిలో మాత్రం మార్పు రాలేదు. పుట్టింటి నుంచి వరకట్నం తీసుకుని రావాలని నిత్యం వేధించేవాడు. దాంతో శనివారం సాయంత్రం జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేనని, తీసుకునిపోవాలని మొరపెట్టుకుంది. మేం ఒకటి రెండురోజుల్లో వస్తాం అని నచ్చజెప్పారు. ఈ పరిణామాలతో తీవ్ర విరక్తి చెందిన ఆమె ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్లు స్థితిలో శవమై తేలింది. సర్జాపుర పోలీసులు పరిశీలించిజరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. జయశ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తెని భర్త సుబ్రమణి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. -
సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ఆదాయపన్ను శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. స్ధానిక ఒకటో వార్డు ఆదాయపన్ను అధికారిణి జయశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయరామ్ నుంచి రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు.