వేధింపులు తాళలేక..
Published Sun, Nov 27 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ఆరోపిస్తూ భర్త పెట్టే చిత్రహింసలను ఆమె భరించలేకపోయింది..తరచూ మద్యం సేవించి వచ్చి వేధించడాన్ని జీర్ణించుకోలేకపోయింది..ఇక అతడితో సంసారం చేయడం కంటే..వితంతువుగా జీవించేందుకు సిద్ధపడింది..ఈ నేపథ్యంలోనే అతడిని ఏవిధంగానైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. తాళికట్టిన వాడు అమితంగా ఇష్టపడే మద్యం సీసాలోనే పురుగులమందు కలిపింది. ఈ వ్యూహరచనలో అనుకోకుండా మర్యాద కోసం వచ్చిన మరో మహిళ బలైపోయింది. తిప్పర్తి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు..
తిప్పర్తి : నిడమనూరు మండలానికి చెందిన కొండేటి యాదయ్యకు తిప్పర్తి మండలం చిన్నారుుగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మతో చాలా ఏళ్ల క్రితమే వివాహం అయింది. అప్పటి నుంచి ఈ దంపతులు చిన్నాయిగూడెంలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తిప్పర్తికి చెందిన ఆదిమూలెం సామ్యేల్‌కు చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన పద్మ(55)తో మూడు దశాబ్దాల క్రితమే వివాహం అయింది. ఇతను కూడా ఇదే గ్రామంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు పద్మ చెల్లెలు మేరీని కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగ సంతానం.
నిత్యం మద్యం సేవించి..
యదయ్య, వెంకటమ్మ దంపతులకు కూతురు, కుమార్తె సంతానం.తమకున్న వ్యవసాయం చేసుకుంటూ కొన్నేళ్ల వరకు సజావుగానే కాపురం చేశారు. అయితే కొన్నేళ్లుగా యాదయ్య మద్యానికి బానిసగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఇక తట్టుకోలేక..
భర్త చిత్రహింసలు రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో వెంకటమ్మ తట్టుకోలేక పోరుుంది. తరచూ తాగి వచ్చి వేధిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్తతో బాధలు పడేకంటే అతడిని హత్య చేసి పిల్లలతో కలిసి వితంతువుగానైనా జీవించాలని అనుకుంది. అందుకు భర్త నిత్యం సేవించే మద్యం సీసాలోనే అతడి తెలియకుండా పురుగులమందు కలిపింది.
ఆ రోజు.. ఏం జరిగిందంటే..
ఈ నెల 22వ తేదీన (మంగళవారం)యాదయ్య వ్యవసాయ భూమిలో కూలీలతో పని చేయించాడు. అక్కడికి సమీప బంధువు పద్మ కూలీగా వచ్చింది. సాయంత్రం పనులు ముగించుకుని అందరూ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసముంటున్న పద్మను మద్యం సేవించేందుకు యాదయ్య పిలిచాడు. మర్యాదను కాదనలేక పద్మ అతడి ఇంటికి వెళ్లింది. అప్పటికే పురుగులమందు కలిపిన మద్యం సీసాలోని చెరి సగాన్ని ఇద్దరూ తాగారు.
Advertisement
Advertisement