
భర్తపై దాడి చేస్తున్న దివ్య
కర్ణాటక, యశవంతపుర: కుటుంబ కలహాలతో భర్త ను భార్య నడివీధిలో చితకబాదిన ఘటన బెంగళూరులో జరిగింది. బాణసవాడి మారుతీసేవనగరకు చెందిన వినోద్, దివ్యలకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా దివ్య తల్లితో కలిసి ఉంటోంది. అయితే దివ్యను ఏదోవంకతో వినోద్ కుటుంబ సభ్యులు గొడవలు పడేవారు. ఇదిలా ఉంటే ఈనెల 9న దివ్య తనకు బంధువైన కానిస్టేబుల్‌ను తీసుకుని వినోద్ పిలిపించి నడి వీధిలో చితకబాదింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment