
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్‌లోని రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. త్రినయని, అక్షయ్ దంపతులు రాంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ జంట పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితమే ప్రేమ విహహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా త్రినయని భర్త అక్షయ్ వేధింపులకు గురవుతోంది. దీంతో భర్త వేధింపులు తాళలేక త్రినయని సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆప్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment