రంగారెడ్డి: భార్య ఉండగానే రెండవ వివాహం చేసుకున్న ఓ వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు ఐదువేల రూపాయల జరిమానా విధిస్తూ సైబరాబాద్ 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చైతన్యపురి సత్యనారాయణపురం కాలనీలో నివాసముండే నర్సింహ్మ, స్వాతి భార్యభర్తలు. వీరి వివాహం 2007లో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా జరిపించారు. వివాహానంతరం వీరి కాపురం కొంత కాలం సజావుగా సాగింది.
భర్త నర్సింహులు తరుచు అదనపు కట్నం తెమ్మంటూ భార్య స్వాతిని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. ఆ క్రమంలో 2012 జనవరి 14న ఊరు వెళ్తున్నానంటూ భార్య స్వాతికి చెప్పి వెళ్లాడు. తర్యాత నెలలు గడుస్తున్నా భర్త నర్సింహులు ఇంటికి రాలేదు. బంధువులను విచారించగా.. కవిత అనే మరో యువతితో రెండో పెళ్లి చేసుకునట్లు తెలిసింది. దీంతో మొదటి భార్య స్వాతి సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించి కోర్డులో అభియోగ పత్రాలు నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలు పరిశీలించిన సైబారాబాద్ 13వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యూసుఫ్ పై విధంగా తీర్పు చెప్పారు.
భార్య ఉండగానే రెండో వివాహం..రెండేళ్ల జైలు శిక్ష
Published Wed, Aug 31 2016 6:40 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement