అమ్మాయి పుట్టిందని భార్యను ఇంటినుంచి గెంటేసిన భర్త | husband harassment by wife | Sakshi
Sakshi News home page

అమ్మాయి పుట్టిందని భార్యను ఇంటినుంచి గెంటేసిన భర్త

May 4 2015 12:07 AM | Updated on Jul 27 2018 2:18 PM

అమ్మాయి పుట్టిందని భార్యను ఇంటినుంచి గెంటేసిన భర్త - Sakshi

అమ్మాయి పుట్టిందని భార్యను ఇంటినుంచి గెంటేసిన భర్త

గుర్రంపోడు అమ్మాయి పుట్టిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టి రెండో పెళ్లి

గుర్రంపోడు అమ్మాయి పుట్టిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టి రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్న భర్తపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆదివారం ముల్కలపల్లి గ్రామంలో జరిగింది. బాధితురాల కథనం ప్రకారం.. స్థానిక ఎస్సీ వర్గానికి చెందిన పోలేని గంగమ్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన మండలి వెంకన్న ప్రేమించుకుని గ్రామ పెద్దల సమక్షంలో ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత గర్భవతి అయిన గంగమ్మ 20 రోజుల క్రితం అమ్మాయికి జన్మనిచ్చింది.
 
 దీంతో వెంకన్న వేధింపులు మొదలయ్యాయి. నువ్వనాకు వద్దని, రెండో పెళ్లి చేసుకుంటానంటూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడని తెలిపింది. కులం తక్కువ అంటూ, కట్నం తేలేదని బాలింత అనే కనికరం లేకుండా దాడి చేశాడని, ఇంటికి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. అత్తా, మామలు కూడా వేధిస్తున్నారని తెలిపింది. ఇరవై రోజుల పసిపాపను తీసుకుని మండు టెండలో మండల కేంద్రానికి వచ్చి బాలింత పడుతున్న కష్టాలు పలువురి కలిచివేశాయి. కాగా గంగమ్మకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు రేపాక పుల్లయ్య కోరారు.                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement