wife suside
-
దంపతుల మధ్య విభేదాలు: పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
మాచర్ల: కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో సహా మాచర్ల మండల పరిధిలోని సాగర్ కుడికాలువ బుగ్గవాగు లాకుల్లో దూకి ఆత్మహత్యచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిట్యార్ శ్రీనివాస్, రేఖ (32) దంపతులు. వారికి దేవాంష్ (4), ధనుష్ (3) కుమారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో నివసిస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో శ్రీనివాస్ తాను పనిచేస్తున్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లకుండా ఇంటిలోనే ఉంటున్నాడు. రేఖ ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో దంపతుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నెల 25న రేఖ తన ఇద్దరు కుమారులను తీసుకొని హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ప్రాంతంలో ఉంటున్న తన సోదరి ఇంటి వద్ద వదిలిపెట్టి వస్తానని స్కూటీపై బయలుదేరింది. రేఖ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో శ్రీనివాస్ అదే రోజు సాయంత్రం జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రేఖ, ఆమె పిల్లల కోసం పోలీసులు గాలింపు చేపట్టగా నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని సూరమ్మ చెరువులో బుధవారం ధనుష్ మృతదేహం లభ్యమైంది. బుగ్గవాగు రిజర్వాయర్ ముత్యాలంపాడు లాకుల వద్ద రేఖ, దేవాంష్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మాచర్ల రూరల్ ఎస్ఐ రాయపూడి ఉదయలక్ష్మి, విజయపురిసౌత్ ఎస్ఐ పాల్ రవీందర్ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చదవండి: cyber crime: కాల్ చేసి కాజేస్తున్నారు -
భర్త వేధింపులు, యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్‌లోని రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. త్రినయని, అక్షయ్ దంపతులు రాంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ జంట పెద్దలను ఎదిరించి ఏడు నెలల క్రితమే ప్రేమ విహహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా త్రినయని భర్త అక్షయ్ వేధింపులకు గురవుతోంది. దీంతో భర్త వేధింపులు తాళలేక త్రినయని సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆప్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అక్షయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
మనుబోలు : మనుబోలు పోలీస్‌స్టేçÙన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బెల్లంకొండ రవీంద్ర భార్య సుప్రియ (28) ఆది వారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక పోలీస్‌స్టేçÙన్ వెనుక నివాసం ఉంటన్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మండలంలోని మడమనూరుకు చెందిన గుంజ పెంచలయ్య కుమార్తె సుప్రియకు అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన సమీప బంధువు ఏఆర్ కానిస్టేబుల్ రవీంద్రకు ఇచ్చి 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి 9 ఏళ్ల కుమారుడు శ్రీశాంత్, 7 ఏళ్ల కుమార్తె అక్షయ ఉన్నారు. ఇప్పటి వరకు వారి సంసారం కలతలు లేకుండానే సాగింది. ఇటీవల సుప్రియకు తరచూ భరించలేని కడుపు నొప్పి వచ్చే ది. ఆదివారం ఉదయం సుప్రియ మడమనూరులోని పుట్టింటికి వెళ్లింది. కడుపు నొప్పి భరించలేకున్నాను చనిపోతాను అని నిస్సహాయత వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. అనంతరం మనుబోలుకు తిరిగి వచ్చేసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోలీస్ క్యార్టర్స్‌లోని రవీంద్ర ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు, బంధువుకు సుప్రియ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన గూడూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుప్రియ మృతదేహానికి గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నార్త్ ఆములూరుకు తీసుకుపోయారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.