
మానవుడి జీవితంలో మధురానుభూతి పంచేది తొలిరాత్రి. దీనికోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అలాంటి రోజు రానే వస్తే ఎంతో సంతోషించి పడక గదిలోకి వెళ్తారు. అలా వెళ్లిన ఓ పెళ్లి కొడుకు భార్యను పట్టించుకోకుండా కంప్యూటర్‌లో పని చేసుకుంటూ కూర్చున్నాడు. వధువేమో అతడినే చూస్తూ బెడ్‌పై కూర్చుని ఉంది. దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
కొత్తగా పెళ్లయిన దంపతులు పెళ్లి బట్టలతోనే అందంగా అలంకరించిన శోభనం గదిలోకి వెళ్లారు. అయితే భార్య బెడ్‌పై కూర్చుని ఉండగా భర్త కంప్యూటర్ ముందు వాలిపోయాడు. ఫొటో చూస్తుంటే ఎంతకీ అతడు రాలేదనే నిర్వేదంతో చూస్తూ కూర్చుండిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటోలపై కామెంట్స్, షేర్లు ట్రెండవుతున్నాయి. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.
ఆ ఫొటోను చూసినవారంతా ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావం’ అని ఒకరు, ‘ఉండమ్మ హిస్టరీ డిలీట్ చేయని’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వధూవరులు ఎక్కడివారో తెలియదు కానీ దానికి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్ క్లాస్‌ల ప్రభావం.. అందుకే టీచర్ శోభనం రోజు కూడా కంప్యూటర్‌లో బోధన చేస్తున్నాడని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితికి అద్దం పడుతోందని మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తమ బాధను వెళ్లబోసుకున్నాడు.
"hold on babe, let me finish my shift" #WFH pic.twitter.com/6Z6gO5kIvI
— Diaper Don (@NamasteTrumpi) February 10, 2021
Comments
Please login to add a commentAdd a comment