
దాడిలో గాయపడిన మస్తాన్‌బీ, గఫార్
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి బంధువులతో కలిసి భార్య, మామపై పెట్రోలుపోసి నిప్పంటించాడు. పెద్దలు జరిపిన పంచాయితీ విఫలం కావడంతో తన భార్య ఆమె తండ్రితో కలిసి పుట్టింటికి జీపులో వెళ్తుండగా బైకులపై బెంబడించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది.
గుంటూరు, ముప్పాళ్ల (సత్తెనపల్లి): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, మామపై.. అల్లుడు, అతని సమీప బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల సమీపంలో సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందిన మస్తాన్‌బీకి నరసరావుపేటకు చెందిన మహమ్మద్ ఇలియాస్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. తరచూ కుటుంబ కలహాలు జరుగుతుండగా భార్యాభర్తలకు బెల్లంకొండ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరలా కుటుంబ కలహాలు నెలకొనడంతో మస్తాన్‌బీ తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. ఇరు కుటుంబ సభ్యులూ ఆదివారం వారితో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడంతో మస్తాన్‌బీని తీసుకుని ఆమె తండ్రి గఫార్ నరసరావుపేట నుంచి జీపులో బెల్లంకొండకు బయలు దేరాడు. దీంతో అల్లుడు ఇలియాస్ తన బంధువులైన మరో ఐదుగురితో కలసి ద్విచక్ర వాహనాలపై వెంబడించి మాదల చప్టా వద్ద జీపును నిలిపివేసి మాట్లాడుకుందామంటూ వారిని కిందికి దింపారు. తర్వాత మస్తాన్‌బీపై పెట్రోలు చల్లి నిప్పంటించారు.
Comments
Please login to add a commentAdd a comment