కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
Published Mon, Jul 25 2016 12:19 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
మనుబోలు : మనుబోలు పోలీస్‌స్టేçÙన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బెల్లంకొండ రవీంద్ర భార్య సుప్రియ (28) ఆది వారం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక పోలీస్‌స్టేçÙన్ వెనుక నివాసం ఉంటన్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మండలంలోని మడమనూరుకు చెందిన గుంజ పెంచలయ్య కుమార్తె సుప్రియకు అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన సమీప బంధువు ఏఆర్ కానిస్టేబుల్ రవీంద్రకు ఇచ్చి 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి 9 ఏళ్ల కుమారుడు శ్రీశాంత్, 7 ఏళ్ల కుమార్తె అక్షయ ఉన్నారు. ఇప్పటి వరకు వారి సంసారం కలతలు లేకుండానే సాగింది. ఇటీవల సుప్రియకు తరచూ భరించలేని కడుపు నొప్పి వచ్చే ది. ఆదివారం ఉదయం సుప్రియ మడమనూరులోని పుట్టింటికి వెళ్లింది. కడుపు నొప్పి భరించలేకున్నాను చనిపోతాను అని నిస్సహాయత వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. అనంతరం మనుబోలుకు తిరిగి వచ్చేసింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోలీస్ క్యార్టర్స్‌లోని రవీంద్ర ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు, బంధువుకు సుప్రియ ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన గూడూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుప్రియ మృతదేహానికి గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి నార్త్ ఆములూరుకు తీసుకుపోయారు. పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement